సాక్షి, అమరావతి: గతంలో రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. కానీ రైతు భరోసా కిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రైతులకు సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
‘‘వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైన బాగుంటుందన్నారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. జులై-అక్టోబర్ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
‘‘మన ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి.. గతంలో రైతు భరోసా పథకం లేదు. ఒకేసారి రైతులకు రెండు రకాల సాయం అందించాం. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొట్టింది’’ అని సీఎం అన్నారు.
‘‘పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని సీఎం జగన్ అన్నారు.
చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?
Comments
Please login to add a commentAdd a comment