జగిత్యాల శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి
ధర్మారం : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏప్రిల్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడానికి ప్రభుత్వం సర్వేలు చేయించినా ఇప్పటికీ నిధులు కేటాయించలదన్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వ రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించకపోగా ప్రతిపక్షపార్టీలపై విమర్శలకే ప్రాధాన్యం మివ్వటం సిగ్గుచేటన్నారు.
రైతు వ్యతి రేకి ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుండగా తెలంగాణలో కేసీఆర్ రైతులను పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. రుణమాఫీతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా బ్యాంకు రుణాలపై వడ్డీలు వసూలు చేయటంపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితే 2004లో రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడని గుర్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్, పెండింగ్ బిల్లు లు, అప్పటి వరకు రైతులపై ఉన్న కరెంటు కేసులను ఎత్తివేసిందని తెలిపారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్షా 50వేలు అందించిన ఘనత వైఎస్‌దేనని చెప్పుకొచ్చారు. కరువు నుంచి బయటపడేందుకు మద్దతు ధర, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని కోరుతే కేసీఆర్ మంత్రివర్గం ప్రతి విమర్శలకు దిగటం వారి దివాలకోరుతనానికి నిదర్శనమన్నా రు. రైతులు కరువుతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లటం న్యాయమా అని ప్రశ్నించారు. సమావేశం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాడె సూర్యనారాయణ, బ్లాక్-టూ అధ్యక్షుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కోరుకంటి స్వామి, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, నాయకులు కోమటిరెడ్డి సం జీవరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాంరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి
Published Mon, Sep 7 2015 4:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement