Input subsidy
-
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు బృందం కుట్రపూరిత రాజకీయాలతో నిలిచిపోయిన ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోలింగ్ ముగిసే వరకు డీబీటీ పథకాల చెల్లింపులపై ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో నేటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు ప్రామాణికాల ఆధారంగా అంచనా దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు గతేడాది ఖరీఫ్ సీజన్లో సాగుపై కొంత మేర ప్రభావం చూపాయి. వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల స్థాయి లాంటి ఆరు ప్రామాణికాల ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు నిబంధనల మేరకు లెక్క తేల్చారు. ఇందులో ఉద్యాన పంటల విస్తీర్ణం 92,137 ఎకరాలు కాగా వ్యవసాయ పంటలు 13,32,108 ఎకరాలున్నాయి.ఆర్బీకేల్లో జాబితాలు ఇక రబీ 2023–24 సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఇందులో 64,695 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 5,99,685 ఎకరాలు వ్యవసాయ పంటలున్నాయి. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్ తుపాన్‌తో నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు చొప్పున 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీగా లెక్కతేల్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు.మోకాలొడ్డిన బాబు బృందం కరువు సాయంతో పాటు మిచాంగ్ తుపాన్ పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందంటూ చంద్రబాబు బృందం ఈసీకి ఫిర్యాదు చేసి నిధుల విడుదలను అడ్డుకుంది. ఖరీఫ్ వేళ రైతులకు సాయం అందకుండా మోకాలొడ్డింది. పోలింగ్ ముగిసే వరకు ఇతర డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో మే 10వతేదీన జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఒత్తిళ్లకు తలొగ్గి వివరణల సాకుతో ఎన్నికల కమిషన్ తాత్సారం చేయడంతో నిధులు జమ కాలేదు. తాజాగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డీబీటీ పథకాల లబ్దిదారులకు నగదు బదిలీపై ఆంక్షలను ఎన్నికల కమిషన్ సడలించింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెట్టుబడి రాయితీ జమ చేసేందుకు మార్గం సుగమమైంది.అర్హులైన రైతుల ఖాతాల వారీగా బిల్లులు జనరేట్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా మొత్తంతో కలిపి ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు రూ.3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీగా అందించినట్లవుతుంది. -
ఈసీ నిర్ణయాన్ని రద్దుచేయండి
సాక్షి, అమరావతి : రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు విద్యాదీవెన, మహిళలకు వైఎస్సార్ ‘చేయూత’ నిధులను పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత నిధుల పంపిణీని వాయిదా వేయాలంటూ ఈసీ ఈ నెల 4న జారీచేసిన లేఖను రద్దుచేయాలని కోరుతూ అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విద్యాదీవెన కింద రూ.610.79 కోట్ల నిధులను తక్షణమే పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గుంటూరు, అడవి తక్కెళ్లపాడుకు చెందిన బంకా అరుణ్, పల్నాడు, గుడిపాడుకు చెందిన పఠాన్ సూరజ్‌లు ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే, ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.847.22 కోట్లనూ పంపిణీ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 30న జారీచేసిన లేఖను సైతం రద్దుచేసి, తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ నిధులను పంపిణీ చేసేందుకు ఆదేశాలివ్వాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన యల్లక్కగారి నారాయణ, గాజుల శ్రీనివాసులు మరో వ్యాజ్యం దాఖలు చేశారు.అంతేకాక.. ‘చేయూత’ నిధులనూ పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ గుంటూరు, భారత్‌పేటకు చెందిన గృహిణి కె. శాంతకుమారి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మూడింటిపై అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారణ జరపాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాది వీఆర్ రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌ను కోరారు. ఈ అభ్యర్థనను మన్నించిన న్యాయమూర్తి విచారణకు అంగీకరించారు. అనంతరం మ.3 గంటలకు విచారణ చేపట్టారు.ప్రభుత్వ వినతిని పరిశీలిస్తాం..ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్‌కు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం కింద నిధుల పంపిణీని ఎందుకు ఆపామో కారణాలను కూడా తెలియజేశామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధుల పంపిణీ విషయంలో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎందుకు ఆగలేరో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమకు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిశీలించి తగిన నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టుకు వివరించారు. అవసరమైతే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని తెలిపారు. ఇలా.. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, అవినాష్ చెప్పిన వివరాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమర్పించే వినతిపై తీసుకున్న నిర్ణయాన్ని తగిన ప్రొసీడింగ్స్ ద్వారా కోర్టు ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారం 9వ తేదీ ఉ.10.30కు వాయిదా వేస్తూ జస్టిస్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. విద్యాదీవెనకూ బ్రేక్.. విద్యార్థులు అప్పులబాటఇక ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఇస్తోందని సీవీ మోహన్‌రెడ్డి వివరించారు. యువతను విద్యాపరంగా ప్రోత్సహించి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలన్న ఉద్దేశంతో 2019లో ప్రభుత్వం ఈ విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీని కింద మార్చి 1 నాటికి రూ.708 కోట్లను విద్యార్థులు, వారి తల్లుల జాయింట్ అకౌంట్లలో జమచేయాల్సి ఉందన్నారు. అక్టోబర్, నవంబరు, డిసెంబరు నెలలకు ఈనిధులను చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో కేవలం 97.89 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని.. మిగిలిన 610.79 కోట్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించిందన్నారు. విద్యాదీవెన నిధులపై ఆధారపడి చదువుకునే విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. సకాలంలో నిధులు అందకపోతే చదువును కొనసాగించేందుకు విద్యార్థులు అప్పులుచేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని నిలిపివేసిన నిధులను తక్షణమే పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. అలాగే.. వైఎస్సార్ చేయూత పథకం కింద నిధుల పంపిణీని కూడా ఈసీ నిలిపేసిన విషయాన్ని మరో న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోడ్ అమల్లోకి రావడానికి ముందునుంచే ఈ పథకం అమలవుతోందన్నారు. ఈసీ నిర్ణయంతో ఎందరో మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.కొత్త పథకాలకే కోడ్ వర్తిస్తుంది..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన కొత్త పథకాలు కావని, ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలుచేస్తున్నవేనన్నారు. కరువు మండలాల గుర్తింపు, లబ్ధిదారుల గుర్తింపు ఎప్పుడో జరిగిందన్నారు. మొత్తం 6.95 లక్షల మంది రైతులను గుర్తించామని, అందుకు అవసరమైన మొత్తాలను సైతం సిద్ధంచేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఈ పథకాల కింద లబ్ధిదారులకు నిధుల పంపిణీ ఎంత అవసరమో వివరిస్తూ ఈసీకి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. సాధారణంగా కొత్త పథకాలకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్ సరఫరాను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకుందని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఆ పథకం కొత్త పథకం కాదని, అప్పటికే కొనసాగుతున్న పథకమని హైకోర్టు గుర్తుచేసిందని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదుపిటిషనర్ల తరఫున మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రకృతి విపత్తుల కారణంగా పంట కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీవల్ల రైతులు కోలుకుని తిరిగి వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఆస్కారం కల్పిస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అందులో భాగంగానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోందన్నారు. నిజానికి.. 2023 ఖరీఫ్‌లో కరువువల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.847.22 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ఇన్పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ కోసం ఈసీ అనుమతి కోరిందన్నారు. కానీ, అందుకు ఈసీ అనుమతిని నిరాకరిస్తూ ఈనెల 30న లేఖ జారీచేసిందన్నారు. నిధుల పంపిణీని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపిందన్నారు. రానున్న సీజన్‌కు విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేసుకోవాల్సి ఉంటుందని.. అందువల్ల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో ఏదైనా జాప్యం జరిగితే అది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీవీ మోహన్‌రెడ్డి వివరించారు. వర్షాలకు ముందే పంట భూములను సిద్ధంచేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిని మధ్యలో ఇలా ఆపేయడంవల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఎన్నికల కమిషన్ ఆలోచించలేదన్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్న వారు తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఖరీఫ్ వర్షాభావం వల్ల, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►సాగుచేసిన ప్రతి ఎకరాకూడా ఇ-క్రాప్ కింద నమోదు చేస్తున్నాం ►ఎవరు ఎంత సాగు చేశారు? ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తోంది ►రైతులు ప్రకృతివైపరీత్యాల కారణంగా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం ►ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోకి వచ్చింది ►అవినీతికి, వివక్షకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం ►మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ►దీనికి నేను చాలా సంతోషిప్తున్నాను, ఆనందపడుతున్నాను ►ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని కలిగించాం ►తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేశాం ►రైతులు నష్టపోకుండా అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకున్నాం ►3.25లక్షల టన్నుల రంగుమారిన, తడిసన ధాన్యాన్ని కొనుగోలు చేశాం ►అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం తోడుగా నిలిచి, అందాల్సిన సహాయాన్ని సమయానికే ఇస్తామన్న భరోసాను కల్పించాం ►వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నాం ►మొట్టమొదటి సారిగా ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లు రైతులకు చెల్లించాం ►గత ఐదేళ్లతో పోలిస్తే రూ. 3,411 కోట్లు మాత్రమే రైతులకు బీమా ఇచ్చారు ►ఆ ఐదేళ్లలో ప్రతి ఏటా కరువు వస్తున్నా కేవలం 30 లక్షలమంది రైతులకు మాత్రమే 3,411 కోట్లు మాత్రమే ఇచ్చారు ►ఈ సంవత్సరంలో కాస్త వర్షాభావ పరిస్థితులు తప్పిస్తే ప్రతిఏటా కూడా మంచి వర్షాలు పడ్డాయి ►నాలుగేళ్లకాలంలో ఒక్క మండలాన్నికూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు ►అలాంటి పరిస్థితుల్లో కూడా 54 లక్షలమందికిపైగా రైతులకు బీమాను అందించిన తోడుగా నిలిచాం ►ఇ-క్రాప్ చేసి రైతులకు ఆటోమేటిక్‌గా ఉచిత పంట బీమాను అందిస్తున్నాం ►ఈ 58 నెలల కాలంలో కొత్త ఒరవడిని తీసుకు రాగలిగాం ►పెట్టుబడి సహాయంగా ఏటా రూ.13500 ఇస్తున్నాం ►గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు ►63 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమిమాత్రమే ఉంది ►87 శాతం మంది రైతులకు హెక్టారులోపే భూమి ►తాజాగా సబ్ డివిజన్లు జరిగిన తర్వాత వచ్చిన డేటా ఇది ►క్రమం తప్పకుండా వీరికి రైతు భరోసా అందుతోంది ►ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల కరువు మండలాలను ప్రకటించాం ►వారికి కూడా ఇన్పుట్ సడ్సిడీ ఇస్తున్నాం ►అలాగే తుపాన్ కారణంగా నష్టపోయిన వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ విడుదలచేస్తున్నాం ►వీరందరికీ కూడా ఈ జూన్‌లో బీమా డబ్బు కూడా చెల్లిస్తాం ►రైతులు ఎక్కడా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ►ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న లాంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేశాం ►తుపాను వల్ల డిసెంబర్ 4న రైతులకు నష్టం జరిగితే డిసెంబర్ 8 కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశాం ►ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుంది -
6న రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. 22 జిల్లాల్లో మిచాంగ్ ప్రభావం మిచాంగ్ తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎం వైఎస్ జగన్
-
పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడి
-
కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్‌బౌల్‌గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది.. ‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. ధరణి పోర్టల్‌తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
30న వైఎస్సార్ రైతుభరోసా సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం, ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షలమంది రైతులు లబ్ధిపొందగా.. ఈ ఏడాది 52.31 లక్షలమంది లబ్ధిపొందనున్నారు. వీరికి తొలివిడతలో రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను ముఖ్యమంత్రి జమచేయనున్నారు. పెట్టుబడిసాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించనున్నారు. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతుభరోసా కింద ఇచ్చిన మాటకంటే మిన్నగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్వోఎఫ్ఆర్) భూములు సాగుచేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండోవిడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందారు. వీరికి తొలివిడతగా రూ.3,934.25 కోట్ల సాయం అందించనున్నారు. గతేడాది 49,26,041 మంది భూ యజమానులు కాగా, 1,23,871 మంది కౌలురైతులు, 91,031 మంది అటవీ భూ సాగుదారులు లబ్ధిపొందారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన 52,30,939 మందిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చినట్లవుతుంది. 48,032 మందికి రూ.46.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అదేరీతిలో గతేడాది డిసెంబర్లో మాండూస్ తుపాన్‌తో పంటలు దెబ్బతిన్న 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేసిన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు 78,510 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి జమచేయనున్నారు. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో 22.22 లక్షలమందికి రూ.1,911.79 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమచేశారు. తాజాగా జమచేయనున్న సాయంతో కలిసి 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లవుతుంది. -
చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొట్టింది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గతంలో రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. కానీ రైతు భరోసా కిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రైతులకు సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ‘‘వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైన బాగుంటుందన్నారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. జులై-అక్టోబర్ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘మన ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి.. గతంలో రైతు భరోసా పథకం లేదు. ఒకేసారి రైతులకు రెండు రకాల సాయం అందించాం. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొట్టింది’’ అని సీఎం అన్నారు. ‘‘పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. రబీ 2020–21 సీజన్లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమ చేశారు. ఇప్పటివరకు రూ.1,795కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ.. ఇక గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేసినట్లవుతుంది. అలాగే, గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందించారు. గతంలో అంతా గందరగోళమే.. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారు. కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నారు. అంతేకాక.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతుభరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు.. అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. చదవండి: ఏది నిజం?: 3 అబద్ధాలు 6 అభాండాలు.. ‘ఈనాడు’ మరో విష కథనం -
ఎప్పటికప్పుడే పరి‘హారం’
సాక్షి, అమరావతి: ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక ముందే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనూ ఇలా అన్నదాతలకు తోడుగా నిలిచిన దాఖలాలు లేవన్నారు. గత సర్కారు అండగా నిలవకపోగా పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి వెన్ను విరిచిందన్నారు. ఒకవేళ ఇచ్చినా ఏడాది తరువాత అరకొరగా విదిలించటాన్ని చూశామని గుర్తు చేశారు. గత సర్కారుకు, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. గత నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంతోపాటు నేలకోత, ఇసుక మేట కారణంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.29.51 కోట్లతో కలిపి మొత్తం రూ.571.57 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం.శంకరనారాయణ, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. రూ.63 కోట్లతో విత్తనాలు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. వెలుగు కింద చీకటి కూడా ఉన్నట్లే అధిక వర్షాల వల్ల కొద్ది మేర పంట నష్టం జరిగింది. రైతన్నల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంగా నవంబరులో వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటూ 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను దాదాపు 1.43 లక్షల మంది రైతన్నలకు రూ.63 కోట్లు ఖర్చు చేసి అందచేశాం. నేడు కౌలు రైతులకూ న్యాయం.. కౌలు రైతులను గత సర్కారు ఏరోజూ గుర్తుంచుకోలేదు. కానీ ఇవాళ అర్హులెవరూ మిగిలిపోకుండా ఇ–క్రాప్ డేటాతో శాస్త్రీయంగా ఆర్బీకేల స్ధాయిలోనే పంట నష్టాలను అంచనా వేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శిస్తూ ఏ సీజన్లో జరిగిన నష్ట పరిహారాన్ని అదే సీజన్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మనదే. కౌలు రైతులకు సైతం ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఇన్పుట్ సబ్సిడీని అందచేస్తున్న ప్రభుత్వం కూడా ఇదే. మిస్ అయిన వారికి మరో చాన్స్ ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఏ ఒక్కరూ మిస్ కాకుండా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలలో జాబితా ప్రదర్శిస్తున్న ప్రభుత్వం మనది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మంచి చేస్తున్నాం. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులతో సహా అన్నదాతలందరికీ చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు అందచేశాం. ఇన్పుట్కు నాడు ఎగనామం.. ► 2014 ఖరీఫ్‌లో సంభవించిన కరువుకు 2015 నవంబరులో గానీ ఇవ్వలేదు. 2015 కరువుకు 2016 నవంబరు కంటే కంటే ముందు ఇచ్చిన పరిస్ధితి చూడలేదు. ► 2015 నవంబరు, డిసెంబరులో భారీ వర్షాలకు రూ.263 కోట్ల పంట నష్టం జరిగితే టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ► 2016 కరువు ఇన్పుట్ సబ్సిడీ 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 ఇన్పుట్ సబ్సిడీని 2018 ఆగస్టులోగానీ ఇవ్వలేదు. ► 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో జరిగిన రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టాన్ని పూర్తిగా గత సర్కారు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్ధితిని గుర్తు తెచ్చుకోవాలి. నేడు ఆగమేఘాలపై పరిహారం ► దాదాపు 1.56 లక్షల రైతు కుటుంబాలకు రూ.123 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని 2020 ఏప్రిల్‌లో అందించాం. ► 2020లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278 కోట్లను అదే ఏడాది అక్టోబరులో ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. ► 2020 నవంబరులో నివర్ తుపానుతో నష్టపోయిన 8.35 లక్షల మంది రైతన్నలకు సుమారు రూ.646 కోట్లను నెల తిరగక ముందే అదే ఏడాది డిసెంబరులో అందజేశాం. – 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాన్‌తో నష్టపోయిన 34,556 మంది రైతన్నలకు సుమారు రూ.22 కోట్లను అదే ఏడాది నవంబరులో అందజేశాం. రెండున్నరేళ్లలో రైతన్నలకు ఏం చేశామంటే... ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకూ రూ.19,126 కోట్ల మేర సాయం.అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు లబ్ధి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంతో 65.64 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.1,218 కోట్లు. గత సర్కారు బకాయిలు కూడా చెల్లింపు. ► రాష్టంలో 18.70 లక్షల మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం సంవత్సరానికి రూ.9 వేల కోట్ల వ్యయం. ఇప్పటివరకు రూ.23 వేల కోట్లు ఖర్చు. ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1,700 కోట్లు వ్యయం. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 31.07 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు. ఈ ఖరీఫ్ నుంచి ప్రతి రైతు వద్ద రూ.10 చొప్పున తీసుకుని సంతకంతో రశీదు ఇవ్వాలని నిర్ణయం. దాదాపు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. ► ధాన్యం సేకరణ, కొనుగోలు కోసం రెండున్నరేళ్లలో రూ.39 వేల కోట్లకు పైగా వ్యయం. గత సర్కారు హయాంలో సంవత్సరానికి రూ.7 నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా సమయానికి చెల్లించని దుస్థితి. ఇప్పుడు ఏటా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. రైతులకు 21 రోజుల్లోనే చెల్లింపులు. ఇది కాకుండా పత్తి రైతులకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,465 కోట్లతో గిట్టుబాటు ధరలతో ఆదుకుంటున్న ప్రభుత్వం. ► గత సర్కారు 2018లో రైతులకు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. రూ.9 వేల కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు కూడా చెల్లింపు. గత సర్కారు దిగిపోతూ పెట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం చెల్లింపు. ► ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ఇప్పటికే 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆర్బీకేలలో అందుబాటులోకి. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు గతంలో రూ.25.50 కోట్ల సబ్సిడీ. ► దాదాపు రూ.2134 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్ధాయిలో యంత్రసేవా కేంద్రాలు ( కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల) ఏర్పాటుకు శ్రీకారం. రానున్న సంవత్సరానికి అన్ని ఆర్బీకేల్లో ఈ సేవలు అందుబాటులోకి. ► ఆర్బీకేల స్ధాయిలోనే వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు. నాలుగు అంచెల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు. ► ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఆప్కాబ్ వరకు ఆధునికీకరణ. సహకార వ్యవస్థలో హెచ్ఆర్ విధానం. ► ఎక్కడైనా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) ద్వారా గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ సమాచారం అందించేలా ఏర్పాట్లు. మార్కెటింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని కనీస గిట్టుబాటు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు. ఇవేకాకుండా జలకళ, ఏపీ అమూల్ ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. -
పంటలు నష్టపోయిన రైతన్నలకు రూ.542.06 కోట్లు
-
రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీని జమ చేశారు. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. రాయలసీమలో గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాం. నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్నాం. శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాఫ్ట్ డేటాను ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణ స్థాయిల్లో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్ప్లే చేస్తున్నాం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1612 కోట్ల సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ♦రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తోంది ♦అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ 80శాతం సబ్సితో 1.43 లక్షలమంది రైతులకు విత్తనాలు ఇచ్చాం ♦అవాళ జరిగిన ఆనష్టాన్ని.. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ రూపేణా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే ♦మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు ♦ఏ సీజన్లో నష్టం జరిగితే.. ఆ సీజన్లో తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ లేదు ♦గత ప్రభుత్వంలో కొన్ని సార్లు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు ♦మరికొన్ని సార్లు,, అరకొరగా, ఆలస్యంగా, అదికూడా కొందరికే ఇచ్చారు ♦గత ప్రభుత్వం ఏరకంగా ఇచ్చిందో గమనించాలి ♦2014 ఖరీఫ్‌లో కరువకు 2015 నవంబర్‌లో గాని ఇవ్వలేదు ♦2015 కరువుకు, 2016 నవంబర్‌లోగాని ఇవ్వలేదు ♦2015 నవంబర్, డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.263 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు ♦2016 కరువుకు సంబంధించి 2017 జూన్‌లో ఇచ్చారు ♦2017 కరువుకు సంబంధించి 2018 ఆగస్టులో ఇచ్చారు ♦2018లో ఖరీఫ్‌లో రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు ♦అదికూడా అరకొరగా, కొందరికే ఇచ్చిన పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు తేడా చూడండి ♦కౌలు రైతులను ఎప్పుడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ♦మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా, ఇ–క్రాప్ డేటాతో పంట నష్టాలను అంచనావేసి, ఆర్బీకేలస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రవేశపెట్టాం ♦తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్లో జరిగిన పంటనష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో సమచేస్తున్నాం ♦కౌలు రైతులకు సైతం... ఇ–క్రాప్ డేటా తీసుకుని వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం ♦ఇలా చేస్తున్నాం కాబట్టే 2020 మారిలో కురిసిన వర్షాలవల్ల నష్టపోయిన రైతులకు 1.56 లక్షల మంది రైతులకు రూ.123.7 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 ఏప్రిల్‌లో అందచేశాం ♦2020 ఏప్రిల్ల్ నుండి 2020 అక్టోబరు వరకూ కురిసిన నష్టోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278.87 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 అక్టోబరులోనే ఇచ్చాం ♦2020 నవంబర్‌లో నివర్ సైక్లోన్‌లో దెబ్బతిన్న రూ.8.35 లక్షలమంది రైతులకు రూ.645.99 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 డిసెంబర్లోనే అందించాం ♦2021 సెప్టెంబరులో గులాబ్ సైక్లోన్‌వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ.21.96 కోట్ల సహాయాన్ని 2021 నవంబర్‌లో అందచేశాం ♦ఏ ఒక్కరు కూడామిస్ కాకుండా సహాయాన్ని అందిస్తున్నాం ♦మన అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇవ్వాళ్టి వరకూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 మంది లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీద్వారా రూ.1,612.62 కోట్ల రూపాయలను అందించాం ♦రైతన్నలు పలు కార్యక్రమాలద్వారా అండగా నిలుస్తున్నాం ♦వైఎస్సార్రైతు భరోసా – పీఎంకిసాన్ ద్వారా అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.19,126 కోట్లు ఇచ్చాం ♦దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500 చొప్పున రైతు భరోసా సాయం కింద అందిస్తున్నాం ♦ఏకైక ప్రభుత్వం దేశంలోనే మనది ♦పంట రుణాలపై సున్నా వడ్డీకింద పూర్తి వడ్డీ రాయితీని సమచేస్తున్నాం ♦65.64 లక్షలమంది రైతులకు రూ.1218 కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చాం ♦గత ప్రభుత్వ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది ♦రాష్ట్రలలో 18.7 లక్షలమంది రైతులన్నలకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ఇవ్వడానికి ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ♦ఇప్పటివరకూ రూ.23వేల కోట్లు ఖర్చు చేశాం ♦నాణ్యమై కరెంటు పగటిపూటే ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటు కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశాం ♦ఈ రెండున్నరేళ్ల కాలంలో వైయస్సార్ ఉచిత పంట బీమాద్వారా రైతన్నలకు 31.07వేలమంది రైతులకు రూ.3788 కోట్ల రూపాయలు రైతన్నలకు అందించగలిగాం ♦రూ.2వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం ♦రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ♦ధాన్యం సేకరణ కోసం అక్షరాల రూ.39వేల కోట్లు ఖర్చు చేశాం ♦గతంలో సమయానికి డబ్బులు ఇవ్వని ఘటనలు చూశాం ♦ఇవాళ 21 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నాం ♦పత్తి కొనుగోలుకోసం రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకోసం రూ.6434 కోట్లు ఖర్చు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది ♦గత ప్రభుత్వం రైతన్నలకు ఉచిత విద్యుత్‌కోసం రూ.9వేల కోట్ల కరెంటును కొనుగోలు చేసి బకాయి పెట్టి వెళ్తే, ఈ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది ♦రూ. 383 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే స్వీకరించింది ♦రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించాం ♦ఇప్పటికే 9160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో అందుబాటులో పెట్టాం ♦ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం ♦మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం ♦నెలలో ఈ నాలుగు స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్నాయి ♦ఈ సమావేశాల్లో గుర్తించిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకారా సంఘాలనుంచి ఆప్కాబ్ వరకూ అన్నింటినీ ఆధునీకరిస్తున్నాం ♦సహకార రంగంలో హెచ్ఆర్ విధానాన్ని తీసుకువస్తున్నాం ♦పంటలు నష్టాల్లో ఉంటే.. సీఎంయాప్‌ను ఆర్బీకేల స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం -
AP: మరో మారు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ
తాడేపల్లి: మరోమారు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన పంటలకు సీఎం వైఎస్ జగన్ ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. రేపు(మంగళవారం) తన క్యాంపు కార్యాలయం నుంచి రైతన్నల అకౌంట్లలో సీఎం జగన్ జమ చేయనున్నారు. మొత్తం 5.71 లక్షల మంది రైతన్నలకు 534.77 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది. దీని ద్వారా 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద 29.51 కోట్ల లబ్ధి చేకూరనుండగా, ఇన్పుట్ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కలిపి మొత్తం 564.28 కోట్లు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు 1612 కోట్ల సాయం అందించారు. -
రైతు నష్టపోవద్దు
-
PM Kisan Shceme : రైతులకు దక్కాల్సిన రూ.820 కోట్లు ఏమయ్యాయి?
ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వాహణ విషయంలో బ్యాంకులు చేస్తోన్న తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరో ఉదాహరణగా నిలుస్తోంది. కిసాన్ యోజన దేశంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000లను కేంద్రం అందిస్తోంది. ప్రతీసారి రూ. 2,000ల వంతున మూడు విడతలుగా ఈ సాయం చేస్తోంది. ఈ పెట్టుబడి సాయం నేరుగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. వ్యవసాయ శాఖ లెక్కలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద దేశ వ్యాప్తంగా 68.76 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతీ నాలుగు నెలలకు రెండు వేల వంతున జమ చేస్తున్నారు. అయితే రెండేళ్ల కాలానికి సంబంధించి ఎంత మంది రైతులకు సాయం చేశారనే వివరాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ ప్రకటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దాదాపు దేశ వ్యాప్తంగా ఒక శాతం మంది రైతులకు పెట్టుడి సాయం అందలేదు. 41 లక్షల మంది రైతులు రూ. 820 కోట్లు 2019 ఫిబ్రవరి నుంచి 2021 జూన్ 30 వరకు సేకరించిన వివరాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల ఏకంగా 61.04 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కాలేదు. బ్యాంకులు మరోసారి ప్రయత్నించగా విఫలమైన ఖాతాల్లో 34 శాతం మేరకు అంటే 20.88 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా జమ కాలేదు. అంటే దాదాపు రూ.820 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలకు చేరనేలేదు. అక్కడే ఎక్కువ వెనుకబాటుతనం ఎక్కువగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే ఈ తరహా ఫెయిల్డ్ ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ 10.95 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వారు ఫిర్యాదులు చేయగా ఇందులో కేవలం 8 శాతం మందికి అంటే 91 వేల మందికి తిరిగి డబ్బులను బ్యాంకులు జమ చేశాయి. బీహార్ విషయానికి వస్తే 1.38 లక్షల విఫల లావాదేవీలు ఉండగా ఇందులో కేవలం 6.8 శాతం మందికే 9,493 మందికే తిరిగి డబ్బులు జమ అయ్యాయి. నిర్లక్ష్యం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డబ్బు తిరిగి ప్రభుత్వం వద్దకే చేరిందా ? లేక బ్యాంకర్ల దగ్గరే ఆగిపోయిందా అనే అంశంపై స్పష్టత లేదు. కానీ 41 లక్షల మంది రైతులకు అందాల్సిన రూ. 820 కోట్లు దక్కకుండా పోయాయి. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకర్లు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. -
వరద ముంచేసింది.. 4 లక్షల ఎకరాల్లో పంటల మునక!
►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు- 43,601ఎకరాలు ►వ్యవసాయ శాఖ ప్రకారం పంట నష్టం అంచనా.. 2,00,000ఎకరాలు ►రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 90.98 లక్షల (78%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 49.63 లక్షల (104.3%) ఎకరాల్లో సాగు చేయగా, 20.68 లక్షల (60.8%) ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ►అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గత వారం కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద తగ్గినా.. రైతుల కన్నీటి ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. ఉప్పొంగిన వరదలతో పంటలు దెబ్బతిని పెట్టుబడులు కోల్పోయిన రైతులు, జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ.. పొలాల్లో ఇసుక మేటలు చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంట లకు నష్టం జరిగింది. కానీ వివరాలను అధికారులు బయటకు వెల్లడించడం లేదు. ఇంకా నష్టాన్ని అం చనా వేస్తున్నామని చెబుతున్నారు. నష్టం తాము ప్రాథమికంగా వేసిన దానికంటే పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యధికంగా పత్తికి నష్టం జరిగినట్లు చెబుతుండగా.. తర్వాతి స్థానంలో వరి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయి. చాలాచోట్ల వరినాట్లు కొట్టుకుపోయాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు కలుపుకొని ఎకరానికి సగటున రూ.30 వేల చొప్పున పెట్టుబడి అవుతుందని అంచనా. కాగా.. అనధికారిక లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఎకరాల్లో పంటల మునకకు గాను రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం పాడై పోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 90.98 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఇప్పటివరకు 90.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానలు ముందే కురవడంతో జూన్ మొదటి వారంలోనే రైతులు పత్తి వంటి పంటలు వేశారు. విత్తనాలు వేసి నెల రోజులు కూడా గడవకముందే వర్షాలు బాగా పడటంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి. దీంతో కొన్నిచోట్ల పత్తి విత్తనాలు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నందున ఆ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. దీంతో పత్తి సాగు గణనీయంగా పెరగ్గా.. వర్షాలకు అత్యధికంగా పత్తి పంటే దెబ్బతింది. తర్వాత వరి, మొక్కజొన్న, సోయాబీన్లకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో పత్తి చేనులో నిలిచిన వర్షపు నీరు మంచిర్యాల జిల్లాలో 6,864 ఎకరాల్లో.. మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పంట నష్టంపై అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎక్కువగా పత్తి పంట నీట మునిగింది. ఈ జిల్లాలో 6,864 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. అందులో పత్తి 5 వేల ఎకరాలు, వరి 1400 ఎకరాలు, మిర్చి 284 ఎకరాలు ఉంది. మొత్తం 2,743 మంది రైతులు నష్టపోయారు. దాదాపు రూ. 3.24 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేశారు. ►అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 43,601 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క పత్తి పంటే 40,795 ఎకరాల్లో దెబ్బతింది. 2,401 ఎకరాల్లో కందికి, 45 ఎకరాల్లో సోయాకు, 90 ఎకరాల్లో వరికి, 270 ఎకరాల్లో పెసరకు నష్టం వాటిల్లింది. ►ఆదిలాబాద్ జిల్లాలో 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో పత్తి 11 వేల ఎకరాలు కాగా సోయా 4 వేల ఎకరాలు ఉంది. జిల్లాలో కంది, ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో 8,400 ఎకరాలలో పంట నష్టం జరిగింది. వరద నీటితో వచ్చిన ఇసుక మేటలు వేయడం వల్ల పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌లో దెబ్బతిన్న వరి, సోయా నిజామాబాద్ జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 6,205 రైతులకు సంబంధించిన 12,597 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా మరో 6 వేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఉద్యానపంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ►కామారెడ్డి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 2,240 మంది రైతులకు సంబంధించి 18,392 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి మరో పదివేల ఎకరాల్లో కూడా పంటలు దెబ్బతిని ఉంటాయని అంచనా. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 11,635 ఎకరాల్లో సోయా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. 4 వేల ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. 1,847 ఎకరాల్లో వరి, 837 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,605 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి 596.3 ఎకరాలు, పత్తి 929 ఎకరాలు, మొక్కజొన్న 80 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. బ్యాక్ వాటర్‌కు పంటలు బలి పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో గోదావరి, మానేరు ఉగ్రరూపం దాల్చడంతో, సరస్వతి, పార్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో మంథిని, ముత్తరాం, అంతర్గం, రామగిరి, రామగుండం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో మొత్తం 3,374 ఎకరాల్లో 1,620 మంది రైతులకు చెందిన వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి నాట్లు నీట మునగడంతో పాటు చాలాచోట్ల మొక్కలు కొట్టుకుపోయాయి. ►ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 5 జిల్లాల్లో అధిక వర్షాలకు తెగిన కుంటలు, చెరువులతో మొత్తం 2,512 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,964 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో వరి, 428 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లాలో అధికంగా 1,300 ఎకరాల్లో పత్తి, 428 ఎకరాల్లో కంది రైతులు నష్టపోయారు. యాదాద్రి జిల్లాలో 1,205 ఎకరాల్లో పంట దెబ్బతింది. 600 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మూడెకరాలు నీళ్ల పాలు మానేరు పక్కన నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ. 60 వేలు కూలీలకే ఖర్చయ్యి ౌది. మానేరులో నీటి ప్రవాహం ఎక్కువై నా పంట పొలం మీద నుండి నీరు పోవడంతో మూడెకరాల పంటకు నష్టం జరిగింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. -నిమ్మతి రమేష్, అడవి శ్రీరాంపూర్ గ్రామం, ముత్తరాం, పెద్దపల్లి జిల్లా పొలం మొత్తం కొట్టుకుపోయింది నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తే వర్షాలతో మొత్తం పొలం కొట్టుకుపోయింది. దాదాపు రూ.75 వేల నష్టం వాటిల్లింది. మళ్లీ వరి నాట్లు వేయాలంటే నారు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే అప్పు చేయాలి. వరితో పాటు సోయా పంటను కూడా నష్టపోయాను. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్పుట్ సబ్సిడీని నిలిపివేశారు. రైతులకు రైతుబంధు కంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే మంచిది. నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి. – సాయిని సమ్మారావు... పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామం. మానేరు పక్కన ఉన్న 7 ఎకరాల 10 గుంటల భూమిలో వరి వేశాడు. ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున 1.15 లక్షల దాకా కూలీలకు ఖర్చు అయ్యింది. ఇటీవల లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం పంట పొలం మీద నుండి పారడంతో పంటకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పొలంలో ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటలు తీసి భూమి చదును చేయడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా పొలం మీద నుండి వరద పోయి పంట నష్టం జరిగింది. అప్పుడు అధికారులు వచ్చి చూశారు కానీ ఎలాంటి నష్టపరిహారం అందలేదు. తాజా పంట నష్టంతో అతను రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. -
బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని సీఎం గుర్తు చేశారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిందని అన్నారు. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని.. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించామని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశామని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చామని సీఎం తెలిపారు. (చదవండి: పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్) గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు కూడా చెల్లించామని సీఎం తెలిపారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం మంగళవారం జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లించింది. (చదవండి: మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్) -
మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారికి మరో కానుక అందించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కంప్యూటర్లో మీట నొక్కి చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నాం. మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యం. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశాం. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.13,101 కోట్లు అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ,13,500 ఇస్తున్నాం. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాయం చేశాం. (చదవండి: పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్) గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చాం. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్‌కు రూ.510 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1,968 కోట్లు చెల్చించాం. భారీ వర్షాలు, తుపాను పరిహారం రూ.1,038 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. ఉచిత విద్యుత్, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వడం కోసం రూ.1700 కోట్లు వెచ్చించాం. విత్తనాల సబ్సిడీ కింద రూ.383 కోట్ల బకాయిలు కూడా చెల్లించాం. అధికారంలోకి రాగానే శనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతుల కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించాం. రైతులకు ఉచిత విద్యుత్ శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి..10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌కు టెండర్లను పిలిచాం. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. గ్రామాల్లో గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, జనతాబజార్లు.. నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. ఈ ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 51.59 లక్షల రైతులు లబ్ది పొందనున్నారు. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా రైతులకు సాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ప్రాజెక్టులతో మహా సంక్రాంతి) -
‘27న రైతులకు ఇన్‌పుట్‌సబ్సీడీ’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ నెల 27న ఇన్పుట్ సబ్సీడీ అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చరిత్రలో ఎన్నడూ ఇంత త్వరగా ఏ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వరదకి, వర్షానికి తేడా తెలియకుండా లోకేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు 2 వేల కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సీడీకి ఎగణామం పెట్టారని ఆరోపించారు. (చదవండి: ఉల్లి విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు) ఆ బకాయిలు కూడా సీఎం వైఎస్ జగన్ రైతులకు అందించారని తెలిపారు. టీడీపీ హాయాంలో రైతులకు రూ. 1,075 కోట్ల వడ్డీ లేని రుణాల మొత్తాన్ని ఎగనామం పెడితే తామోచ్చాక చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేసిన పాపాలు వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను గందరగోళంలో పడేస్తే.. ఇప్పుడు అదే అంశాలను కేంద్ర ప్రభుత్వం చెప్తోందని మంత్రి పేర్కొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకో..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతుల సమస్య ఎట్టకేలకు తీరింది. ఎనిమిదేళ్ల క్రితం రబీ పంటలకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో సోమవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 24,641 మంది రైతులకు 119.44 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ సొమ్మును కంపెనీ ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా చెల్లిస్తూ తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బటన్ ప్రెస్ చేశారు. ఆ తర్వాత ఆ జిల్లాలోని తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీమా సొమ్ము కోసం హైకోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని గతంలో వారు పడిన కష్టాలు వివరించారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న సమయంలో కూడా డబ్బులు ఇవ్వడం సంతోషకరమని రైతులు పేర్కొన్నారు. అరటి పంటకు సంబంధించిన కష్టనష్టాలను తెలుసుకుని అధికారులకు సీఎం పలు సూచనలు ఇచ్చారు. మంచి రేటు వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వ బకాయి విడుదల రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిన ఇన్పుట్ సబ్సిడీని తామిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
సీఎం జగన్ నిర్ణయంతో అనంతపురం రైతుల హర్షం
వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటినీ నెరవేరుస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 2018 ఖరీఫ్, రబీలో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు అపారనష్టం కలిగింది. అప్పడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ రైతుకు మొండిచేయి చూపగా..రైతు కష్టం తెలిసిన సీఎం జగన్మోహన్రెడ్డి రైతుకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. 2018 ఖరీఫ్, రబీకి సంబంధించి రూ. 984.23 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా... కరువుసీమ రైతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, అనంతపురం : జగన్ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. 2018 ఖరీఫ్, రబీలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంట నష్టం టీడీపీ హయాంలోనే జరిగినా..రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 14న నిర్వహించిన వ్యవసాయ మిషన్ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తీరుకు భిన్నంగా... 2013 ఖరీఫ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పంటలకు అపార నష్టం జరిగింది. మొత్తంగా రూ.643 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సి ఉంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పరిహారం ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తన హయాంలో పంట నష్టం జరగలేదంటూ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేశారు. కానీ... జగన్ సర్కారు గతానికి భిన్నంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుండటంతో త్వరలోనే గత ఖరీఫ్, రబీకి సంబంధించిన రూ.985 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రైతులకు అందనుంది. 2018 రబీలో జీవాలకు వదిలిన పప్పుశనగ పంట ఖరీఫ్‌లో రూ.937.40 కోట్లు గత ఖరీఫ్‌లో జూన్ మినహా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేరుశనగ, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో 338.4 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 212 మి.మీ వర్షం కురిసింది. హెక్టారుకు కేవలం 178 కిలోల వేరుశనగ పంట దిగుబడులు వచ్చినట్లు పంట కోత ప్రయోగాలు వెల్లడి చేస్తున్నాయి. దీంతో పెట్టుబడుల్లో సగం కూడా చేతికిరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు విడతల్లో జిల్లాలోని మొత్తం 63 మండలాలను కరువు జాబితాలో చేర్చింది. పంట నష్టం తీవ్రత తెలుసుకునేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పేరుతో కేంద్ర కరువు బృందం గత డిసెంబర్లో జిల్లాలో పర్యటించి వెళ్లింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ తరఫున పంట నష్టం కింద రూ.967 కోట్లు ఇన్పుట్ కావాలని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక కూడా ఇచ్చారు. ఆతర్వాత మరోసారి క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసిన అధికారులు చివరకు రూ.937.40 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ కావాలని కోరారు. ఇందులో వేరుశనగ పంట నష్టం రూ.710.67 కోట్లు ఉండగా మిగతా 14 రకాల పంటల నష్టం రూ.226.73 కోట్లు చూపించారు. మొత్తంగా 6,95,403 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. రబీలోనూ అదే దుస్థితి ఖరీఫ్ దెబ్బతిన్నా... రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న జిల్లా రైతులపై ఈశాన్య రుతుపవనాలు కూడా నీళ్లు చల్లడంతో రబీ గల్లంతైపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధారణంగా 155.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా కేవలం 50 మి.మీ వర్షం కురిసింది. 67 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కావడంతో 77 వేల హెక్టార్లలో వేసిన ప్రధానపంట పప్పుశనగ తుడిచిపెట్టుకుపోయింది. మిగతా పంటలు కూడా బాగా దెబ్బతినడంతో పెట్టుబడుల్లో సగం కూడా చేతికిరాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రబీ కింద 32 మండలాలను కరువు జాబితాలోకి చేర్చింది. కరువు మండలాల జాబితాలో పప్పుశనగ సాగు చేసే వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, పెద్దపప్పూరు లాంటి మండలాలను స్థానం లేకుండా పోయింది. మిగతా మండలాల్లో పంట నష్టం అంచనా వేసిన అధికారులు 46,621 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 43,750 మంది రైతులకు రూ.46.83 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఇలా ఖరీఫ్, రబీ కింద 7.23 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా... 7.40 లక్షల మంది రైతులకు రూ.984.23 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాల్సి ఉంది. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి చంద్రబాబు సర్కార్..ఇన్పుట్ సబ్సిడీ ఫైలును గల్లంతు చేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే తాజాగా సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. -
ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి పరిహారంపై లేఖలా?
సాక్షి, అమరావతి: తాను అధికారంలో ఉండగా కరువు, పంట నష్టం కారణంగా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.2,300 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు 20 రోజులు కూడా గడవకుండా ముందే పరిహారాన్ని అందచేయాలంటూ విమర్శలకు దిగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు చిల్లిగవ్వ విదల్చని చంద్రబాబు ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పంట నష్టపోయిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం ఎన్యూమరేషన్ జరుగుతుందని, విపత్తు సాయం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వరదలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు విమర్శలకు దిగడం పట్ల కూడా విస్తుపోతున్నారు. ‘మనుషులు సృష్టిస్తే వరదలొస్తాయా? విజ్ఞత కలిగిన వారెవరైనా ఇలా మాట్లాడతారా?’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే హుద్ హుద్ తుపాన్‌తో విశాఖ తీవ్రంగా దెబ్బ తినడం ఆయనకు గుర్తు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ హామీని నెరవేర్చకుండా లేఖలా? ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వరదలు వచ్చి కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ప్రకాశం బ్యారేజీకి ఒకే రోజు 7.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తే కరకట్టల వెంట ఉన్న లంక గ్రామాలు దెబ్బ తినకుండా ఉంటాయా?’ అని పరిశీలకులు, ప్రజలు పేర్కొంటున్నారు. కృష్ణా నదికి వరదల సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం కాగా టీడీపీ నేతలు మినహా మరెవరూ విమర్శలు చేయలేదని, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగి తాను తొలి సంతకం చేసిన రైతుల రుణమాఫీ హామీని నెరవేర్చకుండా బకాయిలు చెల్లించాలంటూ ఇప్పుడు ప్రభుత్వానికి లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. వరదలకు ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు లేఖలు రాయడం సిగ్గుచేటని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. -
రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పించాలి
కడప కార్పొరేషన్ : 2012 రబీకి సంబంధించి 21,250 మంది రైతులకు పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్‌ను వెంటనే ఇప్పించాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వేముల, ముద్దనూరు, కొండాపురం రైతులతో కలసి జేసీ–2 శివారెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 2014 రబీలో బుడ్డశనగ పంటకు బ్యాంకులో రెన్యువల్ æచేసిన వారికి చెల్లించారని, మిగిలిన వారికి, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కట్టిన వారికి ఇవ్వలేదన్నారు. వేముల, ముద్దనూరు, కొండాపురం మండలాల రైతులకు ఈ ఇన్సూరెన్స్ రాలేదన్నారు. అలాగే 2013–14లో లింగాల, వేముల మండలాల్లో బుడ్డశనగ, ఉద్యాన పంటలు వేసిన రైతులు అకాల వర్షాల వల్ల పంట పూర్తిగా నష్టపోయారన్నారు. జిల్లా వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను సర్వే చేసి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 2015 ఇన్పుట్ సబ్సిడీ ఇంకా కొందరికి రాలేదన్నారు. 2014–15 రబీ బుడ్డశనగకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారని, దీనికి కూడా ఇన్సూరెన్స్ రాలేదన్నారు. 2016 బుడ్డశనగ ఇన్సూరెన్స్ కూడా పెండింగ్‌లోనే ఉందన్నారు. 2017లో ప్రతి పంటకు ఇన్సూరెన్స్ బ్యాంకులకు పంపారని, కానీ ఇంత వరకూ రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. 2013–14లో లింగాల, తొండూరు, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో వర్షాభావం వల్ల ఉద్యాన పంటలు ఎండిపోతుంటే అధికారులు వచ్చి.. మీరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకోండి, డబ్బులిస్తామని రైతులకు చెప్పారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 2015–16 కరువు నిధులు 30 శాతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ 20 శాతం పెండింగ్‌లో ఉందని, దీనివల్ల బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ ఏడాది అరకొర వర్షం పడటం వల్ల కొందరు రైతులు విత్తనం విత్తినారని, వర్షం పడక పైరు ఎండిపోయిందన్నారు. 80 శాతం మంది రైతులు విత్తనమే వేయలేదన్నారు. రైతుల జీవన పరిస్థితి దుర్భరంగా ఉందని, వారికి పెట్టుబడి రాయితీ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ–2ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతులు విజయశంకర్, మోహన్, ప్రహ్లాదుడు, రజనీకాంత్‌రెడ్డి, శివశంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలు సబ్సిడీకి బానిసలయ్యారు
సాక్షి, అమరావతి: ప్రజలు సబ్సిడీలకు(రాయితీలకు) బానిసలయ్యారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీ వంటి వాటికి అలవాటు పడిపోయారని చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాల్లో ఈ–ప్రగతి–ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. టెలికం రంగంలోకి రావాలని ధీరూబాయ్ అంబానీకి చెప్పింది తానేనన్నారు. అప్పట్లో తన నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సుల వల్లే దేశంలో టెలికం సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. దానివల్లే ప్రస్తుతం ప్రజలకు ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామిక విప్లవం రావడంలోనూ తన కృషి ఉందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో మొదలైన స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం తన ఆలోచనేనని చెప్పుకొచ్చారు. వారికి నేనే వడ్డించా.. : ఒరిజినల్ ఐఎస్బీ సర్టిఫికెట్ పొందడం చాలా కష్టమని, కానీ ఇక్కడ సులభంగా డిగ్రీ పొందారని సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన అధికారులను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. ఐఎస్బీ క్యాంపస్‌ను ముంబయి, చెన్నై, బెంగళూరులో పెట్టాలనుకుంటే తాను చాలా కష్టపడి హైదరాబాద్‌కు తీసుకొచ్చానని తెలిపారు. ఆ సమయంలో మెకంజీ వాళ్లను కాఫీకి పిలిచానని, సర్వర్లను కూడా వెళ్లిపొమ్మని, తానే వారికి అన్నీ వడ్డించానని, చివరికి హైదరాబాద్‌లో ఐఎస్బీ పెట్టేందుకు ఒప్పించానని చెప్పారు. హోదా, హామీలు.. మన హక్కులు: చాలా కష్టాలున్నాయని, కేంద్రం డబ్బులివ్వడం లేదని బాబు వెల్లడించారు. ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలన్నీ మన హక్కులని తెలిపారు. వీటికోసం పోరాడుతూనే లక్ష్యం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 96 మంది అధికారులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
ఉద్యాన రైతులకు ‘ఇన్పుట్’ మంజూరు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ 2016లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద పరిహారం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డి.మన్మోహన్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల పరిధిలో 2,138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 5,247 మంది రైతులకు రూ.5.19 కోట్లు పరిహారం మంజూరు చేశారు. అందులో జిల్లా వాటా రూ.90 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. -
ఇన్‘ఫట్’ సబ్సిడీ
2014 ఇన్పుట్ పంపిణీ నిలుపుదల రెండేళ్ల తర్వాత రూ.50 కోట్ల నిధులు వెనక్కి మిస్‌మ్యాచింగ్ జాబితాలో రూ.10 కోట్లు పెండింగ్ అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు సక్రమంగా కురవక.. పంటలు పండక రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ కొద్దోగొప్పో సాయమందినా కొంత ఊరట కలుగుతుంది..ఇలాంటి సమయంలో రైతులకు మంజూరైన పరిహారం పంపిణీ చేయకుండా రెండేళ్ల తర్వాత ఖజానాకు వెనక్కి పంపారు. ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందుతుందనుకున్న రైతన్నలకు మొండిచేయి చూపినట్లయ్యింది. 2014 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,81,471 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిని నష్టపోయిన 5,79,640 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.567,32,74,088 పరిహారం మంజూరు చేశారు. అందులో నకిలీ పాస్‌పుస్తకాలు, డబుల్ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించి వాటి కింద 7,529 మంది రైతులకు దక్కాల్సిన రూ.7.64 కోట్లు పరిహారం ఇవ్వకుండా మొదట్లోనే ప్రభుత్వానికి వెనక్కి పంపారు. అంతిమంగా 5,72,111 మంది రైతులకు రూ.559,68,40,424 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇష్టారాజ్యంగా రైతుల జాబితాలు తొలిసారిగా ఇన్పుట్ సబ్సిడీకి ఆధార్ లింక్ చేసి ‘ఆన్లైన్ లైసెన్సు మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎల్‌ఎంఎస్) కింద ఈ–రైతు సేవలు’ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆన్లైన్ చేసే క్రమంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తడం, ముఖ్యంగా ఆధార్ నంబర్ డిస్ప్లే కాకపోవడం, డిస్ప్లే అయినా పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం, వాటిని సరిచేయడానికి నానాపాట్లు పడ్డారు. ఇందులో కొందరు రైతులకు ఆధార్ లేకపోవడం, జాబితాలు తప్పుల తడకలుగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు ఇష్టారాజ్యంగా మార్చేశారు. 2014 ఇన్పుట్ పంపిణీకి ఫుల్స్టాప్ ఖరీఫ్–2014 ఇన్పుట్ పంపిణీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయినా పూర్తి స్థాయి పరిహారం రైతులకు పంపిణీ చేయకుండానే ముగింపు పలికారు. ఆర్థికంగా చితికిపోయి బక్కచిక్కిన రైతులకు అందాల్సిన రూ.50 కోట్ల వరకు పరిహారం అలా ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. మరో రూ.10 కోట్లు మిస్ మ్యాచింగ్ జాబితాలో నిలిచిపోగా దాన్ని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పేరున్నా రాలేదంటూ ఇంకా చాలా మంది రైతులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది తిరిగి తిరిగి వేసారిపోయి ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పటికీ రోజూ కనీసం 50 మంది రైతులు 2014 ఇన్పుట్ సమస్యపై జేడీఏ కార్యాలయానికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్హత ఉన్నా అందని పరిహారం అర్హత ఉన్నా చాలా మంది పేర్లు గల్లంతు కావడం, పేరున్నా పరిహారం తక్కువగా ఇవ్వడం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఐదెకరాలున్న రైతులకు కూడా రూ.1,000 లేదా రూ.2 వేలు మాత్రమే దక్కింది. దీనికితోడు పరిహారం ఒకేసారి విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ రావడం వల్ల పంపిణీ ప్రసహనంగా సాగింది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా పది విడతలుగా పరిహారం విడుదల చేశారంటే ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది. 2015 పరిహారం రెండేళ్ల తర్వాత పంపిణీ 2015 ఆగస్టులో తొలివిడతగా పరిహారం విడుదల చేయగా పదో విడత 2017 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ కారణాల వల్ల పరిహారం కోసం రైతులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒకటి, రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు తిరిగిన రైతులు ఎందరో అని చెప్పాలి. కొందరైతే 30 నుంచి 40 సార్లు మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. తిరగడానికి, వచ్చిన ప్రతిసారీ ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టానెంబర్ జిరాక్స్‌ల కోసం, రానుపోనూ చార్జీల కోసం రూ.వేలు ఖర్చు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. పరిహారం రాని వారు పెద్ద సంఖ్యలోనే మిగిలారు. మిస్మ్యాచింగ్ను సరిచేసుకునేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రూ.521 కోట్లు పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 2014లో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 5.81 లక్షల హెక్టార్లు మంజూరైన ఇన్పుట్ పరిహారం : రూ.567.32 కోట్లు బాధిత రైతుల సంఖ్య : 5.79 లక్షల మంది రెండేళ్లుగా పంపిణీ చేసిన పరిహారం : రూ.521 కోట్లు పరిహారం అందుకున్న రైతుల సంఖ్య : 5.37 లక్షల మంది మిస్‌మ్యాచింగ్‌లో ఉన్న పరిహారం : రూ.10 కోట్లు పరిహారం పంపిణీ కాకుండా మిగిలింది : రూ. 51 కోట్లు పరిహారం దక్కని రైతులు సంఖ్య : 42 వేల మంది -
అర్హులందరికీ ఇన్పుట్ సబ్సిడీ
కణేకల్లు: పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని జేడీఏ శ్రీరామమూర్తి తెలిపారు. గతేడాది వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన 5 లక్షల మందికి రూ.889 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన కణేకల్లులో ప్రత్యామ్నాయ పంటల విత్తన పంపిణీని పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ ప్రత్యామ్నాయ పంట విత్తనాలను అందేలా చూడాలని ఏఓ శ్రీనివాసులును ఆదేశించారు. ఈ సందర్భంగా జేడీఏ విలేకరులతో మాట్లాడుతూ, ఇన్పుట్ సబ్సిడీ ప్రక్రియ 95శాతం పూర్తయ్యిందన్నారు. మిస్‌మ్యాచ్, ఇన్పుట్కు అర్హులై ఉండీ జాబితాలో పేరు లేని వారు, ఇన్పుట్ సబ్సిడీ మంజూరైనా ఖాతాల్లో డబ్బు జమ కాని వారు కొందరున్నారనీ, వీరందరికీ త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ డబ్బు అందేలా చూస్తామన్నారు. వేరుశనగ సాగుచేయని వారికే ప్రత్యామ్నాయ విత్తనాలు జిల్లా వ్యాప్తంగా వేరుశనగ సాగయ్యే భూమి 8 లక్షల హెక్టార్లుంటే ఇప్పటి వరకు కేవలం 3.20 లక్షల హెక్టార్లలోనే వేరుశనగ సాగైందన్నారు. 80 వేల హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారన్నారు. ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేయని రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉలవలు, అలసందుల విత్తనాలు ఉచితంగా, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు పంట విత్తనాలు కేజీ రూ.50 రాయితీతో రైతులకు అందజేస్తున్నామన్నారు. వేరుశనగ సాగు చేసి ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఇచ్చేది లేదన్నారు. నల్లరేగడి భూములున్న రైతులకు సెప్టెంబర్ 20 లోపు పప్పుశనగ విత్తనాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జేడీఏ తెలిపారు. జేడీఏ వెంట ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ రెడ్డపరెడ్డి, ఏఈఓ విజయ్‌కుమార్‌లున్నారు. -
టీడీపీ నేతలే ఇన్పుట్ సబ్సిడీ కాజేశారు
-
ఫలితం పొంది విమర్శించడమా?
అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం సాక్షి ప్రతినిధి, అనంతపురం: రుణమాఫీలో రూ.1.50 లక్షలు తీసుకున్నారు.. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకున్నా రు... అయినా నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో ‘రైతు కృతజ్ఞత యాత్ర’ పేరుతో చంద్రబాబు అనంతపు రం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో రూ.24,500 కోట్ల రుణమాఫీ చేయగా.. రూ.2,728 కోట్లు అనంతపురానికి వచ్చింది. రాష్ట్రానికి ఇన్పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214 కోట్లు ఇస్తే రూ.1451 కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. రైతులు పండ్లు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా’’ అని సీఎం చెప్పారు. అనాథగా మారిన బాలికకు అండ తాడిపత్రిలో మంగళవారం తల్లీ ఇద్దరు కూతుళ్లు దారుణహత్యకు గురికాగా.. తండ్రి కూడా బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది. ఈ నేపథ్యంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. స్పందించిన సీఎం ప్రసన్న పేరుతో రూ.20లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు. -
ఇష్టారాజ్యం
- తప్పులతడకగా పంట నష్టం జాబితాలు – నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు – వేరుశనగ సాగు చేస్తే కందికి ఇన్పుట్ సబ్సిడీ – అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జాబితాల తయారీ – గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు పెట్టని వైనం కర్నూలు (అగ్రికల్చర్): – మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడుల్లో 50శాతం కూడా దక్కలేదు. గ్రామ రైతుల్లో దాదాపు 70 శాతం మంది చిన్న, సన్న కారు రైతులే. అయితే.. పంట నష్టం వివరాల నమోదులో వీఆర్ఓ, ఏఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఐదెకరాలు ఉంటే పావు ఎకరా, మూడెకరాలు ఉన్న రైతుకు అరఎకరాలో పంట నష్టం వాటిల్లినట్లు నమోదు చేశారు. దీంతో వారికి రూ.500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. –వెల్దుర్తి మండలం బోగోలు గ్రామంలో వడ్డె రాముడికి 357/1 సర్వే నంబరులో 2.50 ఎకరాలు, 357/ఏ సర్వే నంబరులో 2.50 ఎకరాల భూమి ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్‌లో వేరుశనగ అని నమోదైంది. అడంగల్‌లోనూ అదే పంటను పేర్కొన్నారు. కానీ ఇన్పుట్ సబ్సిడీకి మాత్రం ‘కంది పంట’ అని రాశారు. దీంతో రాముడు హెక్టారుకు రూ.5వేల ఇన్పుట్ సబ్సిడీని కోల్పోయారు. ‘మేము వేరుశనగ వేశాము కదా..! కంది పంటకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందేమిట’ని అడిగితే.. పొరపాటు జరిగిందని, ఏమీ అనుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్-2016లో సాగు చేసిన అన్ని పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో పది మండలాల్లో పంటల దిగుబడి బాగా ఉందంటూ నష్టం వివరాలను నమోదు చేయలేదు. 26 మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.325 కోట్లు ఇటీవల విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఏడీఏలకు విడుదల చేశారు. వారి నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. కాగా.. పంట నష్టం వివరాల నమోదులో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు.. వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. కావలసిన వారికి పత్తి, వేరుశనగ వేసినట్లు రాసి హెక్టారుకు రూ.15వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా చూశారు. ఇతరులకు కొర్ర, కంది వంటి పంటలు చూపారు. దీనివల్ల వారికి తక్కువ మొత్తం వచ్చింది. పాత జాబితాలనే వినియోగించారు! ఇన్పుట్ సబ్సిడీ నమోదులో పాత జాబితాలతోనే మమ అనిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. 2014లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించగా.. కేవలం ఆదోని రెవెన్యూ డివిజన్లోని దేవనకొండ, ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఈ మండలాలకు రూ.73 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైంది. 2015, 2016లోనూ ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో ఇక్కడ 2014 కరువు జాబితాలనే 2015, 2016కు వినియోగించినట్లు విమర్శలున్నాయి. 2015లో ప్రభుత్వం జిల్లాలో 40 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అన్ని మండలాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించింది. నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేసి ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదించారు. ఈ జాబితాలనే తిరిగి 2016లోనూ వినియోగించినట్లు తెలుస్తోంది. దీనివల్ల వేలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలకు తూట్లు నిబంధనల ప్రకారం పంట నష్టంపై సర్వే పూర్తయి, జాబితాలు రూపొందించిన తర్వాత వాటిని గ్రామ పంచాయతీల్లో రైతుల పరిశీలనకు ఉంచాలి. అందులో పేర్లు లేకపోయినా, ఒక పంట సాగు చేసి ఉంటే మరో పంటను నమోదు చేసినా, విస్తీర్ణంలో తేడా ఉన్నా.. రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిశీలించి.. తుదిజాబితాను రూపొందించి వ్యవసాయ సంయుక్త సంచాలకుడి(జేడీఏ)కి పంపాల్సి ఉంటుంది. కానీ ఏ గ్రామ పంచాయతీలోనూ రైతుల పరిశీలనకు జాబితాలు పెట్టిన ధాఖాలాలు లేవు. ప్రదర్శించి ఉంటే ఇప్పుడిన్ని ఫిర్యాదులు, ఆందోళనలు ఉండేవి కావు. అధికార పార్టీ నేతల సిఫారసు మేరకే.. హాలహర్వి పూర్తిగా కరువు మండలం. ఇక్కడ అధికార పార్టీ నేతలు ఇన్పుట్ సబ్సిడీ కోసం వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు మాత్రమే నమోదు చేయించారు. నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. చింతకుంట, శ్రీధర్‌హాల్, కామినహాల్, బిలేహాల్ గ్రామాల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే జాబితాలు రూపొందాయి. నిజమైన రైతులకు అన్యాయం జరగడంపై వీఆర్ఓ, తహసీల్దార్లను అడిగితే వ్యవసాయాధికారులపైన, వారిని అడిగితే రెవెన్యూ అధికారుల మీద చెబుతున్నారు. మొత్తమ్మీద అధికారుల తప్పిదాల వల్ల వేలాదిమంది రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
చంద్రగ్రహణం
ఇన్పుట్ సబ్సిడీలో లోపించిన పారదర్శకత - టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలపైనే మంజూరు - అస్మదీయులైతే పొలం లేకున్నా పరిహారం - జిల్లాలో రూ.వంద కోట్లకు పైగా గోల్మాల్ - భాగస్వాములవుతున్న వ్యవసాయాధికారులు - ఇన్సూరెన్స్ మంజూరులోనూ అన్యాయమే.. - ఆత్మకూరు మండలం సిద్ధలాపురానికి చెందిన ఎ.లక్ష్మిదేవికి సర్వే నెంబర్ 497–3ఏలో పొలం ఉన్నట్లు, అందులో ఆముదం సాగు చేసినట్లు.. ఈ పంటకు నష్టం వాటిల్లినట్లు రూ.13,600 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. నిజానికి ఈమెకు పొలం లేదు. ఇదే సర్వే నెంబర్ 497–3ఏలో అదే గ్రామానికి చెందిన కె.కవిత కూడా ఆముదం సాగు చేసి నష్టపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఈమెకు రూ.13,600 పరిహారం మంజూరయింది. ఇంతటితో ఆగలేదు. ఇదే సర్వే నెంబర్(497–3ఏ)లో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశులు కూడా ఆముదం సాగు చేసి నష్టపోవడంతో రూ.12,240 పరిహారం ఇచ్చారు. ఈయనకూ పొలం లేకపోవడం గమనార్హం. ఈ మండలంలో ఇలాంటి అనర్హులు వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వీరికున్న అర్హత.. మంత్రి పరిటాల సునీత అనుచరులు కావడమే! - బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళా రైతుకు 3.60 ఎకరాల పొలం ఉంది. ఈమె ఖాతాలో(నెంబర్:1163) రూ.3వేలు మాత్రమే జమ చేశారు. ఇదే గ్రామంలో డి.ఈశ్వరయ్య అనే మరో రైతు 2.74 ఎకరాల్లో(పట్టా నెంబర్.954–డి) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.6వేల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు సూర్యనారాయణ 2.50 ఎకరాల్లో(పట్టా నెంబర్.955) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.3వేలు జమ అయ్యింది. ఎకరాకు రూ.6వేలు చొప్పున పరిహారం అందాల్సి ఉన్నా.. అలా జరక్కపోవడానికి వీరంతా అధికార టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలగకపోవడమేనని తెలుస్తోంది. - ఇదీ జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ తీరుతెన్ను. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ పూర్తిగా అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరుగుతోంది. ఇది ప్రభుత్వ సొమ్ము. నష్టపోయిన రైతులందరికీ దక్కాల్సిన పరిహారం అనే విషయాన్ని విస్మరించి అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటున్నారు. పొలం లేని వారికి సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం పంచుతున్నారు. పొలం ఉండి, పంటసాగు చేసి నష్టపోయిన వారితో చెలగాటం ఆడుతున్నారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు 8.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ విస్తీర్ణానికి బ్యాంకర్లు పంట రుణం కూడా అందించారు. అధికారులు మాత్రం 7.17లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందులో 5.90లక్షల హెక్టార్లు వేరుశనగ, తక్కిన విస్తీర్ణంలో ఇతర పంటలు నష్టపోయినట్లు లెక్కగట్టారు. బ్యాంకర్లు వేరుశనగకు ఎకరాకు పెట్టుబడి రూ.19,500 అవుతుందని లెక్కగట్టి ఆ మేరకు రుణం మంజూరు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సాగైన 6.02లక్షల హెక్టార్ల వేరుశనగకు రూ.2,954 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500కోట్ల మేర నష్టం సంభవించింది. ప్రభుత్వం 63 కరువు మండలాలను ప్రకటించింది. కానీ ఇన్పుట్ సబ్సిడీ మాత్రం రూ.1032.42కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అంటే.. రైతులకు ఎకరాకు 19,500 ఖర్చయితే, ప్రభుత్వం రూ.6వేలు మాత్రమే లెక్కగట్టింది. ఇది ప్రభుత్వం రైతులకు చేసిన మొదటి అన్యాయం. పోనీ ఆ మేరకైనా పరిహారం ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఆధార్ ‘లింకు’ పేరుతో మరో అన్యాయం ప్రతి రైతుకు 5ఎకరాల వరకూ పరిహారం ఇవ్వాలి. ఈ లెక్కన అత్యధికంగా రూ.30వేల వరకూ రైతులకు పరిహారం దక్కాలి. ఒక రైతుకు ఓ గ్రామంలో 2 ఎకరాల పొలం ఉండి, మరో గ్రామంలో మరో రెండు ఎకరాల పొలం ఉంటే నాలుగెకరాలకు పరిహారం అందాలి. కానీ ఒకే ఆధార్‌కార్డుతో రెండుచోట్ల పొలం ఉందనే కారణంతో పరిహారం ఎగవేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీడీపీ నేతలకైతే పొలం లేకున్నా సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం వేస్తున్నారు. ఇందులో వ్యవసాయాధికారులు పూర్తిగా అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుచుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గోల్మాల్ చేస్తున్నారు. నిజమైన రైతులుంటే వారికి హక్కుగా దక్కాల్సిన పరిహారాన్ని కూడా అందించని పరిస్థితి. ఇలా.. రూ.వంద కోట్లకు పైగా జిల్లాలో గోల్మాల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబును జిల్లాకు రప్పిస్తున్నారు. కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ‘అనంత’ రైతులెవ్వరికీ లేకపోయినా అధికార పార్టీనేతలు, కార్యకర్తలు పంటసాగు చేయకపోయినా కాసుల పంట పండుతుండటంతో వారు చంద్రబాబుకు కృతజ్ఞత తెలియజేసేందుకు బాబును పిలిపించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీమా మంజూరులో తిరకాసు 21.25లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. ఈ విస్తీర్ణానికి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. కానీ 15.05లక్షల ఎకరాల్లోనే పంట సాగయిందని వ్యవసాయాధికారులు క్రాప్‌బుకింగ్ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో 14.87లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందని బీమా కంపెనీ తేల్చింది. ఈ మొత్తానికి పరిహారం చెల్లించేందుకు బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.419కోట్ల పరిహారాన్ని చెల్లిస్తోంది. నిజానికి రైతు తీసుకున్న రుణానికి ఇన్సురెన్స్ చేశారు. అంటే ఏ మేరకు రుణం తీసుకున్నారో, ఆ మేరకు బీమా మంజూరు కావాలి. ఈ లెక్క రూ.2,500కోట్లకు పైనే అవుతుంది. కానీ బీమా కంపెనీ కేవలం రూ.419కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ మొత్తాన్ని 14.87లక్షల ఎకరాలకు జమ చేస్తున్నారు. తక్కిన 6.37లక్షల ఎకరాలకు పరిహారం ఎవరు చెల్లించాలనేది ప్రశ్నార్థకం. -
రూ.200 కోట్ల ఇన్పుట్ వెనక్కి!
= ఎక్కడ పొలం ఉన్నా...ఒక్క మండలం నుంచే పరిహారం = అర్హత ఉన్నా రూ.30 వేలు కూడా ఇవ్వకపోవడం = ఈ–క్రాప్ కారణంగా చాలా మంది పేర్లు లేకపోవడం అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ –2016లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర 16 రకాల పంటలకు సంబంధించి మంజూరైన రూ.1,032.42 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడిరాయితీ) పరిహారంలో రూ.200 కోట్ల వరకు పంపిణీ కాకుండా ప్రభుత్వ ఖాజానాకు జమ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 7.17 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6,25,050 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు పరిహారం మంజూరైంది. కానీ వ్యవసాయశాఖ వద్ద ప్రస్తుతం ఉన్న జాబితాలు పూర్తిగా అప్లోడ్ చేసినా కాస్త అటు ఇటుగా రూ.850 కోట్లకు మించి ఉండకవపోవచ్చని తెలుస్తోంది. ఇంకా వివరాలు సేకరించి అప్లోడ్ చేసి ట్రెజరీకి సమర్పించినా... చివరకు కొంచెం అటుఇటుగా రూ.200 కోట్లు పరిహారం వెనక్కి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. మండలాల నుంచి డివిజన్లు, అక్కడి నుంచి జేడీఏ కార్యాలయానికి చేరిన జాబితాలను ఇన్పుట్సెల్ అధికారులు క్రోడీకరించి తుది జాబితాలు, వాటికి సంబంధించిన బిల్లులు ట్రెజరీకి సమర్పించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. రూ.1,032 కోట్లకు సంబంధించి జాబితాలు వంద శాతం అప్లోడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా... క్షేత్రస్థాయిలో ఆ మేరకు చర్యలు కనిపించడం లేదు. ఈ సారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకుని కొత్త పద్ధతిలో ఇన్పుట్ పరిహారం పంపిణీ చేస్తుండటంతో అప్లోడ్ ప్రక్రియతో పాటు రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ కూడా వేగవంతంగా చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా వ్యవసాయశాఖ అధికారులు అప్లోడ్ చేసి వాటికి సంబంధించి బిల్లులు ట్రెజరీకి సమర్పిస్తుండగా టోకెన్ తీసుకుని ట్రెజరీ అధికారులు నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.770 కోట్ల జాబితాలు అప్లోడ్ చేయగా, రైతుల ఖాతాల్లోకి రూ.500 కోట్ల వరకు పరిహారం జమ అయినట్లు చెబుతున్నారు. మిగతా మొత్తం నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి వేస్తామంటున్నారు. అందులో ఈనెల 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మీట నొక్కించి కొంత మొత్తం జమ అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇదంతా పూర్తి చేసినా రూ.850 కోట్లకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. కారణాలు అనేకం: ఈ సారి ఆధార్ అనుసంధానాన్ని పకడ్బందీగా చేపట్టడంతో ఒక రైతుకు ఒక మండలంలోనే పరిహారం వర్తింపజేశారు. కొందరు రైతులకు ఒకటి కాకుండా రెండు మూడు మండలాల్లో కూడా పొలాలు ఉన్నాయి. పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అంతో ఇంతో పరిహారం కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇపుడు ఆధార్ అనుసంధానం చేయడంతో ఒకటి ఉంచి మిగతా వాటిని తొలగించేశారు. ఇక కొన్ని మండలాల్లో ఐదు, పది ఎకరాలు ఉన్నా ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.30 వేలు వర్తింపజేయకుండా బాగా తగ్గించేసినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు రైతులకు ఐదు ఎకరాలున్నా రూ.10 వేలు, రూ.15 వేలు ఇలా... బాగా తగ్గించినట్లు వాపోతున్నారు. మరికొన్ని మండలాల్లో సమస్యలెందుకని భూవిస్తీర్ణం చూడకుండా రూ.20 నుంచి రూ.24 వేల ప్రకారం వేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు చోటా మోటా నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రూ.30 వేలు రాయించుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ–క్రాప్ బుకింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవడంతో పంటలు మారిపోవడం, పరిహారం కూడా తారుమారైంది. మరికొందరు అర్జీలు సమర్పించినా వాటిలో రాజకీయ వివక్షతో చాలా వరకు పక్కకు పెట్టినట్లు కూడా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల జిల్లాకు మంజూరైన ఇన్పుట్ పరిహారంలో పెద్ద మొత్తంలో మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు. దీంతో పాటు పంపిణీ చేసిన జాబితాలో జరిగిన పొరపాట్ల కారణంగా ‘మిస్‌మ్యాచింగ్’ జాబితా కూడా రూ.50 కోట్లకు పైగా తేలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని వివరణ కోరగా... అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు. అప్లోడ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఎంత మిగులుతుందనే విషయాన్ని ఇపుడే చెప్పలేమన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ రైతుల హక్కు
అనంతపురం సెంట్రల్ : ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదని, రైతుల హక్కు అనే విషయం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అనంతరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల డబ్బు వారికిచ్చే విషయంలోనూ ప్రచారం చేసుకునేందుకే ముఖ్యమంత్రి ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ అర్హత పత్రాల పేరిట ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను ముద్రించి కార్డులు అందజేయడం హాస్యాస్పదమన్నారు. ఒక్కో కార్డుకు రూ.10 చొప్పున జిల్లాలో 6లక్షల మందికి కార్డులు ఇచ్చేందుకు రూ.60లక్షలు దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం 2016 ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032 కోట్లు ఇస్తున్నారని.. అయితే గత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన వారికి రూ.4,087కోట్లు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన రైతులకే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇంతవరకు అర్హుల జాబితా ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అర్హులకు న్యాయం జరక్కపోతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ జాబితా అప్లోడ్
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)కి సంబంధించి సోమవారం సాయంత్రానికి రూ.550 కోట్ల పరిహారం జాబితాలు అప్లోడ్ చేయడం పూర్తయిందని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.330 కోట్ల జాబితాలు ట్రెజరీకి సమర్పించడం జరిగిందన్నారు. ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేసే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో మొదలు కావచ్చని తెలిపారు. -
వేరుశనగ రైతులకు అన్యాయం
► అధికారుల నిలదీత ► పోలీసుల సమక్షంలోబాండ్ల పంపిణీ తొండూరు : ఖరీఫ్ 2016లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీలో అవకతవకలు జరిగాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇనగలూరు గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ కార్యక్రమం ఏఓ కిశోర్ నాయక్ ప్రారంభించారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాకుండా.. పంట సాగు చేయని వారికి ఎలా వచ్చిందంటూ వ్యవసాయాధికారులను అన్నదాతలు నిలదీశారు. వేరుశనగ సాగు చేసిన వారి పేర్లను ఎంపీఈఓ శివ చదివి వినిపించారు.సాగుచేయని వారి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు.అర్హులైన వారికి బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గ్రామ నౌకర్లు: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గ్రామ నౌకర్లు చక్రం తిప్పినట్లు రైతులు చెబుతున్నారు. గ్రామ నౌకర్లు, ఎంపీఈఓలు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు రైతుల వద్ద డబ్బులు తీసుకుని పంట సాగు చేయని వారి పేర్లను జాబితాలో పొందుపరిచారని ఆరోపించారు. గ్రామంలో ఓ రైతు అర ఎకరాలో వేరుశనగ సాగు చేస్తే రూ.13వేలు,మరొకరికి ఎకరాకు రూ.26వేలు మంజూరైందని.. అర్హులైన మేం ఐదెకరాల్లో సాగు చేస్తే కేవలం రూ.6వేలు మాత్రమే వచ్చిందని గ్రామానికి చెందిన బాల ఎరికల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అంకిరెడ్డి, అరుణమ్మ, వీరనారాయణరెడ్డి తెలిపారు. ఎంపీఈఓలు, జియో ట్యాగింగ్ చేసే సమయంలో గ్రామ నౌకర్లు కొంతమంది చక్రం తిప్పారని అన్నదాతలు ఆరోపించారు. కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఏఓ కిశోర్ నాయక్ తొండూరు ఎస్ఐ శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ వెంటనే ఏఎస్ఐ రమణ, పోలీసు సిబ్బందిని ఇనగలూరు గ్రామానికి పంపించారు. పోలీసుల సమక్షంలో బాండ్లు పంపిణీ చేశారు. ఈ విషయమై ఏఓ కిశోర్నాయక్ను సాక్షి వివరణ కోరగా ఫీల్డ్ విజిట్‌లో రెవెన్యూ అధికారులు పొరపాటు చేయడంవల్ల ఇలా జరిగిందని.. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులతో చర్చించి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తాలుకా కార్యదర్శి దశరథరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగయ్య, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
అవకతవకలు
► ఇన్పుట్ సబ్సిడీ పేర్ల నమోదులో ఇష్టారాజ్యం ► అర్హులైన రైతులకు రాకపోవడంపై ఆందోళన ► జిల్లాలో పలుచోట్ల వెలుగు చూస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీలో అవకతవకల వ్యవహారం రైతులను భగ్గుమనేలా చేస్తోంది.సరిగ్గా ఏడాది కిందట సంబంధిత అధికారులు పంపిన నివేదికల ఆధారంగా ప్రస్తుతం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం మంజూరైంది. అయితే కొన్ని మండలాల్లో అప్పట్లో పంట సాగు చేయని రైతులకు.. అనుకూలురైన వారికి, అధికారుల బంధువులు,ఇతర అనర్హులకు అందజేశారన్న ఆరోపణలు రచ్చకెక్కేలా చేస్తున్నాయి. సాక్షి, కడప : ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన బాండ్ల పంపిణీ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. అందుకు కారణం పలుచోట్ల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కొంతమంది పంట సాగు చేయని రైతులకు పరిహారం అందడంతోపాటు అర్హులైన వారికి రాకపోవడం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. తొండూరుతోపాటు వేముల, రాయచోటి నియోజకవర్గంలోని పలు చోట్ల రైతులు భగ్గుమంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై సమాధానం చెప్పేందుకు అధికారులు కూడా ముందుకు రావడంలేదు. అంతా ఏడాది కిందట జరిగిపోయిందని.. ఇప్పుడు అరిచినా ఎవరూ ఏమి చేయలేరని అధికారులు పేర్కొంటున్నారు. 2016లో వేరుశనగ, పత్తితోపాటు మరికొన్ని పంటలు వేసి కరువు ప్రభావంతో పంటలు ఎండిపోయాయి. తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొని అన్నదాత అల్లాడిపోయారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా పంట నష్టం జాబితాను రూపొందించేలా ఆదేశాలు ఇచ్చింది. అప్ప ట్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్ఓ, మరో సంబంధిత అధికారి కలిసి నివేదికలు రూపొందించారు. గ్రామసభలు పెట్టి పంట సాగు చేసిన రైతులను గుర్తిం చాల్సి ఉంది. అయితే కొంతమంది అధికా రులు గ్రామసభలు నిర్వహించకుండా తమకు తెలిసిన పంథాలో వెళ్లగా.. మరికొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అనుకూలురైన వారి పేర్లను జాబితాలో చేర్చిన ట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరుకు సంబంధించిన అధికారులు అప్పట్లో పులివెందులలోని ఓ లాడ్జిలో కూర్చొని రైతుల జాబితాను తయారు చేస్తున్న వ్యవహారం పత్రికల దృష్టికి వచ్చి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక తొండూరు మండలంలోనే కాకుండా పలుచోట్ల రైతులు అధికారులను నిలదీస్తున్నారు. సాగు తక్కువ ఉన్న వారికి ఎక్కువ మొత్తాలు.. జిల్లాలో చాలా మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. కొంతమంది రైతులు ఎక్కువ పంట సాగు చేస్తే తక్కువ మొత్తంలో మం జూరు కావడం..అధికంగా పంట సాగు చేస్తే తక్కువ మొత్తంలో ఇన్పుట్ సబ్సిడీ రావడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా సుమారు 63వేలమం ది రైతులకు గాను రూ.70కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది. బాండ్ల పంపిణీ అధికారులకు ఇబ్బందిగా మారింది. జేడీ ఠాగూర్ నాయక్ ఏమంటున్నారంటే.. : జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్‌ను సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఏడాది కిందట వ్యవసాయ శాఖ అధికారితోపాటు మరో రెండు శాఖల అధికారులు ప్రత్యేకంగా ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఎంపిక చేశారని తెలిపారు. కొంతమంది పరిహారం రాని రైతులే ఈ విధంగా ఆందోళన చేస్తున్నారని.. అప్పట్లో నియమ నిబంధనల మేరకే పంట సాగు చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. ఏడాది క్రితం అయిపోయిన దానికి ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. -
నేటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
– ప్రభుత్వ ప్రచారానికి వ్యవసాయశాఖ కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి జిల్లాలోని 26 మండలాలకు రూ.325 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు ఈ నెల 22 నుంచి 28 వరకు 26 కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి 3,10,766 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ బుధవారం ప్రొసీడింగ్స్ వచ్చాయని, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని సబ్ డివిజన్ ఏడీఏలకు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంటే రైతులకు పత్రాలు పంపిణీ చేసినా పరిహారం బ్యాంకు ఖాతాలకు జమ కావడానికి రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాల పేరుతో ప్రభుత్వం ప్రచారం కోసం వ్యవసాయ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏఏ రైతుకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది అనే వివరాలు పత్రాల్లో లేవు. వ్యవసాయాధికారులే అక్కడికక్కడ రాసి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. -
ఇన్పుట్ సబ్సిడీ పరిహారం విడుదల
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్ల పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) పరిహారం విడుదలైనట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా పంపిణీ ప్రక్రియను మార్పు చేసినందున ఒకేసారి మొత్తం పరిహారం జిల్లా ట్రెజరీకి విడుదలైందన్నారు. ట్రెజరీ నుంచి ప్రిన్సిపల్ బ్యాంకులకు జమ చేయడానికి జాబితాలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. మండలాల వారీగా ఒకటికి రెండు సార్లు జాబితాలు పరిశీలించిన తర్వాత ఇన్పుట్ సెల్ అధికారులు ట్రెజరీకి సమర్పించడానికి తుది జాబితాలు రూపొందిస్తున్నారని తెలిపారు. మిస్మ్యాచింగ్లు నివారించడానికి డివిజన్ స్థాయిలో ఏడీఏలకు బాధ్యతలు అప్పజెప్పామన్నారు. 24న పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. -
ఏడీఏలకు ఇన్ పుట్ పంపిణీ బాధ్యత
అనంతపురం అగ్రికల్చర్ : ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ బాధ్యత వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏలు)కు అప్పగించారు. గతంలో వీరి భాగస్వామ్యం లేకుండా ఏవోలు కీలకంగా వ్యవహరించారు. జిల్లా స్థాయి ఇన్పుట్ సెల్ అధికారులు పర్యవేక్షించారు. మిస్‌మ్యాచింగ్ జాబితాలు పెరిగిపోవడం, వాటిని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు పరిగణనలోకి తీసుకుని ఈసారి డివిజ¯ŒS స్థాయిలోనే వీటికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ఏడీఏలకు బాధ్యత అప్పగించారు. ఆది, సోమవారం డివిజ¯ŒS ఏడీఏలు, వారి పరిధిలోని ఏవోలందరూ స్థానిక జేడీఏ కార్యాలయంలో మకాం వేసి జాబితాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో వివరాలన్నీ తెలుగులో నమోదు చేశారు. ఇప్పుడు వాటిని ట్రెజరీకి సమర్పించడానికి ఇంగ్లిష్‌లోకి మారుస్తున్నారు. అలాగే డబుల్ ఎంట్రీలు, ఒక మండలం కాకుండా ఇతర మండలాల్లోనూ భూములున్న వారి పేర్లు ఆధార్‌తో అనుసంధానం చేసి తీసివేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో తొలివిడతగా పరిహారం విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
సరికొత్త "డ్రామా'!
– ప్రతిపాదనల మేరకే ఇన్పుట్, ఇన్సూరెన్స్ నిధులు – అదనంగా అర్ధ రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం – ఎప్పుడూ లేనివిధంగా ఇన్‌పుట్‌తో ఇన్సూరెన్స్ ముడిపెట్టి భారం తగ్గించుకోవాలని భావించిన వైనం – న్యాయపరంగా చిక్కులు తప్పవని వెనక్కి తగ్గిన చంద్రబాబు – కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందన్న భయంతో యథావిధిగా పరిహారం – సర్కారు ఏదో ఘనకార్యం చేసినట్లు అధికార పార్టీ హడావుడి (సాక్షిప్రతినిధి, అనంతపురం) - జిల్లాలో 6,25,050 మంది వేరుశనగ రైతులు, వారి తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిసి బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.280 కోట్ల ప్రీమియం చెల్లించారు. పంట నష్టపోయినందుకు రూ.419 కోట్ల బీమాను కంపెనీ రైతులకు చెల్లిస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. - 2016 ఖరీఫ్‌లో వేరుశనగ, ఇతర పంటలు వేసిన రైతులు రూ.3,700 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల దాకా నష్టపోయారు. ప్రభుత్వం కేవలం రూ.1,032.69 కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరించింది. తక్కిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇన్పుట్ విషయంలో ఇది ఏటా జరిగే తంతే. జిల్లా రైతులకు ప్రభుత్వం అదనంగా చేసిందేమీ లేదు. అయినా ప్రభుత్వం ఏదో పెద్ద సాయం చేసినట్లుగా ‘డ్రామా’ను రక్తికట్టించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కొన్నేళ్లుగా నిబంధనల మేరకు పరిహారం ఎలా వస్తోందో ఈసారీ అలాగే వచ్చింది. ఇంకా చెప్పాలంటే రైతులకు వాటిల్లిన నష్టంతో పోలిస్తే చాలా తక్కువ పరిహారమే మంజూరైంది. కరువు రైతులను ఆదుకోవడం, పరిహారం చెల్లించడమనే విషయాలను ప్రభుత్వం మానవీయకోణంలో చూడాలి. కానీ ఇందులోనూ రాజకీయ కోణంలోనే చూసింది. ఆర్థికంగా భారం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో పరిహారం విషయంలో చరిత్రలో ఎప్పుడూలేని అసంబద్ధ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటనలతో పాటు అధికారులు జీవోలు కూడా విడుదల చేశారు. అయితే.. రెండు విషయాల్లో తప్పులు చేశారు. ఈ రెండు ఆధారాలతో రైతులు న్యాయపోరాటం చేస్తే, ప్రభుత్వం కోర్టుమెట్లెక్కక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి విధిలేని పరిస్థితుల్లో గతంలో మాదిరిగానే ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నారు. సర్కారు చేసిన తప్పిదాలు ఇవే.. ఇన్సూరెన్స్ డబ్బుపై సర్కారుకు హక్కు ఉండదు. పరిహారాన్ని సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ సీఎం చంద్రబాబు కొన్ని నెలలుగా హెక్టారుకు రూ.15 వేలకు మించకుండా ఇన్సూరెన్స్ లేదా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,620 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ జీవో 67 జారీ చేసింది. ఇందులో రూ.1,032.69 కోట్లు జిల్లావాటా. ఈ మొత్తంలో 50 శాతం అంటే రూ.516 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మరో రూ.516 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ వాతావరణ బీమా సొమ్ము రూ.419 కోట్లు, ఫసల్ బీమా సొమ్ము రూ.37 కోట్లు.. మొత్తం రూ.456 కోట్లను రాష్ట్రవాటాలో కలిపి, తక్కిన రూ.60 కోట్లను ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని భావించింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై విపక్షాలు, రైతుసంఘాలు కూడా మండిపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు చేస్తూ ఆయా జిల్లాల వ్యవసాయశాఖ జేడీలకు మెమోలు విడుదల చేసింది. హెక్టార్‌కు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని, ఇందులో ఇన్సూరెన్స్ పోగా మిగిలిన మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చెల్లించాలని పేర్కొంది. బీమా సొమ్ముపై హక్కును కాలరాస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసి తప్పిదానికి పాల్పడింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు కోర్టుకు వెళితే సర్కారుకు చిక్కులు తప్పవు. అలాగే రాయదుర్గంలో రూ.1,032.69 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెక్కును ముఖ్యమంత్రి విడుదల చేశారు. అంటే బీమాతో సంబంధం లేకుండా ఆ మేర మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి విడుదల చేసినట్లన్నమాట! ఈ క్రమంలో బీమా సొమ్ముకు, ఇన్పుట్ సబ్సిడీకి లింకు పెడితే రూ.1,032 కోట్ల నిధులు ఏమయ్యాయనే అంశంపైనా రైతులు కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వానికి కచ్చితంగా తిప్పలు తప్పవు. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు కూడా నివేదించారు. దీంతో సీఎం చంద్రబాబు హడావుడిగా మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. కుటుంబరావుతో పాటు వ్యవసాయాధికారులు, న్యాయనిపుణులతో చర్చించారు. ప్రభుత్వం చేయాలనుకున్నదే పొరపాటని, పైగా దీనికి మెమో, చెక్కు విడుదల ద్వారా ప్రభుత్వమే ఆధారాలు ఇచ్చినట్లయ్యిందని, రైతులు కోర్టును ఆశ్రయిస్తే వారే గెలుస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని ఎప్పటిలాగే విడుదల చేసింది. అధికార పార్టీ ఆర్భాటం వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు జిల్లాకు ఏదో ఘన కార్యం చేశారని, రైతులను ఆదుకున్నారనే కోణంలో అధికార పార్టీ నేతలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జిల్లాలో ‘రైతు కృతజ్ఞత యాత్రలు’ చేపడతామని మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రకటించారు. చంద్రబాబు పలు సందర్భాల్లో బీమా, ఇన్పుట్ సబ్సిడీ కలిపి ఇస్తామని చెప్పినప్పుడు... ఇది తప్పు అని, వేర్వేరుగా ఇవ్వాలని ఏ ఒక్కరోజూ కోరని సునీత, శ్రీనివాసులు ఇప్పుడు ప్రభుత్వం చేసిన గోరంత సాయాన్ని..కొండంతగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. -
- ఇన్పుట్ సబ్సిడీ జాబితా విడుదల
కనగానపల్లి టాప్.. హిందూపురం లాస్ట్ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ తయారు చేసిన పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) జాబితా విడుదలైంది. పరిహారం కేటాయింపులో కనగానపల్లి మండలం అగ్రస్థానంలో ఉండగా.. హిందూపురం చివరిస్థానంలో నిలిచింది. గత ఏడాది 7.63 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో 6.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 1.53 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు ఉన్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల 90 శాతం పంటలు నిలువునా ఎండిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నట్లు పంట కోత ప్రయోగాల్లోనూ రుజువైంది. కరువు పరిస్థితుల అధ్యయనానికి ఈ ఏడాది జనవరిలో కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించింది. పంటలు దారుణంగా దెబ్బతినడంతో జిల్లా రైతులకు రూ.1,175 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కలెక్టర్ కేంద్ర బృందానికి నివేదించారు. కేంద్రం తన వాటా పరిహారాన్ని మూడు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌తో ముడిపెట్టి ఇవ్వాలని భావించింది. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చివరకు వెనక్కి తగ్గింది. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ వేర్వేరుగా ఇస్తామని ప్రకటించి.. ఎట్టకేలకు జాబితాలు విడుదల చేసింది. తుది పరిశీలన తర్వాత అన్ని రకాల పంటలు 7,17,235 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు పరిగణించి 6,25,053 మంది రైతులకు రూ.1,032.42 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో కనగానపల్లి మండలంలో 17,683 మంది రైతులకు గానూ అత్యధికంగా రూ.37.80 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా హిందూపురం మండలంలో 6,362 మంది రైతులకు రూ.4 కోట్లు కేటాయించారు. -
ప్రతిపక్షనేత దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం...
► ఇన్పుట్ సబ్సిడీ....బీమా పరిహారం మంజూరు కడప అగ్రికల్చర్: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని పంట చేతికి రాక అల్లాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఆందోళనకు సిద్ధమయ్యారు. రైతులు తిరగబడితే మన పని గోవిందా...అనుకున్న సీఎం బెంబేలెత్తి ఇన్పుట్ సబ్సిడీ, బీమా చెల్లించేందుకు అనుమతులు ఇచ్చారు. 2016–17 పంటల బీమాకు, ఇన్పుట్ సబ్సిడీకి లింకు పెట్టి ఒక దాన్ని మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివరాల్లోకి వెళితే జిల్లాకు పంట బీమా రూ.76 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూ. 44 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఏదో ఒకటే రైతులకు చెల్లించేదని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై స్పష్టమైన జాబితా తయారు చేసి రైతులకు ఒక్కటే చెల్లించాలని జిల్లాలోని వ్యవసాయాధికారులను, బ్యాంకర్లను ఆదేశించింది. దీనిపై సాక్షి దినపత్రికలో కథనాలువచ్చాయి. దీనిపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా వీరపునాయునిపల్లె మండలంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.76 కోట్లు, బీమా రూ.44 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయకపోతే కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో సీఎం చంద్రబాబు వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్పుట్ సబ్సిడీ రూ.76 కోట్లు....వాతావరణ బీమా రూ.44 కోట్లు జిల్లాలో 2016 ఖరీఫ్ సీజన్లో వర్షాభావం వల్ల వేరుశనగ,వరి, జొన్న, సజ్జ, ఆముదం, కంది, మినుము,పత్తి తదితర 9 రకాల పంటలను సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో దిగుబడులు రాకుండా ఎండి పోయాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నివేదికలను తయారు చేసి రూ.76 కోట్ల పంట నష్టం సంభవించిందని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. దీనిఇ ఆధారంగా ఇన్పుట్ సబ్సిడీ (పంటనష్ట పరిహారం) మంజూరైంది. 22 నుంచి రైతు ఖాతాలకు జమ.. జిల్లాలో వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమాను ఈనెల 22వ తేదీ నుంచి జమ చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి ఠాకూర్ నాయక్ తెలిపారు. ప్రతి రైతు ఖచ్చితంగా ఆధార్‌కార్డు బ్యాంకుల్లో సమర్పించాలని అన్నారు. గతంలో ఇవ్వని రైతులు మాత్రమే కార్డులు ఇచ్చి నమోదు చేయించుకోవాలని సూచించారు. -
ఇది ప్రతిపక్షం విజయం: అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం: ప్రతిపక్ష, విపక్ష పార్టీల ఉద్యమం ఫలితంగానే వాతావరణ బీమా, ఇన్పుట్ సబ్సిడీ వేర్వేరుగా అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అంతే తప్ప ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇన్పుట్ సబ్సిడీపై సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8.50 లక్షల హెక్టార్లకు రైతులతోపాటు ప్రభుత్వాలు రూ.280 కోట్లు ప్రీమియం చెల్లిస్తే 6 లక్షల హెక్టార్లకు రూ.419 కోట్లు బీమా పరిహారం అందించడం దారుణమన్నారు. మిగతా 2.50 లక్షల హెక్టార్లకు బీమా ప్రీమియం చెల్లించినా బీమా కంపెనీలు పరిహారం వర్తింపజేయకుండా రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరవు రైతులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ, కరుణ ఉన్నా రూ.1451 కోట్లను ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. న్యాయబద్ధగా జిల్లా రైతులకు రావాల్సిన సొమ్ము (ఇన్పుట్, బీమా) రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ఏటా లక్షల్లో పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాయితీలు అందిస్తున్నామని ప్రకటించుకోవడమే తప్ప వాటిని రైతులకు ఇవ్వడంలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ జూన్ 9న ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారని, 14లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారని చెప్పారు. రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని, రైతులకు డబుల్ ధమాకా అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. -
ఎగసాయం
► అన్నదాత ప్రయోజనాలకు తూట్లు ► ఇన్పుట్ సబ్సిడీ, పీఎంఎఫ్‌బీవై, వాతావరణ బీమాల్లో ఏదో ఒక్కటే.. ► కరువు రైతులకు తీరని అన్యాయం ► ప్రభుత్వ తీరుతో సర్వత్రా విస్మయం ► బీమా సొమ్ముతో ఖజానా నింపుకునే కుట్ర ► ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు, రైతు సంఘాలు కష్టాల్లోని రైతులను ఆదుకోవాల్సిన కనీస ధర్మం ప్రభుత్వానిది. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఊరట కల్పించలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత నోటికందాల్సిన సాయం విషయంలోనూ సర్కారు కుట్ర పన్నింది. మూడు రకాల పరిహారం విషయంలో ఒక్కటే వర్తింపజేసి ఆ నిధులను నొక్కేసే ప్రయత్నం చేస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఇన్పుట్ సబ్సిడీ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా.. వాతావరణ బీమా.. వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు దక్కాల్సిన సొమ్ముతో సొంత ఖజానా నింపుకునేందుకు కుట్ర పన్నింది. 2016లో ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో 10 మండలాల్లో కరువు లేదని అధికారులు తేల్చారు. 26 మండలాల్లోనే అనావృష్టి ప్రభావంతో పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక సిద్ధం చేశారు. ఈ మండలాలకు పెట్టుబడి రాయితీ కింద(ఇన్పుట్ సబ్సిడీ) రూ.325 కోట్లు మంజూరయ్యాయి. 2,50,128.68 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా.. 3,10,766 మంది రైతులు నష్టపోయారు. ఇదిలాఉంటే త్వరలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం కూడా విడుదల కానుంది. అయితే రైతుల సంక్షేమం, అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నామని గొప్పలు చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతుల నోటికాడి సొమ్ము లాగేస్తోంది. మూడింట్లో ఏదో ఒక్కటి మాత్రమే వర్తింపజేస్తామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న అన్నదాతకు ఈ చర్య మింగుడు పడటం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికి విడుదలవుతుందో తెలియకపోయినా.. ఈనెల 19 నుంచి కరువు మండలాల్లో రైతులకు అందుకు సంబంధించిన పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మండలాల వారీగా ఏఏ రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పరిహారం వచ్చిందనే విషయాలపైనా వ్యవసవయాధికారులు ఆరా తీస్తున్నారు. ఒక రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు, ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ బీమా పరిహారం వచ్చినట్లయితే.. వీటిలో ఏది ఎక్కువుంటే ఆ ఒక్కదానినే రైతులకు చెల్లించనున్నారు. ఇదే జరిగితే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రైతుల్లో ఆందోళన గత ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు వాతావరణ బీమా కింద రూ.41కోట్లు విడుదల కానుంది. గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకులు రూ.2870.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశాయి. జూలై 31లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారందరికీ నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తిస్తుంది. వరికి గ్రామం యూనిట్‌గా బీమా కల్పించారు. వరికి సంబంధించి ఆగస్టు 31 వరకు బ్యాంకుల నుంచి పంట రుణాలు చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. ఈ ప్రకారం దాదాపు 2 లక్షల మందికి బీమా వర్తించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఏదో ఒక్కటి మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతుల ఆందోళన అంతా, ఇంతా కాదు. బీమా సొమ్ముపై ప్రభుత్వం కన్ను బీమా పొందాలంటే రైతులు ముందుగా ప్రీమియం చెల్లిస్తారు. ఇది రైతుల వ్యక్తిగతం. బీమా పరిహారం పొందడం రైతుల హక్కు. అయితే ఈ బీమా కింద రైతులకు వచ్చే పరిహారంపై ప్రభుత్వం కన్నేసింది. కరువు రైతులకు ఎలాగూ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం కదా.. మళ్లీ బీమా ఎందుకు అంటూ ఏదైనా ఒక్కటి మాత్రమే అనే షరతు పెట్టింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తే ఏది ఎక్కువగా ఉంటే దానిని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం తమ ఖజానాకు మళ్లించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఏదో ఒక్కటి మాత్రమే చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా వివరాలను మండలాలకు పంపి ఏదైనా ఒక్కటే అనే నిబంధనను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. రైతుల హక్కులను హరించడం దారుణం బీమా అనేది రైతుల హక్కు. ముందుగా ప్రీమియం చెల్లిస్తే పంటలు దెబ్బతిన్నప్పుడు పరిహారం లభిస్తుంది. అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నపుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇన్పుట్ సబ్సిడీ పొందడం కూడా రైతుల హక్కే. ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోంది. రైతుల దక్కాల్సిన సాయాన్ని నొక్కేయాలనుకోవడం క్షమించరాని విషయం. – ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, సీపీఎం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఇవ్వాల్సిందే.. రైతులు వరుస కరువులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం దారుణం. ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తే రెండూ ఇవ్వడం కోనేళ్లుగా జరుగుతోంది. 2016 కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, బీమాల్లో ఏదో ఒక్కటే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం తగదు. ప్రభుత్వం రైతుల సొమ్ముకు ఎసరు పెట్టడం అన్యాయం. దీనిపై పోరాటం చేస్తాం. – జగన్నాథం, రైతు సంఘం జిలా కార్యదర్శి -
19 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం జిల్లాకు రూ.325 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. ముందుగా 26 మండలాల్లో ఏ రైతుకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది.. తదితర వివరాలతో పత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేస్తారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అయితే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ భీమా పరిహారాలు వస్తే ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దానిని మాత్రమే ఇస్తారు. -
ఎందుకంత వివక్ష?
విజయనగరం ఫోర్ట్: కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మం డలాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయి తీ) పేరుతో ఆర్థిక సాయం అం దివ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కు ఆ నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వీటిని కొన్ని జిల్లాలకు విడుదల చేసి... ఈ జిల్లాను విస్మరించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని ఆరు మండలాల్లో కరువు ఏర్పడింది. ప్రభుత్వం సైతం గంట్యాడ, విజయనగరం,మెంటాడ, దత్తిరాజేరు, కొత్తవలస, వేపాడ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో 2108.5 హెక్టార్లకు చెందిన 73.057మంది రైతులకు రూ.3.16 కోట్లు నిధులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇలా విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోగల 300కు పైగా మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇటీవల అధికశాతం మండలాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసింది. కాని విజయనగరం జిల్లాకు మాత్రం విడుదల చేయలేదు. దీంతో రైతులు ఇదేం తీరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన విజయనగరం జిల్లాకు నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం తగదని వాపోతున్నారు. 10 నెలలుగా ఎదురు చూపులు ప్రకృతి సహకరించక ఆరు మండలాల రైతాంగం ఎంతో నష్టాన్ని చవిచూసింది. కనీసం ఆదుకోవాల్సి సర్కారు సాయం అందివ్వడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. మళ్లీ ఖరీఫ్ వచ్చేస్తోంది. రైతాంగం సాగుజూదానికి సమాయత్తమవుతోంది. గడచిన పది నెలలుగా రైతులు వాటికోసం ఎదురుచూస్తున్నా... సర్కారులో చలనం లేదు. దీనిపై వ్యవసాయ శాఖ డెప్యూటీ డైరెక్టర్ అప్పలస్వామివద్ద సాక్షి ప్రస్తావించగా జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ ని«ధులు ఇంతవరకు విడుదల కాని మాటవాస్తవమేనని తెలిపారు. అవి రాగానే అందజేస్తామని పేర్కొన్నారు. -
ఆ 5 మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): 2014 కరువుకు సంబంధించి ఆదోని డివిజన్లోని 5 మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ రూ. 73,24,66,426 విడుదలయ్యాయి. ఇటీవలనే ప్రభుత్వం జీఓ విడుదల చేయగా నిధులు విడుదల చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంటు, ట్రెజరీ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. మండల వ్యవసాయాధికారులు ఇన్పుట్ సబ్సిడీ బిల్లులు తయారు చేసి ట్రెజరీలకు పంపుతారు. ట్రెజరీలో క్లియర్ అయి బ్యాంకుకు వెళితే అక్కడి నుంచి పెట్టుబడి రాయితీ రైతుల ఖాతాలకు జమ అవుతుంది. ఆలూరు మండలానికి రూ.11,56,74,200, చిప్పగిరి మండలానికి రూ.5,22,20,150, పత్తికొండ మండలానికి రూ.14,06,66,939, తుగ్గలి మండలానికి రూ.19,94,95,337.5, దేవనకొండ మండలానికి రూ.22,44,09,800లు విడుదల అయ్యాయి. కాగా 2016 కరువుకు సంబంధించి జిల్లాలోని 26 మండలాలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే నిధులు విడుదల చేయాల్సి ఉంది. -
ఇన్పుట్ సబ్సిడీ మంజూరు
- ఏడు జిల్లాలకు రూ.1,680.05 కోట్లు -ఒకట్రెండు రోజుల్లో తేలనున్న ‘అనంత’ వాటా - వాతావరణ బీమాతో ఇన్పుట్కు లింకు అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ -2016లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు... ఈ ఏడు జిల్లాలకు సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.1,680.05 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ (ప్రకృతి విపత్తుల విభాగం) కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు జీవో 67 విడుదల చేశారు. ఏడు జిల్లాల పరిధిలో 12.21 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో 13.21 లక్షల మంది రైతులకు రూ.1,680.05 కోట్లు మంజూరు చేశారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన రైతుల బ్యాంకు ఖాతాలకు పరిహారం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లాల వారీగా వాటా ఎంతనేది ప్రకటించలేదు. కాగా.. జిల్లాలో 7.17 లక్షల హెక్టార్లలో వేరుశనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని, 6,25,050 మంది రైతులకు రూ.1,032.69 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం మొత్తం విడుదల చేశారా, లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశముంది. ఇన్పుట్కు, ఇన్సూరెన్స్‌కు లింకు మంజూరు చేసిన ఇన్‌పుట్‌సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారనేది అధికారులు చెప్పడం లేదు. వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాల కింద విడుదలైన పరిహారానికి, ఇన్‌పుట్‌సబ్సిడీకి లింకు పెట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతుకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున గరిష్టంగా రెండు హెక్టార్లకు రూ.30 వేలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టిన నేపథ్యంలో మొదట బజాజ్ అలయంజ్ కంపెనీ నుంచి వాతావరణ బీమా మొత్తాన్ని విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తే, ఆ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలవుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా వాతావరణ బీమా పరిహారం ఏ రైతు ఖాతాలో ఎంత జమ అయ్యిందనే వివరాలు తెలిస్తే కానీ ఇన్పుట్ సబ్సిడీ ఎంతివ్వాలనేది అర్థం కాదని అంటున్నారు. మరోవైపు పంట కాలం ముగిసి 2017 ఖరీఫ్‌లో అడుగుపెట్టినా బజాజ్ అలయంజ్ సంస్థ వాతావరణ బీమా పరిహారం ఎంత, ఎంత మందికి, ఎన్ని హెక్టార్లకు వర్తించిందనేది ప్రకటించకుండా జాప్యం చేస్తోంది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు రూ.367 కోట్ల వాతావరణ బీమా మంజూరైనట్లు ప్రకటించారు. ఇటీవల అది రూ.434 కోట్లకు పెరిగిందని చెబుతున్నా.. అధికారికంగా విడుదలకు నోచుకోలేదు. మొత్తమ్మీద పరిహారాన్ని ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా రైతులకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారుల్లో గుబులు రేగుతోంది. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏలు) సమావేశమై పంపిణీ మార్గాలను అన్వేషించే అవకాశముంది. మరోవైపు ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వంపై ఉద్యమించడానికి విపక్షాలు, రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. -
అదనులో అందేనా?!
జూన్ 2 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన ఇప్పటి వరకూ జిల్లాకు చేరని పరిహారం వివరాలు రూ.1,032.69 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.82.34 కోట్లు మాత్రమే ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రైతులకు అన్యాయం! ప్రభుత్వ మోసపూరిత చర్యలతో అన్నదాతలకు రూ.434 కోట్ల మేర నష్టం ముందస్తు వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో పెట్టుబడి కోసం అవస్థలు పడుతున్నారు. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందజేయలేదు. ఖరీఫ్‌లో రైతులు పంటసాగుకు సిద్ధమయ్యేలోపు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల పామిడి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా అధికారులు రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.82.34 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోనుంది. గడిచిన ఖరీఫ్(2016)లో జిల్లా రైతులు 6.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున వెచ్చించారు. వర్షాభావం కారణంగా పంట తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే కంది, జొన్న, పత్తి తదితర పంటల ద్వారా మరో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. మొత్తమ్మీద రైతులకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం వివరాలను తెప్పించుకుని రూ.1,070 కోట్లతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. చివరకు రూ.1,032.69 కోట్లతో తుది నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇందులో రూ.516.345 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రం కూడా ఈ మేరకు కేటాయించాలి. కానీ రూ.82.34 కోట్లను మాత్రమే ఇస్తోంది. తక్కిన రూ.434 కోట్లను ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఇన్çపుట్‌సబ్సిడీ లెక్కల్లో కలిపి అందజేయనుంది. ఈ మోసపూరిత చర్యతో రైతులకు రూ.434కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ బీమా కింద వేరుశనగకు రూ.367 కోట్లు, ఇతర పంటలకు రూ.67కోట్లు మంజూరైంది. ఈ సొమ్ముపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. అయినా ఇన్పుట్లో కలిపేసి రైతులను దగా చేస్తోంది. దీనివల్ల 6,25,050 మంది వేరుశనగ, 3,635 మంది ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అన్యాయం జరగనుంది. చరిత్రలో తొలి మోసం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో వేటికవే లెక్కలు కట్టి ప్రభుత్వాలు రైతులకు అందజేసేవి. చరిత్రలో తొలిసారిగా రైతులకు, బీమా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చింది. తనకు ఏమాత్రమూ సంబంధం లేని సొమ్మును సొంతమన్నట్లు భావించి రైతులను దగా చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రెండింటినీ కలిపి లెక్కగట్టి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఇదే! ఖరీఫ్ మొదలైనా... ఏప్రిల్‌లో పామిడికి విచ్చేసిన చంద్రబాబు ఖరీఫ్ మొదలయ్యేలోపు పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తున్నారు. రైతులు విత్తనకాయలు కొనుగోలు చేస్తున్నారు. కళ్యాణదుర్గంతో పాటు పలుచోట్ల పొలాల్లో విత్తు కూడా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు అందలేదు. నిజానికి గతేడాది అక్టోబరు 10లోపే ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు అందజేయాలి. ఈ సొమ్మును బజాజ్ అలయంజ్ కంపెనీ అక్టోబరులోనే జమ చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండా ప్రభుత్వమే పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు గతేడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయం. జూన్ 2 నుంచి పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ మొదటి విడతలో ఎంత మొత్తాన్ని, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నారు? ఎప్పటిలోగా జమ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లంకెపెట్టి పరిహారం పంపిణీ చేస్తే వెంటనే పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. రూ.1,032 కోట్లతో అధికారులు పంపిన నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఇన్సూరెన్స్ సొమ్మును ఇందులో కలపడం వంటి రికార్డులను పూర్తిస్థాయిలో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తామని పలువురు రైతులు ‘సాక్షి’తో తెలిపారు. వ్యవసాయాధికారులు, జిల్లా కీలక అధికారులు, ప్రభుత్వాన్ని కేసులో చేరుస్తామని చెబుతున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ విడుదల
- 2014 సంవత్సరంలో పంట నష్టం - ఐదు మండలాలకు రూ.73,24,66,362 విడుదల కర్నూలు(అగ్రికల్చర్): 2014 సంవత్సరంలో ఎంపికైన కరువు మండలాలకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో 82,058 మంది రైతులు 75,515.26 హెక్టార్లలో పంటలు కోల్పోయారు. వీరికి పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.73,24,66,362 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ పరిహారాన్ని గత ఏడాదే విడుదల చేయగా, ట్రెజరీలో బిల్లులు ల్యాప్స్ అయ్యాయి. ఇందువల్ల ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. -
నివేదికలతో సరి !
- అతీగతీలేని రూ.23.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ - 2015 నవంబర్‌లో తుపాను దెబ్బకు కుళ్లిన పంట - పట్టించుకోని అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ – 2015కు సంబంధించి రూ.23. 80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జిల్లా రైతులకు అందాల్సి ఉంది. 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ డబ్బులు మాత్రం రైతులకు అందలేదు. కనీసం ఇస్తామన్న భరోసాను కూడా అధికారులు ఇవ్వలేకపోతున్నారు. పంట కోత సమయంలో వరుసగా తుపాన్లు రావడంతో చాలా చోట్ల తొలగించిన పంట పొలాల్లోనే ఉండిపోయింది. 15 రోజుల వ్యవధిలో మూడు తుపాన్లు రావడంతో ఆ పంట బూజుపట్టి కుళ్లిపోయింది. చెనక్కాయలు రంగుమారి మొలకలు రాగా, పశుగ్రాసానికి కూడా పనికిరానంతగా చెడిపోయింది. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 2015 నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట నష్టం అంచనా వేశారు. అప్పట్లో ప్రాథమిక అంచనా ప్రకారం 45 మండలాల పరిధిలో 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేశారు. అయితే పంట నష్టం అంచనా వేసిన బృందాలు చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 33 మండలాల పరిధిలో 16,311 హెక్టార్లలో పంట దెబ్బతినడంతో రూ.23.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. అదే నివేదికను ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు పంపారు. కానీ... ఇప్పటివరకు దాని గురించి పట్టించకున్న నాథుడే కరువయ్యారు. రూ.23.80 కోట్ల ఇన్పుట్ నివేదిక ఒకటుంది... అది విడుదలయ్యేలా చూద్దామన్న ఆలోచన కూడా ఎవరికీ రాకాపోవడం విశేషం. 2015లో పంట పండినట్లు జిల్లా నుంచి నివేదిక పంపడంతో వేరుశనగ రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరుకాని పరిస్థితి నెలకొంది. కనీసం తుపాను ధాటికి దెబ్బతిన్నట్లుగా పంపిన రూ.23.80 కోట్లు అయినా మంజూరు చేస్తే 15 వేల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది. అతలాకుతలం చేసిన తుపాను వాస్తవానికి 2015 నవంబర్‌లో వేరుశనగ పంట తొలగించే సమయంలో సంభవించిన తుపానుతో వేరుశనగతో పాటు పత్తి, పెసర తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నెల రోజుల పాటు విరామం లేకుండా వర్షాలు కురవడంతో కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలో మెజార్టీ మండలాలు తడిసిముద్దయ్యాయి. దీంతో తొలగించిన వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయింది. పంట తొలగించని ప్రాంతాల్లో కూడా మొలకలు రావడంతో రైతులకు భారీగానే నష్టం జరిగింది. మిగతా పంటలను పూర్తిగా పక్కనపెట్టి కంటితుడుపుగా కేవలం వేరుశనగ పంటకు మాత్రమే ఇన్పుట్ ప్రతిపాదనలు పంపారు. దెబ్బతిన్న పంట పొలాలను అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి కుళ్లిన పంటను చూసి చలించిపోయారు. తక్షణం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చి 18 నెలలైనా పైసా కూడా విదల్చకపోవడం గమనార్హం. -
ఇన్‌పుట్‌పై అదేమాట
– ఇన్సూరెన్స్ లేదా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని సీఎం పునరుద్ఘాటన – ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు ద్వారా ఏపీ ఖజానాపై భారం రూ.45 కోట్లు మాత్రమే – తక్కిన మొత్తం బజాజ్ కంపెనీ, కేంద్రం వాటానే – ‘అనంత’ పర్యటనలో చంద్రబాబు ప్రకటనతో సుస్పష్టమైన పరిహారం లెక్కలు – కరువు జిల్లాపై కనికరం చూపని సీఎం (సాక్షిప్రతినిధి, అనంతపురం) ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి ‘అనంత’ రైతులకు ఉన్న అవగాహన రాష్ట్రంలోని మరే జిల్లా రైతులకూ ఉండదు. ఎందుకంటే జిల్లాలో ఏటా పంటనష్టం జరుగుతోన్నా కాస్తోకూస్తో ఉపశమనం లభిస్తోంది వీటివల్లే! అయితే.. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ‘అనంత’ రైతులను నిలువునా మోసం చేస్తోంది. కరువు దెబ్బకు విలవిలలాడిపోతున్న అన్నదాతలపై ఏమాత్రమూ కనికరం చూపడం లేదు. ఇన్సూరెన్స్ అనేది ఓ కంపెనీకి సంబంధించిన వ్యవహారం. మనం స్కూటర్కొని ఇన్సూరెన్స్ చేస్తాం. ప్రమాదం జరిగితే సదరు కంపెనీ మనకు పరిహారం చెల్లిస్తుంది. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. వాతావరణ బీమాలోనూ ఇదే వర్తిస్తుంది. రైతులు బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం చెల్లించారు. పంట నష్టపోతే ఆ కంపెనీ పరిహారం ఇస్తుంది. అయితే.. బీమా పరిహారాన్ని కూడా తామే ఇస్తున్నట్లు చంద్రబాబు ‘అనంత’ రైతులను మోసం చేస్తున్నారు. 2016 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1,070 కోట్ల మేర పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ.6వేల చొప్పున పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 535 కోట్లు విడుదల చేయనుంది. తక్కిన రూ.535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా విడుదల చేయాలి. ఇదిలావుండగా, బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.367 కోట్ల ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది.అయితే.. తాజాగా అన్ని పంటలకూ కలిపి రూ.450 కోట్ల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్లు తెలిసింది. కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చే రూ.535 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రూ.450 కోట్లు కలిపితే రూ.985 కోట్లు అవుతుంది. సీఎం చంద్రబాబు మాత్రం పామిడిలో గురువారం జరిగిన బహిరంగ సభలో తాము జిల్లా రైతులకు పరిహారం రూపంలో రూ.1,030 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రం, బజాజ్ కంపెనీ ఇచ్చే రూ.985 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.45కోట్లు కలిపి.. మొత్తం రూ.1,030 కోట్లు రైతులకు ఇవ్వనున్నారు. అయితే..అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్నట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు. ‘అనంత’ చరిత్రలో ఇప్పటి వరకూ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీకి లంకెపెట్టి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేసే మొట్టమొదటి ప్రభుత్వం ఇదే అవుతోందని ప్రతిపక్షాలు, రైతుసంఘాలు దుయ్యబడుతున్నాయి. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిహారంపై పామిడి సభలో చంద్రబాబు ఏదైనా ప్రకటన చేస్తారని రైతులు ఆశించారు. వారి ఆశలను సీఎం అడియాసలు చేశారు. పేరూరు, బీటీపీలను ఈ ఏడాదే పూర్తి చేస్తాం : సీఎం సీఎం చంద్రబాబు గురువారం నీరు–ప్రగతి ఉద్యమం రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం కోసం పామిడికి వచ్చారు. నీరు–ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆపై స్టాళ్లను సందర్శించారు. తర్వాత స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువను కర్నూలు జిల్లా ముచ్చుమర్రి నుంచి జీడిపల్లి వరకూ మొదటి విడతలో వెడల్పు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను పాత, కొత్త కలెక్టర్లు శశిధర్, వీరపాండ్యన్‌లకు అందించారు. పేరూరు, బీటీ ప్రాజెక్టు పనులను కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు రూ.1030 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటసాగు చేసే సమయానికి ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గుత్తి నియోజకవర్గంలో 12 చెరువులకు నీళ్లు అందించేందుకు రూ.40కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కసాపురంలో టూరిజం సర్క్యూట్‌కు మరో రూ.20కోట్లు కేటాయిస్తామన్నారు. పామిడి, గుత్తిలో డిగ్రీకాలేజీల ఏర్పాటు, గుంతకల్లులో పాలిటెక్నిక్ కాలేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ముఖ్యమంత్రి వద్ద ఏకరువు పెట్టారు. అన్నీ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సభ అనంతరం నేరుగా అనంతపురం చేరుకుని కేటీఆర్ కళ్యాణమంటపంలో నీటిసంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. నీటి ఆవశ్యకత, సంరక్షణపై ప్రసంగించారు. ఆపై శిల్పారామాన్ని ప్రారంభించారు. శిల్పారామాన్ని రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన పార్కులా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్కడి నుండి నేరుగా పుట్టపర్తికి చేరుకుని తిరుగుపయనమయ్యారు. పర్యటనలో మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, నారా లోకేశ్, విప్ యామినీ బాల, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, తిప్పేస్వామి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీని సర్కార్ ఎగ్గొట్టింది
అమరావతి : రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎండగట్టారు. ఎన్నికల హమీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి 2016 వరకూ మొత్తం రూ. 8వేల కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం రూ. 1,546 కోట్లు మాత్రమేనని... మిగిలిన రూ.6,400 కోట్ల సంగతేంటని వైఎస్ జగన్ నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆయన అన్నారు. తుపానులు, కరువుల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...గత పదేళ్ల కాలం నాటి సంగతలు ఎత్తుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఎనిమిదేళ్లు అయిందని, అలాంటిది అప్పట్లో ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతోందని అన్నారు. 2014-16కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. -
‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సర్కార్ ఎగ్గొట్టింది’
అమరావతి : రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎండగట్టారు. ఎన్నికల హమీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి మొత్తం రూ. 8వేల కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం రూ. 1500కోట్లు మాత్రమేనని... మిగిలిన రూ.6వేల 400 కోట్ల సంగతేంటని వైఎస్ జగన్ నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆయన అన్నారు. తుపానులు, కరువుల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...గత పదేళ్ల కాలం నాటి సంగతలు ఎత్తుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఎనిమిదేళ్లు అయిందని, అలాంటిది అప్పట్లో ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతోందని అన్నారు. 2014-16కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. -
‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సర్కార్ ఎగ్గొట్టింది’
-
రూ.1,075 కోట్లు
- ఇన్పుట్ సబ్సిడీ నివేదిక సిద్ధం - దెబ్బతిన్న పంట ఉత్పత్తుల విలువ రూ.2,874 కోట్లు - 7.22 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తుల నష్టం - కేంద్ర కరువు బృందానికి అధికారిక నివేదిక సమర్పణ జిల్లాలో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 7,53,132 హెక్టార్లు దిగుబడి రాని పంట ఉత్పత్తులు : 7.22 లక్షల మెట్రిక్ టన్నులు పంటల వారీగా నష్టం విలువ : రూ.2,874.44 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు : 1,075.46 కోట్లు నష్టపోయిన రైతుల సంఖ్య : 6,93,003 మంది అందులో చిన్నసన్నకారు రైతులు : 5,71,244 మంది అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్-2016 పంట నష్టానికి సంబంధించి రూ.1,075 కోట్లతో పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర కరువు బృందం)కు సమర్పించారు. ‘అధికారిక’ నష్టమే ఈ స్థాయిలో ఉందంటే వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయనే విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పంట పెట్టుబడులు, దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటే రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుఽ అంచనా. వేరుశనగ, కంది, పత్తి, ఆముదం.. ఇలా అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతినడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నట్లు కరువు బృందానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వశాఖల నుంచి సమర్పించిన రూ.2,161.38 కోట్ల జిల్లా నివేదికలో సింహభాగం ఇన్పుట్ సబ్సిడీదే కావడం గమనార్హం. మిగతా అన్ని శాఖలకు సంబంధించి రూ.1,085.92 కోట్లు కావాలని కోరారు. మొత్తమ్మీద ఇన్పుట్ సబ్సిడీ నివేదికలో వేరుశనగ పంట నష్టం రూ.929.88 కోట్లుగా చూపించారు. మిగతా 15 పంటల నష్టం రూ.145.58 కోట్లుగా తేల్చారు. పంటల వారీగా స్కేల్‌ఆఫ్ రిలీఫ్ (నష్ట ఉపశమనం) ప్రకారం నష్టాన్ని అంచనా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పంటల వారీగా నష్టం వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––– పంట పేరు దెబ్బతిన్న విస్తీర్ణం పంట ఉత్పత్తి నష్టం ఇన్పుట్ ప్రతిపాదన (హెక్టార్లలో) ( రూ.కోట్లలో) ( రూ.కోట్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– వేరుశనగ 6,19,925 2,061.00 929.88 కంది 72,357 320.97 72.35 ప్రత్తి 31,170 367.82 46.75 ఆముదం 8,700 22.23 05.91 మొక్కజొన్న 8,744 48.22 10.93 జొన్న 4,044 03.99 02.75 పొద్దుతిరుగుడు 2,309 11.02 02.30 కొర్ర 2,082 01.34 01.04 మినుము 1,180 –– 01.18 పెసర 977 –– 97.72 లక్షలు ఉలవ 155 –– 15.56 ,, రాగి 17 –– 01.16 ,, సోయాబీన్ 582 –– 58.23 ,, సజ్జ 737 –– 50.18 ,, నువ్వులు 139 –– 09.50 ,, అలసంద 06 –– 0.63 వేలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– 16 పంటలు 7.53 లక్షల హెక్టార్లు 2,874.44 కోట్లు 1,075.46 కోట్లు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
చంద్రబాబు నియోజక వర్గంలో అక్రమాలు
-
బుకాయింపు!
అడ్రస్‌లేని వడ్డీరాయితీ, ఇన్పుట్ సబ్సిడీ రూ.81కోట్ల బకాయిలు చెల్లింపుల్లో ఉదాసీనం అయినా సర్కారు కోతలు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతను అడుగడుగునా దగా చేస్తోంది. ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు.. సబ్సిడీలన్నీ చెల్లించేస్తున్నట్టు బుకాయిస్తోంది. ఫలితంగా అన్నదాతకు వేదనే మిగులుతోంది. ఆకివీడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు బకాయి పడిపోయాయి. జిల్లాలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద రూ. 81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా వడ్డీ రాయితీని విడుదల చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలిస్తున్నా.. రైతులకు చెల్లింపులు జరగడం లేదు. రైతులు తీసుకున్న స్వల్ప, దీర్ఘ కాలిక రుణాలకు సంబంధించి మూడేళ్లుగా వడ్డీరాయితీ సొమ్ము రైతులకు అందలేదు. కేంద్రం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ సొమ్ము రాష్ట్రానికి చేరినా ఆ సొమ్ము దారి మళ్లిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీ 6 శాతం వాటా విడుదల చేయలేదు. దీంతో మూడేళ్లుగా రైతులకు వడ్డీ రాయితీ అందడం లేదు. ఇన్పుట్ సబ్సిడీదీ అదే దారి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయట్లేదు. 201314, 201415 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్టపరిహారం(ఇన్‌ఫుట్‌సబ్సిడీ)ని ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ కలిపి రూ.81కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మద్దతు ధరపైనా నిర్లక్ష్యం ఏటా సరైన మద్దతు ధర దక్కక రైతు అష్టకష్టాలు పడుతున్నాడు. ఉత్పత్తుల వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిటీ సూచించినా, కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అ«ధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినా స్పందన లేదు. వచ్చే జూన్‌లో ప్రకటించనున్న ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,800 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. వడ్డీకి వడ్డీ చెల్లిస్తారా! వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. మూడేళ్లుగా స్వల్ప కాలిక రుణాలకు, ఆరేళ్లుగా దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించాలి. ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్న ప్రభుత్వం ఆ సొమ్ముకు వడ్డీ చెల్లించాలి. ధాన్యం మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ప్రకటించాలి. మల్లారెడ్డి శేషమోహన రÆంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, అప్పారావుపేట బకాయిలు రావాలి జిల్లాలోని రైతులకు వడ్డీ రాయితీ సొమ్ము, ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రూ.81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధీర్ఘకాలిక అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఆరు శాతం వడ్డీ రాయితీ ఆరేళ్లుగా రైతులకు అందడంలేదు. ఆప్కాబ్ నుంచి జిల్లా సహకార బ్యాంక్‌కు ఆ సొమ్ము మంజూరైతే జిల్లాలోని అన్ని సొసైటీలకు జమ చేస్తాం. వి.వి.ఫణికుమార్, సీఈవో, జిల్లా సహకార బ్యాంక్, ఏలూరు -
ఇన్పుట్ సబ్సిడీ ఔట్
ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో గోల్మాల్ పరిహారం సొమ్మును పంచేసుకున్న వైనం నిజమైన అన్నదాతలకు మళ్లీ మొండిచెయ్యే.. రైతుల కష్టాన్ని కరువు కాటేసింది. సరే కదా అని ఇన్పుట్ సబ్సిడీతో తమ ఇక్కట్లను కొద్దిగానైనా తీర్చుకుందామంటే అధికారులు గద్దల్లా ఎగరేసుకుపోయారు. అనర్హుల పేర్లతో వివరాలు నమోదు చేసి నిజంగా నష్టపోయిన అన్నదాతలకు అంతులేని ఆవేదనను మిగిల్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో రైతులు దోపిడీకి గురవుతున్న తీరు ఇది. శాంతిపురం: శాంతిపురం మండలంలోని 60 రెవెన్యూ గ్రామాల్లోని 3,793 మంది రైతులకు 2015 ఖరీఫ్‌లో వేరుశనగ నష్టపోయినందుకు రూ .1.60 కోట్ల పరిహారం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. రైతులందరికీ గరిష్టంగా రూ. 6 వేలు మాత్రమే పరిహారానికి వీఆర్వోలు సిఫార్సు చేయడంతో ఆ మేరకే మంజూరయ్యింది. చాలా మంది బాధిత రైతులకు రూ. 1,250 నుంచి రూ.3,900 వచ్చేలా చేశారు. కానీ కొందరు వీఆర్వోలు ముందస్తు ఒప్పందాలతో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో ఎంపిక చేసుకున్న దాదాపు 55 మంది పేర్లతో రూ. 12 లక్షల వరకు దిగమింగారు. గుండిశెట్టిపల్లి, ఎంకే పురం, చిన్నగాండ్లపల్లి, ఎం.శాంతంపల్లి, సొన్నేగానిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో మాత్రం ఎంచుకున్న వారికి భారీగా ఇన్పుట్ సబ్సిడీ మంజూరయ్యేలా చేశారు. పూర్తిగా భూమి లేకున్నా, పది సెంట్లలోపే ఉన్నా వారితో బేరాలు కుద్చుకుని ఒక్కొక్కరికి ఏకంగా రూ. 27 వేల వరకూ ఇన్పుట్ సబ్సిడీ నమోదు చేయడంతో ప్రభుత్వం ఆయా మొత్తాలను విడుదల చేసింది. డబ్బులు ఖాతాలోకి రాగానే ముందస్తు ఒప్పందాల ప్రకారం రైతుల ఖాతాల నుంచి అధికారులు సొమ్మును రాబట్టుకున్నారు. ఈ వ్యవహారం మీడియా దృష్టిలో పడడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించి ంది. వారం నుంచి పలువురు రైతుల ఖాతాలకు మళ్లీ సొమ్మును జమ చేస్తున్నారు. తమ అక్రమాలు వెలుగు చూడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కొందరు బాధిత రైతులు సాక్షిని ఆశ్రయించడంతో తీగ లాగితే డొంక కదిలింది. నమోదు ఇలా.. చిన్నగాండ్లపల్లి రెవెన్యూలో 63 సెంట్లు, 75 సెంట్లు, 1.50 ఎకరాల భూమి ఉన్న ముగ్గురి పేర్లతో రూ. 24 వేల వంతున పరిహారం మంజూరు చేశారు. ఇదే రెవెన్యూ రికార్డుల్లో పేరు లేని వ్యక్తి పేరుతో మరో రూ. 24 వేలను వెచ్చించారు. ఇలా ఐదు మంది పేర్లతో రూ. 1,20,000 ఇన్పుట్ సబ్సిడీకి ఎసరు పెట్టారు. ► గుండిశెట్టిపల్లి రెవెన్యూ పరిధిలో కేవలం మూడున్నర సెంట్ల భూమి ఉన్న మహిళ, మరో 29 సెంట్లు ఉన్న వ్యక్తి, 41 సెంట్లు ఉన్న వారి పేర్లతో రూ. 24 వేల వంతున చెల్లించారు. ► వివాదాస్పద బసవేశ్వరస్వామి ఆలయ మాన్యం సర్వే నంబర్లతో రూ.24 వేలు అర్పించారు. రికార్డుల్లో దొరకని మరో ఐదుగురి పేర్లతో రూ. 27 వేలు, రూ. 24 వేలు, రూ 18 వేలు, రూ. 15 వేలు, రూ 5,250 చొప్పున బిల్లు చేశారు. ఇద్దరు నాయకుల కుటుంబాల్లోని 8 మంది పేర్లతో రూ 1,47,750, మరో 7 మంది పేర్లతో రూ. 1,63,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ► ఎం.శాంతంపల్లి రెవెన్యూ రికార్డుల్లో 52 సెంట్ల భూమి ఉన్న వ్యక్తికి రూ. 24 వేలు, భూమి లేని మహిళ పేరుతో రూ 24 వేలు వంతున కేటాయించారు. ఈ గ్రామ పరిధిలో ముగ్గురి పేర్లతో రూ. 66 వేలకు ఎసరు పెట్టారు. ► సొన్నేగానిపల్లి రెవెన్యూలో 4.40 ఎకరాలు ఉన్న కుటుంబానికి రూ.36 వేలు కేటాయించారు. ఈ రెవెన్యూ గ్రామంలో పది మంది రైతులకు మాత్రం రూ .15, రూ.18 వేల చొప్పున మంజూరు చేశారు. వసూలు ఇలా ► గుండిశెట్టిపల్లికి చెందిన ఓ రైతుకు రూ .27 వేలు పరిహారం బ్యాంకు ఖాతాలో జమ కావడంతో తనను ఎస్బీఐ బ్యాంక్‌కు పిలిపించిన రెవెన్యూ సిబ్బంది మరో మహిళ ఖాతాకు రూ. 22 వేలను బదిలీ చేశారు. ఆ సొమ్ము పై అధికారులకు వెళ్లాలని, తన ఖాతాకు మళ్లీ నగదు వస్తుందని రైతుకు నచ్చజెప్పారు. అయితే ఈ రైతు ‘సాక్షి’ని కలిసిన విషయం తెలుసుకుని మళ్లీ తన ఖాతాకు రూ. 22 వేలను బదిలీ చేశారు. ► గుండిశెట్టిపల్లికి చెందిన మరో రైతు ఖాతాకు రూ 19,500 జమా అయ్యింది. ఇంకా పెద్ద మొత్తం మళ్లీ వస్తుందని మాయమాటలు చెప్పి రూ. 10 వేలను ఓ రెవెన్యూ దళారి ఖాతాకు ‘నగదు బదిలీ’ చేశారు. విషయం బయటకు రావటంతో మళ్లీ ఈ రైతు ఖాతాకు నగదును బదిలీ చేశారు. ► శాంతిపురంలో సొంత వ్యాపారం చేసుకునే రైతుకు రూ. 24 వేలు ఇన్పుట్ సబ్సీడి మంజూరు చేశారు. ఈ విషయం తనకు తెలియక పోవడంతో ఓ వీఆర్వో పదేపదే ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూ. 24 వేలను మీ ఖాతాలో వేశారని, ఆ సొమ్మును తీసివ్వాలని పోరు పెట్టాడు. సాంకేతిక కారణాలతో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ కావడం ఆలస్యమయింది. దీంతో సదరు రైతు తన ఖాతా స్టేట్మెంట్ను వీఆర్వోకి సమర్పించాడు. ఈ నెల 6 వరకూ రోజుకు రెండు సార్లు ఫోన్లు చేసి నగదుపై ఆరా తీసిన వీఆర్వో తర్వాత గుంబనంగా ఉండిపోయాడు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులో సాగిన నగదు బదిలీల వ్యవహారం నిగ్గుతేల్చడానికి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), సీఐడీ దర్యాప్తు జరపాలని రైతులు డిమాండు చేస్తున్నారు. -
మండలిలో కేటీఆర్ వర్సెస్ షబ్బీర్
‘మేము పెట్టిన భిక్షతో..’ అంటూ వ్యాఖ్యానించిన షబ్బీర్ అలీ - పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్న మంత్రి కేటీఆర్ - తెలంగాణ అమరులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ కాంగ్రెస్ విమర్శ సాక్షి, హైదరాబాద్: అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం శాసనసభలో మాటల యుద్ధం జరగగా.. బుధవారం శాసన మండలిలో పరస్పర విమర్శలు దుమారం రేపాయి. వ్యవసాయం అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘మేము పెట్టిన భిక్షతో..’ అని విపక్షనేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్య గందరగోళం రేపింది. ఇటు షబ్బీర్ అలీ, అటు మంత్రి కేటీఆర్‌ల మాటల యుద్ధం జరిగింది. రైతుల బాధలు పట్టవా..? చర్చలో తొలుత షబ్బీర్ అలీ మాట్లాడారు. నాలుగు విడతలుగా రుణమాఫీని అమలు చేస్తుండడంతో రైతులు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలు బ్యాంకుల స్వాధీనంలోనే ఉన్నా యని.. దాంతో వారికి కొత్త రుణాలు లభిం చడం లేదని పేర్కొన్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,650 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 750 మరణాలను మాత్ర మే ధ్రువీక రించిందని.. అందులోనూ 340 కుటుంబాలకే పరిహా రం చెల్లించిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లెవరూ పరామ ర్శించలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగిపో యేలా రైతుల్లో భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫ లమైందని ధ్వజమెత్తారు. ఈ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకుంటూ.. రైతు ఆత్మ హత్యల విషయంలో అం దరం బాధపడుతు న్నామని చెప్పారు. గతంలో రూ.1.5 లక్షలు మాత్రమే ఉన్న పరిహారాన్ని తమ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెం చిందన్నారు. షబ్బీర్ అలీ విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో రెండు గంటల చొప్పున విద్యుత్ సరఫరా జరిగేదని.. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గత ప్రభు త్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో నిలబడేవారని... తమ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా లైన్లు కన బడుతున్నాయా? అని ప్రశ్నించారు. షబ్బీర్ వర్సెస్ కేటీఆర్.. కేటీఆర్ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ తీవ్రంగా ఆగ్రహించారు. ‘మేము పెట్టిన భిక్షతో...’ అని ఆయన ఆవేశంగా మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది. అయితే కేటీఆర్ ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామని శాసనసభలో విపక్ష నేత అంటారు. మేం భిక్ష పెట్టామని ఇక్కడ విపక్ష నేత అంటారు. ప్రజలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఎవరూ పెట్టిన భిక్ష కాదు..’’ అని పేర్కొన్నారు. దీంతో షబ్బీర్ కల్పిం చుకుంటూ.. తెలంగాణ కోసం ప్రాణాలSర్పించిన అమరులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కొందరికి మాత్రమే రూ.10 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకొందని ఆరోపించారు. అమరుల పేర్లు ఎత్తే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, హంతకులే సంతాపాలు తెలుపుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ ఏది? గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి రూ.950 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరై తొమ్మిది నెలలవుతున్నా రైతులకు ఎందుకు పంపిణీ చేయలేదని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో తెలపాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల విధానం తరహాలో ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. రుణమాఫీపై గందరగోళం ఏర్పడిందని, రైతులకు కొత్త రుణాలు లభించడం లేదని బీజేపీ సభ్యుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో రుణాలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వీ సూచించారు. -
అన్నదాతకు ఊరట
అసెంబ్లీ నేపథ్యంలో రూ.300 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముంచుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఫైళ్లు కదిపింది. 2015 ఖరీఫ్‌లో కరువు తీవ్రతతో నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే కరువు సాయంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. 20.91 లక్షల మంది నష్టపోయిన రైతులకు పంపిణీ చేయాల్సిన ఈ సొమ్మును ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైన చెల్లింపులకు సర్కారు కరువు నిధులను మళ్లించిందన్న విమర్శలున్నాయి. కేంద్రం పదే పదే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపాలని కోరడంతో పీడీ ఖాతాలో నిధులున్నట్లుగా పెండింగ్‌లో పెట్టింది. కానీ నిరుడు కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి పంపిణీ చేయలేదంటూ విపక్ష పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇన్ పుట్ సబ్సిడీ అంశం చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అప్రమత్తమైంది. పీడీ ఖాతాలో ఉన్నట్లుగా చెబుతున్న నిధుల్లో రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
పరిహారం ఇవ్వాల్సిందే
జిల్లాలో రూ.4 వేల కోట్ల పెట్టుబడి నష్టం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి డి.హీరేహాళ్: ‘పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. పంట ఎండిపోయింది. ఎండిన పంటకు ఎంత నష్టం వాటిల్లితే అంత బీమా కంపెనీ ఇవ్వాలి. లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం చెల్లించాలి. కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. రైతుకు హక్కుగా రావాల్సిన డబ్బులను చిల్లర రూపంలో భిక్ష వేస్తారా?' అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమలాపురంలో గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ''15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ.750 కోట్లు, కంది, జొన్న, మిరప అన్ని పంటలు కలిపి మొత్తంగా 18 లక్షల ఎకరాలకు రూ.4 వేల కోట్లు పెట్టుబడి రైతులు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వ ముందుచూపులేమి, హంద్రీ–నీవా నీటిని ప్రణాళిక లేకుండా ధారాదత్తం చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా పంట నష్టపోయేందుకు ప్రభుత్వం కారణమైంది. రైతులు ఖర్చు చేసిన డబ్బులు బీమా కంపెనీతో ఇప్పించాలి. లేదంటే ఇన్‌పుట్‌సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఇవ్వాలి. ఇది రైతుల హక్కు! కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. రైతులు నష్టపోయిన పెట్టుబడి ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన టీడీపీ నేతలు రాజధానిలో తలూపి వచ్చేశారు. పైగా 2015కు సంబంధించి 63 కరువు మండలాలను ప్రకటించారు. గత నెల 10న ఇన్‌పుట్‌సబ్సిడీపై జీవో జారీ చేశారు. అందులో 8 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పేరు లేదు. ఎందుకు జిల్లాపై ఈ వివక్ష! ఈ ఏడాది నష్టపోయిన పెట్టుబడి పూర్తిగా ఇవ్వాల్సిందే!'' అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హెచ్చెల్సీ, జీబీసీ, ఎల్ఎల్సీ రైతులు కూడా నష్టపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే హెచ్చెల్సీ రైతులకే పంగనామం పెట్టారు. హెచ్చెల్సీ రైతులకు ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో 3.1/2 టీఎంసీల నీటిని జిల్లా రైతులకు హక్కుగా కేటాయించారు. అలాకాకుండా కర్నూలు జిల్లాకు ఆ నీటిని ధారాదత్తం చేసి ఇక్కడ రైతులకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే కోర్టుకు ఇడుస్తామని ఆయన హెచ్చరించారు. హెచ్చెల్సీ, వర్షాధారం క్రింద సాగు చేసిన రైతులందరికి బేషరతుగా పంట రుణాలను రద్దు చేయాలి లేదా అంతే మొత్తంలో పరిహారం చెల్లించాలన్నారు. పార్టీ రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఉపాధి నిధులను నీరు – చెట్టు కార్యక్రమానికి మళ్లించి, యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీల కడుపుకొడుతున్నారని విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అధికారులంతా జైలుకు వెళతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, సదాశివరెడ్డి, ఎస్టీ సెల్ కార్యదర్శి భోజరాజు నాయక్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బీటీపీ గోవిందు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, డీసీఎంఎస్ చైర్మన్ మల్లికార్జున, మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, మల్లికార్జున, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఏకకాలంలో రుణమాఫీ చేయాలి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేరేడుచర్ల: రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్‌పహాడ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏప్రిల్‌లో విడుదల చేయాల్సిన మూడో విడత రుణమాఫీ నిధులు అక్టోబర్ వచ్చినా సగమే రావడంతో రైతుల ఖాతాల్లో బ్యాంకర్లు జమ చేయడం లేదన్నారు. ఏకకాలంలో మాఫీ చేస్తే రాష్ట్రంలో 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు నలిగిపోతున్నారన్నారు. గత సంవత్సరం పంట నష్టం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించడం శోచనీయమన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరుతాం
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం పుల్లారావుతో పాటు మంత్రి పల్లె రఘనాథరెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.90 లక్షలతో గోదాము, రూ.50 లక్షలతో రైపనింగ్ చాంబర్, కేవీకే సమీపంలో రూ.60 లక్షలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రంæప్రారంభోత్సవానికి హాజరయారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి మట్లాడుతూ అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా అనంతపురం ఉందన్నారు. ఈ జిల్లాపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పంట నష్టపోయిన రైతులకు రెయిన్గన్ల పేరుతో ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రెయిన్గన్లు ఆలస్యంగా ఏర్పాటు చేయడానికి వైఎస్సార్సీపీనే కారణమని ఆరోపించారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. గతేడాది కూడా జిల్లాకు రూ.547 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలనేదే సీఎం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే నదుల అనుసంధానం చేస్తున్నామన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కుటుంబం ఆస్తులను ప్రకటించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, వైఎస్ జగన్ కూడా కుటుంబ ఆస్తులు ప్రకటించాలని అన్నారు. -
ఎన్నేళ్లు పడుతుందో..?
– సా...గుతున్న 2014 ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ – మిస్మ్యాచింగ్తో అన్నదాతల అవస్థలు ఖరీఫ్–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి మంజూరైన పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పరిహారం పంపిణీ పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అర్థంకాని విధంగా సా..గుతోంది. 2015 జూలైలో జిల్లాలోని 5.72 లక్షల మంది రైతులకు రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే మంజూరై 15 నెలలవుతున్నా ఇప్పటికీ పంపిణీ కొనసాగుతుండటం విశేషం. పరిహారం కోసం రైతులు పడుతున్న కష్టాలు, అవస్థలు వర్ణనాతీతం. రైతులకు వచ్చే పరిహారం కన్నా దాని కోసం ఖర్చు చేసిన డబ్బు, వెచ్చించిన సమయం ఎక్కువైందంటే ఇన్పుట్ పంపిణీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతుంది. రైతులకు చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వకుండా అటు వ్యవసాయశాఖ అధికారులు ఇటు బ్యాంకర్లు నానా అవస్థలకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఫలానా తేదీనో, వారంలోనో ఇస్తామనే చెప్పేవారు లేరంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. 2014 ఖరీఫ్‌లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 5,79,646 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో కొన్ని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మంది రైతులకు రూ.559.68 కోట్లకు ఇన్‌పుట్‌సబ్సిడీని కుదించారు. 2015 జూలై 22న పైన తెలిపిన మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ మొదటి విడతగా కొంత మొత్తాన్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడెనిమిది సార్లు కొంచెం కొంచెం విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5.27 లక్షల మంది రైతులకు రూ.505.68 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. అయితే జాబితాలు తప్పులతడకలుగా ఉండటంతో వచ్చిన పరిహారం కూడా రైతులకు అందని పరిస్థితి కల్పించారు. మిస్‌మ్యాచింగ్ జాబితాలో 16 వేల మంది రైతులకు చెందిన రూ.15 కోట్లు బ్యాంకుల్లో నిలిచిపోయింది. జాబితాను సరి చేసుకునేందుకు బాధిత రైతులు ఆర్జీలు ఇచ్చుకుంటున్నా పనికావడం లేదు. ఏఓ, తహశీల్దార్, ఏడీఏ, ఆర్డీఓ, జేడీఏ, జిల్లా గ్రీవెన్స్... ఇలా అన్ని చోట్ల ఒకటికి నాలుగు సార్లు తిరిగి ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. కొందరు రైతులు తిరిగితిరిగి వేసారిపోయి పరిహారం వద్దనుకునే పరిస్థితి కల్పించారు. వీటికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా పరిహారం వర్తింపజేయడంతో అర్హులైన రైతులకు తీరని అన్యాయం జరిగింది. రూ.54 కోట్లు అంతేనా...? జిల్లాకు మంజూరు చేసిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు రూ.505.68 కోట్లు విడుదలైంది. ఇంకా రూ.54 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇపుడున్న పరిస్థితి చూస్తే ఈ మొత్తం విడుదల కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఆధార్ అనుసంధానంతో రూ.2 కోట్ల పరిహారం కోసం అర్హులైన జాబితా సిద్ధంగా ఉంది. ఎనిమిదో విడత కింద పరిహారం మంజూరు చేస్తారా లేదా అనేది అధికారులు చెప్పడం లేదు. మరోవైపు మంజూరైన రూ.505.68 కోట్లలో మిస్‌మ్యాచింగ్‌లో నిలిచిపోయిన రూ.15 కోట్లు మొత్తాన్ని సరిచేసి రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వడం కూడా అనుమానంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇన్పుట్ కోసం రైతులు ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మొత్తమ్మీద 50 వేల మంది రైతులకు చెందాల్సిన రూ.54 కోట్లు పరిహారం చివరకు ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యే పరిస్థితి నెలకొంది. -
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం
బీమా ఎగ్గొట్టేందుకు బాబు పన్నాగం – రైతులను మభ్యపెడితే ఊరుకోం – పీడీ కేసులకు భయపడం – వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పాడి రైతుకు ఇంటికో ఆవు – పెద్దిరెడ్డి రామద్రా రెడ్డి వి.కోట: వేరుశెనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమాను ఎగ్గొంటేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్ గన్నుల విజయగాథలను ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో ఆదివారం ఆయన విలేకరుల సవూవేశంలో వూట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 70 వేల ఎకరాల్లో సాగుచేసిన వేరుశెనగ పంటను కాపాడావుని చంద్రబాబు, ఆయన వుంత్రులు కాకిలెక్కలు చెబుతున్నారని వుండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వురో యావలేని చంద్రబాబు వురోవూరు రైతులను మోసపుచ్చుతున్నారన్నారు. ఎన్నికల హామీలను పూర్తిచేశావుని చెబుతున్న ఆయన వైఖరిపై ప్రజలు అసంతప్తితో ఉన్న విషయం తెలియకపోవడం విడ్డూరవున్నారు. అభివృద్ధి పనుల కోసం వచ్చే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దొరకకుండా తిరిగే చంద్రబాబుకు ప్రజల సవుస్యలు పట్టవని వివుర్శించారు. రాష్ట్రంలో కడుతున్న నీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. భూనిర్వాసితులకు సవున్యాయం చేయాలన్నదే తవు అభివుతవున్నారు. ప్రజల సవుస్యలు ప్రతిపక్షానికే తెలుస్తుందని, అధికార పార్టీ నేతలు పనులు, స్వలాభాల కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ప్రత్యేక హోదాపై మాటలు వూర్చే వ్యక్తులు చంద్రబాబు, వెంకయ్యనాయుడు వూత్రమేనని, వారి వూటలకు చేతలకు పొంతన ఉండదని చెప్పారు. 2019లో తవు అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తధ్యవుని, ఆయన వల్లే ప్రత్యేక హోదా సాధ్యవ˜తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తావున్నారు. పాడి రైతుకు ఇంటికో ఆవు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పాడి రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో పాడి ఆవును అందించేందుకు తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని పుంగనూరులో నిర్వహించిన గాంధీ జయంతి సభలో పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆవులను అందజేసే ప్రతిపాదనను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ మేరకు ఆయన అంగీకారం తెలిపారని స్పష్టం చేశారు. -
నకిలీ పురుగుకు మందేదీ..?
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన వేలాది మంది రైతన్నలు - ఎకరాకు రూ.3 లక్షల చొప్పున.. రూ.500 కోట్ల వరకు నష్టం - నకిలీ విత్తన విక్రయాలపై నియంత్రణ శూన్యం - విత్తన ధ్రువీకరణ సంస్థ ఉన్నా ‘అమ్యామ్యా’లకే ప్రాధాన్యం - బలిపశువులు అవుతున్న రైతన్నలు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు ఒకప్పుడు అనావృష్టి, అతివృష్టి కారణంగానో, పండిన పంటకు మద్దతు ధరలు లేకనో రైతులు నష్టపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు.. కనీసం పంటను కళ్లజూడలేని దుస్థితి. కారణం నకిలీ.. మట్టిని నమ్ముకుని వేలులక్షల రూపాయలు ధారపోసే రైతన్నలను ఇప్పుడు ఈ నకిలీ పురుగు పట్టి పీడిస్తోంది. వేల ఖర్చుతో మిర్చి విత్తనాలు నారు పోసి.. నాటితే.. మొక్కలు ఏపుగా పెరిగి.. పూత.. కాత లేకపోతే.. దాన్ని చూసి రైతన్న కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి నకిలీ విత్తన కంపెనీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఎప్పటిలానే రైతన్న బలిపశువు అవుతున్నాడు. ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నకిలీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నల పరిస్థితిపై ఈ వారం ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం/శాంతినగర్/నర్సంపేట రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా జోరుగా జరుగుతోంది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగ ట్టి కంపెనీలు, వ్యాపారులు, డీలర్లు రూ.వందల కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ అప్పులు చేసి ఆ విత్తనాలతో సాగు చేసిన రైతు మాత్రం ఇప్పుడు వీధిన పడాల్సి వచ్చింది. ముఖ్యంగా మిరప విత్తనాలను వేసి సాగు చేసిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా రైతులు ఇప్పుడు నిండా మునిగిపోయారు. రూ.కోట్లల్లో నష్టపోయారు. తమకు పరిహారం దక్కకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. నకిలీ విత్తనాలను ముందస్తుగా కట్టడి చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం కాగా.. ఇప్పుడు విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది. పైగా ఇది తమ తప్పు కాదంటూ చేతులెత్తేస్తోంది. లెసైన్సులు రద్దు చేస్తామని, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పిన మాటలే చెబుతోంది. కంటితుడుపు చర్యగా అక్కడక్కడ కొందరు డీలర్లను, వ్యాపారులను అరెస్టు చేస్తోంది. నకిలీలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ యంత్రాంగం మొదటి నుంచీ విఫలమవుతూనే ఉంది. 1.43 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు కాయకష్టం చేసి పంట సాగు చేసిన రైతుల శ్రమ వృథా అయింది. విత్తనాలు, పంట సాగు కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. మొక్కలు ఏపుగా పెరిగి రెండు నెలలైనా పూతలేదు.. కాత లేదు. దీంతో తాము నకిలీ విత్తనాలు, నారు సాగుతో నష్టపోయామని గ్రహించిన రైతులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు మిర్చి పంట సాగుచేసి రూ.500 కోట్ల వరకు నష్టపోయార ని అంచనా. పూత, కాత లేని మిర్చి పంటను పీకేసి పరిహారం కోసం రోడ్డెక్కారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.43 లక్షల ఎకరాల్లో (97%) మిర్చి పంట సాగయింది. గతేడాది క్వింటాలు మిర్చి రూ.13 వేల వరకు ధర పలకడంతో ఈసారి రైతులు పెద్ద ఎత్తున ఆ పంటపై దృష్టి సారించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 72 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. నకిలీ విత్తనాల కారణంగా ఖమ్మం జిల్లాలో 8 వేల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. ఈ రెం డు జిల్లాల్లోని మండలాల్లో పూత, కాత లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తూ వ్యవసాయ కార్యాలయాలు, డీలర్ల దుకాణాలు, రో డ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట పండే పరిస్థితి లేక ఈ మూడు జిల్లాల్లో రైతులకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. 20 వేల టన్నుల నాసిరకం విత్తనాలు ఈ ఖరీఫ్ సీజన్లో 20 వేల టన్నుల మేర మిరప విత్తనాలను రైతులకు కంపెనీలు, వ్యాపారులు, డీలర్లు అంటగట్టారు. ఇలా ఒక్కో వ్యాపారి కోట్లు కూడబెట్టుకున్నాడు. కూసుమంచి మండల కేంద్రంలో ఒక విత్తన, ఎరువుల దు కాణదారుడు కేవలం మిరప విత్తనాలను విక్రయించడం ద్వారా ఏకంగా రూ.60 లక్షలు లాభం పొందాడంటే రైతులను ఏ స్థాయిలో ముంచారో అర్థమవుతుంది. జపాన్‌కు చెందిన సకాట అనే పేరుతో విత్తనాలను పెద్ద ఎత్తున విక్రయించారు. వీటిని అమ్మడానికి ముందు విత్తనాలు రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనువైనవా కాదా అనే విషయాన్ని అధికారులు గు ర్తించలేదు. ఇందుకు క్షేత్రస్థాయి పరీక్షలు ఎక్కడైనా జరిగాయా కూడా తెలియదు. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా ‘గ్రీ న్ వీర 333’ అనే కంపెనీ రైతులకు రూ.10 కోట్ల విలువ చేసే విత్తనాలను అమ్మినట్లు సమాచారం. లెసైన్సు కలిగిన గ్రీ న్ వీర, జీవీ అనే కంపెనీలతోపాటు లెసైన్సు లేని మరో 14 కంపెనీలు మిరప విత్తనాలను విక్రయించి నట్లు తెలిసింది. గ్రీన్ వీర అనే కంపెనీ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దగ్గర కొంపల్లి గ్రామం అడ్రస్‌తో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి ఏ ప్రయోగశాలలు లేవని తెలిసింది. విత్తన ధ్రువీకరణ సంస్థ ఏం చేస్తోంది..? రాష్ట్రంలో విత్తనాలను ధ్రువీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ ఉంది. ఇక్కడ నాణ్యమైనవి అని ధ్రువీకరించిన తర్వాతే మార్కెట్లో విక్రయించాలి. కానీ ధ్రువీకరణ చేయించుకోని కంపెనీలు కూడా మార్కెట్లో తమ విత్తనాలను విచ్చలవిడిగా విక్రయించుకుంటున్నాయి. మరోవైపు విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినా.. ఇవేవీ పత్తి, మిరప వంటి విత్తనాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. మొత్తం ప్రైవేటు కంపెనీల ఇష్టారాజ్యానికే వదిలేస్తున్నాయి. ఇంకో విచిత్రమేంటంటే రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో అనేకమంది వ్యవసాయాధికారులు కేవలం కమీషన్ల కక్కుర్తిలోనే ఉంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక రాష్ట్రస్థాయిలో లెసైన్సులు కూడా డబ్బులిస్తే ఇచ్చే పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ శాఖకు డీఎన్ఏ లేబొరేటరీ సౌకర్యం ఉన్నా విత్తన నమూనాలను తీసి పరీక్షించే దిక్కు లేకుండా పోయింది. విత్తనాలపై నియంత్రణకు 2013లో విత్తన బిల్లును రూపొందించినా ఇప్పటికీ దాన్ని చట్టంగా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. పూత నిలబడక.. పిందె రాక.. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామానికి చెందిన రైతులు చిలకనాటు కంపెనీకి చెందిన 10668 లాట్ నంబర్ గల 10 గ్రాముల విత్తనాలను రూ.360 నుంచి రూ.420 చొప్పున కొనుగోలు చేశారు. ఎకరానికి 15 నుంచి 20 ప్యాకెట్ల చొప్పున కేవలం విత్తనాలకే ఎకరానికి రూ.8,400 వరకు వెచ్చించారు. కౌలుకు పొలాలు తీసుకుని సాగు చేసిన వారి పెట్టుబడి మరింత పెరిగింది. ఎకరానికి కౌలు రూ.25 వేలతోపాటు పెట్టుబడి రూ.60 వేల వరకు పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. నెల రోజులపాటు నారుమళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులు రెండు నెలల కిందట నాటు పెట్టారు. ఏపుగా పెరుగుతున్న మిరప పంటను చూసి అప్పులు చేసి మరీ లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. తీరా కాపుకు వచ్చే దశలో పూతలు నిలబడక పిందెలు రాకుండా పోయాయి. దీంతో బాధిత రైతులు డీలర్లను సంప్రదించారు. చిలకనాటు కంపెనీ వారిని పిలిచి పరిశీలించగా క్రాసింగ్ సరిగా లేనందున కాయలు నిలబడవని, విత్తనాల ధర కంటే అధికంగా ఇస్తామని చెప్పివెళ్లిపోయారు. వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదు. రైతన్నలు చేసేది లేక పంటను తొలగించారు. జిల్లాలకు శాస్త్రవేత్తలు నకిలీ మిర్చి విత్తనాల విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశాం. వారు ఇప్పటికే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. నల్లగొండ జిల్లాలోనూ పరిశీలిస్తారు. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టిన విషయాన్ని గుర్తించి సంబంధిత కంపెనీలపై ఆకస్మిక దాడులు నిర్వహించాం. వాటికి లెసైన్సు ఉన్నట్లు తేలింది. వాటిని సీజ్ చేస్తాం. - పార్థసారథి, వ్యవసాయ శాఖ కార్యదర్శి మొలకలు కొని నాటిన.. నకిలీ విత్తనాల వల్ల మా ఊళ్లో మిరప విత్తనాలు మొలకెత్తలేదు. విధి లేని పరిస్థితిలో డోర్నకల్ మండలం ములకలపల్లిలోని గణేశ్ నర్సరీ నుంచి రూ.1కి మొక్క చొప్పున 50 వేల మొలకలు తెచ్చిన. కొన్ని మొలకలు ఎండిపోతే నర్సరీ వారిని సంప్రదిస్తే 2,700 మొక్కలు ఉచితంగా ఇచ్చారు. మొక్కలు ఎండిపోవడం రోజురోజుకు పెరిగిపోయింది. మళ్లీ 15 వేల మొక్కలు కొనుగోలు చేసి నాటినా పరిస్థితిలో మార్పులేదు. - మోర్తాల రాజేందర్, నర్సంపేట మొక్కలకు డీఎన్ఏ టెస్ట్ - డాక్టర్ సైదయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త నర్సంపేట రూరల్: నకిలీ విత్తనాలతో నష్టపోరుున రైతుల పొలాల్లో మిర్చి మొక్కలకు డీఎన్ ఏ టెస్టు నిర్వహించి, రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని, దాని ఆధారంగా సీడ్స యజమానులపై చర్యలు ఉంటాయని హైదరాబాద్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ సైదయ్య తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామశివారు ఆకులతండాలో మిర్చి తోటను పరిశీలించారు. కొన్ని మిర్చి షాంపిల్స్ సేకరించారు. జీవా కంపెనీకి చెందిన సీఎస్ 333 గ్రీన్ రా, బేలా కంపెనీకి చెందిన 2205, పెన్నార్ క్యామ్సమ్ సీడ్, లక్కీ కంపెనీకి చెందిన అంజనీ సీడ్స వాడిన రైతులు ఎక్కువ నష్టపోయారని చెప్పారు. మూడుసార్లు వేసినా అంతే.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన 32 ఏళ్ల జంగలి రాంబాబు తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. గతేడాది మూడెకరాల్లో మిర్చి వేయగా ఎకరాకు రూ.1.50 లక్షల విలువైన పంట దిగుబడి వచ్చింది. దీంతో అప్పు రూ.4 లక్షలు తీర్చేశాడు. ఆదాయం బాగానే వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు కుమారులను ప్రైవేటు చదువులు చదివిస్తున్నాడు. అయితే కల్తీ విత్తనాలు అతడి ఆశలపై నీళ్లు చల్లారుు. విత్తనాలు వేస్తే మొలకెత్తలేదు. రెండోసారీ అదే పరిస్థితి. మూడోసారి వేయగా.. మొక్కలు బాగానే ఎదిగినప్పటికీ ఇటీవలి భారీ వర్షాలతో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోరుుంది.దీంతో పిల్లల ఫీజులు చెల్లించలేక, రెండు కిడ్నీలు చెడిపోరుున చెల్లెలికి వైద్యం చేరుుంచలేక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. మొలకలు కూడా రాలేదు.. రెండు ఎకరాల్లో మిరప సాగు చేసేందుకు వరంగల్ ఉమామహేశ్వర సీడ్స షాపులో నాలుగు మైకో, 10 పెన్నార్ విత్తన ప్యాకెట్లను రూ.4,600 కు కొనుగోలు చేసిన. అధిక దిగుబడి వస్తుందనుకున్న పెన్నార్ ఎఫ్1 రకం విత్తనాలు నారు మొలవనేలేదు. కంపెనీ ప్రతినిధులను అడిగితే పరిహారం ఇవ్వలేమంటూ ఆగ్రోస్ కంపెనీ బేలా 2205 రకం 4, నోబల్ 222 రకం 4, పెన్నార్ రకం 4 విత్తన ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చారు. కానీ నోబెల్ మినహా మిగిలినవి మొలవలేదు. వ్యాపారులను అడిగితే దిగుబడి రాకుంటే కంపెనీ వారు పరిహారం ఇస్తారని చెపుతున్నారు. అసలు నారే మొలవకపోతే దిగుబడి గురించి మాట్లాడటమేంటో అర్థం కావడం లేదు. - మోరె సతీశ్, నందిగామ ఎకరాకు రూ.3 లక్షల నష్టం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎకరాకు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. ఇక్కడ మొత్తం 13 వేల ఎకరాల్లో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తుందా లేదా.. ఇస్తే ఎంత ఇస్తుంది.. ఇచ్చింది సాగు ఖర్చుకైనా సరిపోతుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మిర్చి పంట నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.12 వేల వరకు చెల్లించారు. అదే సబ్సిడీ ఇప్పుడు ఇస్తే కూలి ఖర్చులకు కూడా సరిపోవని రైతులు పేర్కొంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి, పత్తిని వాతావరణ ఆధారిత బీమా కింద తీసుకున్నారు. అయితే వర్షపాతం ఎక్కువగా ఉండి, పూర్తిగా తగ్గిన పరిస్థితుల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లితేనే ఈ బీమా వర్తిస్తుంది. ఎకరాకు రైతులు రూ.4,250 ప్రీమియం చెల్లిస్తే.. బీమా కింద రూ.85 వేలను అందజేస్తారు. ప్రస్తుతం నష్టపోరుున మిర్చి వాతావరణ బీమా పరిధిలోకి రాదు. నకిలీ విత్తనాలతో నష్టపోవడంతో ఇన్ పుట్ సబ్సిడీగా ప్రభుత్వం లేదా పరిహారంగా కంపెనీ.. రైతులకు చెల్లించాల్సిందే తప్ప వేరే దారిలేదు. -
ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి
నంగునూరు: ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేసి రైతులను అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ఎల్లా తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత రబీ సీజన్లో నీళ్లులేక పంటలు ఎండిపోతే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిందని, నేటి వరకు అన్నదాతలకు పరిహారం అందలేదన్నారు. పంటలు పండక, పరిహారం అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో చెరువులు, బావులు, బోర్లలో నీళ్లులేక 50 శాతం పైగా మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా పరిహారం అందించాలని కోరారు. -
పంట నష్టపోతేనే ఇన్పుట్ సబ్సిడీ
అనంతపురం టౌన్ : వర్షాభావంతో ఎండిపోయిన పంటను రక్షకతడి ద్వారా నీరిచ్చి కాపాడామని, అయినా పంట నష్టపోతే ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం మునిసిపల్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడకు వచ్చి మంత్రులు, ఐఏఎస్‌లతో కలిసి కరువును ఎదుర్కొనే ధైర్యాన్ని రైతులకు ఇచ్చారన్నారు. రైతుల కోసం ఇంతలా కష్టపడుతుంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. 2 లక్షలా 90 వేల 500 ఎకరాలకు తడి అందించామనీ.. దీనికి 5082 రెయిన్‌గన్స్, 4755 స్ప్రింక్లర్లు, లక్ష 28 వేల 30 పైపులు, 2404 ఆయిల్ ఇంజన్లు వాడామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే ఇలా చేస్తున్నారని కొందరు విమర్శిస్తు న్నారన్నారు. హంద్రీనీవా, గాలేరు–నగరి, తోటపల్లి, వంశధార, వెలిగొండ, గుండ్లకమ్మ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసినట్లే పెన్నా నదిని కూడా కలుపుతామన్నారు. ప్రతిపక్షాలు కోరినట్లు తప్పకుండా రక్షకతడిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి నిప్పులాంటి వ్యక్తని స్పష్టం చేశారు. -
సగంలోపే ఖరీఫ్ పంటరుణాలు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. కానీ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, బ్యాంకులు విఫలమయ్యాయి. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన పంటరుణ లక్ష్యంలో సగం కూడా బ్యాంకులు పూర్తి చేయలేదు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ బకాయి రూ. 2,020 కోట్లు విడుదల చేయకపోవడంతో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేశాయి. ఫలితంగా అన్నదాతలు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిస్థాయిలో పడక పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు. అప్పుల భారం పెరిగి ఆత్మహత్యల వైపు వెళ్తున్న భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రుణమాఫీ సొమ్ముకు పంట రుణాల విడుదలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు నమ్మలేదని అర్థమవుతోంది. ఈ ఖరీఫ్‌లో రూ. 17,489 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాంకులు ఇప్పటివరకు రూ. 8,060 కోట్లే రైతులకు ఇచ్చాయి. రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కాగా బ్యాంకులు మా త్రం రుణ లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా ఇవ్వలేదు. సాగు విస్తీర్ణం పెరిగినా బ్యాంకులు స్పందించకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు అప్పులవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.10 వేల కోట్ల మేరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసినట్లు అంచనా. ఇన్పుట్ సబ్సిడీపై నీలినీడలు కేంద్ర ప్రభుత్వం గతేడాది కరువు నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికసాయం చేసింది. కానీ ఆ నిధులను రైతులకు అందజేయడంలో సర్కారు నాలుగు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది. 2015 ఖరీఫ్‌లో కరువుదెబ్బకు 30.58 లక్షల ఎకరాలకు తీవ్రంగా నష్టం జరిగిన సంగతి తెలిసిందే. కరువు ప్రభావంతో 20.91 లక్షల మంది రైతులు నష్టపోయారు. కరువు సాయంగా కేంద్రం రాష్ట్రానికి నాలుగు నెలల కిందట రూ.712 కోట్లు, రాష్ట్ర విపత్తు నిధికి రూ.108 కోట్లు మొత్తంగా రూ.820 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మూలుగుతోంది. ఈ సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.198 కోట్లు కలిపి రూ. 1,018 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంపిణీ చేయాల్సి ఉం డగా రేపు మాపు అంటూ జాప్యం చేస్తోంది. -
వేరుశనగ రైతుల్ని ఆదుకోండి
–తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి –వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్ పెనుమూరు: ఐదేళ్లుగా వేరుశనగ రైతులు పంట నష్టపోతున్నా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం గడప గడపకూ వెళ్తూ మోపిరెడ్డిపల్లె, ఉగ్రాణంపల్లె, మనబోటు పల్లె గ్రామాల్లో ఎండుతున్న వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురవడంతో రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగు చేస్తున్నారని చెప్పారు. సకాలంలో వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తుగా వేసిన పంటలో చెట్టుకు రెండు, మూడు కాయాలు కూడా దిగుబడి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు రూ. 15 వేలు వరకు రైతులు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నీరున్నా ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదు కావడంతో వేరుశనగ పంటను రైతులు కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. వేరుశనగ పంటలను పరిశీలించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టరును నారాయణస్వామి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అతివృష్టి ... అనావృష్టిల కారణంగా రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో వర్షాలు లేక ప్రజలు కరువుతో అల్లాడిపోయారని నారాయణస్వామి గుర్తు చేశారు. తాజాగా రెండు సంవత్సరాలుగా పాలనలో తుపాన్ల ప్రభావంతో కురిసిన అకాల వర్షాలతో కంది, వరి, పూల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గత ఏడాది వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా పార్టీ నేత వెంట పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, రైతు విభాగం అధ్యక్షులు గోవిందరెడ్డి, యువత అధ్యక్షులు మురళీ కుమార్‌రెడ్డి, మోపిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ ఔట్!
– మదనపల్లె డివిజన్లో 10వేల మంది రైతులకు మొండిచేయి – ఆన్లైన్లో వివరాలు అంగీకరించకపోవడమే అసలు కారణం – రైతుల కొంపముంచిన సాంకేతిక సమస్యలు – మూడుతరాలకు ముందు చనిపోయినవారి పేర్లతో జాబితా – డెత్ కేసులకు ఇన్పుట్ సబ్సిడీ రాదన్న అధికారులు – నిత్యం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ రైతులు పలమనేరు: మదనపల్లె డివిజన్లో గత ఏడాది వేరుశనగ సాగుచేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ. 10కోట్లకు పైగా వెనక్కిపోనుంది. పదివేల మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదుచేసేందుకు వీలుకాకపోవడమే ఇందుకు కారణం. గతంలో మతిచెందినవారి పేరిటే చాలావరకు పాసుపుస్తకాలున్నాయి. రెవెన్యూశాఖ పంట సాగుదారుకు బదులు 1బి ఆధారంగా జాబితాను తయారుచేయడంతో ప్రస్తుతం రైతులకు పంట నష్టపరిహారం అందని పరిస్థితి తలెత్తింది. డెత్ కేసులకు సంబంధించి పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొట్టింది. జిల్లాలో గతేడాది వేరుశనగను పండించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.10వేలు న ష్టపరిహారంగా ఇచ్చేందుకు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందుకు మంజూరు చేశామని తెలిపింది. సంబందిత రెవెన్యూ గ్రామాల వీఆర్వోల నుంచి వ్యవసాయశాఖ వివరాలను సేకరించింది. ఇందులోని రైతులను సంబంధిత బ్యాంకులో వ్యక్తిగతఖాతాలను తెరవాలని సూచించారు. దీంతోపాటు రైతుల ఆధార్‌కార్డులను బ్యాంకు ఖాతా, భూమి టైటిల్‌దారు, అనుభవదారు వివరాలు మ్యాచయితే నేరుగాఖాతాలోకే పరిహారం అందుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు పలు కారణాలను సాకుచూపు వెబ్సైట్లో అప్లోడ్ కాలేదని రైతులకు పరిహారం చెల్లించడం లేదు. ఇదిగో సాక్ష్యం.... పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబందించి 29,287 మంది రైతులు,14,916 హెక్టార్లలో వేరుశనగ పండించి నష్టపోయారు. వీరికి రూ.11.89 కోట్లను మంజూరు చేసింది. సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో నమోదుకాని రైతులు దాదాపు రెండువేల మంది ఉన్నారు. వీరికి అందాల్సిన రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు విడుదలకాలేదు. మదన పల్లె డివిజన్లో రూ.10 కోట్లు వెనక్కే.... డివిజన్ పరిధిలోని పలమనేరు,కుప్పం,పుంగనూరు, మదనపల్లె, తంబ్ళపల్లె నియోజకవర్గాల్లో దాదాపు పదివేల మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో రూ.10 కోట్లు వెనక్కిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గడువు మించింది కాబట్టి ఈ నిధులను ప్రభుత్వానికి జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ చెబుతోంది. ఆన్లైన్లో తలెత్తిన ఇబ్బందులు ఇవి.... –చనిపోయిన వారిపేరిట పాసుపుస్తకాలుండటం –టైటిల్, ఎంజాయ్మెంటు ఒక్కటిగా లేనివారు –ఆధార్, బ్యాంకు ఖాతా సరిపోక .. –రెవెన్యూ వెబ్‌లో ఎంట్రీకపోవడం.. – మీసేవ అడంగుల్ సైట్లో అధికారుల తప్పిదాలు –ఇక్కడ భూములున్న కర్ణాటక సరిహద్దు రైతులు –సాగుచేసి మైగ్రేషనయిన రైతులు వివరాలు లేక – కౌలు రైతుగా ఎంట్రీలు లేనివారు – అర్హతలున్నప్పటికీ వీర్వోలు జాబితాలో పేరులేనివారు ఇలా రకరకాల కారణాలతో ఆన్లైన్లో వివరాలు అంగీకరించలేదు. దీంతో సంబందిత రైతులకు పరిహారం అందకుండా పోయింది. ఆన్లైన్లో ఎంట్రీకాకపోతే ఏమీ చేయలేం..... సాంకేతిక పరమైన కారణాలతో పరిహారం రానిమాట నిజమే. క్షేత్ర స్థాయిలోవారు పంటను సాగుచేసినా రకరకాల కారణాలతో కంప్యూటర్లో ఆన్లైన్ కావడం లేదు. ముఖ్యంగా డెత్ కేసుల్లో పరిహారం రానట్టే. ఇక్కడ జరుగుతున్న సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలిపాం. విశ్వనాథ రెడ్డి, సహాయసంచాలకులు, పలమనేరు డివిజన్ రైతులతో చెలగాటమాడుతోంది... అర్హులైన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీని అందజస్తామన్న సర్కారు ఇప్పుడు టెక్నికల్ సమస్యల పేరిట రైతులను నట్టేనముంచేసింది. రెవిన్యూశాఖ చేసిన తప్పిదాలకు రైతులను బాధ్యులను చేయడం సమంజమా.. దీనిపై పోరాటానికి దిగుతాం. ఉమాపతి, ఏపీ రైతుసంఘ నాయకులు, పలమనేరు -
పరిహాసం
– ఏడాది అవుతున్నా పూర్తికాని ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీ – రూ.559.68 కోట్లలో రైతుల ఖాతాల్లోకి చేరింది రూ.484 కోట్లు మాత్రమే – కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ ప్రహసనంగా మారింది. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘అనంత’ రైతులను అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదు. ఆధార్, ఆన్లైన్, మిస్‌మ్యాచింగ్, మరో జాబితా అంటూ తిప్పుకుంటున్నారు. పరిహారం కోసం ఏడాదిగా అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రకటించింది. మొదట్లో రూ.5,79,640 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అయితే.. కొన్ని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మందికి రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2015 జూలై 22న ఈ మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు పరిహారాన్ని విడుదల చేస్తూ వచ్చింది. అయితే.. ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయలేదు. ఇచ్చే రూ.5 వేలు.. రూ.10 వేలు.. లేదంటే రూ.15 వేల పరిహారం కోసం రైతులు ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికే వ్యయప్రయాసలకోర్చి 20–30 సార్లు మండల గ్రీవెన్స్‌లు, ఏవోలు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకర్ల చుట్టూ తిరిగారు. జాబితాలు తప్పుల తడక ఇన్‌పుట్‌సబ్సిడీ జాబితాల తయారీ, పరిహారం పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. జాబితాల తయారీలోనే రెవెన్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా రైతులకు సకాలంలో పరిహారం అందలేదు. కొన్నిచోట్ల అర్హులైన రైతులను అసలు జాబితాలోనే చేర్చలేదు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఎక్కువ కావడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర రాయితీలు, పథకాలను ‘తమ్ముళ్లు’ కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్పుట్సబ్సిడీలోనూ మాయాజాలం ప్రదర్శించినట్లు జాబితాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంకా రూ.75 కోట్లు పంపిణీ చేయాలి: కేటాయించిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు 484 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ అయింది. ఇంకా రూ.75 కోట్లకు పైగా పంపిణీ చేయాల్సివున్నా.. ఆధార్ లింక్ పెట్టి పెద్దఎత్తున రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరకు రూ.506 కోట్లు పంపిణీ చేసి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. మిగతా రూ.53 కోట్లు ప్రభుత్వ ఖాజానాకే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీకి ఎప్పుడు ముగింపు పలుకుతారో, రైతులందరికీ ఎన్నడు న్యాయం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
* వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం * రెండేళ్లుగా కరువు పరిస్థితులున్నా చర్యలేవీ? * రూ. వెయ్యి కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇంకా అందలేదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ60 ఏళ్లలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ సర్కారేనని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులు జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, బండారు వెంకటరమణలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు అందలేదన్నారు. రైతు రుణ మాఫీ కింద మిగిలిన 50 శాతం రుణాన్ని వడ్డీతో కలిపి ఒకేసారి మాఫీ చేసి వారికి కొత్త రుణాలు కూడా వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈసారి పత్తి పంట వేయొద్దని రైతులకు చెబుతున్న పోచారం సహా ఇతర మంత్రులు.. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతులకు సబ్సిడీపై సోలార్ పంపుసెట్లు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని నిలదీశారు. స్కైవేలు, ఫ్లైఓవర్లు అంటూ ప్రతి విషయంలోనూ హైటెక్ ప్రచారం తప్ప రైతుల విషయంలో కేసీఆర్ శ్రద్ధ చూపట్లేదని విమర్శించారు. పాలీహౌస్ వ్యవసాయం విషయంలోనూ ప్రభుత్వం హామీ నిలుపుకోలేదన్నారు. గతేడాది కోటి ఎకరాల మేర సాగులోకి తెస్తామన్న ప్రభుత్వం, చివరకు 88 లక్షల ఎకరాల వరకు రైతులు పంటలు వేసినా వారికి ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఏడాది 1.12 కోట్ల ఎకరాల్లో పంటలు వేయనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు 4,58,331 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు వైఎస్సార్ హయాంలో అనుమతిచ్చారని, ఇప్పుడు హరితహారం పేరిట ఎస్టీలను ఆ భూముల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అనుమతివ్వాలని, అటవీశాఖ అధికారులు అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని విమర్శించారు. -
చెప్పేదొకటి.. చేసేదొకటి..
♦ ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు రెయిన్గన్లు ఇస్తారట! ♦ 13,933 మంది రైతుల నోట్లో మట్టికొట్టనున్న సర్కారు ♦ రూ.18.22కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎసరు కడప అగ్రికల్చర్: ఘనమైన హామీలిచ్చే పాలక ప్రభుత్వం, మంత్రులు ఆపదలో ఉన్న రైతులను నిలువునా దోపిడీ చేయడానికి సిద్ధమైంది. పంటలు నష్టపోయి పరిహారం కోసం ఏళ్ల తరబడి రైతన్న నిరీక్షిస్తున్నా పైసా కూడా పరిహారం అందిచక పోగా ఆ నిధులను ఇతర ప్రచారాలకు, స్కీములకు మళ్లించడానికి సిద్ధమవుతోంది. అదేమంటే వర్షాభావ పరిస్థితుల్లో పంటకు నీటి తడులు అందించే రెయిన్గన్ల కొనుగోలుకు ఇన్పుట్ సబ్సిడీ పరిహార నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నేడో రేపో ప్రభుత్వం జీవో జారీ చేయనున్నట్లు అధికారులు అంటున్నారు. అంతకు ముందుగానే అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులకు చెందాల్సిన పరిహారాన్ని అందించకుండా ఇలా ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలతో కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల సొమ్ములను ఇలా వాడుకుంటారా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 50 వేల హెక్టార్లకు రెయిన్గన్లు.... ఈ ఖరీఫ్ సీజన్లో ఉద్యాన పంటలకు రాబోయే విపత్తులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా పంటలను కాపాడతామని, ఇందుకుగాను రెయిన్గన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రభుత్వం ఇటీవల విజయవాడలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ప్రకటించింది. అదేమంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పరిహారానికి ఈ రెయిన్‌గన్‌ను ముడిపెట్టారు. జిల్లాలో 50 వేల హెక్టార్లకు ఈ రెయిన్గన్లను వినియోగించాలని, అందుకు తగ్గ ప్రణాళికలను తయారు చేయాలని ఉద్యానశాఖను ఆదేశించింది.జిల్లా ఉద్యాన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఎసరు పెట్టింది ఈ పరిహారానికే.... జిల్లాలో 2010లో ఫిబ్రవరి నుంచి 2015 నవంబరు వరకు ప్రకృతి విపత్తులతో 70,566.361 హెక్టార్లలో ఉద్యాన పంటలు తోటలు దెబ్బతినగా 13933 మంది రైతులు రూ. 18.22 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం విదిల్చకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీనే ప్రభుత్వం ఇలా వినియోగించడానికి సిద్ధమవుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. -
మొక్కుబడి చర్చ!
♦ హడావుడిగా సాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ♦ కీలక అంశాలపై మొక్కుబడి చర్చతో సరిపెట్టిన వైనం ♦ సభ్యులడిగిన ప్రశ్నలకు లభించని సమాధానాలు ♦ పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ జాప్యంపై సభ్యుల ఫైర్ ♦ ప్రైవేటు బడులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ ♦ వైద్య, ఆరోగ్యంపై ప్రజాప్రతినిధుల కస్సుబుస్సు ఈ సారి జెడ్పీ సమావేశం చప్పగా సాగింది. అన్ని అంశాలపైనా మొక్కుబడి చర్చే జరిగింది. కీలకాంశాలపై ఎక్కువ సమయం వెచ్చించలేకపోయారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, వైద్య, ఆరోగ్యశాఖలో సమస్యలు, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి.. తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించినప్పటికీ అధికారులు వాటిపై సరైన సమాధానం చెప్పలేకపోయారు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘనుందన్రావు తదితరులు హాజరయ్యారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ సభ్యులు స్థాయీ సంఘం మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. కేవలం అధికారులే వస్తున్నారు. కోరం కూడా ఉండట్లేదు. ముందు మీ డ్యూటీ సరిగా చేస్తే అధికారులను ప్రశ్నించొచ్చు. - జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇకపై ప్రైవేటు స్కూళ్లకు కొత్తగా అనుమతులు ఇవ్వొద్దు. క్షేత్రస్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వాలి. ప్రతి పథకంలోపారదర్శకత ఉండాలి. - మంత్రి మహేందర్‌రెడ్డి పాలీహౌస్లో సాగు విధానం లాభదాయకం. అయితే ఈ పద్ధతిపై అవగాహన చేసుకుని ముందుకెళ్లాలి. లాభనష్టాలకు రైతులదే బాధ్యత. - కలెక్టర్ రఘునందన్‌రావు పాలీహౌస్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. సరైన పద్ధతిలో సాగు చేపట్టకపోవడం వల్లే నష్టాలు. - మంత్రి మహేందర్‌రెడ్డి ‘పాలీహౌస్’లపై దుమారం.. పాలీహౌస్ సాగు లాభదాయకమని అధికారులు తప్పుడు సహాలిస్తున్నారని.. వాటిని ఏర్పాటు చేసిన పేద రైతులెవరూ లాభపడలేదని ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావు, జెడ్పీటీసీ సభ్యుడు జంగారెడ్డి, ఎంపీపీ నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బాలేష్ తదితరులు గొంతుకలిపారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరుస కరువుతో అతలాకుతలమైన రైతుకు కనీసం పెట్టుబడి రాయితీ సైతం ఇవ్వకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు జంగారెడ్డి, బాలేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ ఆర్థిక సాయం అందకుంటే సాగు పనులు ముందుకెలా వెళ్తాయన్నారు. ఇందుకు జేడీఏ జగదీష్ స్పందిస్తూ ఇన్పుట్ సబ్సిడీపై ప్రభుత్వం ఇంకా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వికారాబాద్‌లో పత్తి రైతులకు నష్టపరి హారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే కాలె యాద య్య ప్రస్తావించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు రాగానే అమలు చేస్తామని జేడీ ఏ పేర్కొన్నారు. యాంత్రీకరణ కింద పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడంలేదంటూ పలువురు లేవనెత్తగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమిస్తామని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. పంట లు వేయకముందే బీమా ప్రీమియం చెల్లించడాన్ని ఎమ్మెల్యే సంజీవరావు తప్పుబట్టారు. ప్రైవేటుకు కత్తెర వేయండి.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నివిధాలా అర్హులైన టీచర్లున్నప్పటికీ.. పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఎమ్మెల్యే సంజీవరావు ప్రస్తావించారు. పలుచోట్ల సింగిల్ డిజిట్లో విద్యార్థులుంటే.. అవి మూసివేతదిశగా వెళ్తున్నాయన్నారు. డీఈఓ రమేష్ స్పందిస్తూ ప్రస్తుతం బడిబాట సాగుతోందని, పలుచోట్ల ఇంగ్లిష్ మీడియం డిమాండ్ ఉందన్నారు. ఈక్రమంలో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 382 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రైవేటు బడుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలుంటే ప్రైవేటుకు ఎలా అనుమతులిస్తారని ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ ప్రశ్నించగా.. డీఈఓ స్పందిస్తూ కొత్తగా అనుమతులివ్వడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పరపతి పడిపోతున్నదని ఎంపీపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలుంటే పరిస్థితి మారుతుందని పేర్కొనగా.. సర్వీసు రూల్స్ అంశం రాష్ట్రపతి వద్దకు చేరిందని డీఈఓ బదులిచ్చా రు. ఉద్యానవనశాఖ ద్వారా రైతుకు పరి హారం ఇచ్చిన సంగతి ప్రజాప్రతినిధులకు చెప్పకపోవడంపై ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు డీడీ బాబుపై మండిపడ్డారు. దీంతో ఆయన స్పందిస్తూ ప్రజాప్రతినిధులకు పరిహారం పంపిణీ జాబితా ఇస్తానన్నారు. వైద్యశాఖకు చికిత్స చేద్దాం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గాడితప్పిందని ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. పర్యవేక్షణ కొరవడడంతో ఆస్పత్రుల్లో వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వైద్యుల హాజరుశాతం అసంతృప్తిగా ఉందని.. ఇది జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ మహేశ్వరంలో వందపడకల ఆస్పత్రి సంగతేమైందంటూ మెడికల్ అధికారులను నిలదీశారు. ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవహారశైలి బాలేదని ఎంపీపీ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించగా.. డీఎంహెచ్ఓ స్పందిస్తూ ఆమె తనకంటే సీనియర్ అని.. వైద్యశాఖ సంచాలకులు మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమాధానం చెప్పగా.. సభ్యులు మరింత ఆగ్రహించారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పలు ఆస్పత్రుల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం డీఎంహెచ్ఓ నిర్లక్ష్యమని పలువురు ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇన్పుట్ సబ్సిడీ ఇంకెన్నాళ్లు?
కరువు ప్రకటించి ఆర్నెల్లు... కేంద్రం నిధులిచ్చి రెణ్నెల్లు - ఖరీఫ్ ముంచుకొస్తున్నా అందని సాయం - 20 లక్షల మంది రైతుల ఎదురుచూపులు - ఖజానాలో మూలుగుతోన్న రూ.820 కోట్ల కేంద్ర నిధులు - రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.198 కోట్లు ఇవ్వకపోవడమే జాప్యానికి కారణం సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన ఉంది రాష్ట్ర సర్కారు తీరు! తీవ్ర కరువులో చిక్కుకున్న తెలంగాణకు కేంద్రం కరువు సాయంగా రెండు నెలల కిందట రూ.712 కోట్లు విడుదల చేసింది. అలాగే రాష్ట్ర విపత్తు నిధికి రూ.108 కోట్లు ఇచ్చింది. మొత్తంగా రూ.820 కోట్లు విడుదల చేసింది. అయినా రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఒక్క పైసా పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువుగా ప్రకటించి, కేంద్రాన్ని రూ.3 వేల కోట్ల సాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరో మూడ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీ ఇంకా అందకపోవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు మళ్లీ ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,018 కోట్లు.. గత ఏడాది ఖరీఫ్‌లో మొత్తం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా... 88.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో కరువు దెబ్బకు 30.58 లక్షల ఎకరాలకు తీవ్ర నష్టం జరిగిందని కరువు నివేదికలో సర్కారు పేర్కొంది. కరువుతో మొత్తం 20.91 లక్షల మంది రైతులు నష్టపోగా.. అందులో పత్తి రైతులే 9.33 లక్షల మంది ఉన్నారు. దీంతో వ్యవసాయానికి రూ.989 కోట్లు, ఉద్యాన రైతులకు రూ.29 కోట్లు (మొత్తం రూ.1,018 కోట్లు) ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం విడుదల చేసిన రూ.820 కోట్లు ప్రభుత్వ ఖజానాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.198 కోట్లు కలిపి రూ.1,018 కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వాటా విడుదల చేయనందునే.. కేంద్రం ఇచ్చిన కరువు సాయానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.198 కోట్లు విడుదల చేయకపోవడం వల్లే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల వరకే పంపిణీ చేయాలన్నా... ఆ సొమ్ము పూర్తిగా సరిపోదు కాబట్టి జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తాము మొదట్లో విన్నవించిన రూ.3 వేల కోట్ల కరువు సాయాన్ని పూర్తిగా విడుదల చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు సీఎం స్వయంగా కేంద్రానికి విన్నవించారు. అయితే ఇచ్చిన నిధులు రైతులకు ఇవ్వకుండా అదనపు నిధులు కోరడంతో రాష్ట్ర అధికారులపై కేంద్ర అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. -
ఖరీఫ్ కు నో రిలీఫ్
♦ ఇన్‌పుట్‌సబ్సిడీ విడుదల చేయని సర్కారు ♦ గత సీజన్ పంటనష్టంపై నీలిమేఘాలు ♦ తొలకరి పలకరించినా కరుణించని ప్రభుత్వం ♦ పెట్టుబడుల్లేక రైతాంగం విలవిల సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి రిక్తహస్తం చూపింది. కష్టకాలంలో రైతులకు చేయూతనివ్వకుండా దగా చేసింది. గత ఏడాది పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంతో వారు దిక్కులు చూస్తున్నారు. చేతిలో కనీస పెట్టుబడులు లేక అప్పు కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది ఖరీఫ్‌లో పంటలు తుడుచిపెట్టుకు పోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాపాతం నమోదుకాకపోవడంతో ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం కూడా నమోదు కాలేదు. సాధారణంగా ఖరీఫ్‌లో 2.19 లక్షల ఎకరాల మేర సాగులోకి రావాల్సివుండగా, కేవలం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో లక్ష ఎకరాల మేర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో పంట పెట్టుబడి రాక ైరె తాంగం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం, నష్టంపై అంచనాలను రూపొందించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వ్యవసాయశాఖ జిల్లావ్యాప్తంగా 2,03,275 మంది రైతులు వేసిన 1,00,931.7 ఎకరాల మేర పంటలు ఎండిపోయాయని లెక్క తేల్చింది. తద్వారా రూ.73.33 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఈ మేరకు పంటనష్టం (ఇన్పుట్ సబ్సిడీ)ని అందజేయాలని ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకరించిన సర్కారు.. మళ్లీ ఖరీఫ్ దరిచేరుతున్నా నయా పైసా విదిల్చకపోవడం గమనార్హం. ఇన్పుట్ సబ్సిడీని పంపిణీతో రైతాంగానికి చేయూతనిచ్చి భరోసా నివ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగువేయడంలేదు. గతేడాది సకాలంలో వానలు పడకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోగా.. ఈ ఏడాది ఇప్పటికే తొలకరి పలకరించింది. వాతావరణశాఖ కూడా ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీని అందజేస్తే అంచనాలకు మించి విస్తీర్ణం సాగులోకి వచ్చేది. మే మొదటి వారం నుంచే రికార్డుస్థాయిలో జల్లులు కురుస్తుండడంతో భూగర్భజ లాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. అయితే. రెండేళ్లుగా వరుస కరువుతో రైతాంగం దారుణంగా నష్టపోయింది. ఆఖరికి నమ్ముకున్న పశువులకు గ్రాసం వేయలేక.. వాటిని సాకలేక సంతకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో వ్యవసాయ పనుల్లేక పొట్టచేత బట్టుకొని వలస బాట పట్టాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగం దుక్కులు దున్నేందుకు సైతం డబ్బులేని పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీని విడుదలచేస్తే.. ఖరీఫ్ పంటలకు ఊతమిచ్చినట్లవుతుంది.