
విమానంలో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
కోయంబత్తూరు: విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు.
విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది.
కాగా నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం. ఈ ఘటన గత రాత్రి చెన్నై ఇండిగో విమానంలో జరిగింది. సెంథిల్ కుమార్, రాజా... విమానం ఎక్కిన దగ్గర నుంచి పెరున్దురైకి చెందినవారు కాగా, స్వామినాథన్ ట్రిచ్చివాసి.