
హాస్టల్ వద్ద విచారణ చేస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్) జగన్నాథన్, పునిత
అన్నానగర్: విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన హాస్టల్ యజమాని, మహిళా వార్డెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవై బిలమేడు బాలరంగనాథపురం ప్రాంతంలో ప్రైవేటు మహిళా హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌లో 500మందికి పైగా కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు ఉంటున్నారు. హాస్టల్‌ను సేరన్ మానగర్ సమీపం వీఐపీ నగర్‌కు చెందిన జగన్నాథన్ (45) నడుపుతున్నాడు.బిలమేడు ప్రాంతానికి చెందిన పునిత (32) వార్డెన్‌గా పని చేస్తోంది.
రెండు రోజుల కిందట పునిత హాస్టల్‌లో ఉంటున్న నలుగురు యువతులను కోవై నగర్‌లోని స్టార్‌హోటల్‌కి విందు ఇస్తానని చెప్పి తీసుకెళ్లింది. అక్కడ వారికి మద్యం తాగాలని బలవంతం చేయడంతో పాటు హాస్టల్ యజమానితో ఉల్లాసంగా గడపాలని డబ్బు ఆశ చూపింది. దీనికి ఒప్పుకోని యువతులు అక్కడినుంచి వచ్చేశారు. ఈ విషయం బయటికి చెబితే హత్యచేస్తానని హాస్టల్ యాజమాన్యం వారిని బెదిరించింది. దీనిపై యువతులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం బిలమేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అక్కడున్న మహిళల వద్ద విచారణ చేశారు. అజ్ఞాతంలో ఉన్న పునిత, జగన్నాథన్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment