hostel girls
-
కలకలం రేపిన అపరిచితుడు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం, బత్తలపల్లి: అపరిచితుడు కలకలం రేపాడు. సంజీవపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లోకి ఆదివారం అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి చొరబడి ఆరో తరగతి విద్యార్థిని గొంతు పట్టుకుని నులిమాడని, అయితే ఆ విద్యార్థి అరవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని తోటి విద్యార్థినులు తెలిపారు. నైట్‌వాచ్‌మన్, టీచర్ విద్యార్థినుల వద్దకు వెళ్లి విచారణ చేశారు. సోమవారం ఉదయం స్పెషలాఫీసర్ మాధవి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఎక్కడా అపరిచితుడు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె ధర్మవరం రూరల్ సీఐ శివరాముడు, ఎస్ఐ హారున్‌బాషాలకు సమాచారమందించారు. అనంతరం బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థినులు కలలుకంటూ భయాందోళన చెంది ఉంటారని, అపరిచిత వ్యక్తి సంచరించిన ఆనవాళ్లు పరిసరాల్లో ఎక్కడా లభించలేదని కొట్టిపారేశారు. -
హాస్టల్ యువతులకు లైంగిక వేధింపులు
అన్నానగర్: విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన హాస్టల్ యజమాని, మహిళా వార్డెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవై బిలమేడు బాలరంగనాథపురం ప్రాంతంలో ప్రైవేటు మహిళా హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో 500మందికి పైగా కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు ఉంటున్నారు. హాస్టల్‌ను సేరన్ మానగర్ సమీపం వీఐపీ నగర్‌కు చెందిన జగన్నాథన్ (45) నడుపుతున్నాడు.బిలమేడు ప్రాంతానికి చెందిన పునిత (32) వార్డెన్‌గా పని చేస్తోంది. రెండు రోజుల కిందట పునిత హాస్టల్లో ఉంటున్న నలుగురు యువతులను కోవై నగర్‌లోని స్టార్హోటల్కి విందు ఇస్తానని చెప్పి తీసుకెళ్లింది. అక్కడ వారికి మద్యం తాగాలని బలవంతం చేయడంతో పాటు హాస్టల్ యజమానితో ఉల్లాసంగా గడపాలని డబ్బు ఆశ చూపింది. దీనికి ఒప్పుకోని యువతులు అక్కడినుంచి వచ్చేశారు. ఈ విషయం బయటికి చెబితే హత్యచేస్తానని హాస్టల్ యాజమాన్యం వారిని బెదిరించింది. దీనిపై యువతులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం బిలమేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అక్కడున్న మహిళల వద్ద విచారణ చేశారు. అజ్ఞాతంలో ఉన్న పునిత, జగన్నాథన్ కోసం గాలిస్తున్నారు. -
‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంకుశత్వ చర్య అని, తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పాలన వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ మహిళల అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహ(ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ) అధికారులు మాత్రం విద్యార్థినుల మంచి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ‘వర్సిటీలో ఉంటున్నవారు బయటకు వెళ్లేందుకుగానీ, బయట నుంచి అతిథులుగా వచ్చే మహిళా స్నేహితులు లోపలికి వచ్చేందుకుగానీ మార్చి 12 రాత్రి 9గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 6గంటల వరకు నిషేధం. మార్చి 12 రాత్రి ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి అనుమతి ఉండదు. కేవలం హాస్టల్ గదుల ముందు ప్రాంగణంలో మాత్రమే హోలీ ఆడుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ ఒక నోటీసులో తెలిపింది. దీనిపై వర్సిటీ విద్యార్థునులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరు హాస్టల్ విద్యార్థినుల పరారీ
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు పరారయ్యారు. ఈ సంఘటన గౌలిగూడలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని వసతి గృహం నుంచి పారిపోయినట్లు హాస్టల్ అధికారులు గుర్తించారు. దీంతో వసతి గృహ సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు. -
బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి దాడి చేశారు
హైదరాబాద్: హాస్టల్ ఉంటున్న యువతులపై తన భర్త, అతని స్నేహితులు కలిసి లైంగిక దాడి చేసారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వార్డెన్ నవనీత తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్ లోని శ్రీ సాయి మణికంఠ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతులపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ ఆరంభించారు. దీనిలో భాగంగా ఆ హాస్టల్ వార్డెన్ నవనీతను పోలీసులు విచారించారు. కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఫిర్యాదు చేసారన్నారు. వారి ప్రవర్తన బాగోలేదని మందలించినందుకు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తనపైన, తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన ఐదుగురు యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.