gives
-
దాడి చేసిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి..!
ఎవరైనా దొంగ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం.. పోలీసులకు పట్టిస్తాం. వీలైతే దాడి నుంచి తప్పించుకుంటాం.. తప్పని స్థితిలో ప్రతిదాడి చేస్తాం కదా..! కానీ ఎవరైనా దొంగకు తిండి పెట్టి మరి సాగనంపుతామా? వింటేనే నవ్వొస్తుంది కదా..! అమెరికాలో ఓ మహిళ తన ఇంట్లోకి చొరబడిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి గొప్ప మనసు చాటుకుంది. ఆమె పేరు మార్జోరీ పార్కిన్స్(87) ఒంటరిగా నివసిస్తోంది. జులై 26 అర్థరాత్రి తన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి దాడికి యత్నించాడు. ఇది గమనించిన పార్కిన్స్ తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ.. ఆమెను నెట్టివేశాడు. దీంతో ఆమె కిచెన్‌లోకి చేరుకోగలిగింది. అయితే.. కిచెన్‌లోకి చెరుకున్నాక దొంగను డోర్‌తో నిలువరించింది. ఈ క్రమంలో దొంగ.. తనకు ఆకలిగా ఉందని తెలిపాడు. ఈ దయగల పార్కిన్.. అతనికి ఆహారాన్ని అందించి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు ఆ దొంగ చక్కగా తినేసి.. ఏ వస్తువులను తీసుకుపోకుండా అన్నీ అక్కడే వేసి పారిపోయాడు. నేరాలు ఇలా జరగడం దురదృష్టంగా భావించిన పార్కిన్.. నేరస్థులకు శిక్షలు సరిగా వేయడం లేదని అన్నారు. తాను 42 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నానని ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవలేదని చెప్పారు. చట్టాలను ప్రజలు లెక్కచేయలేని స్థితిలో ఉన్నాయని వాపోయారు. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
తమ్ముడిని కోసం ప్రాణం ఇచ్చిన అన్న
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులలో అపశృతి గోదావరిలో మునిగి జార్ఖండ్‌వాసి మృతి సీతానగరం (రాజానగరం) : ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్న అన్నదమ్ములు ఉన్న ఈ రోజులలో తమ్ముడి కోసం తన ప్రాణాన్నే అర్పించాడు ఓ అన్న. రక్తం సంబంధం విలువేంటో నిరూపించాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు జార్ఖండ్ రాష్ట్రం తలామూరు జిల్లా శంఖ గ్రామం నుంచి అన్నదమ్ములు విజయ్‌కుమార్ గుప్త (35), చిత్తరంజన్ కుమార్ గుప్తలు క్రేన్ (ఎక్షావేటర్) ఆపరేటర్లుగా వచ్చారు. శనివారం మధ్యాహ్న 12 గంటలకు పని పూర్తి అయిన తరువాత ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఇసుక తవ్వకాలకు సిమెంట్ తూరలు ఏర్పాటు చేసి రోడ్డు వేశారు. రోడ్డులో రెండో తూర వద్ద స్నానాకి దిగిన తమ్ముడు చిత్తరంజన్ కుమార్ గుప్త ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోతుంటే అది గమనించిన అన్న విజయ్ కుమార్ గుప్త తమ్ముడి చేతులు పట్టుకుని ఒడ్డుకు లాగి తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. అదే సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తమ్ముడిని రక్షించి బేలన్స్ తప్పి ఆదే గోతిలోకి అన్న విజయ్‌కుమార్ గుప్త (35) ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు ఒదిలాడు. మృతునికి భార్య ప్రమీలాదేవి, పదేళ్ల కుష్బు కుమారి, నాలుగేళ్ల అభిమన్యు కుమారి, ఏడేళ్ల కుమారుడు మల్లేష్‌కుమార్ గుప్త ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎ.వెంకటేశ్వరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతోను, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు మృతదేహం లభ్యం కాలేదు -
బిహార్ లిక్కర్ కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: బిహార్ మద్యం తయారీదారులకు సుప్రీకోర్టు ఊరటనిచ్చింది. పాత నిల్వలను క్లియర్ చేసుకోవడానికి సంబంధించిన గడువును పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తమ స్టాక్లను రాష్ట్రం వెలుపల విక్రయించటానికి బీహార్‌లో మద్యం తయారీదారులకు, అమ్మకందారులకు అవకాశాన్నిచ్చింది. జులూ 31 వరకు సమయాన్ని మంజూరు చేసింది. ప్రస్తుత గడువును మరికొంత కాలం పొడిగించాల్సిందిగా పెట్టుకున్న పిటీషన్‌ను కోర్టు ఆమోదించింది. గిడ్డంగుల్లో పడివున్న ముడి పదార్థం సహా, పాత మద్యం స్టాక్స్ పారవేసేందుకు సమయం పొడిగించాలంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బెవరేజె కంపనీలు పెట్టుకున్న అర్జీపై జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ గడువును మంజూరు చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్ 1న నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో విధించిన నిషేధం దృష్ట్యా వారు భారీ ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు భారతీయ మద్య పానీయాల కంపెనీలు వాదించాయి. తమ దగ్గర సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం ఉందని కాన్ఫెడరేషన్ నివేదించింది. ఈ నిల్వ ఉన్న మద్యాన్ని రాష్ట్రం వెలుపల విక్రయాలకు మే31 వరకు ఉన్నగడువును పొడిగించాల్సిందిగా కొంతమంది లిక్కర్ తయారీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. -
నాణ్యమైన విద్యనందించాలి
వ్యాపార దృక్పధం విడనాడాలి ప్రైవేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ సూచన ఘనంగా గ్రీన్ ఫీల్డ్ స్కూల్ వార్షికోత్సవం వాకాడ(కరప) : ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పధంతో కాకుండా నాణ్యతమైన విద్యనందించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచించారు. వాకాడలో శనివారం రాత్రి జరిగిన గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మూడో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ ఎందరో ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం అమెరికా వెళ్లేవారని, కొత్త అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉన్నత చదువుల కోసం అక్కడకు వెళ్లే అవకాలు తగ్గిపోయాయన్నారు. నైపుణ్యం, ఉన్నత ప్రమాణాలు గలవారికే అవకాశాలు ఉంటాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యతో పాటు అన్నింటిలోనూ ముందుండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టాలను గుర్తించి చదువుతో పాటు, వారు మక్కువ చూపే రంగాలల్లో కూడా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. చిన్న వయస్సులోనే ఉన్నత చదువులు చదువుతూ టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన నైనా జైస్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులకనుగుణంగా మహిళలకు విద్యనందించి, వారి బంగారు భవిష్యత్‌కు బాటలువేయాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. ఎంతో ఖర్చుపెట్టి ఉత్తమ విద్యా సంస్థగా గ్రీన్ ఫీల్డు స్కూలును తీర్చిదిద్దిన యాజమాన్యాన్ని అభినందించారు. అంతర్జాతీయ టీటీ క్రీడాకారిణి, ఇండియా యంగస్ట్ జర్నలిజమ్ గ్రాడ్యుయేట్ నైనా జైస్వాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎనిమిదేళ్ల వయస్సులోనే 10వ తరగతి, 10 ఏళ్లకు ఇంటర్మీడియట్, 13 ఏళ్లకు జర్నలిజమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం (16 ఏళ్లు) పాలిటిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్‌లో 6వ ర్యాంకులో ఉన్నానన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని చెప్పారు. నిర్ధిష్టమై లక్ష్యం ఏర్పరచుకుని దాన్ని సాధించేందుకు కషిచేయాలన్నారు. గ్రీన్ ఫీల్డు విద్యా సంస్థ వ్యవస్థాపకులు గ్రంధి నారాయణరావు (బాబ్జీ) మాట్లాడుతూ చదువును పుస్తకాలకే పరిమితం చేయకుండా చదువుతో పాటు అన్నిరంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. స్కూలు విద్యార్థులు సేకరించిన విరాళాలతో కొనుగోలుచేసిన ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు కలెక్టర్ అరుణ్‌కుమార్, నైనా జైస్వాల్ అందజేశారు. కాకినాడ ఐడియల్ కళాశాలల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి, గ్రీన్‌ఫీల్డు స్కూలు కార్యదర్శి జి.సుబ్బారావు, ప్రిన్సిపాల్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం
ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : పోలీసుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా నిర్వహించే కార్యక్రమాలను శాంతి భద్రతల రీత్యా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. శనివారం సర్పవరం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సున్నిత అంశాలపై జిల్లాలో 1994, 1998, 2016 సంవత్సరాల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా సెక్షన్ 30 అమల్లో పెట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు అన్ని రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చేసుకునే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. తొండంగిలో నిర్మించనున్న దివీస్ కర్మాగార స్థాపనకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనను అడ్డుకోగా, కోర్టు ఉత్తర్వులతో సీపీఎం నేతలను అక్కడకు అనుమతించామన్నారు. ఈ నెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి అంతర్వేది దాకా ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తు రాలేదని, వస్తే పరిశీలిస్తామన్నారు. ఈనెల 28 నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అమలాపురం దాకా బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, ఇం దుకు అనుమతి కోరుతూ దరఖాస్తు వచ్చిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకువస్తే, ఆమోదయోగ్యం గా చట్టానికి లోబడి నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామ న్నారు. ఇది అన్ని రాజకీయపార్టీలకు వర్తిస్తుందన్నారు. తునిలో జరిగిన కాపు గర్జనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్క డ అనుకోకుండా అరాచకశక్తులు చొరబడడంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రశాంతవరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
జగన్ జన్మదినం సందర్భంగా పేదలకు దుప్పట్లు
-
యనమలా..నాటి లేఖల మాటేమిటి?
ఆర్థిక మంత్రికి కాంట్రాక్టు అధ్యాపకుల ప్రశ్న భానుగుడి(కాకినాడ) : అధికారం లేనపుడు ఒకలా.. అధికారం చేతికొచ్చాక మరోలా..రంగులు మార్చే ఊసరవెల్లిలా యనమల ప్రవర్తన ఉండడం దురదృష్టకరమని కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ పేర్కొంది. సోమవారం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ యరమాటి రాజాచౌదరి మాట్లాడుతూ అధికారంలో లేనపుడు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి తమ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ విçషయమై లేఖలు రాసి, ఎన్నికల సమయంలో హామీలిచ్చి, అధికారంలోకొచ్చాక తమ గురించి పట్టించుకోకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేలమంది అరకొర వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని కాంట్రాక్టు› లెక్చరర్లు వాపోయారు. ఈ సందర్భంగా యనమల చిత్రపటానికి మోకాళ్లపై మొక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నేడు కలెక్టరేట్ ఎదుట భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటున్నారని, పలువురు వామపక్ష నాయకులు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. -
జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!
మకావుః చైనాలోని మకావులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఓ పాండా కవలపిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. మకావు కు చెందిన జిన్ జిన్ అనే పాండాకు దాని పెవిలియన్ లో రెండు మగ పాండా పిల్లలు పుట్టాయి. దీంతో మకావు ప్రాంతంలో పిల్లలు పెట్టిన మొదటి పాండాగా జిన్ జిన్ ను అధికారులు గుర్తించారు. పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరోటి కాస్త అనారోగ్యంతోనూ, బరువు తక్కువగా ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. పాండాల జాతి అంతరించిపోతున్న తరుణంలో మకావులోని జెయింట్ పాండా జిన్ జిన్ కు కవల పిల్లలు పుట్టడం అక్కడివారికి అపురూపంగా మారింది. అందుకే వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జ్యూ లో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడ చేపట్టి పాండాల సంతతి పెంచేందుకు అధికారులు చర్యలు కృషి చేస్తున్నారు. సాధారణంగా కవల పిల్లలు ఒకరు ఆరోగ్యంగా ఉంటే, మరొకరు కాస్త బలహీనంగా ఉండటం చూస్తుంటాం. అలాగే ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకటి కాస్త బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండటంతో దాని ఆరోగ్య రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. జిన్ జిన్.. కై కై.. జంటను గత ఏడాది చైనా మెయిన్ ల్యాండ్.. మకావుకు బహుమతిగా ఇచ్చింది. అదే జంటకు ప్రస్తుతం కవల పిల్లలు పుట్టడంతో మకావు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన పిల్లల్లో ఒకటి 138 గ్రాముల బరువు ఉండగా, మరోటి మాత్రం కేవలం 53.8 గ్రాములే ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిన్ జిన్ ప్రసవం కోసం మకావు అధికారులు జూన్ 14 నుంచే పెవిలియన్ ను కూడ మూసి ఉంచారు. -
విమానంలో పుట్టిన 'జెట్ స్టార్'
ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు ఎయిర్ లైన్స్ పేరు పెట్టుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళ జెట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తుండగా నొప్పులు రావడంతో ఆమెకు సిబ్బంది సహా... విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్లు కూడ సహకరించారు. దీంతో సుఖప్రసవాన్ని పొందిన ఆమె.. పుట్టిన మగ బిడ్డకు ఎయిర్స్ లైన్స్ పేరు పెట్టుకుంది. ఏప్రిల్ 22 శుక్రవారం సింగపూర్ నుంచి మయన్మార్ కు ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో సా లెర్ టు అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గరు డాక్టర్లు సహకరించి సుఖ ప్రసవం జరిగేట్లు చూశారు. విమాన సిబ్బంది తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతతో సా లెర్ తన బిడ్డకు 'జెట్ స్టార్' అని పేరు పెట్టుకుంది. అనుకోకుండా ఆమె ఇంటిపేరు కూడ స్టార్ అని ఉండటంతో ఆపేరు కలసి వచ్చింది. విమాన ప్రయాణంలో ఎటువంటి ప్రమాదం లేకుండా మహిళకు సహకరించి ఓ అతిచిన్న ప్రయాణీకుణ్ని సురక్షితంగా ప్రసవించేందుకు తమ సిబ్బంది సహాయపడ్డందుకు ఎంతో గర్వంగా ఉందని ఎయిర్ లైన్స్ తెలిపింది. సహ ప్రయాణీకులతో పాటు బేబీ జెట్ స్టార్ కూడ ప్రయాణించి ప్రశంసలు అందుకున్నాడని, ఇది ఎప్పటికీ మరచిపోలేని సంఘటన అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. జెట్ స్టార్ పుట్టిన సందర్భాన్ని వేడుకగా జరుపుకునేందుకు వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చింది. మా విమానంలో సా జెట్ స్టార్ పుట్టిన విషయాన్ని తెలియజేయడం మాకెంతో గర్వంగా ఉందని జెట్ ఎయిర్ వేస్ పోస్ట్ చేసింది. కస్టమర్ సర్వీస్ మేనేజర్ నేతృత్వంలో సిబ్బంది సహాయం అందించారని, ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు 3K583 విమానంలో యాన్ గన్ లో ల్యాండ్ అయ్యారని, అనంతరం యాన్ గన్ లోకల్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ఎయిర్ లైన్స్ పోస్ట్ లో తెలిపింది. 6 పౌండ్ల, ఏడు ఔంసుల బరువుతో పుట్టిన శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని, ఏషియా విమానంలో ప్రసవం జరగడం ఇదే మొదటి సారని, వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చామని పోస్ట్ లో వివరించారు. -
ఆ పాప ఆరుగురికి జీవం పోసింది
చెన్నై: మరణించినా జీవించి ఉండటం.. మరో మనిషికి ప్రాణం పోయడం ఒక్క అవయవ దానం ద్వారా మాత్రం సాధ్యమవుతంది. అలా చెన్నైలోని కరూర్‌కి చెందిన చిన్నారి ఆరుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా నిలిచింది. తమిళనాడులో అతి చిన్న వయసులో అవయవదానం చేసిన 'దాత' గా ఖ్యాతిని దక్కించుకుంది. ఒకటో తరగతి చదువుతున్న జనశృతి (5) తల్లితో పాటు స్కూలుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో కోవై మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ కూడా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆరోగ్యం మరింత విషమించి చివరకు చికిత్సకు చిన్నారి స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా బుధవారం ఉదయం డాక్టర్లు ధ్రువీకరించారు. తమ ముద్దులబిడ్డ అకాలమరణంతో పుట్టెడు శోకంలో మునిగిపోయినా ఆమె తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకున్నారు. తమ చిన్నారి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె రెండు కిడ్నీలు, లివర్, గుండె కవాటాలను వైద్యులు సేకరించారు. అనంతరం రెండు కళ్లను స్థానిక అరవింద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. మిలిగిన అవయవాలను ప్రత్యేకవిమానంలో వివిధ ఆస్పత్రులకు తరలించిన ప్రత్యేక వైద్య బృందం వాటిని అవసరమైన రోగులకు అమర్చింది. కాగా పరమత్తి వెల్లూరు ప్రభుత్వ హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్న జనశృతి తండ్రి తంగవేలు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలా అవయవదానంతో తమ కూతురు సజీవంగా ఉండడం గర్వంగా ఉందన్నారు. -
ఎన్నికల వ్యయం 5లక్షలకు పెంపు
-
చెన్నైకు అయిదు కోట్ల సాయం
భువనేశ్వర్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా ఒడిశాకు చెందిన సుమారు లక్ష మంది చెన్నైలో స్థిరపడినట్టు తెలుస్తోంది.