
సాక్షి, అమరావతి: ఆధార్ అనుసంధానం, జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) మ్యాపింగ్ విఫలమవడంతో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ లబ్ధి పొందని రైతులపై దృష్టి పెట్టి వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రైతు భరోసా అందించాలన్నారు.
జూన్ 6న గుంటూరు జిల్లాలో వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని చెప్పారు. అదే సమయంలో జిల్లా స్థాయిల్లో కూడా స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులతో ట్రాక్టర్ల పంపిణీతోపాటు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సీహెచ్‌సీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment