‘థర్డ్‌ డిగ్రీ’పై రాజీయత్నం! | Attempt to compromise on Third Degree issue | Sakshi
Sakshi News home page

‘థర్డ్‌ డిగ్రీ’పై రాజీయత్నం!

Published Sun, Jul 23 2017 1:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘థర్డ్‌ డిగ్రీ’పై రాజీయత్నం! - Sakshi

‘థర్డ్‌ డిగ్రీ’పై రాజీయత్నం!

- రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు
జైలులో బాధితులతో చర్చలు
ఉద్యోగాలు.. పరిహారం.. కేసుల ఎత్తివేతకు సై
 
సిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్‌ డిగ్రీ’ ప్రయోగంపై ‘రాజీ’ యత్నాలు మొదలయ్యాయి. ముఖ్య నాయకుల ఆదేశాలతో అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు. ఆందోళనలకు ముగింపు పలికేలా తమతో సహ కరించాలంటూ బాధితు లతో చర్చలు జరిపారు.  కేసులు ఎత్తి వేయిస్తామని, పరిహారం మంజూరయ్యేలా చూస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అధికార పార్టీ నాయకులు ఆలస్యంగా స్పందించడంపై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్లకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు శుక్రవారం కరీంనగర్‌ జైలుకు వెళ్లివచ్చారు.  

పోలీసుల తీరును తప్పు పడుతూనే.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘విపక్షాల ఆందోళనకు సహ కరించవద్దు.. వాళ్లు ఇవ్వాల వస్తారు.. పోతారు.. మనమే ఇక్కడ ఉండేది.’అంటూ రాజీ ప్రయ త్నాలు చేసినట్లు సమాచారం. ‘మా పానాలు పోతున్నయి. బొక్కబొక్కకూ పోలీసోళ్లు నీళ్లు పోసిండ్రు.. మాగతి మీకొస్తే తెలుస్తది..’ అంటూ నిందితుల్లో ఒకరు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ‘గిప్పుడా మీరు వచ్చేది’ అంటూ మరొకరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. 
 
బాధిత కుటుంబ సభ్యులతోనూ చర్చలు..
నిందితుల కుటుంబ సభ్యులతో తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులు కొందరు చర్చలు జరిపి నట్లు తెలిసింది. నేరెళ్ల, రామచంద్రాపూర్, జిల్లెల్ల గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లా డగా కొందరు రాజీకి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విపక్షాలకు దూరంగా ఉంటే పరి హారం ఇస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామ నడంతో కొందరు అంగీకరించినట్లు సమాచారం.  కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. పెంట బాణయ్య, చీకోటి శ్రీనివాస్, కోరుగంటి గణేశ్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు.
 
పోరుబాటలో విపక్షాలు
థర్డ్‌ డిగ్రీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్‌ సహా బీజేపీ, దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. హైకోర్టులోనూ కేసు ఫైల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
 
పోలీసులపై చర్యలు..!
థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు సమాచా రం. ప్రభుత్వపరంగా గ్రీన్‌సిగ్నల్‌ రాగానే బాధ్యు లపై చర్యలు చేపట్టనున్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకుని, నిందితులను ఆదుకునే పక్రియను ఏకకాలంతో చేపట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement