kotla surya prakashreddy
-
జిల్లాలో ‘కోట్ల’ ఖర్చు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కొన్ని రోజుల క్రితం అధికార పార్టీలో చేరిన ఒక నేత డబ్బు ఖర్చు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటివరకు ‘మేం నీతివంతులం’ అని చెప్పుకుంటున్న సదరు కుటుంబం కాస్తా... టీడీపీలో చేరిన తర్వాత ఏకంగా రెండు బ్యాంకుల్లో ఉన్న రూ.75 లక్షల రుణాన్ని వెంటనే చెల్లించేశారు. అంతేకాకుండా తనకు దగ్గరగా ఉండే వారి పేరు మీద ఏకంగా నాలుగు కార్లు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ‘మా వద్ద డబ్బుల్లేవ్.. మాది నీతివంతమైన కుటుంబం’ అని చెప్పుకునే సదరు నేత కాస్తా ఇప్పుడు చేస్తున్న వ్యవహారం చూసి పక్కనున్న నాయకులే వాపోతున్నారు. అలాంటి మనుషులు ఈ విధంగా తయారవుతారనుకోలేదని అభిప్రాయ పడుతున్నారు. ఫలితంగా వీరి కుటుంబంపై దశాబ్దాలుగా ఉన్న గౌరవం కాస్తా పోయిందని అంటున్నారు. మరోవైపు మొన్నటి వరకు వైరి వర్గాలుగా ఉన్న రెండు కుటుంబాల వారు ఇప్పుడు ఒకే వాహనంలో తిరుగుతున్నారు. సొంత అన్నదమ్ముల్లా అన్యోన్యంగా మెలుగుతూ ఓట్లు వేయాలంటూ తిరుగుతున్న వీరిని చూసి.. వీరి కోసమా తాము ఇన్ని రోజులుగా కుటుంబాలను వదులుకున్నదంటూ విమర్శిస్తున్నారు. వేర్వేరు వర్గాలుగా విడగొట్టి, తమ గ్రామాల్లో ఫ్యాక్షన్ కుంపటి రాజేసిన ఆ ఇరువురు నేతలు ఇప్పుడు.. ప్రతిపక్ష పార్టీ వైపు ఉంటే ఇబ్బంది పడతావంటూ బెదిరింపులకు దిగుతుండడం గమనార్హం. ఇక ప్రచారం సందర్భంలోనూ సదరు కుటుంబం పెడుతున్న ఖర్చును చూసి.. ‘వారు వీరేనా’ అన్న సందేహం కలుగుతోంది. మద్యం పారించి..డబ్బు వెదజల్లుతూ.. గతంలో ఈ కుటుంబం ఎన్నడూ పెద్దగా మందు పంపిణీ చేసింది లేదు. అయితే, టీడీపీలో చేరే సమయంలో కేసుల కొద్దీ మద్యాన్ని ఏరులా పారించారు. ఎవరికి ఎన్ని కేసుల మద్యం కావాలంటే అంత పంపిణీ చేశారు. ఇందుకోసం ముందుగానే టోకెన్లు జారీచేశారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా నేతలకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. అవతలి పార్టీలో ఉన్న వారిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్న తీరు దారుణంగా ఉంటోంది. సొంత నియోజకవర్గంలోని అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తీసుకున్న ప్యాకేజీ కూడా చర్చనీయాంశమవుతోంది. అన్ని రోజులుగా పాటిస్తున్న విలువలను అధికార పార్టీలో చేరిన వెంటనే తుంగభద్ర నదిలో కలిపిన వైనాన్ని చూసి జనం అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తమ్మీద అధికార పార్టీలో చేరిన తర్వాత సదరు కుటుంబం చేస్తున్న ‘కోట్ల’ ఖర్చు వ్యవహారం జనంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
నేడు కేంద్ర మాజీమంత్రి కోట్ల రాక
మడకశిర : కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి శుక్రవారం మడకశిరకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం 8 గంటలకు శ్రీ నీలకంఠ కోల్డ్ స్టోరేజ్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డితో కలిసి పాల్గొంటారని తెలిపారు. -
స్వార్థంతోనే ‘హోదా’పై నోరు మెదపలేదు
కదిరి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసమే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పోతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి వెంకయ ్యనాయుడుకు కూడా హోదాపై చిత్తశుద్ధి లేదు. ఒకరు పదేళ్లు అంటే ఇంకొకరు 15 ఏళ్లు అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ ప్రజల మది లో మెదులుతూనే ఉన్నాయి. చంద్రబాబు అసెం బ్లీలో సంఖ్యాబలం పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదాపై చూపడం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో చేర్చుకున్నారు’ అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన సతీసమేతంగా కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను తాను తప్పుపట్టనుగానీ పుష్కరాల పేరుతో రూ.కోట్ల దోపిడీ జరిగిందని, టీడీపీ సర్కార్‌లోని పెద్దలు జేబులు నింపుకోవడానికే వీటిని జరిపారా అన్న భావన సామాన్య ప్రజల్లో కలుగుతోందన్నారు. -
సీమాంధ్రకు కర్నూలే రాజధాని : కోట్ల
నంద్యాల, న్యూస్‌లైన్: సీమాంధ్రకు రాజధానిగా కర్నూలు నగరాన్ని ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ను కోరినట్లు కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి నంద్యాల పట్టణంలో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర కు రాజధానిగా కర్నూలు అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. త్వరలో రాజధాని కమిటీని నియమిస్తుందని అందులో కూడా కర్నూలు ఎంపికయ్యే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు విలేకరులు అడుగగా కిరణ్‌కుమార్‌రెడ్డికే కాదు పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉందన్నారు. పార్టీలు వస్తుంటాయి.. పోతుం టాయి ప్రజల అభిమానం పొం దేవి కొన్నే ఉంటాయన్నారు. అలాగే కేంద్ర మంత్రి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడాన్ని కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవులను అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దూరం కావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు, కార్యకర్తలు బయటకు పోవడం లేదని నాయకులు మాత్రం వెళ్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు కోట్ల వివరించారు. ‘కాంగ్రెస్ ద్రోహి శిల్పా’ పదవులు అనుభవించి ఎన్నికల సమయంలో పార్టీ మారుతున్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి.. కాంగ్రెస్ ద్రోహిగా మిగిలారని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో శిల్పాను, ఆయన అనుచరగణాన్ని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శోభా హోటల్లో గురువారం కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో దివంగత నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని శిల్పా వ్యతిరేకించారని, అయినా విధిలేని పరిస్థితుల్లో నంద్యాల అభ్యర్థిగా నియమించాల్సి వచ్చిందన్నారు. ఇక పై ఈ సమస్య స్థానిక నాయకులకు ఉండదన్నారు. త్వరలోనే నంద్యాలకు ఇన్చార్జి ప్రకటిస్తామని చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డికి నిజంగా బలముంటే సొంత జిల్లా అయిన కడపలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలువాలని సవాల్ విసిరారు. ఆయన ఆటలు నంద్యాలలో సాగనివ్వబోమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తదితరులు మాట్లాడారు. -
బీడు బతుకులు
ఆదోని/ఆలూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. సగటు వర్షపాతం 1200 మిల్లీమీటర్లు కాగా.. ఈ ప్రాంతాల్లో 500 మిల్లీమీటర్లు కూడా మించని పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెట్టడమే కానీ.. ఏనాడు లాభాలు ఎరుగని దయనీయం. అందునా నల్లరేగడి భూములు కావడంతో ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అరకొర వర్షాలతో రైతన్న ఏటా ఆర్థికంగా చితికిపోతున్నాడు. పంటల సాగుకు ప్రత్యామ్నాయ జలవనరులు లేక చాలా మంది భూములను బీడు పెట్టుకుంటున్నారు. ఫలితంగా వేలాది మంది చిన్న, మధ్య తరగతి రైతులు పొట్ట చేతపట్టుకుని గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి తదితర నగరాల వైపు అడుగులేస్తున్నారు. ఆదోనిలో పుట్టి పెరిగిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక తమకు మంచి రోజలు వస్తాయని ఆశించిన ఆలూరు, ఆదోని, హొళగుంద, చిప్పగిరి, హాలహర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల ప్రజలకు నిరాశే మిగులుతోంది. తుంగభద్రకు ఉపనది అయిన వేదావతి ఆధారంగా సాగునీటి పథకాలు నిర్మిస్తే ఈ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. ఈ ప్రాంత రైతాంగాన్ని టీజీతో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాగునీటి పథకాల నిర్మాణానికి అధికారులు పంపిన ప్రతిపాదనలు పాలకుల కార్యాలయాల్లో బూజు పట్టిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుర్భర జీవనం గడుపుతున్నారు. చెంతనే నీరున్నా... కృష్ణా బేసిన్-9 పరిధిలోని తుంగభద్రకు వేదావతి ఉపనది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ప్రవహిస్తున్న ఈ నదిలో దాదాపు 87.8 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా ట్రిబునల్ అంచనా వేసింది. 75 శాతం సగటు లభ్యతను లెక్కించి 56.4 టీఎంసీలు కరువు పీడిత ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో మన రాష్ట్రానికి 12.47 టీఎంసీలు, కర్ణాటకకు 38.07 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సైతం నోరుమెదపకపోవడం రైతులకు శాపమవుతోంది.