CM YS Jagan Guntur Tour Live Updates - YSR Yantra Seva Scheme - Sakshi
Sakshi News home page

ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు: సీఎం జగన్‌

Published Fri, Jun 2 2023 10:10 AM | Last Updated on Fri, Jun 2 2023 12:39 PM

CM Jagan Guntur Tour YSR Yantra Seva Live Updates - Sakshi

రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు పంపిణీ చేసిన సీఎం జగన్‌

13, 573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన సీఎం జగన్‌

రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీ జమ చేసిన సీఎం జగన్‌

జెండా ఊపి వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం జగన్‌

రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్‌

సీఎం జగన్‌ కామెంట్స్‌

వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం

అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం

రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు

ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు

ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు

ప్రతి ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయం పరికరాలు

ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు

రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం

ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు 15 లక్షలు కేటాయించాం

రైతన్నకు అండగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం

రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తాం

గుంటూరుకు చేరుకున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

చుట్టుగుంట సెంటర్లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ

గుంటూరు బయలుదేరిన సీఎం జగన్

చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటు­న్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ­పెట్టిన పథకం ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’

గుంటూరు చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కం­బైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు.


వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అం­­చనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. 

ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకను­గు­ణంగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభు­త్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలు­వైన కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్‌ స్థాయిలోనూ ఏర్పాటు­చేస్తోంది.

ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరి­క­రాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభు­త్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పని­మున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement