Oil leak
-
ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ స్టాక్‌హోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు. చదవండి: స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. -
చెన్నైలో విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: రాజమండ్రి నుంచి ఆదివారం చెన్నై బయలుదేరిన ఇండిగో 6ఈ7123 విమానం ఇంజిన్ విఫలమవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలో ఎగురుతుండగానే ఒక ఇంజిన్‌లో ఆయిల్ లీకై అది పనిచేయకుండా పోయిందనీ, దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమమేనన్నారు. ఆయిల్ లీక్ అయినా పైలట్ నేరుగా విమానాన్ని దించకుండా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టారని అధికారి ఆరోపించారు. -
ఆయిల్ లీకేజీతో ఆగిన కాచిగూడ-మదురై ఎక్స్‌ప్రెస్
బి.కొత్తకోట: ఆయిల్ లీక్ కావడంతో కాచిగూడ-మదురై ఎక్స్‌ప్రెస్(17615) ఆగిపోయింది. సాయంత్రం 4.10 గంటల నుంచి బి.కొత్తకోట మండలంలోని తుమ్మణంగుట్ట రైల్వేస్టేషన్లో ఐదున్నర గంటల పాటు ఆగిపోయింది. శనివారం ఉదయం 6.10 గంటలకు కాచిగూడలో బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ కర్నూలు, అనంతపురం మీదుగా చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు నుంచి తుమ్మణంగుట్ట మీదుగా చిత్తూరుకు, అక్కడి నుంచి తమిళనాడులోని మదురైకి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చేరుకోవాలి. రైలు తుమ్మణంగుట్ట రైల్వేష్టేషన్లోకి రాగానే సాంకేతిక లోపం ఉన్నట్టు గుర్తించి అక్కడే నిలిపివేశారు. ఇంజిన్‌లో హోస్ నుంచి అయిల్ లీక్ అవుతోందని గుర్తించి మరమ్మతులకు ప్రయత్నించారు. వీలు పడలేదు. ఈ విషయాన్ని అనంతపురం రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వేరే ఇంజిన్‌ను పంపారు. పాత ఇంజిన్‌కు కొత్త ఇంజిన్‌ను కలిపి రైలును తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీలుపడలేదు. చివరకు పాత ఇంజిన్‌ను తొలగించి, అనంతపురం నుంచి వచ్చిన ఇంజిన్‌తో రైలు బయలుదేరింది. రాత్రి 9.30 గంటలకు తుమ్మణంగుట్ట రైల్వేష్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. ఐదురన్నర గంటలపాటు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు చివరకు ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ప్రయాణికులు పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు.