votebank
-
టీడీపీ ఓటుబ్యాంకుపై టీఆర్ఎస్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి వచ్చే అవకాశాల కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. నూరు సీట్లు లక్ష్యం గా ఎన్నికలకు సిద్ధమవుతోంది. విభజన తర్వాత తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసినా, పధ్నాలుగేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న పార్టీ గా ఆ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయలేకపోయా మనే భావన అధినాయకుల్లో ఉంది. టీడీ పీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ఎంతగా ప్రచారం చేసినా ఆపార్టీ 15 స్థానాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుని తమ ఉనికిని కాపాడుకున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీ పీ పోటీ ఇచ్చేస్థాయిలో లేదని, ఆ పార్టీ టీఆర్ఎస్తో సయోధ్యకు ప్రయత్నిస్తోంద ని చెబుతున్నారు. దీనిలో భాగంగానేఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని ప్రకటించి సంచలనం సృష్టించారు. టీడీపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసే వ్యూహాన్ని రచించిందంటున్నారు. ఓట్లు చీలిపోకుండా వ్యూహం... టీడీపీ గెలిచిన 15 స్థానాల్లో 10 నియోజకవర్గాలు గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి(7), హైదరాబాద్ (3)లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ 19.5% ఓట్లను పొందింది. దీనిని గమనించే నగరంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను తప్ప అందరినీ టీఆర్ఎస్లోకి తీసుకుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా టీడీపీకే పడ్డా యని ఆ ఫలితాలు వెల్లడించాయి. దీంతో ఈసారి నగరంలో టీడీపీ పోటీకి రాకుండా అవగాహన కుదుర్చుకొని కాంగ్రెస్‌కు లాభం కలగకుండా చేయవచ్చని, తద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను తాను పొందవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. ఏరకంగా చూసినా టీడీపీ ఓటు బ్యాంకు కీలకం అవుతుందని అంటున్నారు. -
కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
– బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు చిట్యాల: రజకార్ల వారసులు ఎంఐఎం పార్టీ నాయకులకు తలొగ్గి సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. చిట్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విమోచనం ఆనంతరం కర్ణాటకలో కలిసిన ప్రాంతాల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో మాత్రం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామన్నారు. ప్రధాన మంత్రి మోదీ జన్మదినం సందర్భంగా శనివారం బీజేపీ నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్‌లో శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ పాపయ్య, నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావు, ఆ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాస శ్రీనివాస్, పల్లె వెంకన్న, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌వి ఓటుబ్యాంకు రాజకీయాలు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలకు పాల్పడుతుందని సీపీఎం శాసనసభాపక్ష నేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడి రెండు నెలలవుతున్నా సమస్య జఠిలమవుతుందే తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. అధిష్టానం ఇచ్చిన పదవుల్లో ఉన్న నాయకులే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇరు ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరిపిస్తుందనే అనుమానం కలుగుతుందన్నారు. ఇరు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రేక్షకపాత్ర వహిస్తుందన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాలి పురుషోత్తంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జదీశ్చంద్ర, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.