ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు | three arrest in kothacheruvu | Sakshi
Sakshi News home page

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు

Published Fri, Apr 14 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

three arrest in kothacheruvu

కొత్తచెరువు (పుట్టపర్తి) : పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువుకు చెందిన పాలగిరి, జగరాజుపల్లికి చెందిన దుమ్మలాంజనేయులు, చీమల నరసింహులు అనే గంజాయి విక్రేతలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కొత్తచెరువు సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి విలేకరులకు తెలిపారు. వారి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పైన పేర్కొన్న ముగ్గురు నిందితులు తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి గంజాయిని తీసుకువచ్చి పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో గంజాయిని అమ్మేవారని తెలిపారు.

శుక్రవారం వారు గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కాస మాచారంతో సత్యసాయి ప్రశాంతి రైల్వేస్టేషన్‌ వద్ద కాపు కాసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు పేర్కొన్నారు.  ఏఎస్‌ఐ వెంకీ, కానిస్టేబుళ్లు నాగేశ్వరరెడ్డి, నాగేష్, చంద్ర, భరత్‌రెడ్డి, రామంజి, వన్నప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement