
చెన్నై: రాజమండ్రి నుంచి ఆదివారం చెన్నై బయలుదేరిన ఇండిగో 6ఈ7123 విమానం ఇంజిన్ విఫలమవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలో ఎగురుతుండగానే ఒక ఇంజిన్‌లో ఆయిల్ లీకై అది పనిచేయకుండా పోయిందనీ, దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమమేనన్నారు. ఆయిల్ లీక్ అయినా పైలట్ నేరుగా విమానాన్ని దించకుండా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టారని అధికారి ఆరోపించారు.