ఎవరైనా దొంగ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం.. పోలీసులకు పట్టిస్తాం. వీలైతే దాడి నుంచి తప్పించుకుంటాం.. తప్పని స్థితిలో ప్రతిదాడి చేస్తాం కదా..! కానీ ఎవరైనా దొంగకు తిండి పెట్టి మరి సాగనంపుతామా? వింటేనే నవ్వొస్తుంది కదా..! అమెరికాలో ఓ మహిళ తన ఇంట్లోకి చొరబడిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి గొప్ప మనసు చాటుకుంది.
ఆమె పేరు మార్జోరీ పార్కిన్స్(87) ఒంటరిగా నివసిస్తోంది. జులై 26 అర్థరాత్రి తన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి దాడికి యత్నించాడు. ఇది గమనించిన పార్కిన్స్ తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ.. ఆమెను నెట్టివేశాడు. దీంతో ఆమె కిచెన్‌లోకి చేరుకోగలిగింది. అయితే.. కిచెన్‌లోకి చెరుకున్నాక దొంగను డోర్‌తో నిలువరించింది. ఈ క్రమంలో దొంగ.. తనకు ఆకలిగా ఉందని తెలిపాడు. ఈ దయగల పార్కిన్.. అతనికి ఆహారాన్ని అందించి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు ఆ దొంగ చక్కగా తినేసి.. ఏ వస్తువులను తీసుకుపోకుండా అన్నీ అక్కడే వేసి పారిపోయాడు.
నేరాలు ఇలా జరగడం దురదృష్టంగా భావించిన పార్కిన్.. నేరస్థులకు శిక్షలు సరిగా వేయడం లేదని అన్నారు. తాను 42 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నానని ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవలేదని చెప్పారు. చట్టాలను ప్రజలు లెక్కచేయలేని స్థితిలో ఉన్నాయని వాపోయారు. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి..
Comments
Please login to add a commentAdd a comment