ఓటుకు కోట్లు కేసులో ముమ్మాటికీ సూత్రధారి చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు తప్పవు...జైలు శిక్షా తప్పదని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న డబ్బును రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ర్యాలీకి ఉపయోగించారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన నేరస్తుడు అని ...అలాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేయటమా అని మండిపడ్డారు.