సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు.
ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. రాయలసీమలో గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాం. నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్నాం.
శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాఫ్ట్ డేటాను ఆర్‌బీకే స్థాయిలో ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణ స్థాయిల్లో ఆర్‌బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1612 కోట్ల సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
♦రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తోంది
♦అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ 80శాతం సబ్సితో 1.43 లక్షలమంది రైతులకు విత్తనాలు ఇచ్చాం
♦అవాళ జరిగిన ఆనష్టాన్ని.. ఇవాళ ఇన్‌పుట్ సబ్సిడీ రూపేణా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే
♦మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు
♦ఏ సీజన్‌లో నష్టం జరిగితే.. ఆ సీజన్‌లో తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ లేదు
♦గత ప్రభుత్వంలో కొన్ని సార్లు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు
♦మరికొన్ని సార్లు,, అరకొరగా, ఆలస్యంగా, అదికూడా కొందరికే ఇచ్చారు
♦గత ప్రభుత్వం ఏరకంగా ఇచ్చిందో గమనించాలి
♦2014 ఖరీఫ్‌లో కరువకు 2015 నవంబర్‌లో గాని ఇవ్వలేదు
♦2015 కరువుకు, 2016 నవంబర్‌లోగాని ఇవ్వలేదు
♦2015 నవంబర్, డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.263 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు
♦2016 కరువుకు సంబంధించి 2017 జూన్‌లో ఇచ్చారు
♦2017 కరువుకు సంబంధించి 2018 ఆగస్టులో ఇచ్చారు
♦2018లో ఖరీఫ్‌లో రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు
♦అదికూడా అరకొరగా, కొందరికే ఇచ్చిన పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు తేడా చూడండి
♦కౌలు రైతులను ఎప్పుడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు
♦మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా, ఇ–క్రాప్ డేటాతో పంట నష్టాలను అంచనావేసి, ఆర్బీకేలస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రవేశపెట్టాం
♦తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్‌లో జరిగిన పంటనష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో సమచేస్తున్నాం
♦కౌలు రైతులకు సైతం... ఇ–క్రాప్ డేటా తీసుకుని వారికి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం
♦ఇలా చేస్తున్నాం కాబట్టే 2020 మారిలో కురిసిన వర్షాలవల్ల నష్టపోయిన రైతులకు 1.56 లక్షల మంది రైతులకు రూ.123.7 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా 2020 ఏప్రిల్‌లో అందచేశాం
♦2020 ఏప్రిల్‌ల్ నుండి 2020 అక్టోబరు వరకూ కురిసిన నష్టోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278.87 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా 2020 అక్టోబరులోనే ఇచ్చాం
♦2020 నవంబర్‌లో నివర్ సైక్లోన్‌లో దెబ్బతిన్న రూ.8.35 లక్షలమంది రైతులకు రూ.645.99 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా 2020 డిసెంబర్‌లోనే అందించాం
♦2021 సెప్టెంబరులో గులాబ్ సైక్లోన్‌వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ.21.96 కోట్ల సహాయాన్ని 2021 నవంబర్‌లో అందచేశాం
♦ఏ ఒక్కరు కూడామిస్ కాకుండా సహాయాన్ని అందిస్తున్నాం
♦మన అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇవ్వాళ్టి వరకూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 మంది లక్షల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీద్వారా రూ.1,612.62 కోట్ల రూపాయలను అందించాం
♦రైతన్నలు పలు కార్యక్రమాలద్వారా అండగా నిలుస్తున్నాం
♦వైఎస్సార్‌రైతు భరోసా – పీఎంకిసాన్ ద్వారా అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.19,126 కోట్లు ఇచ్చాం
♦దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500 చొప్పున రైతు భరోసా సాయం కింద అందిస్తున్నాం
♦ఏకైక ప్రభుత్వం దేశంలోనే మనది
♦పంట రుణాలపై సున్నా వడ్డీకింద పూర్తి వడ్డీ రాయితీని సమచేస్తున్నాం
♦65.64 లక్షలమంది రైతులకు రూ.1218 కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చాం
♦గత ప్రభుత్వ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది
♦రాష్ట్రలలో 18.7 లక్షలమంది రైతులన్నలకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ఇవ్వడానికి ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
♦ఇప్పటివరకూ రూ.23వేల కోట్లు ఖర్చు చేశాం
♦నాణ్యమై కరెంటు పగటిపూటే ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటు కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశాం
♦ఈ రెండున్నరేళ్ల కాలంలో వైయస్సార్ ఉచిత పంట బీమాద్వారా రైతన్నలకు 31.07వేలమంది రైతులకు రూ.3788 కోట్ల రూపాయలు రైతన్నలకు అందించగలిగాం
♦రూ.2వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం
♦రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం
♦ధాన్యం సేకరణ కోసం అక్షరాల రూ.39వేల కోట్లు ఖర్చు చేశాం
♦గతంలో సమయానికి డబ్బులు ఇవ్వని ఘటనలు చూశాం
♦ఇవాళ 21 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నాం
♦పత్తి కొనుగోలుకోసం రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకోసం రూ.6434 కోట్లు ఖర్చు చేశాం
♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది
♦గత ప్రభుత్వం రైతన్నలకు ఉచిత విద్యుత్‌కోసం రూ.9వేల కోట్ల కరెంటును కొనుగోలు చేసి బకాయి పెట్టి వెళ్తే, ఈ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది
♦రూ. 383 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే స్వీకరించింది
♦రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించాం
♦ఇప్పటికే 9160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో అందుబాటులో పెట్టాం
♦ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం
♦మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం
♦నెలలో ఈ నాలుగు స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్నాయి
♦ఈ సమావేశాల్లో గుర్తించిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నాం
♦ప్రాథమిక వ్యవసాయ సహకారా సంఘాలనుంచి ఆప్కాబ్ వరకూ అన్నింటినీ ఆధునీకరిస్తున్నాం
♦సహకార రంగంలో హెచ్‌ఆర్ విధానాన్ని తీసుకువస్తున్నాం
♦పంటలు నష్టాల్లో ఉంటే.. సీఎంయాప్‌ను ఆర్బీకేల స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment