
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఆహ్వానపత్రాన్ని అందిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉత్తరాది వారి ఆధిపత్యం నడుస్తోందని, వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఇంటర్నేషనల్ జేఏసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో భాగంగా ప్రత్యేక హోదాపై రెండు జాతీయ పార్టీలు మాట మార్చాయని అన్నారు. దీనిపై ద్రావిడులందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దానిలో భాగంగా విశాఖపట్టణంలో తలపెట్టిన ‘సాగర తీరాన హోదా ఉద్యమ కెరటం’ సమావేశానికి రావాల్సిందిగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, స్పీకర్ వైద్యలింగంలను మంగళవారం కేతిరెడ్డి ఆహ్వానించారు. అంతేకాకుండా దక్షిణాది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.