డ్రగ్స్ కేసు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు | High Court Notices To Telangana CS In Contempt Of Court Case | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కేసు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

Published Thu, Apr 7 2022 12:36 PM | Last Updated on Thu, Apr 7 2022 4:08 PM

High Court Notices To Telangana CS In Contempt Of Court Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ ఆరోపణ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని కోర్డుకు ఈడీ తెలిపింది. దీంతో వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని సూచించింది. అనంతరం ఈ పిటిషన్​పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement