కన్నుల పండువగా వేణుగోపాలస్వామి కల్యాణం | venugopala swami Kalyanam celebrations | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా వేణుగోపాలస్వామి కల్యాణం

Published Mon, Mar 13 2017 6:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

venugopala swami Kalyanam celebrations

రాయికల్‌ : మండలంలోని చింతలూరు గ్రామంలోని వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు చెరుకు మహేశ్వరశర్మ, మధుశర్మ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య కల్యాణం కన్నుల పండువగా జరిపారు. హాజరైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సాయప్ప చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సర్పంచ్‌ కదుర్ల లక్ష్మి,రాయికల్‌ మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ ఎనుగందుల ఉదయశ్రీ పాల్గొన్నారు.


ఇబ్రహీంపట్నంలో...  
ఇబ్రహీంపట్నం : మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి కల్యాణాన్ని అర్చకులు మంత్రరాజం రాముచార్యులు, రామకృష్ణచార్యులు, అజయ్‌చార్యులు వేదమంత్రాలతో నిర్వహిం చారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన నిర్మల్‌ ఏపీపీ గుడ్ల రామకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి యేసుగౌడ్, సత్త య్య, హరీశ్, శ్రీకాంత్, వీడీసీ సభ్యులు దొనికెన నారా యణ, రాధారపు ప్రభాకర్, గంగాధర్, నాయకులు పెం ట లింబాద్రి, ఆంకతి రాజన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement