![CM YS Jagan Drives Tractor at YSR Yantra Seva Scheme Launching - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/7/APCMYSJagan_1.jpg.webp?itok=tOzvZtpo)
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్నిజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒక రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి సీఎంతో ఉన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమ చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: (వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment