న్యూఢిల్లీ: బిహార్ మద్యం తయారీదారులకు సుప్రీకోర్టు ఊరటనిచ్చింది. పాత నిల్వలను క్లియర్ చేసుకోవడానికి సంబంధించిన గడువును పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తమ స్టాక్లను రాష్ట్రం వెలుపల విక్రయించటానికి బీహార్లో మద్యం తయారీదారులకు, అమ్మకందారులకు అవకాశాన్నిచ్చింది. జులూ 31 వరకు సమయాన్ని మంజూరు చేసింది. ప్రస్తుత గడువును మరికొంత కాలం పొడిగించాల్సిందిగా పెట్టుకున్న పిటీషన్ను కోర్టు ఆమోదించింది.
గిడ్డంగుల్లో పడివున్న ముడి పదార్థం సహా, పాత మద్యం స్టాక్స్ పారవేసేందుకు సమయం పొడిగించాలంటూ కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బెవరేజె కంపనీలు పెట్టుకున్న అర్జీపై జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ గడువును మంజూరు చేసింది.
కాగా గత ఏడాది ఏప్రిల్ 1న నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో విధించిన నిషేధం దృష్ట్యా వారు భారీ ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు భారతీయ మద్య పానీయాల కంపెనీలు వాదించాయి. తమ దగ్గర సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం ఉందని కాన్ఫెడరేషన్ నివేదించింది. ఈ నిల్వ ఉన్న మద్యాన్ని రాష్ట్రం వెలుపల విక్రయాలకు మే31 వరకు ఉన్నగడువును పొడిగించాల్సిందిగా కొంతమంది లిక్కర్ తయారీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
బిహార్ లిక్కర్ కంపెనీలకు ఊరట
Published Mon, May 29 2017 1:37 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
Advertisement
Advertisement