విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం
Published Mon, Oct 3 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం
– రైతులను మభ్యపెడితే ఊరుకోం
– పీడీ కేసులకు భయపడం
– వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పాడి రైతుకు ఇంటికో ఆవు
– పెద్దిరెడ్డి రామద్రా రెడ్డి
వి.కోట:
వేరుశెనగ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటబీమాను ఎగ్గొంటేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్ గన్నుల విజయగాథలను ప్రచారం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో ఆదివారం ఆయన విలేకరుల సవూవేశంలో వూట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 70 వేల ఎకరాల్లో సాగుచేసిన వేరుశెనగ పంటను కాపాడావుని చంద్రబాబు, ఆయన వుంత్రులు కాకిలెక్కలు చెబుతున్నారని వుండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వురో యావలేని చంద్రబాబు వురోవూరు రైతులను మోసపుచ్చుతున్నారన్నారు. ఎన్నికల హామీలను పూర్తిచేశావుని చెబుతున్న ఆయన వైఖరిపై ప్రజలు అసంతప్తితో ఉన్న విషయం తెలియకపోవడం విడ్డూరవున్నారు. అభివృద్ధి పనుల కోసం వచ్చే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దొరకకుండా తిరిగే చంద్రబాబుకు ప్రజల సవుస్యలు పట్టవని వివుర్శించారు. రాష్ట్రంలో కడుతున్న నీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. భూనిర్వాసితులకు సవున్యాయం చేయాలన్నదే తవు అభివుతవున్నారు. ప్రజల సవుస్యలు ప్రతిపక్షానికే తెలుస్తుందని, అధికార పార్టీ నేతలు పనులు, స్వలాభాల కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ప్రత్యేక హోదాపై మాటలు వూర్చే వ్యక్తులు చంద్రబాబు, వెంకయ్యనాయుడు వూత్రమేనని, వారి వూటలకు చేతలకు పొంతన ఉండదని చెప్పారు. 2019లో తవు అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తధ్యవుని, ఆయన వల్లే ప్రత్యేక హోదా సాధ్యవ˜తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తావున్నారు.
పాడి రైతుకు ఇంటికో ఆవు
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పాడి రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో పాడి ఆవును అందించేందుకు తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని పుంగనూరులో నిర్వహించిన గాంధీ జయంతి సభలో పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆవులను అందజేసే ప్రతిపాదనను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ మేరకు ఆయన అంగీకారం తెలిపారని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement