ఆ 5 మండలాలకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
Published Sat, Jun 3 2017 12:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కర్నూలు(అగ్రికల్చర్): 2014 కరువుకు సంబంధించి ఆదోని డివిజన్‌లోని 5 మండలాలకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 73,24,66,426 విడుదలయ్యాయి. ఇటీవలనే ప్రభుత్వం జీఓ విడుదల చేయగా నిధులు విడుదల చేస్తూ డిజాస్టర్ మేనేజ్‌మెంటు, ట్రెజరీ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. మండల వ్యవసాయాధికారులు ఇన్‌పుట్ సబ్సిడీ బిల్లులు తయారు చేసి ట్రెజరీలకు పంపుతారు. ట్రెజరీలో క్లియర్ అయి బ్యాంకుకు వెళితే అక్కడి నుంచి పెట్టుబడి రాయితీ రైతుల ఖాతాలకు జమ అవుతుంది. ఆలూరు మండలానికి రూ.11,56,74,200, చిప్పగిరి మండలానికి రూ.5,22,20,150, పత్తికొండ మండలానికి రూ.14,06,66,939, తుగ్గలి మండలానికి రూ.19,94,95,337.5, దేవనకొండ మండలానికి రూ.22,44,09,800లు విడుదల అయ్యాయి. కాగా 2016 కరువుకు సంబంధించి జిల్లాలోని 26 మండలాలకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే నిధులు విడుదల చేయాల్సి ఉంది.
Advertisement