న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు మాత్రం సుప్రీం ధర్మాసనం అంగీకరించింది.
గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్ సవరణలు రాజ్యాంగ సమానత్వ నిబంధనలను ఉల్లంఘించేవని పట్నా హైకోర్టు జూన్ 20 నాటి తీర్పులో వెల్లడించింది. వెనకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ నిలుపుదల తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటాన్ని నిరాకరించింది.
చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment