
బనశంకరి: మహిళా డీజేతో ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన నగరంలో వెలుగుచూసింది. ఒక పబ్‌లో పనిచేసే మహిళా డీజే ఒంట్లో బాగా లేకపోవడంతో సోమవారం ఇంటికే భోజనం పంపాలని స్విగ్గి యాప్‌లో ఆహారం ఆర్డర్ చేసింది. కొంతసేపటికి విగ్నేష్ అనే పేరుతో డెలివరీ బాయ్ ఆమె అపార్టుమెంటు ఫ్లాట్‌కు వచ్చాడు. అయితే అతడు తలుపు కొట్టకుండా, నేరుగా ఫ్లాట్ లోపలి వరకు రావడంతో ఆమె ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. భోజనం తీసుకుని బిల్లు చెల్లించి ఇంట్లోకి బయలుదేరింది.
యువకుడు వెంబడించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకోగా గట్టిగా శబ్ధం రావడంతో పొరుగు ఫ్లాట్‌లోని కుక్కలు గట్టిగా మొరగడంతో డెలివరీ బాయ్ ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ ఫేస్‌బుక్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.