
విద్యార్థినిని వీడియో తీసిన పాఠశాల టీచర్
ఇదేం వైపరీత్యం..
⇒ విద్యార్థినితో కరస్పాండెంట్ కుమారుడి అసభ్య ప్రవర్తన
⇒ వీడియో తీసిన పక్క పాఠశాల టీచర్ దాన్ని షేర్ చేసిన కరెస్పాండెంట్
⇒ బెదిరింపులకు పాల్పడ్డ మీడియా ప్రతినిధులు
కేపీహెచ్‌బికాలనీ: ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ను వీడియో తీసి ఇతరులకు షేర్ చేసిన ఉదంతంలో బాలానగర్ పోలీసులు నిందితులైన ఇద్దరు పాఠశాల కరెస్పాండెంట్లను, విద్యార్థిని అరెస్ట్ చేశారు. సీఐ బిక్షపతిరావు తెలిపిన మేరకు.. గత నెల 30న కోమటిబస్తీకి చెందిన ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాల కరస్పాండెంట్ కుమారుడు భవనంపైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్కూల్ టీచర్ గమనించి సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసింది. ఆ వీడియోను పాఠశాల కరస్పాండెంట్‌కు చూపించడంతో అతను తన ప్రత్యర్థి పాఠశాల కరస్పాం డెంట్‌పై ఉన్న కోపంతో వీడియోను ఇతరులకు షేర్ చేసి ప్రచారంలో పెట్టాడు.
దీంతో ఇద్దరు స్థానిక మీడియా ప్రతినిధులు పాఠశాల కరస్పాండెంట్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఈనెల 6న తెలుసుకున్న విద్యార్ధిని కుటుంబీకులు, స్థానిక బస్తీవాసులు ఆగ్రహాంతో ఇరు పాఠశాలల కరస్పాండెంట్‌లను, మీడియా ప్రతినిధులను నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులైన ఇద్దరు కరస్పాండెంట్లు సురేష్, విజయ్‌కుమార్‌లతో పాటు ఇద్దరు మీడియా ప్రతినిధులను, విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్ధిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.