
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కు విషయంలో నరేంద్ర మోదీని తన ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు. ఏపీపై సవతి తల్లి తీరు ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. `ఆంధ్ర ప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఆ రాష్ట్రం చేసిన తప్పేంటి? ప్రత్యేక హోదాపై ఏమి జరుగుతోంది? ఏపీకి ప్రత్యేక హోదా రావాలని తెలంగాణ కూడా కోరుకుంటోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్రమే అనుకుంటున్నారా?` అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన మోదీని ప్రస్తుతం సినీ ప్రముఖులు కూడా విమర్శస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రదానిని ఉద్దేశించి ట్విటర్‌లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో వచ్చిన ‘గాయత్రి’. సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Why this step motherly treatment to Andhra Pradesh? What did A.P do wrong? What’s going on with Special Status? Even when Telangana is supporting Special Status for A.P, is it just the sentiment of one state? @arunjaitley
— Mohan Babu M (@themohanbabu) 8 March 2018