Dispose
-
స్కిల్ స్కామ్‌లో లోకేష్ బెయిల్ పిటీషన్ డిస్పోజ్
-
తండ్రిని చంపి ముక్కలుగా.. సాయం చేసిన తల్లి
దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసు మరువక మునుపే అచ్చం అలాంటి ఉదంతమే పశ్చిమ బెంగాల్ చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ నిందితుడు ప్రియురాలిని 35 ముక్కలుగా చేస్తే....ఇక్కడొక ఒక కొడుకు కన్న తండ్రేని హతమార్చి ఆరు ముక్కలుగా కోసేశాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కోల్కతలాని బరుయ్‌పూర్ ఉంటున్న రిటైర్డ్ నేవీ ఆఫీసర్ 55 ఏళ్ల చక్రవర్తి కన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. అతను 2000లో రిటైర్ అయ్యారు. ఒక ఎగ్జామ్ ఫీజు విషయమై తలెత్తిన వివాదం హత్య చేసేందుకు దారితీసింది. ఆ అధికారి కుటుంబ సభ్యల మధ్య ఎగ్జామ్ ఫీజు చెల్లింపు విషయమై వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కోపంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత అతన్ని ఆరు ముక్కలుగా కోసి తమ ఇంటికి సమీపంలో వేరు వేరు చోట్ల పడేశాడని చెప్పారు. అందుకు అతడి తల్లి సహకరించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏమి ఎరుగనట్లుగా పోలీసులకు నవంబర్ 15న మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తాము ఆ తల్లి కొడుకులను గట్టిగా విచారించగా...అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యామని పోలీసులు చెబుతున్నారు. తామే హత్య చేసి ముక్కలుగా కోసి పడేసినట్లు తల్లి కొడుకులు ఒప్పుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించే విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడని..తట్టుకోలేక ఈ దారుణానికి నిందితుడు ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి సైకిల్‌పై తీసుకువెళ్లి పడేసినట్లు తెలిపాడు. బాధితుడి శరీర భాగాలను చెరువు సమీపంలో చెత్త డంప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసలు తెలిపారు. మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే విచారణలో బాధితుడు తరచు తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి కొడుకులిద్దర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు. (చదవండి: చెప్పకుండా పెళ్లి చేసుకుందని...కన్న తండ్రే కాలయముడిలా...) -
జన్యువులను నిర్వీర్యం చేసి బ్యాక్టీరియాను చంపేస్తారు
వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేయాలంటే ఏం చేస్తాం. యాంటీబయాటిక్స్ వాడతాం. అంతేకదా.. అయితే ఈ క్రమంలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్ స్టేట్ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జన్యువులను నిర్వీర్యం చేయడం ద్వారా కేవలం చెడు బ్యాక్టీరియా మాత్రమే నాశనమయ్యేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన పేగుల్లో సి.డిఫికైల్ అనే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా మనుగడకు కీలకమైన జన్యువులను నిర్వీర్యం చేసే మందులు తయారు చేసి వాడారు. సక్రమంగా పనిచేయడంతో ఇదే పద్ధతిని ఇతర బ్యాక్టీరియాకు వర్తింప చేయవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అరుణ్ శర్మ అంటున్నారు. బ్యాక్టీరియా రకాన్ని బట్టి మందును తయారు చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాక్టీరియా మాత్రమే నాశనమవుతుందని.. మిగిలినవాటికి ఏ మాత్రం హాని జరగదు కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వివరించారు. అభివృద్ధి చేసిన మూడు ముందుల ద్వారా కూడా అతితక్కువ దుష్ప్రభావాలు కనిపించడం ఇంకో విశేషమని చెప్పారు. -
ప్రమాదకరంగా దేశ రాజకీయాలు
ఆసిఫాబాద్ క్రైం: దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆసిఫాబాద్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గాలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిరసన తెలిపిన వారిని హింసిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలో భవిషత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
బిహార్ లిక్కర్ కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: బిహార్ మద్యం తయారీదారులకు సుప్రీకోర్టు ఊరటనిచ్చింది. పాత నిల్వలను క్లియర్ చేసుకోవడానికి సంబంధించిన గడువును పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తమ స్టాక్లను రాష్ట్రం వెలుపల విక్రయించటానికి బీహార్‌లో మద్యం తయారీదారులకు, అమ్మకందారులకు అవకాశాన్నిచ్చింది. జులూ 31 వరకు సమయాన్ని మంజూరు చేసింది. ప్రస్తుత గడువును మరికొంత కాలం పొడిగించాల్సిందిగా పెట్టుకున్న పిటీషన్‌ను కోర్టు ఆమోదించింది. గిడ్డంగుల్లో పడివున్న ముడి పదార్థం సహా, పాత మద్యం స్టాక్స్ పారవేసేందుకు సమయం పొడిగించాలంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బెవరేజె కంపనీలు పెట్టుకున్న అర్జీపై జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ గడువును మంజూరు చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్ 1న నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో విధించిన నిషేధం దృష్ట్యా వారు భారీ ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు భారతీయ మద్య పానీయాల కంపెనీలు వాదించాయి. తమ దగ్గర సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం ఉందని కాన్ఫెడరేషన్ నివేదించింది. ఈ నిల్వ ఉన్న మద్యాన్ని రాష్ట్రం వెలుపల విక్రయాలకు మే31 వరకు ఉన్నగడువును పొడిగించాల్సిందిగా కొంతమంది లిక్కర్ తయారీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. -
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జడ్పీటీసీల ఫోరం మండిపాటు 21న జడ్పీ కార్యాలయాల వద్ద నిరసన హైదరాబాద్: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జడ్పీటీసీల ఫోరం ఆరోపించింది. హక్కులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ నిమిత్తం శుక్రవారమిక్కడ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు అభివృద్ధి నిధులు కేటాయించాలని, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే విధంగా తగిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మాదిరిగానే జడ్పీటీసీలకు ఏటా రూ.25లక్షల సీడీపీ నిధులు, నెలకు రూ.25వేల వాహన అలవెన్స్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక చాంబర్, ప్రతి జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.10కోట్లు ప్రభుత్వం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారన్నారు. జడ్పీటీసీలకు పెంచిన గౌరవ వేతనం ఐదు నెలలుగా అందడంలేదని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఫోరం గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తానాజీరావు, అంజయ్య, నారాయణరెడ్డి, అధికార ప్రతినిధి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.