
ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న ‘సాక్షి’ డైరెక్టర్లు వైఈపీ రెడ్డి, ఏఎల్‌ఎన్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపట్ల బ్యాంక్ వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. తెలియని నంబర్లు, ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. ‘కస్టమర్లకు ఎస్‌బీఐ ఎటువంటి లింక్స్ పంపదు. ఓటీపీ చెప్పాలంటూ ఫోన్ ద్వారా మా బ్యాంక్ సిబ్బంది కోరరు.
బ్యాంక్ శాఖ ద్వారానే లావాదేవీలు ఉంటాయి. ఓటీపీలు, సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు’ అని వివరించారు. ఎస్‌బీఐ ‘మీటింగ్ కస్టమర్స్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యానికి గురువారం ఆయన విచ్చేశారు. చాలా ఏళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ తమ కస్టమర్‌గా ఉం దని గుర్తుచేశారు. అద్భుతమైన సంస్థకు రావ డం ఆనందంగా ఉందన్నారు. సీజీఎంతోపాటు బ్యాంక్ అధికారులు సురేంద్ర నాయక్, పి.ఎల్.శ్రీనివాస్ రావు, పల్లవి శర్మ, మారుతి, సంతోష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment