స్నేహితున్ని చంపి ఇంట్లో పాతిపెట్టారు | Police arrest three in friend murder case at bodhan | Sakshi
Sakshi News home page

స్నేహితున్ని చంపి ఇంట్లో పాతిపెట్టారు

Published Fri, Aug 22 2014 12:53 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

Police arrest three in friend murder case at bodhan

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం జరిగింది. స్నేహితుడినే సహచరులు హతమార్చి.... ఇంట్లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది. మృతుడు బోధన్కు చెందిన ఇఫ్తికర్ చిట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే బోధన్కు చెందిన ఇఫ్తికర్ పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీనపై బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే షకీల్  ఆదేశాలతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఇఫ్తికర్ బైక్ నిజామాబాద్లోని ఓ హోటల్ వద్ద లభించింది.

ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులో్కి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇఫ్తికర్ను చంపి ఆశనగర్ కాలనీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపారు. పోలీసులు ఈరోజు ఉదయం మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement