మాట్లాడుతున్న ఎల్‌డీఎం శ్రీధర్
అలంపూర్ రూరల్ : బ్యాంకు ఖాతాదారులు తప్పక బీమా చేయించుకోవాలని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) శ్రీధర్ సూచించారు. బుధవారం అలంపూర్ మండలంలోని సింగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి రాచబాట అవుతుందన్నారు.
సాధ్యమైనంత వరకు తెలిసిన వారికే నగదు బదిలీలు చేయాలన్నారు. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితమని, ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్ విభాగం పనిచేస్తోందన్నారు. రూరల్ ఎంప్లాయిమెంట్‌పై ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో సర్టిఫికెట్ పొందిన వారికి రూ.లక్ష వరకు రుణాలు ఇస్తామన్నారు.
అనంతరం డీడీఎం రవీంద్రనాయక్ మాట్లాడుతూ గ్రామాన్ని అలంపూర్ ఆంధ్రాబ్యాంకు దత్తత తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కాంతమ్మ, జోగుళాంబ ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ రాధాకృష్ణ, ఎంపీడీఓ మల్లికార్జున్, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రాఘవ విశ్వనాథ్, బ్యాంకు ఉద్యోగి గోపి, గ్రామస్తులు నాగేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment