
సాక్షి, గుంటూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శుక్రవారం) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా రైతుల ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment