ఆత్మకూరు సి.ఐ పై సస్పెన్షన్ వేటు
Published Fri, Dec 2 2016 1:06 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
కర్నూలు:
ఆత్మకూరు సీఐ దివాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ విచారణ జరిపించారు. ఆత్మకూరు పట్టణంలోని కేఎస్‌ఆర్ గోడౌన్‌లో ఆ ప్రాంత రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. గోడౌన్ యజమాని రైతులకు తెలియకుండా ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ దివాకర్‌రెడ్డి గోడౌన్ యజమానిని పిలిపించి పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని రైతులు డీఐజీకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. వాస్తవమేనని విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కూడా అవినీతి ఆరోపణలపై ఆరుగురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు వీఆర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
Advertisement