స్వార్థంతోనే ‘హోదా’పై నోరు మెదపలేదు
కదిరి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసమే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పోతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి వెంకయ ్యనాయుడుకు కూడా హోదాపై చిత్తశుద్ధి లేదు. ఒకరు పదేళ్లు అంటే ఇంకొకరు 15 ఏళ్లు అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ ప్రజల మది లో మెదులుతూనే ఉన్నాయి. చంద్రబాబు అసెం బ్లీలో సంఖ్యాబలం పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదాపై చూపడం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో చేర్చుకున్నారు’ అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గురువారం ఆయన సతీసమేతంగా కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను తాను తప్పుపట్టనుగానీ పుష్కరాల పేరుతో రూ.కోట్ల దోపిడీ జరిగిందని, టీడీపీ సర్కార్‌లోని పెద్దలు జేబులు నింపుకోవడానికే వీటిని జరిపారా అన్న భావన సామాన్య ప్రజల్లో కలుగుతోందన్నారు.