beema
-
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆరోగ్య బీమా ఎన్నో కుటుంబాలకు మెరుగైన రక్షణ కలి్పస్తుందనడంలో సందేహం లేదు. కానీ, మన దేశంలో సగం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేరన్నది వాస్తవం. 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలే నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారులకు ప్రయోజనం కలిగించే మార్పులకు శ్రీకారం చుట్టింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ‘65 ఏళ్ల’ పరిమితిని తొలగించింది. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండాల్సిన కాలాన్ని తగ్గించింది. క్లెయిమ్ తిరస్కరణ నిబంధనలను మరింత అనుకూలంగా మార్చింది. వీటివల్ల పాలసీదారులకు ఒరిగే ప్రయోజనం, ప్రీమియం భారం గురించి తెలుసుకుందాంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో తమ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడ్డారా?, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని బీమా సంస్థ పాలసీ దరఖాస్తులో అడుగుతుంది. అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అవి ముందస్తు వ్యాధుల కిందకు వస్తే (పీఈడీ) నిర్ణీత కాలం పాటు ఆయా వ్యాధుల కవరేజీ కోసం వేచి ఉండాలి.ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసే వరకు వాటికి సంబంధించిన క్లెయిమ్‌లకు బీమా సంస్థ చెల్లింపులు చేయదు. పాలసీదారులు సొంతంగా చెల్లించుకోవాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది గరిష్టంగా 48 నెలలు (నాలుగేళ్లు) ఉండగా, దీనిని ఐఆర్డీఏఐ తాజాగా 36 నెలలకు (మూడేళ్లు) తగ్గించింది. కాకపోతే ఒక్కో బీమా సంస్థలో ఈ కాలం ఒక్కో మాదిరిగా ఉండొచ్చు. అదనపు ప్రీమియం చెల్లిస్తే ఈ వెయిటింగ్ కాలాన్ని కొన్ని బీమా సంస్థలు తగ్గిస్తున్నాయి కూడా. మరి అదనపు ప్రీమియం భరించలేని వారికి తాజా నిబంధన సంతోషాన్నిచ్చేదే.తాజా పరిణామంతో బీమా సంస్థలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు మూడేళ్లకు మించి కొర్రీలు పెట్టడం కుదరదు. ఇది బీమా వ్యాప్తిని పెంచుతుందని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం బిజినెస్ హెడ్ సిద్థార్థ్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. ‘‘ముందస్తు వ్యాధులకు మూడేళ్లకంటే తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీని ఎంపిక చేసుకోవడం పాలసీదారుల అవసరం, అవగాహనపైనే ఆధారపడి ఉంటోంది.తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీదారులకు అనుకూలం’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, క్లెయిమ్‌లు, అండర్‌రైటింగ్ డైరెక్టర్ బసుతోష్ మిశ్రా చెప్పారు. ఒక ఏడాది తగ్గించడం వల్ల ముందస్తు వ్యాధుల పేరుతో బీమా సంస్థల నుంచి క్లెయిమ్ తిరస్కరణలు తగ్గిపోతాయని నిపుణుల విశ్లేషణ.మొదటి రోజు నుంచే..అదనపు ప్రీమియం చెల్లిస్తే మొదటి రోజు నుంచే ముందస్తు వ్యాధులకు కవరేజీ ఇచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. ‘‘మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కొలె్రస్టాల్ తదితర ముందు నుంచి ఉన్న వ్యాధులకు పాలసీదారులు మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. కాకపోతే ఇందు కోసం 10–15 శాతం అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది’’అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు.ముందు నుంచి అంటే ఎంత కాలం..?పాలసీ తీసుకునే తేదీ నాటి నుంచి దానికి ముందు 36 నెలల కాలంలో డాక్టర్ ఏదైనా సమస్యని నిర్ధారించడం.. అందుకు గాను చికిత్స లేదా ఔషధాలు సూచించినా అది పీఈడీ కిందకు వస్తుందిన నిజానికి ఇప్పటి వరకు ఇది 48 నెలలుగా ఉండేది. అంటే పాలసీ తీసుకునే నాటికి ముందు నాలుగేళ్ల కాలంలో ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటే దాన్ని పీఈడీగా పరిగణించే వారు. ఇప్పుడు మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. దశాబ్దం క్రితం ఐదారేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. బీమా రంగంలో పోటీ పెరగడం, పాలసీ కొనుగోలుదారులు విస్తరించడంతో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఈ తప్పు చేయొద్దు..పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ పీఈడీల గురించి వెల్లడించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్న డోస్‌తో రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి పరీక్షల్లో బయటపడేవి కావని చెప్పి చాలా మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు పాలసీ దరఖాస్తులో వెల్లడించరు. కానీ, ఇది పెద్ద తప్పు. తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నదీ, వాటికి ఏవేవి మందులు వాడుతున్నది తప్పకుండా వెల్లడించాలి. దీనివల్ల పాలసీ డాక్యుమెంట్లో మీ ఆరోగ్య సమస్యలు నమోదు అవుతాయి. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల పరంగా వివాదాలు తగ్గిపోతాయి.కానీ, ఆరోగ్య సమస్యలను బయట పెడితే కంపెనీలు పాలసీ జారీకి నిరాకరిస్తారయన్న భయంతో కొందరు వెల్లడించరు. కానీ, థైరాయిడ్, కొలె్రస్టాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సైతం అండర్‌రైటింగ్ విషయంలో (పాలసీ జారీ) బీమా సంస్థలు సౌకర్యంగానే ఉంటాయి. కనుక నిజాయితీగా వెల్లడించడమే మంచిదని నిపుణుల వ్యాఖ్య.వ్యాధుల వారీగా వెయిటింగ్..కొన్ని ఆనారోగ్యాలకు చికిత్స కవరేజీని బీమా సంస్థలు మొదటి రోజు నుంచే ఆఫర్ చేయవు. వీటి కోసం ‘ప్రత్యేకమైన వెయిటింగ్ పీరియడ్’ను అమలు చేస్తుంటాయి. నిబంధల ప్రకారం ఈ కాలాన్ని గరిష్టంగా 4 సంవత్సరాలకు మించి అమలు చేయకూడదు. ఇప్పుడు ఈ కాలాన్ని మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. నిజానికి కొన్ని బీమా సంస్థలు రెండేళ్లకే ఈ వెయిటింగ్ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి.పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో ఈ వ్యాధుల వివరాలు పూర్తిగా ఉంటాయి. నిరీ్ణత వెయిటింగ్ కాలం ముగిసిన తర్వాతే వీటికి సంబంధించిన క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది. క్యాటరాక్ట్, సైనసైటిస్, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ చికిత్సలు, కిడ్నీలో రాళ్ల తొలగింపు, కీళ్ల మార్పిడి చికిత్సలకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు కొత్త వారికే కాకుండా పాత పాలసీదారులకూ వర్తిస్తుంది. ఐదేళ్లు పూర్తయితే చాలు!మారటోరియం పీరియడ్‌ను 8 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయం. పాలసీ తీసుకుని, క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాతి కాలంలో ఎలాంటి కారణం చూపుతూ బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడం కుదరదు. పాలసీదారు మోసం చేసినట్టు నిరూపిస్తే తప్పించి క్లెయిమ్‌ను ఆమోదించాల్సిందే. ఒకేసారి 8 ఏళ్ల నుంచి 5ఏళ్లకు తగ్గించడం వల్ల పాలసీదారులకు ఎంతో వెసులుబాటు లభించినట్టయింది.దరఖాస్తులో ఆరోగ్య సమాచారం పూర్తిగా వెల్లడించలేదనో, తప్పుడు సమాచారం ఇచ్చారనే పేరుతో బీమా సంస్థలు కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లకు చెల్లింపులు చేయకుండా నిరాకరిస్తుంటాయి. ఉదాహరణకు మధుమేహం, ఆస్తమా తదితర వ్యాధులు ముందు నుంచి ఉన్నా కానీ వెల్లడించలేదంటూ క్లెయిమ్‌లు తిరస్కరించిన కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ, పాలసీదారు మోసపూరితంగా సమాచారం వెల్లడించిన సందర్భాల్లోనే ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్ తిరస్కరించడానికి ఇక మీదట కూడా బీమా సంస్థలకు అధికారం ఉంటుంది.ఈ ఐదేళ్లు అన్నది సదరు వ్యక్తి ఆ పాలసీ మొదటి సంవత్సరం నుంచి వర్తిస్తుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టబులిటీ ద్వారా మారినప్పటికీ, అంతకుముందు సంస్థల్లోని కాలం కూడా కలుస్తుంది. అలాగే, ఈ మారటోరియం అన్నది మొదట తీసుకున్న బీమా కవవరేజీకే ఐదేళ్లు వర్తిస్తుంది. ఇది ఎలా అంటే ఉదాహరణకు ఆరంభంలో రూ.5 లక్షలకు తీసుకున్నారని అనుకుందాం. ఐదేళ్ల తర్వాత రూ.10 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం.అప్పుడు ఐదేళ్లు ముగిసిన మొదటి రూ.5 లక్షల కవరేజీకి మారటోరియం తొలగిపోతుంది. పెంచుకున్న కవరేజీ అప్పటి నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాతే మారటోరియం పరిధిలోకి వస్తుంది. ‘‘ఇది పాలసీదారుల అనుకూల నిర్ణయం. ఎనిమిదేళ్లు మారటోరియం అన్నది చాలా సుదీర్ఘమైనది. పాలసీ తీసుకునే ముందే ఏవైనా వ్యాధులు ఉంటే అవి బయట పడేందుకు ఐదేళ్లు సరిపోతుంది. ఏదైనా మోసం ఉంటే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత బీమా సంస్థపైనే ఉంటుంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సీఈవో శిల్పా అరోరా పేర్కొన్నారు. ప్రీమియం భారం..వృద్ధులకూ ఆరోగ్య బీమా కవరేజీని విస్తతం చేయడమే ఐఆర్డీఏఐ తాజా చర్య వెనుక ఉద్దేశ్యం. దీంతో బీమా సంస్థలు ఇప్పుడు ఏ వయసు వారికైనా బీమా పాలసీలను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో పోటీ ఎలానూ ఉంటుంది. కనుక ఇక మీదట వృద్ధుల కోసం బీమా సంస్థలు మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అదే సమయంలో వీటి ప్రీమియం 10–15 శాతం వరకు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.అంతేకాదు, ఇతర పాలసీదారులపైనా ప్రీమియం భారం పడనుంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం వల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పాలసీల ప్రీమియంను బీమా సంస్థలు సవరించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సామాన్య, మధ్యతరగతి వాసులకు భరించలేని స్థాయికి చేరగా, ఇప్పుడు మరో విడత పెంపుతో ఈ భారం మరింత అధికం కానుంది. 65 ఏళ్ల పరిమితి లేదిక.. 2016 నాటి ఆరోగ్య బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా సంస్థలు 65 ఏళ్లలోపు వారికి తప్పనిసరిగా హెల్త్ కవరేజ్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్పించి ఈ వయసులోపు వారికి కవరేజీని తిరస్కరించరాదన్నది నిబంధనల్లోని ఉద్దేశ్యం. 65 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఇవ్వడం, ఇవ్వకపోడం బీమా కంపెనీల అభీష్టంపైనే ఆధారపడి ఉండేది. అంతేకానీ, 65 ఏళ్లు నిండిన వారికి సైతం ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వాలని బీమా సంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి లేదు.తాజా నిబంధనల్లో 65 ఏళ్లను ఐఆర్డీఏఐ ప్రస్తావించలేదు. అంటే వృద్ధుల విషయంలో బీమా కంపెనీలకు మరింత స్వేచ్ఛనిచి్చనట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ వయసుల వారి అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన ఫీచర్లతో పాలసీలను బీమా సంస్థలు తీసుకురావచ్చంటున్నారు. 65 ఏళ్లకు మించిన వారికి సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఐఆర్డీఏఐ అనుమతించిందన్న వార్తలు వాస్తవం కాదు. నిబంధనల్లో 65 ఏళ్ల పరిమితిని తొలగించింది అంతే.ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం కూడా 65 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా ఆఫర్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే 65 ఏళ్లు దాటిన వారికి సైతం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల పరిమితిని ఆసరాగా తీసుకుని.. అంతకుమించిన వయసు వారికి ఆరోగ్య బీమా కవరేజీ ప్రతిపాదనలను కొన్ని బీమా సంస్థలు నిరాకరించేవి.ఇప్పుడు దీన్ని తొలగించడం వల్ల ఇక మీదట అలా చేయడం కుదరదు. వివిధ వయసుల వారికి అనుగుణమైన బీమా ఉత్పత్తులను రూపొందించి, ప్రీమియం నిర్ణయించాల్సిందే’’అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సనూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. -
ఇంటింటా 'వైఎస్సార్ బీమా'
సాక్షి, అమరావతి: వైఎస్సార్ బీమా పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కార్యక్రమం చేపట్టింది. వార్డు, గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితులు, బియ్యం కార్డు ఉన్నదా? లేకపోతే అందుకు గల కారణాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలను గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు నమోదు చేసుకుని అర్హులను ఎంపిక చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలకు బీమా ధీమా ► నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు బీమా ధీమా కల్పించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ► గతంలోనూ ఈ బీమాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేశాయి. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడంతో అమలు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భుజానికి ఎత్తుకుంది. ► అసంఘటిత రంగంలోని కార్మికులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ► అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలు బియ్యం కార్డుల్ని కలిగి ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ► అసంఘటిత రంగంలోని కార్మికులు, అల్పాదాయ వర్గాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ► అలాంటి కుటుంబాలకు బీమా పరిహారం అందితే వారికి జీవనం కొనసాగించే వీలుంటుంది. ఈ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆ కుటుంబాల తరఫున ప్రీమియం మొత్తాలను చెల్లిస్తుంది. ప్రయోజనాలివీ.. ► 18 నుంచి 50 సంవత్సరాల్లోపు వయసు కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం పొందినా రూ.5 లక్షల బీమా మొత్తం ఆ కుటుంబానికి అందుతుంది. ► సహజ మరణమైతే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 51 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణించినా.. శాశ్వత వైకల్యం పొందినా రూ.3 లక్షల పరిహారం అందుతుంది. -
రైతన్న కష్టాలు..సబ్సిడీ కోసం
సాక్షి, ధర్మవరం: ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన అమలు చేస్తుంది. కానీ ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రతి పథకాన్నీ తమ రాజకీయ అవసరాలకు డుకుంటున్నారు. లబ్ధిదారులకు పచ్చ కండువాలు కప్పి తమవారిగా చేసుకున్న తర్వాతే సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. భార్యా భర్తల మధ్య తగవైనా.. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న వివాదమైనా..చంద్రన్న బీమా అయినా.. చేపల చెరువు అయినా ఏదైనా కండువా కప్పుకుంటేనే న్యాయం జరుగుతుంది.. లేకపోతేఏడ్చి గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. నాపేరు కృష్ణయ్య. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి. నేను బోరువద్ద రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టుకున్నా. ఉద్యానశాఖ ప్రోత్సాహకం కింద అందించే డబ్బుకోసం బిల్లు పెడితే ఇయ్యలేదు. ఎంపీఈఓ ఫొటో తీసుకెళ్లినా నాకు బిల్లు రాలేదు. ఎందుకని అడిగితే ‘‘మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు అందుకని బిల్లు పెట్టనివ్వం’’ అని ఇక్కడి టీడీపీ నేతలు చెబుతున్నారు. చీనీ చెట్లకు బిల్లు పెట్టుకున్నా.. అదీ అంతే. నేను పదేళ్ల కిందట చీనీ మొక్కలు నాటినా బిల్లు ఇయ్యలేదు. సంవత్సరం కూడా కాని చెట్లకేమో బిల్లులిస్తున్నారు. సొసైటీలో రూ.6 వేలు డీడీ కట్టినా.. ఇంతవరకూ రూపాయి కూడా గతిలేదు. చివరకు ఊరంతా సీసీరోడ్లు వేసినా.. మా సందులో మాత్రం ఎయ్యలేదు. వైఎస్సార్సీపీ వాళ్లమంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు.’’ప్రభుత్వ తీరు.. అధికార పార్టీ నేతల ఆగడాలపై ఓ రైతు నిస్సహాయత ఇదీ. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో బాధిత రైతును గుర్తించిన ‘సాక్షి’ లోతైన విశ్లేషణ చేయగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘అన్న చెప్పాడు.. మీ వానికి చంద్రన్న బీమా రావాలంటే పార్టీలో చేరాలంట.. లేకపోతే బీమా ఇయ్యరు. పార్టీలోకి చేరతారో..? బీమా మొత్తం పోగొట్టుకుంటారో...? మీ ఇష్టం..’’ ఇటీవల రోడ్డు ప్రమాదంలో బిడ్డను కోల్పోయి చంద్రన్న బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన మృతుని కుటుంబ సభ్యులకు అధికారపార్టీ నాయకులు జారీ చేసిన హుకుం ఇది. ‘‘మీ భూములను హౌసింగ్‌కు తీసుకుంటారంట..నీవు వచ్చి అన్నను కలిస్తే.. నీకు న్యాయం జరగుతుంది..లేకపోతే అంతే.. నీకు పింఛన్ వచ్చింది.. అన్న దగ్గరకు వచ్చిపో.. నీకు ఇళ్లు ఇప్పిస్తాం.. ఒకసారి ఆఫీస్ దగ్గరికి వస్తే చాలు’’ –ధర్మవరం నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను అధికారపార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు..ఇవి ధర్మవరం: నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల దాష్టీకానికి లబ్ధిదారులు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాపుతున్నారు. ఏ సంక్షేమ పథకానికైనా తమకు తెలియకుండా లబ్ధిదారులను ఎంపిక చేయవద్దనీ, ఒక వేళ అలా ఎంపిక చేసినా తమకు చెప్పకుండా పథకం వర్తింపచేయవద్దని అధికార పార్టీ నేతలు అధికారులను ఆదేశిస్తున్నారు. వారు చెప్పిట్లు వినేవారికి మాత్రమే పథకాలు అందేలా చూస్తారు. ముఖ్యంగా «పింఛన్లు, హౌసింగ్, చంద్రన్నబీమా, రేషన్ కార్డులు, చినీచెట్ల బిల్లులు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే పచ్చకండువా కప్పుకోవడం ఆయా లబ్ధిదారులకు తప్పని సరైంది. కాదు..కూడదంటే నిర్ధాక్షిణ్యంగా సంక్షేమ పథకాలను వారికి దూరం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఇలా.. బత్తలపల్లి మండలంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలంటే తప్పనిసరిగా అధికారపార్టీలోకి చేరాలని హుకుం జారీ చేశారు. అందుకు అంగీకరించని వారి దరఖాస్తులను అధికారుల చేత తిరస్కరింపజేశారు.ఇక ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో పండ్ల చెట్లకు సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే తప్పని సరిగా అధికారపార్టీ కండువా కప్పుకోవాలని లేకపోతే లేదని తేల్చిచెప్పారు. అయితే వారి ఒత్తిళ్లలకు తలొగ్గనివారికి నేటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో వారు వీరు అన్న తేడాలేకుండా..అందరికీ ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందేవి. కానీ నేడు ఇలా వ్యవహరించడం పట్ల నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామం. ఈమెకు 189 సర్వే నంబర్లో ఐదు ఎకరాల భూమి ఉంది. ఐదు సంవత్సరాల క్రితం పొలంలో 356 మామిడి మొక్కలు నాటుకున్నారు. ఉపాధి పథకం కింద వీటిని సాగు చేశారు. ఇందుకు గాను మూడు సంవత్సరాల్లో రూ.7.30 లక్షలు బిల్లు కావాల్సి ఉంది. అయితే రూ.1.25 లక్షలు మాత్రమే బిల్లు చేసి ఉపాధి సిబ్బంది చేతులు దులుపేసుకున్నారు. మిగిలిన బిల్లులు చేయమంటే ‘‘మీరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు..మీకు బిల్లులు చేయడం ఇబ్బందిగా ఉంది’’ అని చెబుతున్నారని బాధితురాలు వాపోతోంది. వీరితో పాటు చెట్లు నాటుకున్న రైతులకు మాత్రం మొత్తం బిల్లులు ఇవ్వడం గమనార్హం. - మహిళా రైతు పేరు ఉమ్మడి ఆదిశేషమ్మ. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు. మండల కేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కింద నిధులతో జనసంచారం లేని ప్రాంతాల్లో సైతం సిమెంట్ రోడ్లు వేసి నిధులు దిగమింగిన అధికార పార్టీ నేతలు...తమ కాలనీలో మాత్రం రోడ్లు వేయడం లేదని వాపోతున్నారు. తాము వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామన్న కారణంగా తమ వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. -సాకే లక్ష్మన్న,ధర్మవరం బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామం. ఈయన గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఒక హెక్టారులో అరటి పంటను సాగు చేశారు. ఈయనతో పాటు నారాయణరెడ్డి, నాగేంద్రమ్మలు సైతం అరటి పంటను సాగు చేశారు. ఇందుకుగాను ప్రభుత్వం హార్టికల్చర్ కింద హెక్టారుకు రూ.30,800 చెల్లిస్తుంది. ఈ డబ్బులు ఇవ్వకుండా గ్రామానికి చెందిన జన్మభూమి కమిటి సభ్యులు, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పేరు చెప్పి బిల్లులు చేయకుండా అడ్డుకున్నారు. అదేమని హార్టికల్చర్ అధికారులను అడిగితే ‘‘మీకు బిల్లులు చేయవద్దని ఒత్తిడి తీసుకువస్తున్నారు’’ అని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. - గుమ్మడి అనంతరెడ్డి. పిన్నదరి గ్రామానికి చెందిన ఈయన... సర్వేనంబర్ 374లో 4.8 ఎకరాల్లో 330 చీనీచెట్లు సాగు చేశాడు. మొక్క రూ.70 ప్రకారం కొని, మొక్కలు నాటడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. పండ్లతోటల సాగుచేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మహేష్ వైఎస్సార్ సీపీ మద్దతుదారుడని అధికారులకు చెప్పిన టీడీపీ నాయకులు ఆయన దరఖాస్తును పక్కన పెట్టించారు. దీంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. -రైతు టీ.మహేష్. తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి స్వగ్రామం. నాలుగేళ్ల కిత్రం సర్వేనంబర్ 284లోని 4.20 ఎకరాల పొలంలో డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం ద్వారా 294 మామిడి మొక్కలు నాటాడు. మొక్కలను సంరక్షించడానికి (వాచ్ అండ్ వాటర్) నెలకు రూ.10 వేలు ఏడాది పాటు ఇచ్చారు. రామకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటుడటంతో టీడీపీ నాయకులు ఆయన బిల్లులు నిలిపారు. ఇప్పటికి రూ.4 లక్షల వరకు బిల్లులు అందాల్సి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -ఎం.రామకృష్ణచౌదరి, తాడిమర్రి మండలం కండువా కప్పుకుంటేనే బిల్లిస్తారంట నేను 5.20 సెంట్లలో 600 చినీ చెట్లను సాగు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లుల కోసం ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. నేను వైఎస్సార్సీపీకి చెందిన వాడని బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. బిల్లుల కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేశాను. అధికారులు కనికరించలేదు, గ్రామంలో జన్మభూమి కమిటీ వాళ్లతో సంతకాలు చేయించుకు రావాలని అధికారులు సూచించారు. వాళ్లేమో కండువా వేసుకుంటే తప్ప బిల్లులు చేయమని తెగేసి చెప్పుతున్నారు. రైతులకు పార్టీలు అంటగట్టి పథకాలు రాకుండా చేయడం శోచనీయం. – రాజశేఖర్, నల్లచెర్లోపల్లి, ముదిగుబ్బ మండలం మూడేళ్లుగా బిల్లులు చెల్లించలేదు నేను మూడు ఎకరాల్లో 220 మామిడి చెట్లను పెంచుతున్నాను. ఈ చెట్లను ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్నాను. టీడీపీ అధికారం చేపట్టిన మొదట్లో ఒక బిల్లు మాత్రమే వేశారు. అనంతరం నేను వైఎస్సార్సీపీ సానుభూతి పరుడని చెప్పి బిల్లులు రాకుండా నిలిపివేశారు. బిల్లుల కోసం అధికారులు చుట్టు తిరిగినా వారు పట్టించుకోలేదు. – తిరుపాల్‌రెడ్డి, మర్తాడు, ముదిగుబ్బ టీడీపీలో చేరితే బిల్లులిస్తామని చెబుతున్నారు ఉపాధి హామీ పథకం కింద మూడున్నర ఎకరంలో మామిడి మొక్కలను రెండేళ్ల కిందట నాటాను. మొక్కలను ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకుని బతికించుకున్నాను. బిల్లుల కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లితే మీ గ్రామంలో ఉన్న జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం పెట్టించుకుని రావాలని ఏపీఓ చెప్పారు. వాళ్ల వద్దకు వెళ్లితే నీవు వైస్సార్సీపీ సానుభూతి పరుడివి బిల్లులు ఎలా అయితాయని అనుకుంటున్నారు.. మళ్లీ ఎంపీడీఓ వెంకటరమణ వద్దకు వెళ్లి బతిమాలుకుంటే...ఆయన ‘‘ఇదంతా ఎందుకు నీవు పార్టీ కండువా వేసుకుంటావని చెప్పు వెంటనే ఎమ్మెల్యేతో మాట్లాడి నీ బిల్లులు, నీ బంధువులకు చెందిన బిల్లులను ఒక్కరోజులోనే చేస్తా’’ అని చెప్పాడు. మీరు కుడా ఇలా మాట్లాడాతారా సార్..అంటే ‘‘కండువా వేసుకుంటేనే బిల్లుల కోసం కార్యాలయానికి రా.. లేకపోతే రావద్దు’’ అని ఆయన గట్టిగా చెప్పాడు. నాకు రూ.29 వేలు రావాల్సి ఉంది. వీటి కోసం ఆత్మాభిమానం చంపుకోలేనని చెప్పి అక్కడి నుంచి వచ్చా. నా గోడును మా గ్రామం మీదుగా పాదయాత్ర చేసుకుంటు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతి పత్రం రూపంలో ఇచ్చుకున్నాను. – చంద్రమోహన్, ఏలుకుంట్ల, బత్తలపల్లి మండలం ఇచ్చిన బిల్లును తీసుకున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నేను 5 ఎకరాలలో మామిడి మొక్కలను నాటుకున్నాను. గ్రామంలో వైఎస్సార్సీపీకి సానుభూతి పరునిగా ఉంటున్నాను. ఈ విషయాన్ని అధికారులకు చెప్పి జన్మభూమి కమిటీ సభ్యుల బిల్లులు చేయకూడదంటు నిలుపుదల చేశారు. బిల్లుల కోసం జిల్లా కేంద్రంలో జరిగే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చుకున్నాను. వీటికి స్పందించిన అధికారులు పెండింగ్‌లో ఉన్న బిల్లు మొత్తం రూ.70 వేలు పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేశారు. అయితే సాయంత్రం చేతికి డబ్బులు ఇచ్చారు. గంట వ్యవధిలోనే మళ్లీ వచ్చి ‘‘నీ బిల్లులో పొరపాటు ఉందని...లెక్క తేలగానే ఇస్తాం’’ అని చెప్పి డబ్బును ఇప్పించుకుపోయారు. బిల్లు కోసం మళ్లీ వెళ్లితే జన్మభూమి కమిటీ వాళ్లను కలవమని పోస్ట్‌మ్యాన్ చెప్పాడు. కమిటీ సభ్యులను అడిగితే ఎమ్మెల్యే సూర్యనారాయణతో కండువా వేయించుకుంటేనే బిల్లు ఇస్తామని చెప్పారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి...టీడీపీ వాళ్లకే చేస్తామనడం సరికాదు. – కేశప్ప, ఏలుకుంట్ల , బత్తలపల్లి మండలం -
అందరూ బీమా చేయించుకోవాలి
అలంపూర్ రూరల్ : బ్యాంకు ఖాతాదారులు తప్పక బీమా చేయించుకోవాలని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) శ్రీధర్ సూచించారు. బుధవారం అలంపూర్ మండలంలోని సింగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి రాచబాట అవుతుందన్నారు. సాధ్యమైనంత వరకు తెలిసిన వారికే నగదు బదిలీలు చేయాలన్నారు. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితమని, ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్ విభాగం పనిచేస్తోందన్నారు. రూరల్ ఎంప్లాయిమెంట్‌పై ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో సర్టిఫికెట్ పొందిన వారికి రూ.లక్ష వరకు రుణాలు ఇస్తామన్నారు. అనంతరం డీడీఎం రవీంద్రనాయక్ మాట్లాడుతూ గ్రామాన్ని అలంపూర్ ఆంధ్రాబ్యాంకు దత్తత తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కాంతమ్మ, జోగుళాంబ ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ రాధాకృష్ణ, ఎంపీడీఓ మల్లికార్జున్, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రాఘవ విశ్వనాథ్, బ్యాంకు ఉద్యోగి గోపి, గ్రామస్తులు నాగేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం – రైతులను మభ్యపెడితే ఊరుకోం – పీడీ కేసులకు భయపడం – వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పాడి రైతుకు ఇంటికో ఆవు – పెద్దిరెడ్డి రామద్రా రెడ్డి వి.కోట: వేరుశెనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమాను ఎగ్గొంటేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్ గన్నుల విజయగాథలను ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో ఆదివారం ఆయన విలేకరుల సవూవేశంలో వూట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 70 వేల ఎకరాల్లో సాగుచేసిన వేరుశెనగ పంటను కాపాడావుని చంద్రబాబు, ఆయన వుంత్రులు కాకిలెక్కలు చెబుతున్నారని వుండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వురో యావలేని చంద్రబాబు వురోవూరు రైతులను మోసపుచ్చుతున్నారన్నారు. ఎన్నికల హామీలను పూర్తిచేశావుని చెబుతున్న ఆయన వైఖరిపై ప్రజలు అసంతప్తితో ఉన్న విషయం తెలియకపోవడం విడ్డూరవున్నారు. అభివృద్ధి పనుల కోసం వచ్చే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దొరకకుండా తిరిగే చంద్రబాబుకు ప్రజల సవుస్యలు పట్టవని వివుర్శించారు. రాష్ట్రంలో కడుతున్న నీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. భూనిర్వాసితులకు సవున్యాయం చేయాలన్నదే తవు అభివుతవున్నారు. ప్రజల సవుస్యలు ప్రతిపక్షానికే తెలుస్తుందని, అధికార పార్టీ నేతలు పనులు, స్వలాభాల కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ప్రత్యేక హోదాపై మాటలు వూర్చే వ్యక్తులు చంద్రబాబు, వెంకయ్యనాయుడు వూత్రమేనని, వారి వూటలకు చేతలకు పొంతన ఉండదని చెప్పారు. 2019లో తవు అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తధ్యవుని, ఆయన వల్లే ప్రత్యేక హోదా సాధ్యవ˜తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తావున్నారు. పాడి రైతుకు ఇంటికో ఆవు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పాడి రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో పాడి ఆవును అందించేందుకు తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని పుంగనూరులో నిర్వహించిన గాంధీ జయంతి సభలో పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆవులను అందజేసే ప్రతిపాదనను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ మేరకు ఆయన అంగీకారం తెలిపారని స్పష్టం చేశారు. -
బీమా ధీమా ఇచ్చేనా?
-కొబ్బరి చెట్లకూ ఇక బీమా -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -5 జిల్లాల్లో అమలు కానున్న పథకం -జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సేద్యం జంగారెడ్డిగూడెం : వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల ఎక్కువగా కొబ్బరి పంటకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా కొబ్బరి తోటలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొబ్బరి తోటల సాగులో రాష్ట్రం నాలుగోస్థానంలో ఉంది. జాతీయ హార్టీకల్చర్ బోర్డు 2014 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 121.9 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1258.4 మెట్రిక్ టన్నుల కొబ్బరి ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంట తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాల్లో కొబ్బరి బీమా పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సుమారు 55 వేల ఎకరాల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. బీమా చేసే ప్రక్రియ.. పెనువిపత్తులు లేదా సహజసిద్ధమైన నష్టానికి, అకస్మాత్తుగా కొబ్బరి మొక్కలు చనిపోవడం వంటి వాటికి, రీప్లాంటేషన్ చేసే సమయంలో నష్టాన్ని తగ్గించేలా బీమా సౌకర్యం కల్పించనున్నారు. బీమా పథకంలో నిర్దేశించిన ప్రదేశంలో ఆరోగ్యవంతంగా ఉండే కనీసం 5 మొక్కలు ఉండాలి. అరోగ్యవంతంగా ఉన్న మొక్కలు అన్నింటికీ బీమా చేయించాలి. పాక్షిక బీమా చెల్లుబాటు కాదు. అన్ని రకాలైన కొబ్బరి మొక్కలకు బీమా వర్తిస్తుంది. పొట్టిగా, హైబ్రీడ్ రకాలకు చెందిన చెట్లకు 4 నుంచి 60 సంవత్సరాల వయసు, పొడవుగా ఉండే చెట్ల రకానికి చెందిన 7 నుంచి 60 సంవత్సరాల మొక్కలకు బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వయసుకు సంబంధించి సంబంధిత రైతు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుం ది. తనిఖీ సమయంలో లోపాన్ని గుర్తిస్తే బీమాను నిలుపుదల చేస్తారు. ఏ సందర్భాల్లో బీమా వర్తిస్తుందంటే.. పెను విపత్తులు సంభవించినా, అధిక వర్షాలు, పిడుగులు పడినా, వరదలు, అగ్నిప్రమాదం, చీడపీడలు, కరువు సమయాల్లో కొబ్బరి మొక్కలు చనిపోయినా లేక మొక్కలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఈ బీమా వర్తిస్తుంది. మొక్కలు వెంటనే చనిపోకపోయినప్పటికీ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు లేదా ఉద్యానశాఖ మొక్కలు ఉత్పాదకత కోల్పోయినట్టుగా ధ్రువీకరణ ఇస్తే బీమా చెల్లించడం జరుగుతుంది. అయితే ఉద్దేశ పూర్వకంగా పంట విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, నిర్వహణ లోపం, జంతు, పక్షులు లేదా మనుషుల వల్ల పంట నాశనం అయితే, యుద్ధాలు, పోరాటాలు, కుట్రలు, విద్యుదాఘాతాలు తదితర వాటికి బీమా వర్తించదు. క్లెయిమ్ చేసుకోవడం ఇలా.. బీమా చేసిన కొబ్బరి చెట్లు చనిపోయినా లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఘటన జరిగిన 15 రోజులలోపు పూర్తి వివరాలతో తెలియజేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ తనిఖీ చేసేంతవరకు సంబంధిత చెట్లను తొలగించడం గానీ, తరలించడం గానీ చేయరాదు. అలాగే నష్టానికి సంబంధించి సీడీబీ లేదా ఉద్యానశాఖ ధ్రువీకరించాల్సి ఉంటుంది. బీమా ప్రతినిధి తనిఖీ చేసి ధ్రువీకరించిన 30 రోజులలోపు రైతుకు బీమా సొమ్ము అందుతుంది. ప్రీమియం ఇలా.. 4 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.9 ప్రీమియం చెల్లిస్తే రూ.900 బీమా లభిస్తుంది. 16 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.14 ప్రీమియం చెల్లిస్తే రూ. 1,750 బీమా లభిస్తుంది. చెల్లించే ప్రీమియంలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తుంది. మిగిలిన 25 శాతం రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరించకపోతే రైతు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఒకవేళ రెండు సంవత్సరాలకు ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే 7.5 శాతం, మూడు సంవత్సరాలకు ఒకేసారి చెల్లిస్తే 12.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే గరిష్టంగా మూడు సంవత్సరాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. బీమా చేసిన 30 రోజులలోపు చెట్లు చనిపోతే బీమా వర్తించదు. అయితే క్రమం తప్పకుండా రెన్యువల్ చేసిన చెట్లకు ఈ నిబంధన వర్తించదు. దరఖాస్తు ప్రక్రియ బీమాను నేరుగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ)కి దరఖాస్తు చేసుకోవడం ద్వారా గానీ లేదా అధీకృత ఏజెంట్ల వద్ద గాని, ఉద్యానశాఖ ద్వారా గానీ, సీడీబీచే గుర్తింపు పొందిన కోకోనట్ ఉత్పత్తి, పెంపకందార్ల సొసైటీల ద్వారా గానీ దరకాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుతో పాటు ప్రీమియం డీడీ, భూమి రికార్డు, అందులోని ప్లాంటేషన్ వివరాలను ధ్రువీకరిస్తూ రెవెన్యూ లేదా ఉద్యానశాఖ ఇచ్చిన ధ్రువీకరణపత్రం, ఆరోగ్యవంతమైన చెట్లకే బీమా చేస్తున్నట్టుగా రైతు ఇచ్చే స్వీయ ధ్రువీకరపత్రం, ప్లాంటేషన్‌కు సంబంధించి భూమి సర్వే నంబర్, భూమిలో వేసిన చెట్ల వివరాలతో కూడిన స్కెచ్ జత చేయాల్సి ఉంటుంది. రైతువాటా ప్రీమియం 25 శాతం డీడీ రూపంలో చెల్లించిన 30 రోజుల్లో బీమా ధ్రువీకరణపత్రం రైతుకు అందుతుంది.