చెన్నైకు అయిదు కోట్ల సాయం
Published Fri, Dec 4 2015 4:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM
భువనేశ్వర్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా ఒడిశాకు చెందిన సుమారు లక్ష మంది చెన్నైలో స్థిరపడినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement