ప్రకృతి విపత్తులతో గత రెండేళ్లలో నష్టపోయిన రైతులకోసం రూ. 435 కోట్ల పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించింది.
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విపత్తులతో గత రెండేళ్లలో నష్టపోయిన రైతులకోసం రూ. 435 కోట్ల పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. గత ఏడాదిలో కరువు, నీలం తుపాను, 2011లో కరువువల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి బుధవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో, అధికారులతో చర్చించారు. 2012వ సంవత్సరం కరువుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 279 కోట్లు, 2012 నీలం తుపానుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 21కోట్ల పెట్టుబడి రాయితీని. 2011లో కరువుకు సంబంధించి రూ.135కోట్ల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రఘువీరారెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్థిక మంత్రి స్పందించారు. రెండేళ్లకూ సంబంధించి మొత్తం రూ. 435 కోట్ల పెట్టుబడి రాయితీని వెంటనే విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించి గురువారమే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.
వీఆర్‌ఓల గౌరవ వేతనం పెంపుపై చర్చ
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల) గౌరవ వేతనం పెంపుపై కూడా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రూ. 3000గా ఉన్న గౌరవ వేతనం పెంచాలని వీఆర్‌ఏలు చాలాకాలంగా కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. గౌరవ వేతనం ఎంతమేరకు పెంచాలన్న అంశంపై ముఖ్యమంత్రితో