సాక్షి, హైదరాబాద్ : రాబోవు రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికే ప్రధాని కాబోతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై టీడీపీ ఎంపీలు పెట్టిన ఆవిశ్వాస తీర్మానంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టె సమయంలో కేసీఆర్‌తో టీడీపీ ఏమైనా సంప్రదింపులు జరిపిందా అని ఆయన ప్రశ్నించారు. 2014 లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయం పై టీఆర్‌ఎస్‌తో సంప్రదించారా అని అడిగారు.
ఇపుడు టీడీపీకి, బీజేపీకి చెడితే టీఆర్‌ఎస్ ఎందుకు టీడీపీకి అనుకూలంగా ఉండాలన్నారు. గత నాలుగు ఏళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో పొత్తులు పెట్టుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగినపుడు టీడీపీ తమ పక్షాన మాట్లాడిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మొదటగా కేంద్రంతో పోరాటానికి సిద్ధమైందని కేసీఆర్ సర్కార్ అని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ ఎందుకు తమతో కలవలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, రాష్ట్రంలో రైతు రుణమాఫీపై టీఆర్‌ఎస్ పోరాటం చేస్తోందని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment