YSR Yantra Seva
-
యాంత్రీకరణపై అభాండాలా ?
-
వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ప్రతీ ఆర్ బీకే పరిధిలో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు అందజేస్తునాం
-
రైతులకు ఏమి కావాలో వారినే అడిగి అందజేస్తాం: సీఎం జగన్
సాక్షి, చుట్టుగుంట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ఉంది. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ. 361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తాం. అందులో భాగంగానే వైఎస్సార్ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ బీమా నమోదు ప్రారంభం -
ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు: సీఎం జగన్
►రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు పంపిణీ చేసిన సీఎం జగన్ ►13, 573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన సీఎం జగన్ ►రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీ జమ చేసిన సీఎం జగన్ ►జెండా ఊపి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం జగన్ ►రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్ సీఎం జగన్ కామెంట్స్ ►వైఎస్సార్ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం ►అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం ►రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ►ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు ►ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు ►ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు ►ప్రతి ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయం పరికరాలు ►ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు ►రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం ►ప్రతి ఆర్బీకే సెంటర్లో యంత్రాలకు 15 లక్షలు కేటాయించాం ►రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ►రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తాం ►గుంటూరుకు చేరుకున్న సీఎం జగన్ ►వైఎస్సార్ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2ను ప్రారంభించనున్న సీఎం జగన్ ►చుట్టుగుంట సెంటర్లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ ►గుంటూరు బయలుదేరిన సీఎం జగన్ ►చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ►గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. ►వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. ►ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటుచేస్తోంది. ►ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరికరాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పనిమున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Live: వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం...గుంటూరులో సీఎం వైఎస్ జగన్
-
Andhra Pradesh: నేడు మెగా యంత్ర సేవా మేళా
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం కింద శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. 40 శాతం సబ్సిడీ.. 50 శాతం రుణం ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటుచేస్తోంది. ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరికరాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పనిమున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది. నూరు శాతం ఆర్బీకేల్లో ఏర్పాటు లక్ష్యంగా.. ప్రతి ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు లక్ష్యంతో తాజాగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. గతేడాది 3,800 ఆర్బీకేల పరిధిలో ట్రాక్టర్లతో కూడిన యంత్ర పరకరాలను అందించగా.. తాజాగా 2,562 ఆర్బీకేల్లో ఏర్పాటుచేస్తున్నారు. రూ.361.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, సబ్సిడీ రూపంలో రూ.125.48 కోట్లు ప్రభుత్వం నేరుగా రైతు గ్రూపుల ఖాతాలకు జమచేయనుంది. తాజాగా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో 2562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 యంత్ర పనిముట్లు సమకూరుస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో రైతు గ్రూపులకు అందిస్తున్న ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను గుంటూరులో శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించడమే కాదు సబ్సిడీ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమచేస్తారు. అదే సమయంలో నియోజకవర్గ కేంద్రాల్లో యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభిస్తారు. జూలైలో కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి.. ఇక కిసాన్ డ్రోన్ సేవలను సైతం ఆర్బీకే స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో మండలానికి మూడు చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జూలైలో 500 డ్రోన్ సీహెచ్‌సీలు ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. రైతుల కోరిక మేరకు 50 శాతం సబ్సిడీపై ఏడు లక్షల స్ప్రేయర్లు, టార్పాలిన్లను అక్టోబర్‌లో పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు. నేడు గుంటూరుకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ఈనెల 2న (నేడు) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగామేళా–2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు. చుట్టుగుంటలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగామేళా–2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కొనుగోలు.. నిర్వహణ బాధ్యత రైతు గ్రూపులదే.. ► పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాల ఎంపిక, కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రైతు గ్రూపులకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ► యంత్ర పరికరాలు, వాటి అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. కనీసం 15 రోజుల ముందుగా మండల పరిధిలో ఏ ఆర్బీకే నుంచైనా బుక్ చేసుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ సీహెచ్‌సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ► ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గ్రూపులకు వచ్చే ఆదాయం, రుణాల చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వీటి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో డాష్ బోర్డునూ ఏర్పాటుచేశారు. ► సీహెచ్‌సీల్లోని సభ్యులు సొంతంగా వినియోగించుకోవడమే కాదు.. మండల పరిధిలోని చిన్న, సన్నకారు రైతులకు అద్దెకిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. -
సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, గుంటూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శుక్రవారం) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా రైతుల ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
రైతుకు యంత్రాల దన్ను
ఈ ఏడాది 7,13,150 మంది రైతులకు టార్పాలిన్లు, వ్యక్తిగత యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు.. 20 శాతం మిగిలిన వర్గాల వారికి ఇవ్వాలి. అవసరమైన చోట భూ విస్తీర్ణాన్ని బట్టి పరికరాలు పంపిణీ చేయాలి. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేంద్రాల్లోని పరికరాలు, యంత్రాలన్నీ రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి. ఎలాంటి పరికరాలు, వాటి అద్దె, ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో తెలిపే సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. రైతు గ్రూపులే కాదు.. ఆయా గ్రామాల్లోని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 10,750 ఆర్బీకేలు ఉండగా, ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ ఉప కరణాల పంపిణీ పూర్తి చేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో 1,615 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని సంకల్పించగా, ఇప్పటికే 391 చోట్ల హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.690.87 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేయగా, ఇందులో సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ప్రభుత్వం అందించిందని వివరించారు. కాగా, మిగిలిన 4,225 ఆర్బీకేల్లో కూడా యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీ ఏర్పాటుకు 2022–23కు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,325 కోట్లు ఖర్చు చేయనుందని, ఇందులో వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం రూ.910 కోట్లు వెచ్చిస్తుందన్నారు. ఇందులో ప్రభుత్వం రూ.1,014 కోట్లు సబ్సిడీ భరిస్తుందని తెలిపారు. రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు, ఇతర యంత్రాలు, వ్యక్తిగత ఉపకరణాలను దశల వారీగా అందించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సత్వరమే అగ్రి ఇన్ఫ్రా పనులు ► అగ్రి ఇన్ఫ్రా కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లతో పాటు గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి. ► ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వైఎస్సార్ చేయూత ద్వారా వారి సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలి. చేయూత పథకం కింద లబ్ధి పొందే వారికి పాడి పశువులు పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల్లో వారిని భాగస్వాములను చేయాలి. ► అమూల్, అలానా తదితర కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా చేయూత లబ్ధిదారులైన మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలి. ఇందులో భాగంగా పశువుల పెంపకానికి మరింత ప్రోత్సాహం అందించాలి. మేకలు, గొర్రెల పెంపకానికి అవసరమైన సహకారం అందించాలి. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. మరింతగా పాల సేకరణ ► ప్రస్తుతం రాష్ట్రంలో 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ సంస్థ ఇప్పటి వరకు 419.51 లక్షల లీటర్ల పాలు సేకరించింది. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు రూ.179.65 కోట్ల చెల్లింపులు జరిగాయి. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే అదనంగా రూ.20.66 కోట్ల మేర పాడి రైతులు లబ్ధి పొందారు. ► అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి పొందగలిగారు. ఈ నేపథ్యంలో అమూల్ ద్వారా పాల సేకరణను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి. ► అమూల్ పాల సేకరణ వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో భాగంగా ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్ఎస్ శ్రీధర్, కే కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అహ్మద్ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు వివరించగా, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. -
సర్కారు ‘యంత్ర’తంత్రం.. కూలీల కొరతకు చెక్
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 980 మంది రైతులు 2,450 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో కూలీలు దొరక్క ఇబ్బందిపడేవారు. చిన్నచిన్న యంత్రాల కోసం కూడా దళారీలను ఆశ్రయించేవారు. సీజన్లో బెంగళూరు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే యంత్రాలకు వేలకు వేలు పోయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆర్బీకేల పరిధిలో ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాల ద్వారా ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్, ఇతర యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఒక్కో సీజన్లో పంటను బట్టి ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.. సాక్షి, అమరావతి: ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు రైతుల కష్టాలకు చెక్ చెబుతున్నాయి. కూలీల కొరతను తీర్చడమేకాదు.. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు తక్కువ ధరకే అద్దెకు ఇచ్చేందుకు ఆర్బీకే, క్లస్టర్ స్థాయిల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో వివిధ రకాల పరికరాలను 6,781 కేంద్రాల్లో.. రూ.25లక్షల అంచనా వ్యయంతో క్లస్టర్ స్థాయిలోని 391 కేంద్రాల్లో మరికొన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 40 శాతం సబ్సిడీపై రైతు గ్రూపులకు ఈ కేంద్రాల ద్వారా దుక్కి యంత్రాలు, దమ్ము, చదును చేసే పరికరాలు, వరి నాటే, నూర్పిడి యంత్రాలు.. విత్తనం, ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలను అందించింది. వీటితోపాటు ఇటీవలే ఆర్బీకే స్థాయిలో రైతు గ్రూపులకు 3,800 ట్రాక్టర్లను కూడా అధికారులు అందించారు. పంటల సరళి, స్థానిక డిమాండ్‌ను బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ, అద్దెలు నిర్ణయించే బాధ్యత రైతు కమిటీలకు అప్పగించారు. వీటి ధరలు, సంప్రదించవలసిన వారి వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు వీలుగా మండలానికి మూడు చొప్పున ఈ ఏడాది రెండువేల గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు డ్రోన్స్ సరఫరాకు చర్యలు చేపట్టింది. యంత్రాలతో పెట్టుబడి ఆదా నిజానికి.. దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.600, దమ్ముకు రూ.1,000లు తీసుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఆర్బీకేల్లోని ట్రాక్టర్లను అద్దెకు తీసుకుంటే రూ.ఐదారు వందలకు మించి అవడంలేదంటున్నారు. ► అలాగే.. సీడ్ కం ఫెర్టిలైట్ డిల్లర్ ద్వారా విత్తనాలతో పాటు మందును ఒకేసారి చల్లేందుకు ఎకరాకు రూ.300 వరకు మిగులుతోందని రైతులు అంటున్నారు. ► జొన్న, మొక్కజొన్న కట్టలు కట్టేందుకు గతంలో ఎకరాకు కూలీలకు రూ.1,500లు ఖర్చయ్యేది. అలాంటిది ప్రస్తుతం కట్టలు కట్టే మిషన్‌వల్ల రూ.ఐదారు వందలు మించి కావడంలేదు. ► మినుము పంటకు పురుగుల మందు పిచికారి కోసం ఎకరాకు ఒక్కో కూలీకి రూ.600 ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.200కు మించి కావడంలేదు. ► ఇక గతంలో కోత మిషన్‌కు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలు చెల్లించే వారు. కానీ, ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3వేల లోపే అవుతోందని రైతులు చెబుతున్నారు. ..ఇలా ఇతర పరికరాల ద్వారా పొందే ఆదా లెక్కిస్తే రెండు సీజన్లు కలుపుకుని పంటను బట్టి ఎకరాకు రూ.10 వేలకు పైగా ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రైతు గ్రూపునకు ఆదాయం గ్రామంలో ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి ట్రాక్టర్–టిల్లర్ తీసుకున్నాం. మేం వాడుకోగా గ్రామంలో రైతులకు అద్దెకిస్తున్నాం. బయట ఎకరాకు రూ.1,300–రూ.1,500 తీసుకుంటున్నారు. మేం రూ.900–రూ.1,100కు ఇస్తున్నాం. ఎకరాకు రూ.400 వరకు ఆదా అవుతుండడంతో మా వద్ద అద్దెకు తీసుకునేందుకు గ్రామంలో మెజార్టీ రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. – పత్తి వెంకటబ్రహ్మయ్య, ఆలమూరు, నంద్యాల జిల్లా పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది మా గ్రూపు తరఫున రెండు రోటేవేటర్లు, రౌండ్ పీలర్, థ్రషర్స్ తీసుకున్నాం. రోటోవేటర్‌కు బయట ఎకరాకు రూ.1,800 వరకు తీసుకుంటున్నారు. మేం రూ.900కే అద్దెకిస్తున్నాం. థ్రషర్కు బయట రూ.2వేలు తీసుకుంటే. మేం రూ.1,600కే ఇస్తున్నాం. రౌండ్ పీలర్కు కట్టకు రూ.30లు తీసుకుంటే మేం రూ.25లకే ఇస్తున్నాం. వీటివల్ల మాకే కాదు.. గ్రామంలో మెజార్టీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – పగిడి శివరామయ్య, రుద్రవరం, నంద్యాల జిల్లా ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేదు మా గ్రూపు ద్వారా ట్రాక్టర్ తీసుకున్నాం. మేం మిరప, మినుము సాగుచేస్తున్నాం. మేం వినియోగించుకోగా గ్రామంలో మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా అన్ని రకాల పనులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – జమ్మి సురేష్, దేవరపల్లి, ఏలూరు జిల్లా రూ.3.64 లక్షలు సబ్సిడీ జమైంది మా గ్రూపు కింద ఇటీవలే తైవాన్ స్ప్రేయర్లు, న్యూ హాలాండ్ ట్రాక్టర్ తీసుకున్నాం. వీటి ఖరీదు రూ.9.57 లక్షలు కాగా.. రూ.3.64 లక్షల సబ్సిడీ జమైంది. ఖరీఫ్ సాగు వేళ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మా గ్రూపులో రైతులందరి అవసరాలు పూర్తికాగానే ఇతర రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – భీమవరపు శివరామకృష్ణ, పెనుమూలి, గుంటూరు జిల్లా -
AP: రైతన్నలకు శుభవార్త.. 50% సబ్సిడీపై..
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన అత్యాధునిక యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 50% సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనుంది. రూ.2,016 కోట్ల అంచనా వ్యయంతో.. రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల (రూ.6 లక్షలు సబ్సిడీ) విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల (రూ.10 లక్షలు సబ్సిడీ) అంచనా వ్యయం కాగల కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల విలువైన 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. వీటికి అదనంగా త్వరలో రైతన్నలకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 1.80 లక్షల మందిని సర్వే చేసి.. రైతులకు ఏ పరికరాలు అవసరమో గుర్తించేందుకు ఆర్బీకే స్థాయిలో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి 20 మంది చొప్పున రాండమ్‌గా 1.80 లక్షల మందిని సర్వే చేసి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 34 శాతం మంది.. పీపీ ఎక్విప్మెంట్స్ (నాప్సాక్, తైవాన్, పూట్ బూమ్ తదితర కంపెనీలకు చెందిన స్ప్రేయర్లు), 25 శాతం మంది.. టార్పాలిన్స్, 15 శాతం మంది.. భూమి చదును యంత్రాలు (కల్టివేటర్స్, ఎంబీ ప్లాఫ్, లెవెలింగ్ బ్లేడ్, డిస్క్ ప్లో, డిస్క్ పడ్లెర్, రోటో పడ్లెర్ తదితర), 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ (పవర్ టిల్లర్, పవర్ వీడర్, క్రాప్ రేపర్, బ్రష్ కట్టర్, చాప్ కట్టర్), 9 శాతం మంది.. రోటోవేటర్స్, 4 శాతం మంది.. సీడింగ్ పరికరాలు (సీడింగ్ డ్రిల్, సీడ్ కమ్ పెర్ట్ డ్రిల్, డ్రమ్ సీడర్), ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్మెంట్ కావాలని కోరారు. 50 శాతం సబ్సిడీపై పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైన యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామానికి 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైనవి 2 యూనిట్ల చొప్పున 50 శాతం సబ్సిడీపై మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యూనిట్లను అందించడానికి రూ.403 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అర్హుల గుర్తింపు పూర్తికాగానే అమలుకు చర్యలు.. గత మూడేళ్లలో గ్రామ, క్లస్టర్ స్థాయిలో రైతు కమిటీలతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అందించాం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీహెచ్‌సీలతో పాటు వ్యక్తిగతంగా రైతులకు పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అర్హుల గుర్తింపు కోసం విధివిధానాల రూపకల్పన పూర్తి కాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. –కాకాని గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రైతన్నకు ‘యంత్రం’
నాడు– నేడు.. తేడా చూడండి గతానికి, ఇప్పటికి ఎంత తేడా ఉందో గమనించాలని ప్రతి రైతన్ననూ కోరుతున్నా. గతంలో చంద్రబాబు హయాంలో అరకొరగా ట్రాక్టర్లు ఇచ్చారు. అయితే రైతులు ఎవరూ ట్రాక్టర్ల కోసం ఆర్డర్లు ఇవ్వలేదు. నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కలసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో కుమ్మక్కై స్కామ్‌లు చేశారు. ఈ రోజు ట్రాక్టర్ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతుల ఇష్టానికే వదిలిపెట్టాం. రైతు తనకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్, తనకు నచ్చిన పనిముట్టును తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. 175 రకాల ట్రాక్టర్ల మోడళ్లలో రైతు తనకు నచ్చింది కొనుగోలు చేసే అవకాశం కల్పించాం. ప్రభుత్వం రైతుకు సబ్సిడీ ఇస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేస్తున్నామో గమనించండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: అన్నదాతల సాగు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే వైఎస్సార్ యంత్ర సేవా పథకం గుంటూరు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి మెగా పంపిణీలో భాగంగా 3,800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 5,260 రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు చుట్టుగుంట వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. ఆర్బీకే పరిధిలో సరసమైన ధరలకే.. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతన్నలకు తోడుగా ఉండేందుకు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను నిర్మించాం. ఈరోజు మరో గొప్ప కార్యక్రమం మొదలైంది. వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని 10,750 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు కావాల్సిన పనిముట్లన్నీ తక్కువ ధరకు లభించేలా రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున 40 శాతం రాయితీ ఇస్తున్నాం. మరో 50 శాతం రుణాలను బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ వారికి గ్రామంలోనే ఆర్బీకేల పరిధిలో సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఈరోజు రూ.2,016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షలు విలువగల 10,750 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షలు విలువైన కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నాం. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం జగన్ రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేల్లోనూ సేవలు.. ఇవాళ ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేలకు ఈ సేవలన్నీ విస్తరిస్తాయి. ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తున్నాం. క్లస్టర్ స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ జరుగుతోంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్ల విలువైన ఉపకరణాలకు సంబంధించి రూ.175 కోట్ల సబ్సిడీని కూడా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలతో కలిపి 6,780 ఆర్బీకేలు, 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతోంది. సంవత్సరం తిరగక ముందే రూ.2,016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, అంబటి రాంబాబు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కల్పలతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మద్దాళి గిరిధర్, నంబూరి శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మేకతోటి సుచరిత, ఉండవల్లి శ్రీదేవి, ముస్తఫా, కిలారు రోశయ్య, ఉన్నతాధికారులు వై. శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, ప్రవీణ్‌కుమార్, హరికిషన్, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు. హరిత నగరాలు.. జిందాల్ పవర్ ప్లాంట్ ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆ«ధ్వర్యంలో నిర్వహించే జగనన్న హరిత నగరాలు కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కొండవీడులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ రావి, వేప మొక్కలను నాటారు. అనంతరం రూ.345 కోట్ల వ్యయంతో నిర్మించిన జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి పైలాన్ ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిందాల్ ప్లాంట్ నమూనాను పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, చెత్త వినియోగించి విద్యుదుత్పత్తిపై జిందాల్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు వైఎస్సార్ యాంత్రీకరణ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రస్తుతం సాగులో కూలీల కొరత అధికంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి రైతుభరోసా కేంద్రానికి యంత్ర పరికరాలు సమకూర్చడం వల్ల వ్యవసాయ పనులు ముమ్మరం చేయవచ్చు. ఇప్పటికే రైతుభరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందించారు. రైతుభరోసా డబ్బులు పెట్టుబడికి ఉపయోగపడతాయి. మా గ్రామంలోని ఆర్బీకేలో అన్నీ సకాలంలోనే అందుతున్నాయి. సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – అర్చనాల ఉమాశంకర్, బోదనంపాడు గ్రామం, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా సీఎంకు రుణపడి ఉంటాం రైతుల కష్టాలను గుర్తించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతుభరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమచేస్తున్నారు. ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటోంది. దీంతోపాటు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద శ్రీరామా సీహెచ్‌సీ గ్రూప్ ద్వారా ట్రాక్టర్ మంజూరు చేయడం ఆనందంగా ఉంది. ట్రాక్టర్ వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. – ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, వడ్లమూడి గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా ఆధునిక పరికరాల పంపిణీ బాగుంది ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలంటే కష్టతరంగా ఉంటోంది. కానీ వైఎస్ జగన్ పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేయడం బాగుంది. అది కూడా సబ్సిడీ కింద మంజూరు చేయడం ఎంతో మేలు కలిగిస్తోంది. ఆర్బీకేల వద్దే తక్కువ అద్దెకి అందుబాటులోకి తీసుకువచ్చి సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో వైఎస్సార్ యంత్ర సేవా పథకం అమలు చేయడం బాగుంది. – జి.శ్రీరామాంజనేయులు, శ్రీనివాస జేఎల్సీ గ్రూప్, కంచకోడూరు, గూడూరు మండలం, కృష్ణాజిల్లా సంతోషంగా ఉంది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత బీమా పథకం కింద పూర్తి నష్టపరిహారం అందించడం ఆనందంగా ఉంది. అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్‌ను రైతులకు మంజూరు చేయించడం బాగుంది. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. – వీర్ల నాగేశ్వరరావు, శ్రీపైలమ్మ తల్లి గ్రూప్, ప్రత్తిపాడు గ్రామం, పెంటపాడు మండలం, ఏలూరు జిల్లా పండుగలా వ్యవసాయం వ్యవసాయం దండగ అంటూ సాగుని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. అన్నదాతలను కడగండ్లపాలు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారు. గత పాలకుల నాటి దుస్థితిని సీఎం జగన్ సమూలంగా మార్చారు. విత్తనం నుంచి పంట విక్రయించేవరకు అన్ని సేవలను రైతుల గడప వద్దనే అందించే వన్‌స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభపరిణామం. సబ్సిడీ కింద మంజూరు చేసిన ట్రాక్టర్ ద్వారా రోజుకి సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఆదాయం వస్తుంది. – షేక్.ఖాసీంషరీఫ్, ఇస్లాం రైతు మిత్ర గ్రూప్, లగడపాడు గ్రామం, పల్నాడు జిల్లా -
వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
-
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం
-
CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్నిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి సీఎంతో ఉన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్
సాక్షి, గుంటూరు జిల్లా: వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. గుంటూరులో రాష్ట్ర స్థాయి మెగా పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్. జగన్ ఏమన్నారంటే..: గొప్ప కార్యక్రమమిది ఈ రోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించాం. ఆర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలబడుతున్నాయి. చదవండి: ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య ఆర్భీకే పరిధిలో సరసమైన ధరలకే... 10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపర్చేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నాం. మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే ఈరోజు రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేల్లోనూ సేవలు.. ఇవాళ ఆర్భీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాయి. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్రపరికరాలను కూడా అందిస్తున్నాం. క్లస్టర్ స్దాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ కూడా జరుగుతుంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్లు విలువచేసే సామాన్లుకు సంబంధించిన.... రూ.175 కోట్ల సబ్సిడీని కూడా ఈ కార్యక్రమంలోనే వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్రపరికరాలన్నీ కలిపి ఇప్పటికి 6780 ఆర్బీకేల్లోకి, మరో 391 క్లస్టర్ స్దాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతుంది. రాబోయే రోజుల్లో సంవత్సరం తిరక్క మునుపే రూ.2016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ... మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. చివరగా.. ఒక చిన్న తేడాను గమనించమని ప్రతి రైతన్నను కోరుతున్నాను. ఇదే కార్యక్రమంలో భాగంగా గతంలో చంద్రబాబునాయుడు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులు ఎవరూ కూడా వాళ్లు ట్రాక్టర్ల ఆర్డర్లు ప్లేస్ చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడు అంతా కలిసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో స్కామ్‌లు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించండి. ఈ రోజు ట్రాక్టర్ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతు ఇష్టానికి వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్‌నైనా తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సబ్సిడీ ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. అవినీతి లేకుండా.. అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా ఏ రకంగా వ్యవస్ధను క్లీన్ చేస్తున్నామో.. గమనించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా చూడండి. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్ కొనుగోలు చేసే అవకాశం ఇచ్చాం అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. అనంతరం రూ.175 కోట్ల సబ్సిడీ అమౌంట్‌ను కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతు గ్రూపుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్, వైఎస్సార్ యంత్రసేవా పథకంలో భాగంగా రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Live Blog: 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
‘వైఎస్సార్ యంత్ర సేవ’మెగా మేళా (ఫొటోలు)
-
AP: రాష్ట్ర స్థాయి మెగా మేళా
సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం కింద రాష్ట్ర స్థాయి మెగా మేళాను మంగళవారం గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం 5,262 రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెగా మేళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్, అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఏడాది పాటు సర్వీసింగ్, ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు ఈ ఏడాది రెండు వేల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం రూ.2,106 కోట్లతో ఆర్బీకే స్థాయిలో ఒక్కోటి రూ.15 లక్షల విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించనున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
CM Jagan: ఈనెల 7న గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. మెగా మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. అలాగే హరిత నగరాలు కింద పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వారి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర రైతాంగం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం క్రింద రాష్ట్ర స్థాయి మెగా మేళా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జూన్ 7వ తేది నాడు రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చదవండి👉 వరదాపురం X పరిటాల.. ఢీ అంటే ఢీ! కొనసాగుతున్న మాటల యుద్ధం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో.. వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి.. పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రైతన్నలకు తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహిస్తాయి. పంటల సరళి, స్థానిక డిమాండ్ కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె. సంప్రదించ వలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు ప్రభుత్వంగా, ‘వ్యవసాయం దండగ’ అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్థితిని సమూలంగా మారుస్తూ... రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. "విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే" అందించే వన్ స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి, వైఎస్సార్ రైతు భరోసా క్రింద రైతన్నలకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. చదవండి👉🏻 పవన్ కల్యాణ్‌కి చురకలంటించిన కేవీపీ రైతులపై పైసా భారం పడకుండా సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్రింద ఒక ఖరీఫ్ కు సబంధించిన బీమా పరిహారం ఆ తరువాతి ఖరీఫ్ ప్రారంభ సమయానికే చెల్లిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తూ అన్నివేళలా రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది. రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసి యంత్ర పరికరాలు రైతులకు పెద్ద సంఖ్యలో అందజేస్తుంది. రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. అలాగే ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద మొత్తం సబ్సిడీగా మొత్తం రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం నాడు జరిగే మెగా మెళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యాంత్రీకరణలో భాగంగా దుక్కి యంత్రాలు, దమ్మచదను చేసే పరికరాలు, వరినాటు యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, విత్తనం-ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలు మొదలైనవాటిలో స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన యంత్రాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు కూడా యంత్ర పరికరాలపై చేస్తున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం ఉపయోగపడుతుంది. చదవండి👉🏼 ఇలాంటి పోలీస్ ఒక్కడున్నా చాలు! సొంత డబ్బులతో.. -
AP: మెగా మేళాకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 5,177 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ప్రారంభిస్తోంది. రైతుల కమిటీలతో కూడిన ఈ సీహెచ్‌సీల ద్వారా ఆ ప్రాంత రైతులకు ఎక్కువ ఏ యంత్ర పరికరాలు అవసరమో వాటిని అందిస్తారు. ఇందులో భాగంగా తొలిసారిగా ప్రభుత్వం ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను అందుబాటులోకి తెస్తోంది. మంగళవారం (7వ తేదీ) గుంటూరు చుట్టుగుంట సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. చిన్న, సన్నకారు రైతుల కోసం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చిన్న, సన్నకారు రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో రూ.1,612.50 కోట్లతో 10,750 సీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా సాగయ్యే ఎనిమిది (ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల్లో క్లస్టర్ స్థాయిలో రూ.403.75 కోట్లతో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెస్తోంది. ఈ మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. రైతు కమిటీలు పది శాతం , మిగిలిన 50 శాతం ఆప్కాబ్ ద్వారా రుణంగా అందిస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల చొప్పున ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో రూ.163.70 కోట్లతో 3,624 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.17.75 కోట్లతో 71 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.65.06 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించింది. మిగిలిన మొత్తంలో రూ.25.66 కోట్లు రైతు కమిటీలు సమకూర్చుకోగా, రూ.90.72 కోట్లు రుణంగా అందించారు. నాలుగో విడతలో 5,177 సీహెచ్‌సీలు నాలుగో విడతలో రూ.470 కోట్ల అంచనా వ్యయంతో 5,177 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ట్రాక్టర్లతో కూడిన ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు 3,800 ఉంటాయి. హార్వెస్టర్లతో కూడినవి 320 క్లస్టర్ స్థాయిలో ఉన్నాయి. ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలతో ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు మరో 1,057 ఏర్పాటు చేస్తున్నారు. వ్యయంలో రూ.170 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగిలిన మొత్తంలో 10 శాతం రైతు కమిటీలు, మిగిలినది బ్యాంకుల నుంచి రుణం రూపంలో అందిస్తున్నారు. ప్రతి సీహెచ్‌సీకి ఓ ట్రాక్టర్ ఆర్బీకే స్థాయిలో ప్రతి సీహెచ్‌సీకి ఓ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం ఏడుకు పైగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వందకు పైగా మోడళ్లు ఉంటాయి. హార్స్ పవర్‌ను బట్టి రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ విలువలో 40 శాతం (రూ.2లక్షల నుంచి రూ.3.4లక్షల) వరకు సబ్సిడీగా అందిస్తున్నారు. తొలి విడతగా మండలానికి కనీసం ఆరు చొప్పున 3,800 ట్రాక్టర్లను ఇస్తారు. కంబైన్డ్ హార్వెస్టర్ల మాదిరిగానే ఈ ట్రాక్టర్లకు కూడా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను అమర్చుతున్నారు. రైతుల వెతలు తీర్చేందుకే విత్తు నుంచి కోతల వరకు కూలీల కోసం రైతులు పడుతున్న ఇక్కట్లకు తెరదించేందుకే గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను తీసుకొస్తోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆర్బీకేలోనూ ఓ ట్రాక్టర్ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే తొలి విడతగా 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేయబోతున్నాం. 320 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు, ఇతర పరికరాలతో మరో 1,057 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. మెగా మేళా రూపంలో రాష్ట్రస్థాయిలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. – వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని 7వ తేదీన ప్రారంభించనున్నారు. పథకం కింద వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్ హార్వెస్టర్స్ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేళా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హరికిరణ్ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్ హార్వెస్టర్స్‌ను పంపిణీ చేస్తారని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ జరిగే ప్రాంతానికి రవాణా సౌకర్యం, తాగునీరు, వసతి వంటి సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేళా ప్రాంతానికి ముందుగానే యంత్రాలు చేరేలా కంపెనీ ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. (చదవండి: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ) -
6న యంత్ర సేవా పథకం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆధార్ అనుసంధానం, జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) మ్యాపింగ్ విఫలమవడంతో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ లబ్ధి పొందని రైతులపై దృష్టి పెట్టి వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రైతు భరోసా అందించాలన్నారు. జూన్ 6న గుంటూరు జిల్లాలో వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని చెప్పారు. అదే సమయంలో జిల్లా స్థాయిల్లో కూడా స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులతో ట్రాక్టర్ల పంపిణీతోపాటు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సీహెచ్‌సీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
పంటలు నష్టపోయిన రైతన్నలకు రూ.542.06 కోట్లు
-
చంద్రబాబు మాటలను సీఎం జగన్‌కు వివరించిన మంత్రి కన్నబాబు
-
నేడు రైతన్నలకు అకౌంట్లలో నేరుగా జమచేయనున్న సీఎం జగన్
-
రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీని జమ చేశారు. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్నాం. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. రాయలసీమలో గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాం. నేలకోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిస్తున్నాం. శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాఫ్ట్ డేటాను ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణ స్థాయిల్లో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్ప్లే చేస్తున్నాం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1612 కోట్ల సాయం అందించాం. 18.70 లక్షల మంది రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ♦రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తోంది ♦అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ 80శాతం సబ్సితో 1.43 లక్షలమంది రైతులకు విత్తనాలు ఇచ్చాం ♦అవాళ జరిగిన ఆనష్టాన్ని.. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ రూపేణా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే ♦మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు ♦ఏ సీజన్లో నష్టం జరిగితే.. ఆ సీజన్లో తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ లేదు ♦గత ప్రభుత్వంలో కొన్ని సార్లు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు ♦మరికొన్ని సార్లు,, అరకొరగా, ఆలస్యంగా, అదికూడా కొందరికే ఇచ్చారు ♦గత ప్రభుత్వం ఏరకంగా ఇచ్చిందో గమనించాలి ♦2014 ఖరీఫ్‌లో కరువకు 2015 నవంబర్‌లో గాని ఇవ్వలేదు ♦2015 కరువుకు, 2016 నవంబర్‌లోగాని ఇవ్వలేదు ♦2015 నవంబర్, డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.263 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు ♦2016 కరువుకు సంబంధించి 2017 జూన్‌లో ఇచ్చారు ♦2017 కరువుకు సంబంధించి 2018 ఆగస్టులో ఇచ్చారు ♦2018లో ఖరీఫ్‌లో రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు ♦అదికూడా అరకొరగా, కొందరికే ఇచ్చిన పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు తేడా చూడండి ♦కౌలు రైతులను ఎప్పుడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ♦మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా, ఇ–క్రాప్ డేటాతో పంట నష్టాలను అంచనావేసి, ఆర్బీకేలస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రవేశపెట్టాం ♦తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్లో జరిగిన పంటనష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో సమచేస్తున్నాం ♦కౌలు రైతులకు సైతం... ఇ–క్రాప్ డేటా తీసుకుని వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం ♦ఇలా చేస్తున్నాం కాబట్టే 2020 మారిలో కురిసిన వర్షాలవల్ల నష్టపోయిన రైతులకు 1.56 లక్షల మంది రైతులకు రూ.123.7 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 ఏప్రిల్‌లో అందచేశాం ♦2020 ఏప్రిల్ల్ నుండి 2020 అక్టోబరు వరకూ కురిసిన నష్టోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278.87 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 అక్టోబరులోనే ఇచ్చాం ♦2020 నవంబర్‌లో నివర్ సైక్లోన్‌లో దెబ్బతిన్న రూ.8.35 లక్షలమంది రైతులకు రూ.645.99 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా 2020 డిసెంబర్లోనే అందించాం ♦2021 సెప్టెంబరులో గులాబ్ సైక్లోన్‌వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ.21.96 కోట్ల సహాయాన్ని 2021 నవంబర్‌లో అందచేశాం ♦ఏ ఒక్కరు కూడామిస్ కాకుండా సహాయాన్ని అందిస్తున్నాం ♦మన అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇవ్వాళ్టి వరకూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 మంది లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీద్వారా రూ.1,612.62 కోట్ల రూపాయలను అందించాం ♦రైతన్నలు పలు కార్యక్రమాలద్వారా అండగా నిలుస్తున్నాం ♦వైఎస్సార్రైతు భరోసా – పీఎంకిసాన్ ద్వారా అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.19,126 కోట్లు ఇచ్చాం ♦దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500 చొప్పున రైతు భరోసా సాయం కింద అందిస్తున్నాం ♦ఏకైక ప్రభుత్వం దేశంలోనే మనది ♦పంట రుణాలపై సున్నా వడ్డీకింద పూర్తి వడ్డీ రాయితీని సమచేస్తున్నాం ♦65.64 లక్షలమంది రైతులకు రూ.1218 కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చాం ♦గత ప్రభుత్వ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది ♦రాష్ట్రలలో 18.7 లక్షలమంది రైతులన్నలకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ఇవ్వడానికి ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ♦ఇప్పటివరకూ రూ.23వేల కోట్లు ఖర్చు చేశాం ♦నాణ్యమై కరెంటు పగటిపూటే ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటు కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశాం ♦ఈ రెండున్నరేళ్ల కాలంలో వైయస్సార్ ఉచిత పంట బీమాద్వారా రైతన్నలకు 31.07వేలమంది రైతులకు రూ.3788 కోట్ల రూపాయలు రైతన్నలకు అందించగలిగాం ♦రూ.2వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం ♦రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ♦ధాన్యం సేకరణ కోసం అక్షరాల రూ.39వేల కోట్లు ఖర్చు చేశాం ♦గతంలో సమయానికి డబ్బులు ఇవ్వని ఘటనలు చూశాం ♦ఇవాళ 21 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నాం ♦పత్తి కొనుగోలుకోసం రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకోసం రూ.6434 కోట్లు ఖర్చు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది ♦గత ప్రభుత్వం రైతన్నలకు ఉచిత విద్యుత్‌కోసం రూ.9వేల కోట్ల కరెంటును కొనుగోలు చేసి బకాయి పెట్టి వెళ్తే, ఈ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది ♦రూ. 383 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే స్వీకరించింది ♦రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించాం ♦ఇప్పటికే 9160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో అందుబాటులో పెట్టాం ♦ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం ♦మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం ♦నెలలో ఈ నాలుగు స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్నాయి ♦ఈ సమావేశాల్లో గుర్తించిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకారా సంఘాలనుంచి ఆప్కాబ్ వరకూ అన్నింటినీ ఆధునీకరిస్తున్నాం ♦సహకార రంగంలో హెచ్ఆర్ విధానాన్ని తీసుకువస్తున్నాం ♦పంటలు నష్టాల్లో ఉంటే.. సీఎంయాప్‌ను ఆర్బీకేల స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం -
ఇప్పుడిది రైతాంధ్ర
ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవి. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇలాగే కష్టపడి చదివితే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారు. మీకు ఏం కావాలన్నా తగిన సహకారం అందిస్తాం. గిరిజన, వెనకబడిన ప్రాంతాల నుంచి కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదివే పరిస్థితి వస్తుంది. – విద్యార్థులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపే గొప్ప వ్యవస్థను నెలకొల్పి స్పష్టమైన మార్పు తెచ్చామన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి బృందాలు ఏపీకి వస్తున్నాయని, ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న గొప్ప మార్పు అని గుర్తు చేశారు. కరోనా సవాల్ విసిరినా రైతుల కోసం అడుగులు ముందుకేస్తూ అండగా నిలిచామన్నారు. వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానని, రైతుల కళ్లలో దీపావళి కాంతులు ముందుగానే చూడాలని ఆకాంక్షిస్తూ మూడు పథకాల నిధులను ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు రూ.2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టైంది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ... రైతన్నల కళ్లల్లో ముందే దీపావళి వెలుగులు ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపు 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం అక్టోబరులో ఇవ్వాల్సిన డబ్బులను జమ చేస్తున్నాం. రైతు భరోసా కింద గత ఆగస్టులో విడుదల చేసిన డబ్బులతో కలిపి ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో రూ.2,052 కోట్లు ఇస్తున్నాం. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు రైతులకు సైతం రైతు భరోసా.. ఈ రెండున్నరేళ్లలో ఒక్క రైతు భరోసా పథకానికే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమిని సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ... వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు రూ.112.70 కోట్లను సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. ఇ–క్రాప్ డేటా ఆధారంగా రూ.లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఇందులో గత సర్కారు సున్నా వడ్డీ కింద ఎగ్గొట్టిన బకాయిలు రూ.1,180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద ఈరోజు 1,720 రైతు గ్రూపులకు అంటే ఒక్కో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీనిద్వారా రైతులు నిర్దేశించిన సరసమైన అద్దెకే యంత్రసేవలు వారికి అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా ఐదు చొప్పున 1,035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్టాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) అందుబాటులోకి తెస్తున్నాం. 29 నెలల్లో గణనీయమైన మార్పులు.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తెచ్చామన్నది ఈ సందర్భంగా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 29 నెలల్లో రైతుల కోసం ఎన్నెన్నో.. 9,160 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం. త్వరలో మిగిలిన ఆర్బీకేల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. ► కరోనా సవాల్ విసిరినప్పటికీ మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది. కరువుసీమలో సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రైతన్నలు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ► రైతులు నష్టపోకూడదని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తెచ్చాం. మద్దతు ధర రాక పొగాకు రైతులు ఇబ్బంది పడుతుంటే కొనుగోళ్లలో జోక్యం చేసుకుని బాసటగా నిల్చాం. ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) అందుబాటులోకి తెచ్చాం. కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కనీస మద్దతు బాటు ధరలు కల్పించాం. ► రైతు భరోసా కేంద్రాలను వన్ స్టాప్ సెంటర్లుగా (అన్ని అవసరాలు తీర్చే) తీర్చిదిద్దాం. ► వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు ద్వారా రైతులకు అన్ని విధాలుగా సలహాలు, సూచనలు ఇచ్చి.. ప్రతి అడుగులో తోడుగా నిలుస్తున్నాం. ► ఇ– క్రాపింగ్ ద్వారా పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు లాంటివి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ► కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థలో ఏఎంసీలను కూడా ఆధునికీకరిస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ► రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3,716 కోట్లు అందించగలిగాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ► రైతులకు పాల వెల్లువ, వైఎస్సార్ జలకళ.. ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ద్వారా తోడుగా నిలిచాం. జేఎఫ్ కెన్నడీ ఏమన్నారంటే.. ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా రైతు తాను పంట పండించడానికి కావాల్సిన అన్నింటినీ ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్‌గా కొనుగోలు చేస్తాడు. తాను కష్టపడి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్‌సేల్‌గా అమ్ముకునే పరిస్ధితి నెలకొందని అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అప్పట్లోనే చెప్పారు. మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితిని మనం మారుస్తున్నాం. పొలం వద్దకే ఆర్బీకే సిబ్బంది గిరిజన రైతునైన నాకు మీరు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ రైతు భరోసా మూడు దఫాలు అందింది. చాలా అనందంగా ఉన్నాం సార్. వైఎస్సార్ తరువాత ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మీ ప్రభుత్వంలో ఇచ్చారు. పోడు వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం. గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటారు. ఆర్బీకే సిబ్బంది నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు. –ఎం.విశ్వేశ్వర రావు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం, విశాఖపట్టణం జిల్లా ఇప్పుడు అన్నీ గ్రామంలోనే మీరు రైతాంగానికి వెన్నెముకలా నిలిచారు. వ్యవసాయ అధికారులు మా దగ్గరకు వచ్చి పంటల గురించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్ రైతులు ఆనందంగా ఉన్నారు. కరెంట్ బిల్లులు కట్టలేని సమయంలో వైఎస్సార్, మీరు చేసిన సాయం మరువలేం. ఇప్పుడు అన్నీ మా గ్రామంలోనే అందుతున్నాయి. –కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా మా కళ్లలో ఆనందం రైతు భరోసా ద్వారా మీరు అన్నదాతల కళ్లలో ఆనందం నింపారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్లి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. –శ్రీదేవమ్మ, లక్ష్మీదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా రైతులపై ప్రేమ మరోసారి చాటారు... సీఎం సార్.. మీరు చెప్పారంటే చేస్తారంతే అని రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి దీపావళి కంటే ముందే రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, యంత్ర సేవా పథకం సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఈరోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్ కూడా అధికారులను పిలిచి అభినందించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి ఆర్బీకే మోడల్‌ను తాము కూడా అనుసరిస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్పుట్స్ ఇవ్వటానికే పరిమితం కాకుండా ఆర్బీకేలను విజ్ఞాన కేంద్రంగా, సేవా నిలయాలుగా మార్చడం గొప్ప విషయం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
100% హామీల అమలు
-
అన్నదాతకు పండగ