AP CM YS Jagan To Launch YSR Yantra Seva Scheme In Guntur Today, Details Inside - Sakshi
Sakshi News home page

YSR Yantra Seva Scheme Launch: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్‌

Published Tue, Jun 7 2022 12:04 PM | Last Updated on Tue, Jun 7 2022 3:17 PM

AP CM YS Jagan To Launch YSR Yantra Seva Scheme - Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: వైఎస్సార్‌ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. గుంటూరులో రాష్ట్ర స్థాయి మెగా పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌. జగన్‌ ఏమన్నారంటే..:

గొప్ప కార్యక్రమమిది
ఈ రోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించాం. ఆర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలబడుతున్నాయి.
చదవండి: ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య

ఆర్భీకే పరిధిలో సరసమైన ధరలకే...
10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపర్చేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నాం. మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. 

ఇందులో భాగంగానే ఈరోజు రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.

రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేల్లోనూ సేవలు..
ఇవాళ ఆర్భీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాయి. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్రపరికరాలను కూడా అందిస్తున్నాం. క్లస్టర్‌ స్దాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ కూడా జరుగుతుంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్లు విలువచేసే సామాన్లుకు సంబంధించిన.... రూ.175 కోట్ల సబ్సిడీని కూడా ఈ కార్యక్రమంలోనే వారి ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేస్తున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్రపరికరాలన్నీ కలిపి ఇప్పటికి 6780 ఆర్బీకేల్లోకి, మరో 391 క్లస్టర్‌ స్దాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతుంది. రాబోయే రోజుల్లో సంవత్సరం తిరక్క మునుపే రూ.2016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ... మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను.

చివరగా..
ఒక చిన్న తేడాను గమనించమని ప్రతి రైతన్నను కోరుతున్నాను. ఇదే కార్యక్రమంలో భాగంగా గతంలో చంద్రబాబునాయుడు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులు ఎవరూ కూడా వాళ్లు ట్రాక్టర్ల ఆర్డర్లు ప్లేస్‌ చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడు అంతా కలిసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో స్కామ్‌లు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించండి. ఈ రోజు ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతు ఇష్టానికి వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్‌నైనా తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు తానే ఆర్డర్‌ ప్లేస్‌ చేస్తాడు. సబ్సిడీ ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. 

అవినీతి లేకుండా..
అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా ఏ రకంగా వ్యవస్ధను క్లీన్‌ చేస్తున్నామో.. గమనించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా చూడండి. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్‌ కొనుగోలు చేసే అవకాశం ఇచ్చాం అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు. అనంతరం రూ.175 కోట్ల సబ్సిడీ అమౌంట్‌ను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రైతు గ్రూపుల  ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్, వై​ఎస్సార్‌ యంత్రసేవా పథకంలో భాగంగా రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement