three arrest
-
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ఒట్టావా: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. మరిన్ని అరెస్టులుంటాయని స్పష్టం చేశారు. ఎడ్మంటన్‌లో ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్(22), కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్‌ప్రీత్ సింగ్(28)లపై హత్య, హత్యకు కుట్ర కేసులు నమోదు చేశామన్నారు. కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం కోణంలోనూ విచారణ సాగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) విభాగం శుక్రవారం తెలిపింది. 2023 జూన్ 18వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సర్రేలోని గురుద్వారా వెలుపల ఉన్న నిజ్జర్‌ను గుర్తు తెలియని దండగులు కాల్చి చంపారు. భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. -
లైన్మెన్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసు: ముగ్గురు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఒప్పందం చేసుకొని పలువురి అభ్యర్థుల నుంచి నిందితులు అడ్వాన్సుగా రూ. లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. సరైన సమయానికి సమాధానాలు పంపించలేకపోవటంతో అభ్యర్థులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. బయటపడిందిలా.. ఈనెల 17న జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరిగింది. ముందుగానే విద్యుత్‌శాఖలోని పలువురు ఉద్యోగులు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తామనేది వాళ్ల ఒప్పందం. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్షా హాల్‌కు సెల్‌ఫోన్‌ను తీసుకెళతారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మెసేజ్ రూపంలో అభ్యర్థులకు సమాధానాలు వస్తాయి. మొదటి ఆన్సర్ ఏ అయితే 1 అని, బీ అయితే 2 అని అంకెల రూపంలో సమాధానాలు పంపిస్తారు. అయితే నిందితులు ఎక్కువ మంది అభ్యర్థులతో ఒప్పందం చేసుకోవటంతో ఒకేసారి అందరికీ సమాధానాలు పంపించలేకపోయారు. దీంతో బయటికి వచి్చన తర్వాత పలువురు అభ్యర్థులు మోసపోయామని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేటలో ముగ్గురి అరెస్ట్.. అంబర్‌పేట పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. డిటెక్టెవ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కథనం ప్రకారం... కాడ్తాల్కు చెందిన లోక్యా నాయక్ జూనియర్ లైన్మెన్ పరీక్ష కోసం సిద్దపడ్డాడు. ఇతనికి నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అభ్యర్థి దశరథ్‌తో పరిచయం ఉంది. డబ్బులు ఖర్చుపెడితే పరీక్షలో పాస్ అయ్యే మార్గం ఉందని దశరథ్ లోక్యానాయక్‌తో చెప్పాడు. దీనికి లోక్యా నాయక్ అంగీకరించాడు. దీంతో కర్మన్‌ఘాట్‌లో నివిసించే లైన్మెన్ శ్రీనివాస్ (42)ను సంప్రదించారు. వీరంత కలిసి అంబర్‌పేటలో నివసించే మలక్‌పేట ఏడీఈ ఫిరోజ్‌ఖాన్(46)ను సంప్రదించారు. రూ.లక్ష ఇస్తే పరీక్షలో పాస్ అయ్యేలా చూస్తానని లోక్యానాయక్ వద్ద డబ్బులు తీసుకున్నారు. కాగా జూనియర్ లైన్ పరీక్షకు లోక్యానాయక్ హజరయ్యాడు. బయటకు వచ్చి మీరు నాకు ఏలాంటి సహాయం చేయలేదని, తిరిగి నా డబ్బులు ఇవ్వాలని కోరాడు. నీవు పరీక్షా సమయంలో మద్యలో ఎందుకు వచ్చావు... పూర్తి సమయంలో పరీక్షా కేంద్రంలో ఉంటే నీకు జవాబులు అందించే వాళ్లమని అతనికి చెప్పాడు. దీంతో లోక్యా నాయక్ విసుగుచెంది శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరు.. ప్రశ్నాపత్రం లీక్ విషయమై ఘట్కేసర్ పీఎస్‌లో కేసు నమోదయింది. ఘట్కేసర్లో నివాసం ఉండే కోదాడ ఈఏ సైదులును అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండలం, ఘనాపూర్ గ్రాలంలోని కేపీఆర్‌ఐటీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షా హాల్లో అభ్యర్థి సీహెచ్ శివప్రసాద్‌ను తనిఖీ చేయగా లోదుస్తుల్లో సెల్ ఫోన్ లభించింది. వెంటనే పరీక్షా నిర్వాహకులు సీఐ చంద్రబాబుకు సమాచారమివ్వగా, అభ్యరి్థని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి, నిజమేనని తేలడంతో కేసు నమోదు చేశారు. అలాగే సుల్తాన్ బజార్లో కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లి మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు చేరవేసుకున్నట్లు తెలిసింది. (చదవండి: టీఎంసీ మంత్రి సన్నిహితుల ఇంట్లో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు) -
త్రిపుర సీఎంపై హత్యాయత్నం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్‌కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లేన్‌కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్‌కి వెళ్లారు. ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
అల్లానే మా అమ్మాయిని కాపాడాడు..
సాక్షి, విజయవాడ : ‘మా అమ్మాయిని అల్లానే కాపాడాడు. పోకిరీల వికృత చేష్టలపై ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు స్పందించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని’ షేక్ నజ్బుల్లా తల్లిదండ్రులు షేక్ జాకీర్, నజియా బేగం పేర్కొన్నారు. పోకిరీల వికృత చేష్టలతో రైలు నుంచి దూకి గాయపడ్డ నజ్బుల్లా చికిత్స అనంతరం నిన్న (శుక్రవారం) రాత్రి విజయవాడలోని పెజ్జోనిపేటలోని తన ఇంటికి చేరింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వరుస సెలవులు రావడంతో బక్రీద్ పండుగను తమతో కలిసి జరుపుకుందామని స్నేహితులతో కలిసి నజ్బుల్లా చెన్నై నుంచి బయలుదేరిందన్నారు. రైలులో పోకిరీలు వేధిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు పట్టించుకోలేదన్నారు. కాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నజ్బుల్లా తన స్నేహితురాళ్లతో కలిసి మిలీనియం ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి విజయవాడ వస్తుండగా కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి తట్టులేక ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద నడుస్తున్న రైలులో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
హత్య కేసులో మరో ముగ్గురు అరెస్టు
బెళుగుప్ప : మండల పరిధిలోని కాలువపల్లి వద్ద ఈనెల 22న జరిగిన హరిజన సోమశేఖర్ (25) హత్య కేసులో ఇప్పటికే ప్రదాన ముద్దాయి హరిజన ఆంజినేయులును అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్ఐ నాగస్వామి విలేకరులకు తెలిపారు. ఆంజినేయులుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్య కేసులో పాల్గొన్నట్లు తేలిందన్నారు. ఆంజినేయులుకు తన సమీప బంధువులు అయిన ఆత్మకూరుకు చెందిన హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలు కూడా ముద్దాయిలేనన్నారు. వీరిని గురువారం గోళ్ల గ్రామానికి సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయ పరిసరాల్లో ఉండగా తమ అదుపులోకి తీసుకున్నామన్నారు. కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరచగా ఆగస్టు 9 వరకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. -
యువకుడి మృతి కేసులో నిందితుల అరెస్ట్
బ్రహ్మసముద్రం : యువకుడి మృతి కేసులో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివప్రసాద్, బ్రహ్మసముద్రం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, గంగరామన్నగారి తిప్పేస్వామి, కండక్టర్ రాజశేఖర్ ముగ్గురు మంచి స్నేహితులు. ఈ నెల ఆరో తేదీన ముగ్గురూ గ్రామ సమీపంలోని జమ్మికట్ట వద్ద కూర్చుని మద్యం తాగుతున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన పుట్టప్పగారి లక్ష్మీపతి (29) అక్కడకు వచ్చాడు. ఇతనికీ కొంత మద్యం పోశారు. ఆ తర్వాత మరికొంత కావాలంటూ డిమాండ్ చేయడంతో బోయ రామకృష్ణ కోపోద్రిక్తుడై లక్ష్మీపతి మర్మావయవాలపై తన్నాడు. స్పృహతప్పి పడిపోయిన అతడిని చనిపోయాడని భావించి, ఈ నేరం తమపైకి రాకుండా ఉండేందుకు అందరూ కలిసి మెడకు లుంగీతో బిగించి, చెట్టుకు వేలాడదీసి పరారయ్యారు. ముగ్గురు నిందితులూ మంగళవారం ఆర్ఐ విజయకుమార్ వద్ద లొంగిపోయారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్
దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు, ఫేస్బుక్ ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు సమీపంలోని శివానగర్‌లో జూన్ 28న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ హరినాథ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన షబరీ, ముద్దిరెడ్డిపల్లికి చెందిన నరేష్, నరసింహులు ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కెళ్లేవారు. పట్టణంలో దొంగతనం చేసిన వారి వీడియోలు అక్కడేఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ఫోటోలను కొందరు యువకులు ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తూ ఆచూకీ తెలపాలని కోరారు. ఆ దొంగలు ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం నేస్తూ జీవిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల సమీపంలో బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనంలో తిరుగుతున్న నరేష్, నరసింహులు, షబరీలను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు చైన్ స్నాచర్లుగా మారారని, వారిపై గతంలో నాలుగు కేసులున్నాయని తెలిపారు. చైన్ స్నాచర్ల అరెస్టులో పట్టణ ఎస్ఐలు సురేష్, జయానాయక్, పోలీసులు పాల్గొన్నారు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు
కొత్తచెరువు (పుట్టపర్తి) : పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువుకు చెందిన పాలగిరి, జగరాజుపల్లికి చెందిన దుమ్మలాంజనేయులు, చీమల నరసింహులు అనే గంజాయి విక్రేతలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కొత్తచెరువు సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖరరెడ్డి విలేకరులకు తెలిపారు. వారి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పైన పేర్కొన్న ముగ్గురు నిందితులు తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి గంజాయిని తీసుకువచ్చి పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో గంజాయిని అమ్మేవారని తెలిపారు. శుక్రవారం వారు గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కాస మాచారంతో సత్యసాయి ప్రశాంతి రైల్వేస్టేషన్ వద్ద కాపు కాసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ వెంకీ, కానిస్టేబుళ్లు నాగేశ్వరరెడ్డి, నాగేష్, చంద్ర, భరత్‌రెడ్డి, రామంజి, వన్నప్ప పాల్గొన్నారు. -
విమానంలో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
కోయంబత్తూరు: విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం. ఈ ఘటన గత రాత్రి చెన్నై ఇండిగో విమానంలో జరిగింది. సెంథిల్ కుమార్, రాజా... విమానం ఎక్కిన దగ్గర నుంచి పెరున్దురైకి చెందినవారు కాగా, స్వామినాథన్ ట్రిచ్చివాసి. -
సనత్ నగర్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సనత్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నివాసంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వ్యభిచారం అనే మాట వినపడకుండా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. -
శ్రీశైలవాసు హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
నందిగామ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గవరపు శ్రీశైల వాసు హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలవాసు ను చందాపురం గ్రామానికి చెందిన ఉన్నం హనుమంతరావు, హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషా గత నెల 28న హతమార్చిన విషయం తెలిసిందే. నందిగామ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు అయ్యింది. నందిగామతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది నాలుగు బృందాలుగా ఆరు రోజుల నుంచి నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్థరాత్రి కిరాయి హంతకుడు పాషాను నందిగామ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే హనుమంతరావును బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు పాషాకు తుపాకీ అద్దెకిచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సోమవారం నందిగామ కోర్టులో హాజరు పరచనున్నారు. -
స్నేహితున్ని చంపి ఇంట్లో పాతిపెట్టారు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం జరిగింది. స్నేహితుడినే సహచరులు హతమార్చి.... ఇంట్లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది. మృతుడు బోధన్‌కు చెందిన ఇఫ్తికర్ చిట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే బోధన్‌కు చెందిన ఇఫ్తికర్ పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీనపై బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే షకీల్ ఆదేశాలతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఇఫ్తికర్ బైక్ నిజామాబాద్‌లోని ఓ హోటల్ వద్ద లభించింది. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులో్కి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇఫ్తికర్‌ను చంపి ఆశనగర్ కాలనీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపారు. పోలీసులు ఈరోజు ఉదయం మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. -
చిత్తూరు జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లిలో పోలీసుల తనిఖీల్లో భారీగా మందుగుండు బయటపడింది. ఓ ప్రాంతంలో రహస్యంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. 600 జిలెటిన్ స్టిక్స్, 5 బస్తాల నల్లమందు, 70 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
నగరిలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలతో పాటు మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అప్పలాయగుంట వద్ద 102 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
-
కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లింది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఈరోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్రాజు తెలిపారు. కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్రాజు తెలిపారు.