Andhra Pradesh: నేడు మెగా యంత్ర సేవా మేళా | CM YS Jagan To Start YSR Yantra Seva Mega Mela At Guntur | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: నేడు మెగా యంత్ర సేవా మేళా

Published Fri, Jun 2 2023 4:43 AM | Last Updated on Fri, Jun 2 2023 7:17 AM

CM YS Jagan To Start YSR Yantra Seva Mega Mela At Guntur - Sakshi

పంపిణీకి సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు

సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటు­న్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ­పెట్టిన ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ పథకం కింద శుక్రవారం రాష్ట్ర­వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్త­య్యా­యి. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కం­బైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు.

వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అం­­చనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. 

40 శాతం సబ్సిడీ.. 50 శాతం రుణం
ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకను­గు­ణంగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభు­త్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలు­వైన కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్‌ స్థాయిలోనూ ఏర్పాటు­చేస్తోంది.

ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరి­క­రాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభు­త్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పని­మున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది.

నూరు శాతం ఆర్బీకేల్లో ఏర్పాటు లక్ష్యంగా..
ప్రతి ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు లక్ష్యంతో తాజాగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. గతేడాది 3,800 ఆర్బీకేల పరిధిలో ట్రాక్టర్లతో కూడిన యంత్ర పర­కరాలను అందించగా.. తాజాగా 2,562 ఆర్బీకేల్లో ఏర్పాటు­చేస్తు­న్నారు. రూ.361.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, సబ్సిడీ రూపంలో రూ.125.48 కోట్లు ప్రభుత్వం నేరుగా రైతు గ్రూపుల ఖాతాలకు జమచేయనుంది.

తాజాగా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో 2562 ట్రాక్టర్లు, 100 హార్వె­స్టర్లు, 13,573 యంత్ర పనిముట్లు సమకూరుస్తు­న్నారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరి­ధిలో రైతు గ్రూపులకు అందిస్తున్న ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వె­స్టర్లను గుంటూరులో శుక్రవారం సీఎం జగన్‌  ప్రార­ంభించడమే కాదు సబ్సిడీ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ­చేస్తారు. అదే సమయంలో నియోజకవర్గ కేంద్రాల్లో యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభిస్తారు.

జూలైలో కిసాన్‌ డ్రోన్లు అందుబాటులోకి..
ఇక కిసాన్‌ డ్రోన్‌ సేవలను సైతం ఆర్బీకే స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా­హాలు చేస్తోంది. తొలి విడతలో మండలానికి మూడు చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జూలైలో 500 డ్రోన్‌ సీహెచ్‌సీలు ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. రైతుల కోరిక మేరకు 50 శాతం సబ్సిడీపై ఏడు లక్షల స్ప్రేయర్లు, టార్పాలిన్లను అక్టోబర్‌లో పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు.

నేడు గుంటూరుకు సీఎం జగన్‌ 
సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 2న (నేడు) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో వైఎ­స్సార్‌ యంత్రసేవా పథకం మెగా­మేళా–­2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరు­కుంటారు.

అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు. చుట్టు­గుంటలో ఏర్పాటు­చేసిన వేదిక వద్ద వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగామేళా–2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్రస్థాయి పంపిణీ కార్యక్ర­మాన్ని ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభి­స్తారు. అనంతరం సీఎం తాడేపల్లి నివాసానికి చేరు­కుంటారు.

కొనుగోలు.. నిర్వహణ బాధ్యత రైతు గ్రూపులదే..
► పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాల ఎంపిక, కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రైతు గ్రూపులకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 

► యంత్ర పరికరాలు, వాటి అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. కనీసం 15 రోజుల ముందుగా మండల పరిధిలో ఏ ఆర్బీకే నుంచైనా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్‌ సీహెచ్‌సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసు­కొ­చ్చింది. 

► ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గ్రూపులకు వచ్చే ఆదాయం, రుణాల చెల్లింపు వివరాలను ఎప్ప­టి­­కప్పుడు నమోదు చేస్తూ వీటి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో డాష్‌ బోర్డునూ ఏర్పాటుచేశారు. 

► సీహెచ్‌సీల్లోని సభ్యులు సొంతంగా వినియోగించు­కోవ­డమే కాదు.. మండల పరిధిలోని చిన్న, సన్న­కారు రైతులకు అద్దెకిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement