mla jeevan reddy
-
మరో వివాదంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అటాక్.. ఆ కారణం వల్లే పిస్టల్ తలకు గురిపెట్టి..
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ సోమవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. బిల్లులు ఆగాయని హత్యకు పథకం.. కొన్నాళ్లుగా జీవన్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్‌కు స్పర్థలున్నా యి. తన భార్య కల్లెడ సర్పంచ్‌గా ఉండగా ప్రసాద్ ఆ గ్రామంలో రూ.20 లక్షల విలువైన కాంట్రాక్టులు చేశాడు. ఈ పనుల్లో అవకతవ కలు జరిగినట్లు మాక్లూర్ ఎంపీఓ నివేదిక రూపొందించారు. దీంతో కలెక్టర్ కల్లెడ సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు. ప్రసాద్‌కు రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. విచక్షణ కోల్పోయిన ప్రసాద్ ఎంపీఓపై దాడి చేయడంతో మాక్లూర్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తనతో ఉన్న విభేదాలతో జీవన్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నాడని భావించిన ప్రసాద్.. హత్యకు పథకం వేశాడు. గత ఏప్రిల్‌లో నాందేడ్‌లో కత్తి, జూన్‌లో సంతోష్ సహకారంతో నగరంలోని నాంపల్లిలో ఎయిర్‌పిస్టల్, పిల్లెట్స్ కొన్నాడు. నేరుగా జీవన్‌రెడ్డి ఇంటికెళ్లినా ఆయన లేకపోవడంతో కొద్దిసేపు రెక్కీచేసి ఊరికి వెళ్లిపోయాడు. తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టి.. జూలై మొదటి వారంలో నిజామాబాద్‌కు చెందిన సుగుణ ద్వారా బాల్కొండకు చెందిన సురేందర్ ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. రూ.60 వేలు తీసుకున్న సురేందర్.. బిహార్‌లోని మున్నాకుమార్ ద్వారా నాటుపిస్టల్ తెప్పించి, ప్రసాద్‌కిచ్చాడు. తూటాల కోసం దమ్మాయ సాగర్‌తో కలిసి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నాంపల్లిలోని ఆర్మరీకి వెళ్లిన తూటాలు కావాలని అడి గినా వారు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి ప్రసాద్ బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి ఇంటికెళ్లాడు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి ఆయన తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టాడు. ఎమ్మెల్యే కేకలు వేయడం.. గన్మెన్లు అప్రమత్తం కావడంతో ప్రసాద్ పారిపోయాడు. జీవన్‌రెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ను పట్టుకుని.. కారు, ఎయిర్ పిస్టల్స్, పిల్లెట్స్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సుగుణ, సంతోష్, మున్నాకుమార్, సురేందర్, దమ్మాయ సాగర్ కోసం గాలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న గన్మెన్లపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, ప్రసాద్ భార్య పాత్రపై ఆధారాల్లేవని డీసీపీ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘నేనే కాంగ్రెస్.. కాంగ్రెస్సే నేను’.. ఆసక్తికరంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు -
ఎమ్యెల్యే జీవన్ రెడ్డి ఇంటికి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్
-
మాపై కావాలనే పగబట్టారు : మాజీ సర్పంచ్ లావణ్య
-
ప్రజా దర్బార్ కాదది.. పొలిటికల్ దర్బార్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
పంచాయతీ కార్మికులకు పది వేల జీతం ఇస్తాం
సారంగాపూర్(జగిత్యాల): కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచుతామని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సారంగాపూర్ మండల కేంద్రంలో సారంగాపూర్, బీర్పూర్ మండలాల పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తెలిపారు. ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగియడంతో, ప్రత్యేకాధికారులు భాధ్యతలు చేపట్టి, పారిశుధ్యం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమింపజేయడానికి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ్మెపై అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ పంచాయతీ కార్మికులు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించే ఆత్మగౌరవ సభలో వేతనం పెంపు హామీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా ప్రకటింపజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్య సరళ, వైస్ ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, మండల కోఅప్షన్ సభ్యుడు ఎండీ.ఇబ్రహీం, పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్, మాజీ సర్పంచ్ న్యారబోయిన గంగాధర్, పార్టీ సీనియర్ నాయకులు వురుమల్ల లక్ష్మారెడ్డి, కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణరెడ్డి, ఎదులాపురం లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
డీలర్ల పక్షాన నల్లకోటు వేసి వాదిస్తా!
కరీంనగర్: రేషన్ డీలర్లను తొలగిస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం డీలర్లు చట్టబద్ధంగా సమ్మె చేస్తామంటే సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం తగదన్నారు. డీలర్లకు అం డగా అవసరమైతే తాను నల్లకోటు వేసుకొని కోర్టులో వాదిస్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ నాలుగేళ్లుగా రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుండా వారికి ఇచ్చే కమీషన్ ఇతరత్రా అలవెన్సులు ఇవ్వకపోవడంతోనే సమ్మె అనివార్యమైందని చెప్పారు. ప్రభుత్వం బకాయి పడిన 415 కోట్లు వెంటనే విడుదల చేయాలని క్వింటాలుకు రూ.87 కమీషన్‌ను చెల్లించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా స మస్య పరిష్కారానికి మార్గం చూడాలని లే నిపక్షంలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ ?
-
కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా
సారంగాపూర్(జగిత్యాల): ఉపాధి హామీ కూలీలను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడిన సంఘటనలో 21 మంది గాయపడ్డారు. జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లి–పెంబట్ల గ్రామాల మధ్య సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల–రంగపేట గ్రామాల మధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీ ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాలీ ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాటగానే ఓవర్‌లోడ్ కారణంగా కుదుపునకు గురికావడంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌వేశాడు. దీంతో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు. సకాలంలో స్పందించిన పోలీసులు సంఘటన విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య 10 నిమిషాల్లో తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరామర్శించారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
రాయికల్(జగిత్యాల): మండలంలోని ఆలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అదనపు తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయమన్నారు. పాఠశాలలో మౌలిక వసతులకోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వైద్యులు డాక్టర్ గురువారెడ్డి, మల్లారెడ్డి, అమిత్, బోగ ప్రవీణ్, శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలోతహసీల్దార్ హన్మంతరెడ్డి, ఎంపీడీవో శివాజీ, సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి, ఎంపీటీసీ రాజేశ్‌యాదవ్, ఎంఈవో గంగాధర్ పాల్గొన్నారు. -
తాగునీటికే మొదటి ప్రాధాన్యత
రాయికల్(జగిత్యాల): తాగునీటి సమస్యకే మొదటి ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఇటీవల బావి తవ్వగా ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈద్గాకు 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. శ్మశాన వాటిక కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దోబిఘాట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపిమాధవి, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ కట్కం సులోచన, సింగిల్‌విండో చైర్మన్ పడిగెల రవీందర్‌రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ మొబిన్, ఉపసర్పంచ్ మ్యాకల రమేశ్, వార్డు సభ్యులు కోల రవి, నాయకులు మహిపాల్, మున్ను, దివాకర్ పాల్గొన్నారు. -
‘కేసీఆర్ ప్రధాని కాబోతున్నారు’
సాక్షి, హైదరాబాద్ : రాబోవు రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికే ప్రధాని కాబోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై టీడీపీ ఎంపీలు పెట్టిన ఆవిశ్వాస తీర్మానంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టె సమయంలో కేసీఆర్‌తో టీడీపీ ఏమైనా సంప్రదింపులు జరిపిందా అని ఆయన ప్రశ్నించారు. 2014 లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయం పై టీఆర్ఎస్తో సంప్రదించారా అని అడిగారు. ఇపుడు టీడీపీకి, బీజేపీకి చెడితే టీఆర్ఎస్ ఎందుకు టీడీపీకి అనుకూలంగా ఉండాలన్నారు. గత నాలుగు ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో పొత్తులు పెట్టుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగినపుడు టీడీపీ తమ పక్షాన మాట్లాడిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మొదటగా కేంద్రంతో పోరాటానికి సిద్ధమైందని కేసీఆర్ సర్కార్ అని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ ఎందుకు తమతో కలవలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, రాష్ట్రంలో రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ పోరాటం చేస్తోందని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. -
కేటీఆర్ దేశాలు తిరిగి ఇదే నేర్చుకున్నావా?
సాక్షి, హైదారాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానిస్తే తెరాస ఎంపీలు నోటికి బట్టకట్టుకొని కూర్చున్నారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి లొంగిపోయిందని, సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని, కేసీఆర్ ఉద్యమ స్పూర్తి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. జైతెలంగాణ నుంచి జై ఆంధ్రగా కేసీఆర్ మారిందని విమర్శించారు. దేశాలు తిరిగి ఇదే నేర్చుకున్నావా? : గీతారెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న మంత్రి ఇలా మాట్లాడటం భావ్యమేనా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోనియాగాంధీ దగ్గర మోకరిల్లారని.. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆరోజు రాహుల్ గాంధీ పప్పు అనిపించే అక్కడికెళ్లారా అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు గాని, ఇతర టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పప్పు కాదని, గుజరాత్ ఎన్నికల్లో మోదీని రాహుల్ గాంధీ గడగడలాడించారని పేర్కొన్నారు. -
పనుల్లో నిబంధనలు పాటించాలి
జగిత్యాల రూరల్ : మిషన్ భగీరథ పనులు నిబంధనలు పాటించి నిర్వహించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల మండలం ధరూర్ గ్రామంలో రూ. కోటి 26 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యంతో నిర్మించే వాటర్‌ట్యాంక్ పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. అలాగే కన్నాపూర్ గ్రామంలో రూ.3 లక్షలతో నిర్మించే బుడిగజంగాల సామూహిక భవన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల వల్ల గ్రామాల్లో తారురోడ్లు, సీసీరోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. పనులు కాగానే మరమ్మతులు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్తున్నారని, దీంతో గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ముందుగానే మరమ్మతు పనులకు గ్రామపంచాయతీల్లో డిపాజిట్ చేసి పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి పైప్లైన్లు ధ్వంసం కాకుండా స్థానిక నాయకులను సంప్రదించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అవగాహన లేకుండా నిర్మాణ పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఉన్న పైప్లైన్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పనుల నిర్వహణ బాధ్యత ఐదేళ్లపాటు కాంట్రాక్టర్లదేనన్నారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి, సర్పంచులు కొలుగూరి జలజ, సిరిగిరి తిరుపతి, ఎంపీటీసీలు శీలం సురేందర్, గాలిపల్లి శేఖర్, నాయకులు కొలుగూరి దామోదర్‌రావు, శీలం మల్లేశం, పెండెం రాములు, సతీశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం మిషన్ భగీరథ నిర్వహణ పనులపై బుధవారం తక్కళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నీటి సరఫరా పైప్లైన్లు మిషన్ భగీరథ పనుల్లో ధ్వంసం కావడంతో ఐదు రోజులుగా తాగునీరు అందకపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పనులను ఆయన పరిశీలించారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ స్థానికులను సంప్రదించి పనులు చేయాలని, ప్రస్తుతం గ్రామస్తులకు పైపుల మరమ్మతులతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో నిర్మాణం చేసే గ్రామాల్లో తాగునీటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా పనులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం దశరథరెడ్డి, గంగాధర్, మల్లారెడ్డి, సతీశ్ ఉన్నారు. -
రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది: ఎ.జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంపత్‌ను ప్రశ్నించారు. ప్రతిగా ఎమ్మెల్యే సంపత్.. ‘అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్ఎస్కు లేదు. అసలు టీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు..’అంటూ స్పందించారు. -
వైఎస్ హయాం స్వర్ణయుగం: జీవన్‌రెడ్డి
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్షిప్–2017 కేంద్ర పురస్కారం వరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు లేక పంటలకు గిట్టుబాటు ధర లభించక, పంట రుణాలు అందక, రుణ మాఫీ జరగక వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ను కేంద్ర పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పరిశీలిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ విధానం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. సాగుకు పెట్టుబడులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానాంశాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఒకవేళ గిట్టుబాటు ధర తక్కువగా ఉంటే బోనస్ ప్రకటించి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.3వేలు కల్పించాలని, పప్పు దినుసులు, పసుపు, మిర్చి పంటలకు రూ.10వేల గిట్టుబాటు ధర కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 30శాతానికి మించి రైతులకు పంట రుణం అందలేదన్నారు. నాడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 2004–2009 వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయ రంగం స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల ప్రోత్సాహకం, పప్పుదినుసులకు రూ.200, వరికి రూ.50 బోనస్ కల్పించి రైతులకు భరోసా ఇచ్చారని జీవన్‌రెడ్డి చెప్పారు. -
ప్రకటనలతో కాలం గడుపుతున్నారు: జీవన్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వం, నిందను కేంద్రంపై వేసి, చేతులెత్తేసిందని కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ నుండే రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వవలసి ఉందన్నారు. రైతు సమస్యలను దృష్టి మళ్లించడానికే సమగ్ర భూ సర్వేను సీఎం తెరమీదకు తీసుకొచ్చారని, మండలానికి ఒక్క సర్వేయర్ కూడా దిక్కు లేదని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సమావేశానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని ఎద్దేవా చేశారు. ఖరీఫ్, రబీలకు సంబంధించి జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమావేశాలు కూడా ఇంతవరకు నిర్వహించలేదన్నారు. పెట్టుబడి రాయితీ కాదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకటనలతోనే సీఎం కాలం గడుపుతున్నారని, రుణమాఫీ ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదని మండిపడ్డారు. మద్దతు ధరపై బోనస్ ఎందుకు ప్రకటించడంలేదని ఆయన ప్రశ్నించారు. సమగ్ర భూ సర్వే కూడా మరో సమగ్ర కుటుంబ సర్వేలాగే అవుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇచ్చి రైతులకు అండగా ఉండాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదు: జీవన్ రెడ్డి
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనకు చట్టాలపై అవగాహన ఉందో లేదో తెలియదని, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాలతో సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్‌ను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. ఆయనేమీ రాజ్యాంగానికి అతీతుడు కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్ సమర్పించలేదని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. చెప్పే అబద్ధాలకు, చేసే మోసాలకు ముక్కు నేలకు రాయాల్సి వస్తే కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత- చేవెళ్ల తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా, రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణ జాప్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విధి లేని పరిస్థితుల్లోనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ కోసం ఆమరణ దీక్షకు దిగుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో పౌరహక్కులకు విలువ లేదన్నారు. అహంకారమే కేసీఆర్‌ను గద్దె దించుతుందని జీవన్‌రెడ్డి తెలిపారు. -
'మియాపూర్ స్కాం వెనుక పెద్ద తలకాయలు'
హైదరాబాద్: మియాపూర్ భూ అక్రమాల వెనుక గోల్డ్‌స్టోన్ ప్రసాదే కాకుండా ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గోల్డ్ స్టోన్ వెనుక ఉన్న వారెవరో తెలియాలంటే సీఐడీ విచారణతో సాధ్యం కాదన్నారు. 690 ఎకరాలు ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నాయో ప్రభుత్వం బయట పెట్టడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలని, లేదంటే ఆయన హస్తం కూడా ఉన్నట్లు భావించాల్సి వస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును వెంటనే ప్రభుత్వం సీబీఐకి అప్పగించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. సరైన విచారణ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, దీనిపై న్యాయపరంగా వెళతామని, ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇది మరో నయీమ్ కేసు అని, ఓటుకు నోటు, ఎంసెట్ లీకేజి కేసుల్లా దీన్నికూడా నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు అన్నారు. నయీమ్ కేసుతో సంబంధాలున్నాయని తెలిసినా మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. -
కేసీఆర్ ఓయూలో ఎందుకు మాట్లాడలేదు
-
కన్నుల పండువగా వేణుగోపాలస్వామి కల్యాణం
రాయికల్ : మండలంలోని చింతలూరు గ్రామంలోని వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు చెరుకు మహేశ్వరశర్మ, మధుశర్మ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య కల్యాణం కన్నుల పండువగా జరిపారు. హాజరైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సర్పంచ్ కదుర్ల లక్ష్మి,రాయికల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎనుగందుల ఉదయశ్రీ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో... ఇబ్రహీంపట్నం : మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి కల్యాణాన్ని అర్చకులు మంత్రరాజం రాముచార్యులు, రామకృష్ణచార్యులు, అజయ్‌చార్యులు వేదమంత్రాలతో నిర్వహిం చారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన నిర్మల్ ఏపీపీ గుడ్ల రామకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి యేసుగౌడ్, సత్త య్య, హరీశ్, శ్రీకాంత్, వీడీసీ సభ్యులు దొనికెన నారా యణ, రాధారపు ప్రభాకర్, గంగాధర్, నాయకులు పెం ట లింబాద్రి, ఆంకతి రాజన్న పాల్గొన్నారు. -
రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
జగిత్యాల రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధిహామీ పథకం కింద చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణాలను మండలంలోని తాటిపల్లిలో రూ.15 లక్షల విలువైన, చల్గల్లో రూ.17 లక్షల విలువైన సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా సీసీరోడ్లు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామన్నారు. అనంతరం చల్గల్ గ్రామ శివారులోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు నీలం భూమన్న, జున్ను కవిత, ఎంపీటీసీలు ఎంబారి రాజేశ్వరి, మొర్రి లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలుగూరి దామోదర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ అయిలవేని గంగాధర్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రెడ్డి, నాయకులు చెట్పల్లి సత్తన్న, బందెల మల్లయ్య, పెద్దన్న, జున్ను రాజేందర్, మల్లేశం, గంగారెడ్డి పాల్గొన్నారు. -
‘రాజకీయ అవసరాల కోసమే నయీమ్ కేసు’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నయీమ్ కేసులో సంబంధాలు ఉన్న వారిని వదిలి పెట్టేది లేదని సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఇప్పుడు హోమ్ శాఖ కోర్టుకు ఇచ్చిన రిపోర్టు విరుద్ధంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని.. సిట్ విచారణ జరుగుతుందని లీకు ఇచ్చారన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ కు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. నయీమ్ కేసును రాజకీయ అవసరాల కోసం వాడుకున్నట్టుగా ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల బండారం పడుతుందనే ప్రభుత్వం నయీమ్ కేసును నీరు కారుస్తుందని మండిపడ్డారు. కేసును సీబీఐ కు అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జీవన్ రెడ్డి తెలిపారు. -
'నయీం డైరీని బయటపెట్టాలి'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం గ్యాంగ్ స్టర్ నయీంపై ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కరి చేశారు. నయీం డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డైరీ బయటపడితే అందరి పాత్ర బయటకొస్తుందని అన్నారు. జీవన్ రెడ్డి ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నయీం ఆస్తులు, కేసు విచారణ తదితరాలను వివరించారు. వీటిపై స్పందించిన జీవన్ రెడ్డి కేసుతో సంబంధమున్న అధికారులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. నయీం కేసుపై సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. -
జీవన్‌రెడ్డితో మనసులో మాట
-
కేసీఆర్ మోదీ ఏజెంట్
హైదరాబాద్ : దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నాయకుడు టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం శాసనసభ మరుసటి రోజుకు వాయిదా పడిన తర్వాత జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అసెంబ్లీలో మాట్లాడిన తీరు గమనిస్తే కేసీఆర్ ప్రజలకు ఏజెంటుగా కాకుండా మోదీ ఏజెంట్ గా మాట్లాడారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిందని, వారి మధ్య జరిగిన చర్చల ఆంతర్యమేంటో తెలియాలన్నారు. ప్రధాని ఏమైనా దేవుడా? ఆయన నిర్ణయాలు తప్పుపట్టరాదా? బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ ప్రజలను బలిపెడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడేందుకే పెద్ద నోట్ల రద్దు అంశాన్ని చర్చకు పెట్టినట్టుందని, కనీస ఖర్చుల కోసం డబ్బులు లేక ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడి చనిపోయిన వారికి సభలో కనీసం నివాళులు అర్పించాలన్న మా పార్టీ సూచనను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నగదు రహితం లావాదేవీల రాష్ట్రంగా మారుస్తామంటున్న కేసీఆర్ కు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. వీరి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 10 శాతం జనాభా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి తలెత్తిందని విమర్శించారు. -
'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి'
జగిత్యాల : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుని తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని ఆయన అధికారులను నిలదీశారు. మద్దతు ధర చెల్లించకుంటే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. -
'వారిద్దరి భేటీ చీకటి ఒప్పందమే'
హైదరాబాద్ : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ భేటీలో చీకటి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజల ఇబ్బందులు సీఎంకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. కనీసం కొత్త కరెన్సీని రాష్ట్రానికి పంపాలని కూడా ప్రధానిని కేసీఆర్ అడగలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రాష్ట్ర ఆదాయం తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రెండున్నరేళ్లలో కేసీఆర్ రూ.70 వేల కోట్లు అప్పులు చేశారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగిత్యాల జిల్లాలో పోలీసు సర్కిళ్లు పెంచాలి
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో పోలీస్ సర్కిళ్ల పరిధి పెంచాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎస్పీ జోయల్ డేవిస్‌కు లేఖరాశారు. జగిత్యాల టౌన్ యథావిధిగా కొనసాగించి జగిత్యాల రూరల్ సర్కిల్లో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు, ధర్మపురి సర్కిల్లో ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాలు, మల్యాల సర్కిల్లో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. -
'రాష్ట్ర ప్రయోజనాలను సీఎం తాకట్టు పెట్టారు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగు కావన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో 90 రోజులపాటు 160 టీఎంసీల నీటి వినియోగానికి ప్రతిపాదన, మహారాష్ట్ర ప్రభుత్వంతో సూత్రప్రాయ ఒప్పందం కూడా జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. 18 లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారో, మరో 18లక్షల ఎకరాలను ఎలా స్థిరీకరిస్తారో చెప్పాలని జీవన్ రెడ్డి సవాల్ చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ అనాలోచిత నిర్ణయమని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను సీఎం వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల పక్షాన నిజాయితీగా ఆలోచించాలని.. అధికారంలో ఉన్నవారు ముందుచూపుతో వ్యవహరించాలని జీవన్ రెడ్డి సూచించారు. -
'మహారాష్ట్ర ఒప్పందంతో కేసీఆర్ మహా మోసం'
కరీంనగర్ : మహారాష్ట్ర ఒప్పందం పేరుతో సీఎం కేసీఆర్ మహా మోసానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ....కాంగ్రెస్ హయాంలోనే మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఇది వరకే ఒప్పందం చేసుకున్నామని సంబరాలు జరుపుకున్నాయని.... 23న మళ్లీ ఏమి ఒప్పందం చేసుకుంటారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడుతుందన్న కేసీఆర్ ఏ ప్రాజెక్టు కడితే అడ్డుకున్నామో చెప్పాలన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్, అక్కడి నుంచి ఎస్సార్ఎస్పీకి నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. మెడ మీద తల ఉన్నవారి ఎవ్వరికీ కేసీఆర్ మాటలు అర్థం కావని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాయికల్ : ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కిష్టంపేట గ్రామంలో మంగళవారం ట్రాన్స్ఫార్మర్, దోభీఘాట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటేనే మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపి మాధవి, సర్పంచ్ తంగెళ్ల రమేశ్, ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్ సురేశ్‌గౌడ్, నాయకులు జాన గోపి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి రోజులు పెంచాలని కలెక్టర్‌కు వినతి జగిత్యాల రూరల్ : ఉపాధి పథకంలో కూలీలకు 100 రోజుల నుంచి 150 రోజుల పని దినాలు పెంచాలని మంగళవారం కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్‌కు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ వినతిపత్రం సమర్పించారు. మంగళవారం వెల్దుర్తిలో హరితహారానికి హాజరైన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గీత కార్మికులకు ఉపాధి పథకంలో ఈత, తాటిచెట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నక్కల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ బిరుదుల గంగమ్మ, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
'వైఎస్ మరణంతో తెలుగు జాతి నష్టపోయింది'
వైఎస్‌తో హైదరాబాద్‌కు గుర్తింపు ప్రాజెక్టుల రూపకల్పన ఆయనదే జగిత్యాల అర్బన్ : వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకేకాక యావత్ తెలుగుజాతే నష్టపోయిందని ఈ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల రూపకల్పన వైఎస్‌దేనని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో చేపట్టిన అభివదిృపనులు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం, ఫ్లడ్ కెనాల్, వరదకాలువ నిర్మాణం, ఫ్లడ్ మానేరు, ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్ట్‌ల నిర్మాణం వైఎస్ హయాంలోనే రూపకల్పన జరిగిందని తెలిపారు. వైఎస్ మరణం తీరని లోటని, ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ను ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నారు. రైతులకు ఉచితవిద్యుత్ అందించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆయన హయాంలో జగిత్యాల నియోజకవర్గం 1500 కోట్లతో అభివదిృ చెందిందన్నారు. జగిత్యాలలో జేఎన్టీయూ కళాశాల ఏర్పా టు, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజ లకు రాకపోకల కోసం కమ్మునూర్ వంతెన నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ, జగిత్యాలలో న్యాక్సెంటర్, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు. మెట్రోలైన్ రూపకల్పన, పీవీ ఎక్స్‌ప్రెస్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తదితర ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు వైఎస్.హయాంలో చోటుచేసుకున్నాయి. ఆయన ఇప్పటికీ ప్రజలగుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో పండ్లు పంపిణీచేయడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
టీడీపీ దుకాణం ఖాళీ
తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ అయింది. మిగిలిన ఒకే ఒక్కరు రేపో మాపో టీఆర్ఎస్లోకి రావడం ఖాయం. ఇక టీడీపీ దుకాణాన్ని మూసుకోవాల్సిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. - జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
కరువు మండలాలను ప్రకటించరా?
♦ వ్యవసాయానికి తగిన సౌకర్యాలు కల్పించామన్న కారణం సరికాదు ♦ కరువు మండలాలపై జీవన్‌రెడ్డి పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ♦ కలెక్టర్ సిఫారసులను, జీవన్‌రెడ్డి వినతులను పరిగణనలోకి తీసుకోండి ♦ ప్రభుత్వ పాలసీ, మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకోండి ♦ 21 కరువు మండలాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కోసం తగిన సౌకర్యాలు కల్పించామన్న కారణంతో కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆ కారణంతో కరువు మండలాలను ప్రకటించకపోవడం ఎంత మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కరువు మండలాలుగా ప్రకటించకుండా వదిలేసిన 21 మండలాల విషయంలో కలెక్టర్ సిఫారసులను, జీవన్‌రెడ్డి వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాలసీ, మార్గదర్శకాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, జిల్లా మొత్తం 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేస్తే, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం 19 మండలాలనే ప్రకటించిందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ కరువు మండలాల ప్రకటనకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కలెక్టర్ జిల్లాలో మొత్తం 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి సిఫారసు చేశారని, అయితే ప్రభుత్వం 19 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాలను అధికారులు పక్కనపెట్టేశారని తెలిపారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ 21 మండలాల్లో వ్యవసాయ సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయని, అందువల్ల నిబంధనల మేర తగిన నిర్ణయమే తీసుకున్నామన్నారు. దీనికి సత్యంరెడ్డి స్పందిస్తూ కాలువలు ఉన్నాయని, అయితే గత రెండేళ్లుగా వాటిలో చుక్క నీరు కూడా లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నీళ్లు లేని కాలువలు ఉండి ప్రయోజనం ఏముందని ఏజీని ప్రశ్నించింది. వ్యవసాయ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామన్న కారణంతో కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం సరికాదని పేర్కొంది. కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్రం నుంచి రైతులకు కొన్ని ప్రయోజనాలు దక్కుతాయని, జిల్లా పరిషత్ కూడా 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని సత్యంరెడ్డి కోర్టుకు నివేదించారు. పిటిషనర్ జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే అన్న విషయం తెలుసుకున్న ధర్మాసనం, ఎమ్మెల్యే అయి ఉండి ఎందుకు కోర్టుకొచ్చారని, ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించవచ్చుకదా అని సత్యంరెడ్డిని ప్రశ్నించింది. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ లేదని, బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా దీని గురించి ప్రస్తావిస్తారని సత్యంరెడ్డి తెలిపారు. -
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి
జగిత్యాల శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి ధర్మారం : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏప్రిల్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడానికి ప్రభుత్వం సర్వేలు చేయించినా ఇప్పటికీ నిధులు కేటాయించలదన్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వ రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించకపోగా ప్రతిపక్షపార్టీలపై విమర్శలకే ప్రాధాన్యం మివ్వటం సిగ్గుచేటన్నారు. రైతు వ్యతి రేకి ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుండగా తెలంగాణలో కేసీఆర్ రైతులను పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. రుణమాఫీతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా బ్యాంకు రుణాలపై వడ్డీలు వసూలు చేయటంపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితే 2004లో రాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడని గుర్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్, పెండింగ్ బిల్లు లు, అప్పటి వరకు రైతులపై ఉన్న కరెంటు కేసులను ఎత్తివేసిందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్షా 50వేలు అందించిన ఘనత వైఎస్‌దేనని చెప్పుకొచ్చారు. కరువు నుంచి బయటపడేందుకు మద్దతు ధర, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని కోరుతే కేసీఆర్ మంత్రివర్గం ప్రతి విమర్శలకు దిగటం వారి దివాలకోరుతనానికి నిదర్శనమన్నా రు. రైతులు కరువుతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లటం న్యాయమా అని ప్రశ్నించారు. సమావేశం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాడె సూర్యనారాయణ, బ్లాక్-టూ అధ్యక్షుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కోరుకంటి స్వామి, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, నాయకులు కోమటిరెడ్డి సం జీవరెడ్డి, జగన్మోహన్రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాంరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు జైలుశిక్ష తప్పదు
-
ఏడు మండలాలను వదులుకున్న కేసీఆర్
హైదరాబాద్: పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు మండలాలను తెలంగాణ ముఖ్యమంత్రి వదులుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత టి. జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న వాటర్ గ్రిడ్ పథకంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని విమర్శించారు. ఆ పథకం వల్ల రూ.2 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేయొచ్చని ప్రభుత్వానికి సూచించారు. అందుకు అదనంగా మరో రూ.38 కోట్లు ఎందుకు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వృథా అయ్యే నిధులతో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు దారుణమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1800 ఎకరాలు సాధించలేరా ? అని ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. ముంపునకు గురయ్యే 1800 ఎకరాలను మహారాష్ట్ర ఇచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ సర్కారును డిమాండ్ చేశారు. -
అయ్యో.. రైతన్నా..!
♦ పొలంలోనే నెలకొరిగారు ♦ జగిత్యాల మండలంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య ♦ చల్గల్లో కోల నాగయ్య,బాలెపల్లిలో బేతి సుధాకర్‌రెడ్డి ♦ ఉసురుతీసిన పంటనష్టం, అప్పులబాధలు ♦ రూ.5లక్షల పరిహారం ఇవ్వాలి ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి డిమాండ్ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయూరుు. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోయూరుు. రబీలో సాగు చేసిన పంటలు నీళ్లందక కళ్లముందే ఎండిపోతున్నారుు. దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబాలను పోషించుకునే దారి కనపడక జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలకు వేసేందుకు తెచ్చిన క్రిమిసంహారక మందును తామే తాగి ప్రాణాలు తీసుకున్నారు. అన్నం పెడుతుందని ఆశించిన పొలంలోనే విగతజీవులుగా నేలకొరిగారు. జగిత్యాల జోన్ : జగిత్యాల మండలానికి చెందిన ఇద్దరు రైతులు ఒకేరోజు, దాదాపుగా ఒకే సమయంలో, ఒకే తీరుగా బలవన్మరణాలకు పాల్పడడం విషాదాన్ని నింపింది. చల్గల్ గ్రామానికి చెందిన కోల నాగయ్య(48) అనే రైతు తనకున్న ఇరవై గుంటల భూమితో పాటు రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు. పంట గింజ దశకు చేరుకున్న సమయంలో నీరు అడుగంటడంతో పొలం ఎండిపోరుుంది. పెట్టుబడులు, బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదే మండలం బాలెపల్లికి చెందిన బేతి సుధాకర్‌రెడ్డి(40) నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఇటీవల భూగర్భ జలాలు అడుగంటిపోయూరుు. కళ్లముందే పంట ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. ఇతడు సైతం బుధవారం రాత్రి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక ముందు తాగి ప్రాణం విడిచాడు. అంతకుముందే బిడ్డ పెళ్లి చేయడం, ఇల్లు కట్టుకోవడం, పంట పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో దాదాపు రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఇతనికి భార్య రాజవ్వ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అదుకునేలా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. రూ.5లక్షల పరిహారం ఇవ్వాలి సారంగాపూర్: వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జగిత్యాల మండలంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. గత కాంగ్రెస్ సర్కారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల ప్రత్యేక అందించి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 464 మండలాలకు 353 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ సభ్యురాలు భూక్య సరళ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి, సర్పంచ్ కంచెర్ల శ్యామల, ఎంపీటీసీ సభ్యురాలు నల్ల సత్తెమ్మ, సింగిల్‌విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
హలో ఎమ్మెల్యే గారు..
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేడు సిద్దుల గుట్టపై కార్యక్రమం ప్రారంభం ఆర్మూర్ : నమస్తే నేను మీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని.. మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీ సమస్య ఏంటో చెప్పండి.. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.. అంటూ ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించడానికి 24 గంటలు, 365 రోజుల పాటు ఎమ్మెల్యే ఫోన్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. మ్మెల్యే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసారు. ఈ టెక్నాలజీ ద్వారా 1860425252 నెంబర్లో ఎమ్మెల్యేకు సమాచారం చేరవేయవచ్చును. బాధితులు ఈ సెల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్‌తో సూచించిన నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గొంతు వినిపిస్తుంది. బీప్ అనంతరం రెండున్నర నిముషాల పాటు బాధితులు తమ సమస్యను చెప్పుకోవచ్చును. బాధితులు చెప్పే సమస్య రికార్డు అవుతుంది. తర్వాత తిరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.. నేను గాని మా సిబ్బంది గాని సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము.. అంటూ కాల్ ముగుస్తుంది. ఈ రికార్డును ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి వెంటనే స్పందిస్తారు. వైద్య సేవలు, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలైతే సంబంధిత సిబ్బంది సమస్యకు సంబంధించిన అధికారితో వెంటనే ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. బాధితులు చెప్పిన సమస్యలన్ని నేరుగా ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండే లాప్టాప్కు చేరుతాయి. ఎమ్మెల్యే స్వయంగా పరిష్కరించాల్సిన సమస్య ఉంటే తన కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకుంటారు. నేడు సిద్దుల గుట్టపై ప్రారంభం.. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండటానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ఈ మీ సేవలో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.