specia status
-
హోదాతోనే ప్రకాశం అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఒంగోలు: ‘‘హోదా ఏమైనా సంజీవనా.. ఎక్కువ ప్రయోజనం కోసమే ప్యాకేజీకి ఒప్పుకున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. హోదా అంశాన్ని బాబు గాలికొదిలేసిన తరుణంలో హోదా అవసరం అని నినదించి ఐదేళ్లపాటు పోరాటం చేసి, ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. జగన్ పోరాటాల ఫలితంగానే నేడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాను ఎన్నికల ప్రచారంగా మార్చారు. ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకున్న సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ప్రత్యేక ప్యాకేజీ నిధులు అంటూ మోసం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తొలుత ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని మరలా ఎన్నికల మైలేజీ కోసం ఇప్పుడు ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తుంది. ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి హోదా ఆవశ్యకతపై ఇటు విద్యార్థులను, అటు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్శిటీల స్థాయిలో విద్యార్థులతో సదస్సులు నిర్వహించి హోదా వల్ల కలిగే లాభాలు, రాష్ట్రాభివృద్ధిని కళ్లకు కడుతున్నారు. హోదా కోసం దీక్షలు చేపట్టారు. ఢిల్లీ స్థాయిలో పోరుబాట సాగించారు. జగన్ హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతూ పబ్బం గడిపేస్తున్నారు. హోదాను పణంగా పెట్టి స్వప్రయోజనాలు ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీసే పరిస్థితి లేకపోవడంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిందన్న విమర్శలున్నాయి. విభజన పుణ్యమాని రాష్ట్ర లోటు బడ్జెట్‌తో కోలుకోలేని స్థితిలో ఉన్నా బాబు సర్కార్ ప్రత్యేక హోదాపై గట్టిపట్టు పట్టలేదు. స్వప్రయోజనాల కోసం ప్యాకేజీ ఇవ్వాలని అడగడం తప్ప హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది లేదు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వచ్చి మట్టి, నీళ్లిచ్చారు. అప్పడుకూడా చంద్రబాబు కేవలం ప్యాకేజీ కావాలంటూ కోరారు తప్ప ప్రత్యేక హోదా అడగలేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మోదీ వద్ద సాగిలపడ్డారన్న విమర్శలున్నాయి. యూటర్న్ బాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు.. నరేంద్రమోదీ లాంటి ప్ర«ధాని దేశంలో ఇంత వరకు లేరని అసెంబ్లీ సాక్షిగా పొగిడారు. కేంద్రం నిధుల లెక్కలు అడగడం, ఓటుకు కోట్లు కేసు భయంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి హోదా రాగం అందుకున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో హోదా కోసం జగన్ మాత్రమే పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీకి మైలేజీ వస్తుందని భావించిన చంద్రబాబు జగన్ దారిలో నడిచారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల ప్రచారమంతా బూటకం పరిశ్రమలు వస్తున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బూటకం. ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో పేపర్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టుకూ పునాది రాయి వేశారు. ఇది కేవలం ఎన్నికల కోసమే తప్ప మరొకటి కాదు. కేంద్ర అనుమతి లేకుండా పోర్టును రాష్ట్రం ఎలా నిర్మిస్తుందో చంద్రబాబు చెప్పాలి. ప్రజలను పిచ్చొళ్లను చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే ఈ పోర్టులు, పరిశ్రమలు ఎప్పుడో వచ్చి ఉండేవి. – కె.వసంతరావు, కందుకూరు కంపెనీలు క్యూకడతాయి బీటెక్ పూర్తి చేసిన నేను గత 4 సంత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి రాయితీలు ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తారు. తద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. నాలాగా ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. – మన్నేపల్లి రవి, నిరుద్యోగి, సీఎస్‌పురం పరిశ్రమలకు రాయితీ వస్తుంది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా పామూరు మండలంలోని పాబోలువారిపల్లె, బోడవాడ, మాలకొండాపురం గ్రామాలవద్ద 14,500 ఎకరాల్లో రు.55 వేల కోట్లతో నిమ్జ్ (నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్–జాతీయ పారిశ్రామిక ఉత్పాదక కేంద్రం) మంజూరు కాగా దీని ద్వారా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సుమారు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు పలురాయితీలు వస్తాయి. దీంతో ప్రతిపాదిత నిమ్జ్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు త్వరితగతిన ప్రారంభమై నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కరువు ప్రాంతమైన పామూరు మండలం నుంచి వలసలు నివారించవచ్చు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం. – ఎం.రామసుబ్బారెడ్డి,డైట్ కళాశాల ఇన్చార్జి, పామూరు డీఎస్సీలు ఎక్కువగా విడుదల చేసేవారు ప్రత్యేక హోదా ప్రకటించడం ద్వారా ఆంధ్రాకు కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు వస్తాయి. ఐదేళ్లు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోంది. తద్వారా డీఎస్సీలు ఎక్కువగా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల ఖాళీలను బట్టి ఏటా డీఎస్సీ విడుదల చేయవచ్చు. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారికి సకాలంలో ఉద్యోగవకాశాలు లభిస్తాయి. – ఎం విజయభాస్కర్, ఎమ్మెస్సీ బీఈడీ, పామూరు ప్రత్యేక హోదా వస్తే.. ప్రత్యేక హోదా వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్ రూపంలో వస్తాయి. మిగిలిన పది శాతం నిధులు మాత్రమే లోన్‌గా ఇస్తారు. ప్రధానంగా టాక్స్‌లో రాయితీ ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తరలివచ్చే అవకాశాలున్నాయి. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చీమకుర్తి ప్రాంతంలో 450కు పైగా గ్రానైట్ మైనింగ్ లీజులున్నాయి. ఇక్కడి గెలాక్సీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అంతే స్థాయిలో మార్కెట్ ఉంది. ఏడాదికి వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్ తరలివెళ్తోంది. హోదా వస్తే గ్రానైట్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశముంది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పొగాకు. హోదాతో సిగరెట్ కంపెనీలు జిల్లాకు తరలి వచ్చే అవకాశముంది. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మార్కాపురం ప్రాంతంలో గతంలో 150 పలకల పరిశ్రమలుండగా వాటి పరిధిలో 15 వేల మంది కార్మికులు పనిచేసేవారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కరువవడంతో ప్రస్తుతం 35 పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. 4 వేల మంది కార్మికులకు మాత్రమే పనులు దొరుకుతున్నాయి. హోదా వస్తే ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. తద్వారా కరువు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. జిల్లాలో నల్లమల అడవులు విస్తారంగా ఉన్నాయి. వీటితోపాటు సుబాబులు సైతం పెద్ద ఎత్తున పెంచుతున్నారు. దీంతో ఈ ప్రాంతం పేపర్ పరిశ్రమకు అనువైనదిగా ఉంది. హోదా వస్తే ఇక్కడ పేపర్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో రైతులు టమోటా అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీలు నెలకొల్పాలన్న ప్రతిపాదన ఉన్నా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. హోదా వస్తే రామాయపట్నం పోర్టుతో పాటు మొత్తం కోస్తా కారిడార్‌లో భాగంగా తీరప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాలో దొనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం 50 వేల ఎకరాలు, పామూరులో 20 వేల ఎకరాలు, సీఎస్ పురంలో 10 వేల ఎకరాలు గుర్తించారు. రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి 6 వేల ఎకరాలను గుర్తించారు. అయితే ఇప్పటి వరకు పారిశ్రామిక వాడగాని, కనిగిరి ప్రాంతంలో నిర్మించదలచిన నిమ్జ్ కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసినట్లపోయాయి. ఒంగోలు–నంద్యాల నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేయాల్సి ఉంది. కనిగిరి నేషనల్ ఇన్ఫ్రాక్టర్చర్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అభివృద్ధికి 12,003 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కానీ పనులు మొదలుకాలేదు. జిల్లా వ్యాప్తంగా కొత్త పరిశ్రమలు జాతీయ విద్యాసంస్థల కోసం లక్షన్నర ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, త్రిబుల్ ఐటీ ఐఐఎం, ఐఎన్టీ కోసం భూమి అందుబాటులో ఉందని ప్రతిపాదనలు పంపినా ఒక్కటీ ఆమోదం పొందలేదు. ఒంగోలు నాన్‌మెట్రో విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్సిటీ, మినరల్ యూనివర్సిటీ తదితర పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి. పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. బాబు యూటర్న్ల కారణంగానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నది వాస్తవం. -
నేనిస్తున్న నీళ్లు తాగుతూ నాపై విమర్శలా?
సాక్షి, పోలవరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తాను ఇచ్చిన నీళ్లు తాగుతూ తననే విమర్శిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... కుప్పం కంటే పులివెందులకే ముందుగా నీళ్లు ఇచ్చామని, అయితే తాను ఇచ్చిన నీళ్లను తాగుతూ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. పనిలో పనిగా సాక్షి దినపత్రికపై కూడా చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆ పత్రిక విషం చిమ్ముతుందంటూ వ్యాఖ్యానించారు. దేశంలోనే అరుదైన ప్రాజెక్ట్ పోలవరం అని, జూన్ నాటికి కాపర్ డ్యామ్‌ను పూర్తి చేస్తామన్నారు. పోలవరానికి అదనంగా 9200 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామన్నారు. ఇప్పటికే 5500 కోట్లు ఇచ్చారని, ఇంకా 2900 కోట్ల రూపాయిలు కేంద్రం నుంచి రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని, పోలవరం అడ్డుకోవాలని కోర్టులకు వెళ్తున్నారని అన్నారు. తన కష్టానికి సమాధానం అయిదుకోట్ల మంది ప్రజలే చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లు ఓపిక పట్టానని అన్నారు. ఈ నాలుగేళ్లు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించానని, ఇపుడు దండోపాయంలోకి దిగానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వీళ్లందరూ రాజకీయాలలో తనకంటే జూనియర్స్ అని అన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని.. వెంకన్నకు సమాధానమ చెప్పాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈ నెల 30 తిరుపతిలో బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. -
‘లాలూచీ రాజకీయాలే హోదాకు అడ్డంకి’
సాక్షి,విశాఖసిటీ/మద్దిలపాలెం: లాలూచీ రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాల్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర బంద్ సందర్భంగా మద్దిలపాలెం జంక్షన్లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడూతూ కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిందంటే.. అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. ఏపీకి హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ చాలని గతంలో దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాలుగేళ్ల పోరాటంలో భాగంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టగా, దాన్ని చర్చకు రానీయకుండా చేశారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పించిన తర్వాత ఏపీలోని 25 మంది ఎంపీలు కలిసికట్టుగా రాజీనామా చేసి ఉన్నట్లైతే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదని అభిప్రాయపడ్డారు. మార్చి 2014లో కాంగ్రెస్ పార్టీ కేబినెట్లో హోదాపై తీర్మానం చేసిన తర్వాత కూడా చంద్రబాబు నడిపిన లాలూచీ రాజకీయాలవల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. అఖిల పక్షం బంద్ వల్ల ప్రయోజనం లేదంటూ చెత్తగా మాట్లాడటం చంద్రబాబుకు తగదని హితవు పలికారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు ఎన్ని బంద్‌లు చేశారో గుర్తులేదా అని ప్రశ్నించారు. నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసనలు తెలిపితే ఏం సాధిస్తామని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ ద్వంద్వవైఖరిని విడనాడాలని సూచించారు. స్వప్రయోజనాలకు పోలవరం తాకట్టు అవినీతిని, మద్యం దుకాణాలను ప్రోత్సహించడంతో పాటు రాజధాని పేరుతో కుంభకోణాలకు పాల్పడటం, పోలవరం ప్రాజెక్టును స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టడంలో సిద్ధహస్తులుగా మారిపోయిన చంద్రబాబు బంద్‌ను వ్యతిరేకించడం సరికాదన్నారు. చంద్రబాబు వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేస్తున్న ఇలాంటి వ్యక్తికి బతికుండే హక్కు లేదంటూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయ దండం పట్టుకొని తీర్పునిస్తారేమోనన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన బకాసురుడిలా మారిపోయారని దుయ్యబట్టారు. ఈయన ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్న విషయం ప్రజలు అవగాహన చేసుకున్నారన్నారు. 5 కోట్ల ఆంధ్రుల అభిప్రాయాల్ని ప్రతిబింబించేలా అఖిలపక్షం ఉద్యమిస్తోందని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాఠ్యాంశాల నుంచి హిస్టరీని తొలగించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారామ్‌తో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
చంద్రబాబు అవినీతి కుంభకర్ణుడు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వంద వైఖరితో ప్రత్యేక హోదా రాదని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబును బకాసురుడితో పోల్చవచ్చు అంటూ విమర్శించారు. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టుపెట్టిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబు, అవినీతిలో కుంభకర్ణుడిని తలపిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహస్యం చేసే తీరు చూస్తే, ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు పుట్టారని రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ సైతం బాధపడేవారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, అది విజయవంతమైన బంద్‌లో కనిపించిందని అన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు బంద్‌లో పాల్గొన్న వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలకు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
సడలని దీక్ష
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన ఆదివారమూ కొనసాగాయి. పట్టు సడలకుండా దీక్షల్లో పాల్గొని హోదా నినాదాన్ని హోరెత్తించారు. పార్టీ నాయకులకు జనం కూడా తోడు కావడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. చిత్తూరు, సాక్షి : జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటా వార్పులతో నిరసన తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్థానిక క్లాక్‌టవర్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేశారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని రోజా అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. దీక్ష అనంతరం జ్యోతిచౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. కుప్పం సర్కిల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్యవేడు, నాగలాపురంలో జరిగిన దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. చిత్తూరు గాం«ధీ సర్కిల్లో వైఎస్సార్ బీసీ, ఎస్సీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, జ్ఞానజగదీశ్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో జరిగిన దీక్షలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సంఘీభావం తెలిపారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆ పార్టీ కార్యకర్త వాసుమయ్య గుండు కొట్టుకొని టీడీపీ, బీజేపీ ఎంపీలకు పిండ ప్రదానం చేశారు. తుడా సర్కిల్లో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, వెదురుకుప్పం కార్వేటినగరం, ఎస్సార్‌పురం మండలాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. పెనుమూరు, వెదురుకుప్పంలో జరిగిన దీక్షలకు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, రొంపిచెర్లలో రిలే నిరాహార దీక్షలు జరి గాయి. రొంపిచెర్లలో జరిగిన దీక్షకు మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు. పుంగనూరులో రెడ్డెప్ప పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో మండల నాయకులు వంటావార్పు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీలేరులో జరిగిన వైఎస్సార్ విద్యార్థి విభాగం దీక్షకు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మదనపల్లె అన్నమయ్య సర్కిల్లో వైఎస్సార్సీపీ నాయకులు వంటావార్పు కార్యక్ర మం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబుకు చుక్కెదురు
-
అఖిలపక్ష సమావేశం మధ్యలోనే ...
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంమధ్యలోనే సీపీఎం పార్టీ నేత మధు బయటకు వచ్చేశారు. అఖిలపక్షం చేసిన తీర్మానం రాష్ట్రానికి మేలు చేసేలా లేదని విమర్శించారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణం తెలుగు దేశం, బీజేపీ పార్టీలే కారణమని ఆయన దుయ్యపట్టారు. ఏపీకి అన్యాయం చేసిన పాపం బీజేపీతో పాటు టీడీపీకి ఉంటుందన్నారు. ‘ దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు’ అని మధు పేర్కొన్నారు. అఖిలపక్ష డ్రామాతో చంద్రబాబు చేసిన పాపాన్ని అందరికి రుద్దాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ...‘బీజేపీ నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పోలవరం నిర్వాసితుల డబ్బుకి కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ అంటోంది. బీజేపీ ఎంత అన్యాయం చేసిందో టీడీపీ అంతే అన్యాయం చేసింది. మేం ఎన్నిసార్లు అడిగినా సీఎం లెక్కలు చెప్పలేదు. మేం హోదా కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి, తులనాడారు. ఆ విషయాన్ని చంద్రాబాబును నిలదీశాను. తీర్మానం చేస్తామన్నారు...దాన్ని వ్యతిరేకించాను. రాష్ట్రానికి అన్యాయం చేసింది టీడీపీ, బీజేపీనే. చేసిన పాపాలన్నీ చేసి...అమ్మ, నాన్నని చంపినవాడు తల్లిదండ్రులు లేనివాడిని క్షమించండి అన్నట్లు...రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. కేంద్రం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోంది. మేం మీతో కలిసి పోరాటం చేయమని ఖరాఖండిగా చెప్పాం. సీఎం ఎక్కడా పోరాటం చేస్తామని చెప్పలేదు. మేం పోరాడినప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన లేచారు. టీడీపీతో కలిసి పోరాటం చేసే ప్రసక్తే లేదు.’ అని స్పష్టం చేశారు. -
‘కేసీఆర్ ప్రధాని కాబోతున్నారు’
సాక్షి, హైదరాబాద్ : రాబోవు రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికే ప్రధాని కాబోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై టీడీపీ ఎంపీలు పెట్టిన ఆవిశ్వాస తీర్మానంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టె సమయంలో కేసీఆర్‌తో టీడీపీ ఏమైనా సంప్రదింపులు జరిపిందా అని ఆయన ప్రశ్నించారు. 2014 లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయం పై టీఆర్ఎస్తో సంప్రదించారా అని అడిగారు. ఇపుడు టీడీపీకి, బీజేపీకి చెడితే టీఆర్ఎస్ ఎందుకు టీడీపీకి అనుకూలంగా ఉండాలన్నారు. గత నాలుగు ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో పొత్తులు పెట్టుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగినపుడు టీడీపీ తమ పక్షాన మాట్లాడిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మొదటగా కేంద్రంతో పోరాటానికి సిద్ధమైందని కేసీఆర్ సర్కార్ అని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ ఎందుకు తమతో కలవలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, రాష్ట్రంలో రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ పోరాటం చేస్తోందని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. -
‘పవన్ కల్యాణ్ నాటకాలాడుతున్నాడు’
సాక్షి, అమరావతి : పవన్ కళ్యాణ్ ఎన్ని నాటకాలాడినా చేసేదేమి లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా పాచి పోయిన లడ్డూ అన్న పవన్ నేడు ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం అంటున్నాడని విమర్శించారు. బీజేపీ స్క్రిప్టుకు అనుగుణంగా పవన్ నటిస్తున్నాడని విమర్శించారు. దమ్ముంటే పోలవరంలో అవినీతి జరిగిందని పవన్ చేసిన ఆరోపణల్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు.ఉద్దేశ్ పూర్వకంగానే పవన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ సమావేశాలకు పవన్ హాజరవుతున్నారని ఆయన ఆరోపించారు. -
‘హోదాకు మద్దతిస్తాం.. కానీ..’
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పూర్తి మద్దతు ఇస్తామని శిరోమణి అకాలీదళ్ తెలిపింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ప్రేమ్‌సింగ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ సర్కార్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ ముందుకు రాకముందే సభ మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతూ.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సభ నడపడం సాధ్యం కాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. హోదా కోసం అలుపెరుగని పోరు చేపట్టిన వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని పోరు కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టేలా పట్టుపడుతున్నారు. -
‘హోదా’ కోసం తుది పోరు
కాకినాడ : ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుదిపోరుకు సన్నద్ధమైంది. గడచిన నాలుగేళ్లలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు కలెక్టరేట్ వద్ద బైఠాయింపులు, నిరాహార దీక్షలు, యువభేరి సహా ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఆది నుంచి ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు సంజీవని అంటూ ఎలుగెత్తి చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హోదాకన్నా ప్యాకేజీ మిన్న అంటూ కేంద్రం వద్ద మోకరిల్లి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టినా.. ఒక్కటే మాట, ఒక్కటే నినాదంతో ఉద్యమించిన వైఎస్సార్ సీపీ ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని తుదిపోరుకు సన్నద్ధమవుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడా పార్టీ కూడగడుతోంది. ఈ తీర్మానంపై సోమవారం పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహాసంకల్ప మానవహారం చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆయా ప్రాంతాల్లో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల భాగస్వామ్యంతో సోమవారం మానవహారాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల ఆకాంక్షను ఢిల్లీలో ప్రతిబింబించేలా పార్టీ తరఫున అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, మోషేన్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష ఢిల్లీలో ప్రతిబింబించేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సంకల్ప మానవహారాన్ని విజయవంతం చేసి అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు సంఘీభావం తెలియజేయాలని ఆయా పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బోస్, కన్నబాబు, మోషేన్‌రాజు కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విధిగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఏపీకి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టం!
-
ఏపీకి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టం!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం లోక్‌సభ ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన నోటీసును వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే అవిశ్వాసం పెడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని అన్నారు. పార్లమెంటులో చర్చ జరిగేవరకూ అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరాటంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకొని.. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారని అన్నారు. -
‘ద్రావిడులు ఏకం కావాలి’
సాక్షి, చెన్నై : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉత్తరాది వారి ఆధిపత్యం నడుస్తోందని, వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఇంటర్నేషనల్ జేఏసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో భాగంగా ప్రత్యేక హోదాపై రెండు జాతీయ పార్టీలు మాట మార్చాయని అన్నారు. దీనిపై ద్రావిడులందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దానిలో భాగంగా విశాఖపట్టణంలో తలపెట్టిన ‘సాగర తీరాన హోదా ఉద్యమ కెరటం’ సమావేశానికి రావాల్సిందిగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, స్పీకర్ వైద్యలింగంలను మంగళవారం కేతిరెడ్డి ఆహ్వానించారు. అంతేకాకుండా దక్షిణాది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. -
ఏపీపై సవతి ప్రేమ ఎందుకు : మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కు విషయంలో నరేంద్ర మోదీని తన ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు. ఏపీపై సవతి తల్లి తీరు ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. `ఆంధ్ర ప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఆ రాష్ట్రం చేసిన తప్పేంటి? ప్రత్యేక హోదాపై ఏమి జరుగుతోంది? ఏపీకి ప్రత్యేక హోదా రావాలని తెలంగాణ కూడా కోరుకుంటోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్రమే అనుకుంటున్నారా?` అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన మోదీని ప్రస్తుతం సినీ ప్రముఖులు కూడా విమర్శస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రదానిని ఉద్దేశించి ట్విటర్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో వచ్చిన ‘గాయత్రి’. సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. Why this step motherly treatment to Andhra Pradesh? What did A.P do wrong? What’s going on with Special Status? Even when Telangana is supporting Special Status for A.P, is it just the sentiment of one state? @arunjaitley — Mohan Babu M (@themohanbabu) 8 March 2018 -
కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది
-
పదునెక్కిన నినాదం
-
స్వార్థంతోనే ‘హోదా’పై నోరు మెదపలేదు
కదిరి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసమే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పోతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి వెంకయ ్యనాయుడుకు కూడా హోదాపై చిత్తశుద్ధి లేదు. ఒకరు పదేళ్లు అంటే ఇంకొకరు 15 ఏళ్లు అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ ప్రజల మది లో మెదులుతూనే ఉన్నాయి. చంద్రబాబు అసెం బ్లీలో సంఖ్యాబలం పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదాపై చూపడం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో చేర్చుకున్నారు’ అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన సతీసమేతంగా కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను తాను తప్పుపట్టనుగానీ పుష్కరాల పేరుతో రూ.కోట్ల దోపిడీ జరిగిందని, టీడీపీ సర్కార్‌లోని పెద్దలు జేబులు నింపుకోవడానికే వీటిని జరిపారా అన్న భావన సామాన్య ప్రజల్లో కలుగుతోందన్నారు.