ration dealers association
-
డీలర్ల పక్షాన నల్లకోటు వేసి వాదిస్తా!
కరీంనగర్: రేషన్ డీలర్లను తొలగిస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం డీలర్లు చట్టబద్ధంగా సమ్మె చేస్తామంటే సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం తగదన్నారు. డీలర్లకు అం డగా అవసరమైతే తాను నల్లకోటు వేసుకొని కోర్టులో వాదిస్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ నాలుగేళ్లుగా రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుండా వారికి ఇచ్చే కమీషన్ ఇతరత్రా అలవెన్సులు ఇవ్వకపోవడంతోనే సమ్మె అనివార్యమైందని చెప్పారు. ప్రభుత్వం బకాయి పడిన 415 కోట్లు వెంటనే విడుదల చేయాలని క్వింటాలుకు రూ.87 కమీషన్‌ను చెల్లించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా స మస్య పరిష్కారానికి మార్గం చూడాలని లే నిపక్షంలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
మూకుమ్మడిగా సెలవులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ గురువారం నుంచి మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, కార్యదర్శి అనంద్‌లు డీలర్లకు పిలుపునిచ్చారు. రేషన్ డీలర్లందరూ నెల పాటు సెలవులు కావాలని తహసీల్దార్, ఏఎస్‌ఓలకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని సూచించారు. డీడీలు కట్టకపొతే లైసెన్సులను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడం దారుణమన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. -
జులై 1 నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె
పంజగుట్ట : రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ జులై 1వ తేదీ నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐక్య రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. నిరవధిక సమ్మె పోస్టర్‌ను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షులు నాయకోటి రాజు, ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాసరి మల్లేశం, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి, బత్తుల రమేష్‌లు ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాలుగా రేషన్ డలలర్లను ప్రభుత్వం ఆదుకుంటుందని వేచి చూశామని, ఇతర వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం తమను మాత్రం విస్మరించిందని ఆవేదనవ్యక్తం చేశారు. 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తమకు రావల్సిన కమీషన్ ’ 400 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ ఖాతాలో జమచేసిందని, తమకు రావాల్సిన కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకుండా తాత్కారం చేస్తుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంబంధిత శాఖా మంత్రికి, సివిల్సప్లై కమీషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేకుండా పోయిందన్నారు. కమీషనర్ ప్రభుత్వ మెప్పు పొందేందుకు తమకు కోతలు విధిస్తున్నారని ఆరోపిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈపాస్ మిషన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకించడంలేదని, కాని కేవలం 20 పైసల కమీషన్ ఇవ్వడంవల్ల షాపునిర్వహణ, అద్దె, విద్యుత్‌బిల్లు చెల్లించుకోలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,200 మంది రేషన్‌డీలర్లు ఉన్నారని, వారి భవిష్యత్తుగూర్చి ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31వ తేదీన హయత్‌నగర్‌లోని లక్ష్మీరెడ్డిపాలెంలో డీలర్లు, వారి కుటుంబ సభ్యులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే రేషన్ బంద్
♦ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అల్టిమేటం సాక్షి, హైదరాబాద్: నామమాత్రపు కమీషన్లతో అనేక సమస్యలతో రేషన్ షాపులు నడుపుతున్నామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిది రకాల సరుకుల విక్రయం నుంచి రెండు సరుకులకే కుదించడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని సంఘం తెలిపింది. ప్రభుత్వం ముందుంచిన తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఆగస్టు నుంచి రేషన్ షాపులను మూసివేస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి తమ నిర్ణయాన్ని తెలిపామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని, లేదంటే కనీసం రూ.30 వేల గౌరవ వేతనం చెల్లించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీలర్లను బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజెంట్లుగా గుర్తించాలని, డీలర్లకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. మొత్తంగా 18 డిమాండ్లతో మంత్రి ఈటలకు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. -
రెండు మండలాలు..రాసిచ్చేస్తా...
-అడ్డువచ్చిన వారి తోక కత్తిరిస్తా... -ఈ డీల్ కుదిర్చినందుకు నాకు ఎంత ఇస్తావ్... -నీవు కాదంటే చెప్పు వేరేవారికిచ్చేస్తా -పౌర సరఫరాల సరుకు పక్కదారిపై మంతనాలు -అధికార పార్టీ యువనేతే వ్యూహకర్త -‘సాక్షి’ చేతికి చిక్కిన ఆడియో సంభాషణ 'రెండు మండలాలు నీకు అప్పగిస్తాను. ఎవరైనా తోక జాడిస్తే నాతో చెప్పు అడ్డంగా తోక కత్తిరించేస్తా... నీ దోపిడీకి రహదారి వేసినందుకు నాకెంత ఇస్తావు... ముందుగా అది తేల్చు ... నాపై బాగా ఒత్తిళ్లున్నాయి. నువ్వు ఏ విషయం తేల్చకపోతే నేను నా వాళ్లకు అప్పగించేస్తాను...ఇదీ ప్రకాశం జిల్లా ఎస్.ఎన్.పాడు మండలంలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తితో యువనేత బేరసారాలు. దీనికి ఒక రేషన్ డీలర్ల అసోసియేషన్ నేత మధ్యవర్తిగా వ్యవహరించి కథ నడిపించాడు. ఆ సంభాషణ ఏ రీతిలో సాగిందంటే...' సాక్షి, టాస్క్‌ఫోర్స్: పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టడానికి పెద్ద ప్రభుత్వ యంత్రాంగమే ఉంది. అయినా బొక్కసానికి బొరియలు పడుతూనే ఉన్నారు. ఈ బొరియలు కప్పడానికి ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి కిరీటం పెట్టింది. సరిదిద్దాల్సింది పోయి బేరసారాలకు దిగుతున్నారు ... అరికట్టాల్సింది పోయి అడ్డంగా దోచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు ... అధికారం మాదే అడ్డొచ్చినవాడెవడంటూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ... పేదలకు, మధ్య తరగతికి అందాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారు ... బొక్కసానికి కన్నం వేస్తున్నారు. పంచాయితీ పెట్టి మరీ పంచుకుంటున్నారు. అదెలా అంటే... అక్రమ రవాణాదారుడు: ఈపాస్ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది. అంత రావడం లేదు. యువనేత: ఈ పాస్ వల్ల డీలర్లకు ఆదాయం కొంచెం తగ్గిన మాట నిజమే. గతంలో ఒక షాపులో ఆరు వందలు కార్డులుంటే మూడు వందల కార్డులు అమ్ముకున్నారు. ఇప్పుడు రెండు వందల నుంచి 250 వరకూ అమ్ముతున్నారు. టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది. చీమకుర్తిలో 900 టన్నులు బియ్యం రవాణా జరుగుతుంటే గతంలో 300 వందల టన్నులు అమ్ముకునేవారు. ఇప్పుడు 200 నుంచి 250 టన్నులు పక్కదారి పడుతోంది. ట్రాన్స్‌పోర్టు మొత్తం ఇవ్వు. కిలోకి రూపాయి ఇస్తావా? ఎక్కడ బియ్యం ఎంత వస్తుందో నాకు తెలుసు. ఇవన్నీ కాదు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు? (మాటల్లో కొంత అసహనం)... ఈ వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులున్నాయి? ఎక్కడైనా లారీ పట్టుబడితే బయటపడడానికి ఎన్ని చిక్కులు...ఆ చిక్కు ముడులు విప్పాలంటే ఏమి చేయూలో సుదీర్ఘంగా ముగ్గురి మధ్య చర్చ జరిగింది. యువనేత: నాపై చాలా ప్రెజర్ వస్తోంది...అడగడానికి భయపడాల్సిన వారు కూడా నా వద్దకు వచ్చి నాకు నాలుగు షాపులు ఇప్పించమని అడుగుతున్నారు. బంధుత్వాలు, పార్టీని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నారు. ఇంతకు ముందే చీమకుర్తికి చెందిన వ్యక్తి ట్రాన్స్‌పోర్టు కావాలని అడిగి వెళ్లాడు. ట్రాన్స్‌పోర్టు వర్క్ అవుట్ కాదని చెప్పాను. ట్రాన్స్‌పోర్టు ఉంటే డీలర్లతో సంబంధాలు ఉంటాయని చెబుతున్నాడు. మధ్యవర్తి: పెద్ద మనసు చేసుకో? పార్టీ మనిషిగా ఇతనికే ఇప్పించు. మొదటి నుంచీ పార్టీకి నమ్ముకున్నోడు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీలోకి వచ్చినవారు కాదు. అలా అని నీ సొంత మండలంలోకి వచ్చి దర్పం ప్రదర్శించేవాడు కాదు. వయా మీడియాగా అతనికి వచ్చేలా చూడు. ఏం చేయాలో నువ్వే చెప్పు యువనేత: ప్రతి నెలా 15 లారీలు వచ్చాయ్...20 వచ్చాయ్... ఈ పంచాయితీలు నాకనవసరం. సింగిల్ టెండర్ వేయిస్తాను. రెండు మండలాల్లో కొనుక్కొని, టెండర్ చేజిక్కించుకోమను. నెలకు ఎంత ఇస్తావు స్ట్రయిట్‌గా చెప్పు అని అడిగాను. ట్రాన్స్‌పోర్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోలుతాను. కిలోకు రూపాయి చొప్పున మీ కుర్రోళ్లకు ఇస్తానని ఒకతను నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడున్న వారి సంగతి తేల్చకుండా ఇవ్వడం కరెక్టు కాదని పెండింగ్ పెట్టా. ట్రాన్స్‌పోర్టు టెండర్ లేకుండా చేయిస్తా. నువ్వు ఎంతకైనా కొనుక్కో. రూ.12, రూ.13, రూ.15... ఎంతైనా. వంద టన్నులు కొనుక్కో.. లేకపోతే రెండు వందల టన్నులు కొనుక్కో. నీ ఇష్టం అది నాకు సంబంధం లేదు అని చెప్పాను. మధ్యవర్తి: ఇది మంచి ప్రతిపాదనే కదా... అక్రమ రవాణాదారుడు : మా వాళ్లను కనుక్కుని చెబుతానని చెప్పా. మా వారితో మాట్లాడితే అంత ఆదాయం రావడం లేదన్నారు. తెల్లగుడిపాడు వారు వేరే వారికి తోలుతున్నారని చెప్పారు. ఎన్ని వస్తున్నాయో చెప్పమని అడిగాను. ట్రాన్స్‌పోర్టు మొత్తం వారిని తీసుకోవాలని చెప్పు.. లేదంటే బియ్యం రెండు మూడు బళ్లు ఆయన చెప్పిన వారికి పంపిస్తానని మావాడు చెప్పాడు. మధ్యవర్తి: ఇదంతా అనవసరం. ట్రాన్స్‌పోర్టు ఎంత వస్తుంది. అక్రమ రవాణాదారుడు: 50 నుంచి 55 వేలు వస్తుంది. మధ్యవర్తి: ట్రాన్స్‌పోర్టు ఇతనే చేస్తాడు. బిల్లు నువ్వు తీసుకో. నెలకి ఇంతని చెప్పి సెటిల్ చేసుకో... యువనేత: త్వరలోనే సంతనూతల పాడు, చీమకుర్తి డీలర్ల సమావేశం పెట్టి వారికి కూడా చెబుతాను. మధ్యవర్తి: మిల్లర్లతో కూడా ఇబ్బందులుంటాయి. కొంతమంది పక్క మండలాల్లో కూడా వేలు పెడుతున్నారు. వారికి నువ్వు గట్టిగా చెప్పాలి. యువనేత: ట్రాన్స్‌పోర్టు నీకు ఇప్పిస్తాం. డీటీకి చెప్పేస్తాను. ట్రాన్స్‌పోర్టు డబ్బులు మా కుర్రాళ్లకు ఇచ్చేయి. ఇంకా నెలకు ఎంత ఇస్తావో తేల్చి చెప్పు.... యువనేత, మధ్యవర్తి, అక్రమ రవాణాదారుడి మధ్య చర్చల అనంతరం...ట్రాన్స్‌పోర్టు బిల్లు కాకుండా మరికొంత మొత్తం నెలనెలా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒక మండలంలో బయటపడిన తంతు మాత్రమే ఇది. మిగిలిన మండలాల్లో ఇదే తరహా అక్రమాలకు తెరదీస్తున్నారు... అధికార దాహంతో జిల్లాను దోచేస్తున్నారు. యువనేత: ఏడేళ్ల నుంచి టీడీపీ బాధ్యతలు నేనే మోస్తున్నాను. ఈ రోజు డిపార్టుమెంట్లో ఉండి నా మనుషులకు, నాకు న్యాయం చేసుకోలేకపోతే ఎలా? నా పొజిషన్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇతనికి నాలుగు రోజుల కిందట మూడు ఆప్షన్స్ ఇచ్చాను. నువ్వే డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. ఇంకో సెంటర్ వెతుక్కో. సంతనూతలపాడు.. చీమకుర్తి వదిలేసెయ్... ఇది ఫస్ట్ ఆప్షన్... అలా కాదంటే తోలడం మావాళ్లే చేస్తారు. అన్ని షాపుల నుంచి కలెక్షన్ ఎలా చేయాలో వారే చేస్తారు. వారే అమ్ముకుంటారు. నీకు ఏ సంబంధం లేదు. ట్రాన్స్‌పోర్టు నువ్వే ... తోలేదీ నువ్వే ... ఎంత కొనుక్కుంటావో కొనుక్కో. వంద కొనుక్కుంటావో, నూటయాభై కొనుక్కుంటావో నీ ఇష్టం. నా సంగతి ఏం చేస్తావ్. ఆప్షన్ నీదే...