సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ గురువారం నుంచి మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, కార్యదర్శి అనంద్‌లు డీలర్లకు పిలుపునిచ్చారు.
రేషన్ డీలర్లందరూ నెల పాటు సెలవులు కావాలని తహసీల్దార్, ఏఎస్‌ఓలకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని సూచించారు. డీడీలు కట్టకపొతే లైసెన్సులను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడం దారుణమన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.
మూకుమ్మడిగా సెలవులు పెట్టండి
Published Thu, Jun 28 2018 1:48 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment