సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి వచ్చే అవకాశాల కోసం టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. నూరు సీట్లు లక్ష్యం గా ఎన్నికలకు సిద్ధమవుతోంది. విభజన తర్వాత తొలి ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసినా, పధ్నాలుగేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న పార్టీ గా ఆ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయలేకపోయా మనే భావన అధినాయకుల్లో ఉంది. టీడీ పీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ఎంతగా ప్రచారం చేసినా ఆపార్టీ 15 స్థానాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుని తమ ఉనికిని కాపాడుకున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీ పీ పోటీ ఇచ్చేస్థాయిలో లేదని, ఆ పార్టీ టీఆర్‌ఎస్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోంద ని చెబుతున్నారు. దీనిలో భాగంగానేఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ప్రకటించి సంచలనం సృష్టించారు. టీడీపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసే వ్యూహాన్ని రచించిందంటున్నారు.
ఓట్లు చీలిపోకుండా వ్యూహం...
టీడీపీ గెలిచిన 15 స్థానాల్లో 10 నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి(7), హైదరాబాద్ (3)లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ 19.5% ఓట్లను పొందింది. దీనిని గమనించే నగరంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను తప్ప అందరినీ టీఆర్‌ఎస్‌లోకి తీసుకుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా టీడీపీకే పడ్డా యని ఆ ఫలితాలు వెల్లడించాయి. దీంతో ఈసారి నగరంలో టీడీపీ పోటీకి రాకుండా అవగాహన కుదుర్చుకొని కాంగ్రెస్‌కు లాభం కలగకుండా చేయవచ్చని, తద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను తాను పొందవచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఏరకంగా చూసినా టీడీపీ ఓటు బ్యాంకు కీలకం అవుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment