కరీంనగర్: రేషన్ డీలర్లను తొలగిస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం డీలర్లు చట్టబద్ధంగా సమ్మె చేస్తామంటే సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం తగదన్నారు. డీలర్లకు అం డగా అవసరమైతే తాను నల్లకోటు వేసుకొని కోర్టులో వాదిస్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ సర్కార్ నాలుగేళ్లుగా రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుండా వారికి ఇచ్చే కమీషన్ ఇతరత్రా అలవెన్సులు ఇవ్వకపోవడంతోనే సమ్మె అనివార్యమైందని చెప్పారు. ప్రభుత్వం బకాయి పడిన 415 కోట్లు వెంటనే విడుదల చేయాలని క్వింటాలుకు రూ.87 కమీషన్‌ను చెల్లించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా స మస్య పరిష్కారానికి మార్గం చూడాలని లే నిపక్షంలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
డీలర్ల పక్షాన నల్లకోటు వేసి వాదిస్తా!
Published Sun, Jul 1 2018 2:13 AM | Last Updated on Sun, Jul 1 2018 2:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment